Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 22

   సాగర్ మధ్యలో ఆమెనాసి - "నిర్మాలా! ఇవాన్నీ నేను  మనస్పూర్తిగా నా యిష్టంతో చేస్తున్నాను...." అన్నాను.
    "ఆ విషయం నాకుతెలుసు. కానీ  నేను దేవతనైతే నన్నభిమానించిన వారి స్ధాయికి నేనూ ఎదిగి వారిని సుఖ  పెట్టగలుగుతాను. దెయ్యాన్ని కాబట్టే నన్నభిమానించిన వారిని నాస్దాయికిదింపి కష్టపెడుతున్నాను...." అంది నిర్మల
    ఆమె మాటలకు సాగర్ దిమ్మెరపోయాడు. నిర్మల చాలా తెలివైనది. పరోక్షంగా అతడినామె తప్పుపడుతోంది, వెక్కిరిస్తోంది.
    "అయాంసారీ నిర్మలా!" అన్నాడుసాగర్.
    "సారీ దేనికి?" అంది నిర్మల.
    సాగర్  ఆమె ముఖంలోకే చూశాడు. నిర్మల కళ్ళలో ఆశ్చర్యముంది.
    "సారీ దేనికి"
    ఆమెమాటలు పదేపదే మననం చేసుకున్నాడతడు.
    తను తప్పుచేస్తున్నాడు. అందుకని అన్నీ  తనకోణంలోంచే ఆలోచించిమాటిమాటికీ పట్టుబడిపోయానేమోనని భయపడుతున్నాడు. నిజానికి నిర్మల తననుతప్పుపట్టడంలేదు. తనచేత  పనులుచేయించుకున్నందుకు బాధపడుతోంది.
    నిర్మల అందంలో మచ్చలేదు. మనసులోనూ  మచ్చలేదు. స్వచ్చతకు మారుపేరు కావడంవల్ల ఆమె నిర్మల పేరుకే సార్ధకతనిచ్చింది.
    కానీ తను....తనామెను మోసంచేయాలనుకుంటున్నాడు....ఎందుకు? స్వార్ధం....భౌతికం....తన ఆలోచనలిలావెడుతున్నాయేమిటి.....?
    "సెంటిమెంటును జయించగలవా?" అనడిగాడు చంచల్రావు.
    "నో సెంటిమెంట్స్!" అన్నాడతను.
    నిర్మలను తాను మోసగించగలడా?..... "నోసెంటిమెంట్స్....." అతడి  మాటలే అతడిచెవుల్లో గింగురుమంటున్నాయి. అదేతన ఆశయమనుకున్నాడతను.
    ఒకసారామెను వశపర్చుకున్నాక ఆమె అంటే మోజుతగ్గిపోతుంది. అంతగా  కావాలంటే అప్పుడే ఆమెకు వేరేనుంచి సంబంధమేదై నాచూసి- పెళ్ళికి డబ్బు సాయంచేయవచ్చు. అంతకుమించి న్యాయం చేయలేడామెకు. అవసరం కూడా లేదు!
    నిర్మల చేనుతూనే ఉంది "నాలో ఆశలులేవు. పెద్దకోరికలులేవు, వాస్తవానికి సరి పెట్టుకుని జీవించగలను" అని.
    తనతో జీవితమే ఓ అనుభవమామెకు. ఇదామెకువరం. కానీ తను ముందుగా  అలా మాట్లాడకూడదు. అప్పుడు తనకూ చంచల్రావుకూ తేడా  ఉండదు. కొంతకాలంపాటు ఆమెను భ్రమలో వుంచాలి.
    "మీరేదో ఆలోచిస్తున్నారు. నేనిప్పుడేవస్తాను....." అని నిర్మల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాగర్  ఆమెను  వారించలేదు. కొద్దిక్షణాల్లోనే నిర్మల తిరిగివచ్చింది ఆమెకా  సేపటి క్రితం ధరించినదుస్తులిప్పుడామె చేతుల్లోవున్నాయి. ఆమె మామూలు దుస్తుల్లో వుంది.
    "మీ బట్టలు మీకు తిరిగిచ్చేస్తున్నాను...."అంది నిర్మల.
    "అవిమీకోసమే!" అన్నాడు సాగర్.
    "కావచ్చు కానీ  ఈ బట్టల్ని నాబట్టలుగా చెప్పుకోలేను. దాచుకోలేను. వీటిని నావాళ్ళ ఎదుట ధరించలేను. అలాంటి పరిస్దితిల్లో వున్నానునేను...."
    "ప్రత్యేకంగా మీకోసం కొన్నాను. ఇవి నేనేంచేసుకొను...."
    "ఎప్పుడైనా నేను మీదగ్గరకు వస్తే అప్పుడు కట్టుకుంటాన్లెండి....." అని- "దయుంచి ఒక్కమాట చెబుతాను వినండి! ఇకమీరు నన్ను కలుసుకో వద్దు...."అంది నిర్మల.
    "ఎందుకని?" అన్నాడు  సాగర్ దెబ్బతిన్నట్లు.
    "మీపరిచయం నాలోని సహనాన్ని అంతంచేస్తోంది. కొత్త ఆశలు రేపుతోంది. నాగురించినేను గొప్పగా భావించుకునేలా చేస్తోంది. అందుకు ఫలితం కొత్తనరకం అనుభవించడమే!" అందినిర్మల.
    నిర్మల విషయానికి వస్తోందనీ- ఉత్త కబుర్లతో తమపరిచయం కొనసాగదనీ అతడికర్దమైంది. అందుకే- "పోనీ మనపరిచయం కొత్త స్వర్గానికి దారితీస్తే మీకిష్టమేనా?" అన్నాడుసాగర్.
    "అంటే?"
    "నిర్మలా! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరిష్టపడితే పెళ్ళి చేసుకుంటాను...." అన్నాడు సాగర్.
    నిర్మల తెల్లబోయి "వద్దు!" అంది.
    "ఏం నేనంటే మీకిష్టంలేదా?" అన్నాడు సాగర్.
    "ఇష్టాయిష్టాలగురించి  ఆలోచించే అవకాశం కూడా నాకులేదు. కానీ  నేను మీకు తగనని నాకుతెలుసు...."
    "ఎందుకాని?"
    "సూర్యుడు వెలుగునిస్తాడు. చంద్రుడు వెన్నెలకాస్తాడు. మొక్కలు పూలుపూస్తాయి. కొన్ని ప్రశ్నలకు ఎందుకన్న ప్రశ్న ఉండదు. చూడగానే  తెలిసేవిషయాలివి....."
    "చూడగానే తెలిసేడేవారికి?"
    "ఈ ప్రపంచానికి...."
    "ప్రపంచమంటే.....?"
    "మీ కుటుంబం....మీ స్నేహితులు...."
    ఉన్నట్లుండి పిట్టదారిలోకి వచ్చిందని గ్రహించాడు సాగర్. ఆ అవకాశాన్నతడుపయోగించుకొదల్చుకున్నాడు.
    "నాకుటుంబం  గురించి నాకు బెంగలేదు. వాళ్ళమాటలు నేనులెక్కచేయను. కానీ అవసరానికి నాన్నాదుకున్న నా స్నేహితులమాటకు నేను విలువనిస్తాను. వాళ్ళు  నా ఎన్నికను హర్షించగలరని నానమ్మకం...."
    "నాకు నమ్మకంలేదు...."
    "నా నమ్మకాన్ని నేను బుజువుచేసుకోగలను. కానీ  అందుకు మీరు నన్ను నమ్మాలి!" అన్నాడు సాగర్.
    "అయినా ఈ బుజువులన్నీ ఎందుకులెండి?" అంది నిర్మల.
    "అప్పుడుకానీ మనపెళ్ళికి మీరోప్పుకోరుగా...."
    "అందని పండుకు ఆశించను నేను...."
    "ఇప్పుడు నాకంతా అర్ధమయింది. నన్ను పెళ్ళిచేసుకోవడం మీకిష్టం లేదు. అందుకే యిలా  డొంక తిరుగుడుగా చెబుతున్నారు....."
    "అదేంకాదు నాఅదృష్టం వేరొకరికి దురదృష్టం కాకూడదు....."       

 Previous Page Next Page