"కుల మతాల ప్రసక్తి నాకు లేదు. మావాళ్ళు ఒప్పుకోరు కాని రజియా కోసం వాళ్ళని ధిక్కరించగలను నా బ్రతుకు నేను బ్రతకగలను రజియాని పెళ్ళి చేసుకుంటానో లేదోనని మీ కనుమానం వుంటే యీక్షణంలోనే మీ అందరూ కలసి పెళ్ళి జరిపించండి" అన్నాడు దృఢంగా వీల్లేదు రజియా హిందూని పెళ్ళాడటానికి వీలు లేదు అసలు మా బావమరిదితో రజియాకి పెళ్ళి కుదిరిపోయింది. మాటిచ్చేశాను" అరిచాడు అన్నయ్య.
ఆ మాటకి రజియా చురుక్కున తీక్షణంగా చూసింది అంతదాకా వచ్చాక ఆమె అన్నకి భయపడాల్సింది కనపడలేదు. పక్క నేను అండగా వున్నానని గాబోలు. "వాడా ఆ తాగుబోతు, ముండలముఠాకోరుని నేను చచ్చిన పెళ్ళాడనను అన్నయ్యా పాపం నీకు ఎప్పుడూ చెల్లెలిమీద లేని అభిమానం యిప్పుడు మాత్రం ఎందుకు ఏనాడూ అన్నగా బాధ్యత నెరవేర్చని నీకు నా పెళ్ళి బాధ్యతా అనవసరం నీవు వదిన కలిసి ఆ రౌడీకి నన్ను కట్టబెట్టి వాడి దగ్గరనించి డబ్బులాగాలని చూస్తున్నారట నాకు తెలుసు. నా కంఠంలో ప్రాణం వుండగా చేసుకోను. నా పెళ్ళి నా యిష్టం వచ్చిన వాడితో చేసుకొనే హక్కు నాకుంది" తీక్షణంగా చూస్తూ తెగేసి చెప్పింది అన్న మొహంలో రక్తం పొంగింది.
"నీ కెంత ధైర్యం నీవు వీడ్ని ఎలా పెళ్ళాడతావో చూస్తాను" బుసకొట్టాడు.
"చూడు బాగా ఇదంతా చెల్లెలిమీద ప్రేమ కాదని, నీయింట్లో దాసీగా వుంచుకోడానికి దొరికిన అవకాశం యిలా చెయ్యి జారిపోతుందని! నా పెళ్ళిద్వారా వచ్చే డబ్బు రాదని నీ భయం నీలాంటి నీచుడు నాకు అన్న అని చెప్పుకోడానికి అసహ్యం నేను యీయనతో వెడుతున్నాను నాదారికి అడ్డం వస్తే పర్యవసానం బాగుండదు పదండి వెడదాం." "రజియా బేటి బాగా ఆలోచించుకున్నావా పెళ్ళి కాకముందే ఒకడితో వెళ్ళడం మంచిది కాదు" ముసలి వాడు అన్నాడు. బాబాయ్ అన్నదగ్గిరవుండి భరించే హింసకంటే ఈయనతో వెళ్ళి ఏనిష్టూరమైనా భరిస్తాను ఆయనమీద నాకా మాత్రం నమ్మకముంది అంది రజియా స్థిరంగా రజియాకి నామీదవున్న నమ్మకానికి ఆనందించాను - రజియా చేయి నా చేతిలోకి తీసుకుని అందరివంక తిరిగి మీ అల్లా సాక్షిగా, మీ అందరి సాక్షిగా రజియా యీ క్షణం నించి నాభార్య-" అన్నాడు-ముసలతను ఒక్కక్షణం సందేహించి రజియా బేటి యీ పెళ్ళి నీకు సమ్మతమేనా అల్లా సాక్షిగా యితన్ని నీవు అంగీకరిస్తాను అన్నాడు రజియా సిగ్గుగా తల ఊపింది. ముసలతను "నసీర్, రజియా యిష్టపడినపుడు యింక నీవు చేసేదేంలేదు - రజియా అన్నట్లు నీవు 'ఎప్పుడూ మీ అమ్మ, రజియాల భారం స్వీకరించలేదు. పెళ్ళి విషయంలో మాత్రం ఎందుకు ఆమె యిష్టం వాడిని చేసుకుంటుంది." అన్నాడు. తరువాత ముసలతను మాఇద్దరి చేతులు కలిపి ఏవో మనస్సులో చదివాడు తరువాత మా కోసం మోకరిల్లి నమాజు చేశాడు ఓ ముసలావిడ వచ్చి రజియా చీరకొంగు తీసి రజియాకి ముసుగు వేసింది. ముసలాయన ప్రార్ధన పూర్తి చేసి" ఈ క్షణం నుంచి అల్లా సాక్షిగా మీరు భార్యభర్తలు వెళ్ళండి అల్లా మీకు శుభం కలుగచేస్తాడు అన్నాడు రజియా వంగి నమస్కరించింది తరువాత అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా రజియాని చేయి పట్టుకుని నడిపించుకుని బయటికి తీసుకువెళ్ళాను - అన్న నిస్సహాయంగా బుసలు కొట్టాడు.
మీరు తొందర పడలేదు గదా నామీద జాలితో తొందరపడి చేసుకున్న నిర్ణయం కాదుగదా అంది రజియా రైలులో వెడుతుండగా నేను తొందరపడి చేసుకున్న నిర్ణయంగా మాత్రమే నీకనిపిస్తూందా రజియా" అన్నాను మృదువుగా ఈ రెండు మూడు నెలలుగా నన్ను చూస్తున్న నీకు నా మనసేమిటో తెలియదా?
"అదికాదు అదుకాదు మన మధ్య వున్న అంతారాలు జాతి మతం కులం మీవంశం గౌరవం ప్రతిష్ట వీటన్నింటి గురించి ఆలోచించలేదేమోనని అంది రజియా, "వీటన్నింటిని గురించి రెండు నెలలుగా ఆలోచిస్తూనే వున్నాను రజియా నీ కోసం వీటన్నింటిని వదులుకోగలను" నిబ్బరంగా అన్నాను. కానీ మీవాళ్ళ నన్ను అంగీకరిస్తారా" సందేహంగా చూసింది రజియా అంగీకరించరు ..ఎంత మాత్రం అంగీకరించరు" తాపీగా అన్నాను.
రజియా కలవరపడ్తూ చూసింది మరి-మరి నఎందుకిలా చేశారు" అంది. "ఎందుకా! ఎందుకో చెప్పాల రజియా "కొంటెగా అన్నాడు. రజియా మొహం ఎర్రబడింది "తమాషాకాదు సరిగా చెప్పండి నాకేమిటో చాలా భయంగా వుంది. మీ యీ నిర్ణయం వల్ల మన భవిష్యత్తు ఎలా వుంటుందోనని నాకు చాలా భయంగా వుంది. నా కారణంగా మీరు మీ వాళ్ళకి దూరం అవడం" రజియా కలవరపాటుతో అంది. రజియా చేయి చేతిలోకి తీసుకుని ప్రేమగా రజియా అదంతా నిర్ణయం తీసుకున్నను నా హౌస్ సర్జన్ రెండు నెలల్లో అయిపోతుంది. తరువాత ఉద్యోగం దొరికేవరకు జమీలు, ఆస్థులు యింకా వున్నాయి మాకు. పిత్రార్జితం నావాటా నాకు యీయననే హక్కు ఎవరికీ లేదు- డబ్బుకి ఏ కొరతాలేదు. ఎటొచ్చి మావాళ్ళతో చెబితే నిన్ను వారింటి కోడలుగా ఎంత మాత్రం అంగీకరించరన్నది నిజం. అందుచేత వాళ్ళతో చెప్పదలచలేదు.