Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 20

 

    భోజనం ముగిస్తుండగానే ఆమె ఫ్రిజ్ లో నుంచి ఐస్ క్రీమ్ తెచ్చి అతని ముందుకి తోసింది విసురుగా.
    'పెళ్ళిరోజు కదా సాయంత్రం వెరయిటీ చూపిద్దామని ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను -- ఆ సిక్స్ నాట్ త్రీ లో వున్నది నాకంటే ఎక్కువయిపోయినప్పుడు నా ఐస్ క్రీమ్ తనకెందుకు పెట్టాలీ నువ్వే తిను .'
    సురేష్ తాపీగా , హాపీగా ఐస్ క్రీమ్ సగం తినేసి యింక తినలేక త్రెన్చాడు.
    డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచీ లేచి వెళ్ళి వాళ్ళ బెడ్ రూమ్ లోకి తొంగి చూశాడు. బెడ్ ల చుట్టూ పూలదండలు అందంగా సువాసనలు వెదజల్లుతూ వేలడుతున్నాయ్.
    ఆమె డైనింగ్ టేబుల్ సర్దాక హలో కోస్తూ సురేష్ ని  కోపంగా చూసింది.
    "అక్కడేం పని నీకు?" అంది ఎర్రబడిన మొఖంతో.
    "అదేనండీ! అయన కోసం స్పెషల్ గా చేసినవన్నీ నా కిస్తున్నారు కదా?......"
    ఆమె ముఖంలో రక్తం వడిగా ప్రవహించింది.
    'అంటే?"
    "ఆ పూలదండలు కూడా కొన్ని నాకిస్తారేమోనని....."
    "నువ్వేం చేసుకుంటావవి?"
    "ఏదో అదొక సరదా అండీ ---- చిన్నప్పట్నుంచీ ......."
    ఆమె బెడ్ దగ్గర కెళ్ళి ఓ గులాబీ దండ తెంపి అతనికొచ్చింది.
    "ఇంక వెళ్ళు! ఆయన్ని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి వుండు "
    "కనిపెట్టడమా? నీడనయిపోతాను . నా సంగతి మీకింకా తెలీదు "
    "ముఖ్యంగా ఈ సిక్స్ నాట్ త్రీ బస్ స్టాప్ లో జాగ్రత్తగా ఫాలో అవాలి"
    'అవుట్ డోర్ డ్యూటీ నాకొదిలేయండి. కానీ ఇన్ డోర్ కార్యక్రమాలు మీరే వెయ్యి కళ్ళతో అబ్జర్వ్ చేస్తుండాలి గాని --"
    ఆమె గాబరాగా చూసింది .
    "అంటే ఇక్కడ ఫ్లాట్స్ లోనే రహస్యంగా కలుసుకుంటారంటావా?"
    "మొన్నో రోజేప్పుడో అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చేసరికి టెర్రేస్ మీద ఈశాన్యం వేపున వాటర్ టాంక్ వెనుక నుంచీ గుసగుసలు వినిపించినాయ్. నేను లేచి 'ఎవరది' అనేసరికి చకచక మెట్లు దిగి వెళ్ళిపోయినా చప్పుడు వినిపించింది.
    "ఖచ్చితంగా ఈ మనిషే అయుంటారు. ఈ మధ్య అర్ధరాత్రుళ్ళు లేచి నిద్రపట్టడం లేదని ఇంట్లోనే కాసేపు పచార్లు చేస్తున్నారు. బహుశా అలా పచార్లు చేస్తూ నేను మళ్ళీ నిద్రలోకి జారిపోగానే టెర్రస్ మీద కేళుతున్నరేమో " మరింత అనుమానంగా అంది.
    "ఇంకా అనుమానం ఏమిటండీ! ఈసారి నిద్రపట్టటం లేదని పచార్లు మొదలెట్టినప్పుడు మీరు నిద్ర పోయినట్లు నటించి అయన ఒక వేళ టెర్రెస్ మీద కెళితే మాత్రం రెడ్ హెండేడ్  గా పట్టుకోండి ." ఆమెను మరింత పురి గొల్పాడు.
    టెర్రేస్ మీద వెళ్ళేసరికి కుమిదిని టాంక్ కింద వున్న తన సామ్రాజ్యంలోకి జొరబడి కూర్చుని తన పక్క బట్టలన్నీ సర్దుతోంది.
    వెనుక నుంచీ శబ్దం కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూసాడు.
    "ఏయ్ ఎవరది? వదులు"
    "ఎవరో చెప్పుకో"
    "ఇంకెవరు? ఇలాంటి చిల్లర వేషాలు నువ్వు తప్పితే ఇంకెవరు వేయరు "
    "పేరు చెప్పు" కావాలనే ఆమె మెడ మీద పెదాలతో తాకాడు.
    "ఇదిగో చెంప పగిలిపోతుంది. వదలకపోయారంటే "
    చటుక్కున వదిలేశాడు. ఆమె అన్నంత పనిచేసే రకం అని అనుమానం.
    ఆమెను వదిలేశాడు.
    తనంటే అంత అభిమానం వున్న మనిషి ఇలా రివర్స్  అయిందేమిటి?ఓసారి వాటేసుకోగానే 'నన్ను పెళ్ళి చేసుకుంటారా?" అనడుగుతుందని ఊహించుకున్నాడు.
    ఆమె వెనక్కు తిరిగి కోపంగా చూసింది.
    "ఇంకోసారిలాంటి వేషాలేస్తే మర్యాదగా ఉండదు."
    "కళ్ళు మూసినా తప్పేనా?"
    "తప్పే"
    తన చేతిలో వున్న గులాబీల దండ ఆమె కిచ్చాడు.
    "ఇదేమిటి?"
    "నీ కోసమే తెచ్చాను ."
    ఆమె ముఖంలో అప్పుడు కనిపించింది అనందం.
    "నిజంగా?'
    "మైగాడ్! ఈ గులాబీపూలు పెట్టుకుంటే నీ అందం త్రీ డైమేన్షన్ ఎఫెక్టు తో కనబడుతుందని పూలమ్మేవాడు చెప్పాడు."
    నవ్వేసింది.
    "నీలాంటి కంజూస్ వాడితో యిన్ని పూలు కొనిపించాడంటే వాడు చాలా గొప్ప సేల్స్ మెన్ అయింటాడు"
    "పనిమనిషిని కూడా పక్కలో పడుకోబెట్టుకునేంత విశాల హృదయము గల మేరీపండరీకాక్షయ్య లాంటి యజమానురాలు దొరుకుతే నేనూ డబ్బు దానం చేస్తాను."
    కుమిదిని ఉలిక్కిపడింది కలవరపాటుతో అతని వేపు చూసింది.
    "ఆ విషయం నీకెలా తెలుసు?"
    "పైనుండే వాడికి కింద జరిగే విషయం తెలీకుండా ఎలా వుంటుంది. వెంటేలెటర్ లో నుంచి చూశానోసారి!"
    "ఆమెకేం మాట్లాడాలో తెలీలేదు ."
    "ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయ్ . ఆ టైం లో పక్కనే పడుకుని కదలకుండా పట్టుకుంటాను" తడబడుతూ అంది.
    "చాలా కష్టమైన పని అనుకుంటాను ."
    'అయినా గాని తప్పదు గదా! ఫిట్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేయాల్సిందేగా?"
    "చేయాల్సిందే! ఈసారి ఆమెకు ఫిట్స్ వచ్చినప్పుడు చెప్పండి. మీ బదులు నేను సహాయం చేస్తాను."
    కుమిదిని అనుమానంగా చూసింది.
    "ఏం అక్కర్లేదు . ఐ కెన్ మానేజ్ " విసవిసా వేల్లిపోబోయింది.
    "హలో కుమిదినీ! వన్ మినిట్! నీతో ఓ మాట చెప్పాలి."
    "ఏమిటది?"
    కొంచెం తిక్క ఎక్కువగానే వుంది. వల్లోకి లాగుదామంటే అంత తేలిగ్గా పడేట్లు లేదు. వల్లోకి లాగితేగానీ మేరీతో గట్టిగా చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించలేదు.
    బెట్టుచేసే ఆడదాన్ని ఓసారి గట్టిగా కౌగలించుకుంటే సరెండర్ అయిపోతుందని తన ఫ్రెండ్ వహీద్ చెప్పాడు. ఆ మాట కరక్టే అయుంటుంది. ఎప్పుడూ వాడికోసం ఎంతోమంది అమ్మాయిలు వస్తుంటారు . ఈసారి తన చెంప పగలగొట్టినా ఆమెను కౌగలించుకుని వదలకూడదు అలా అయితేనే తనకు జాబ్ గారంటీ ఉంటుంది.
    ఆమె వేపు ఓ అడుగు వేసేసరికి ఆమె రెండడుగులు వేసింది వెనక్కు.
    "మరేం లేదు - అర్జంటుగా ఓ వంద కోడతావేమోనని! ఆఫ్ కోర్స్ అప్పుగా నేలే!"
    "వచ్చే ఫస్ట్ కి గానీ ఆమె నాకు జీతం ఇవ్వదు" వెళ్ళిపోయింది.
    ఆ రాత్రి హాయిగా నిద్ర పట్టింది.
    

                                                   *    *    *

    డ్రస్ చూసి జగదాంబ నవ్వుతోంది.
    "ఏందీ కొత్త గెటప్? పబ్లిక్ ని లోపటజేసే స్కీమ్ మేమయినా తీసుకున్నావా ఏం సంగతి ?"
    "పార్ట్ టైం మొగుడి గెటప్ ! ఎలా వుంది?"

 Previous Page Next Page