అటువైపు నుంచి నిశ్శబ్దం.
"చెయ్యి పట్టుకున్నాడే అనుకుందాం. చిన్నంతరం పెద్దంతరం లేకుండా చెయ్యి చేసుకుంటుందా?"
"మరేం."
"అలాంటప్పుడు రేప్ చెయ్యక బాబు వూరుకుంటాడా?"
"నిజమే"
"అందుకే రేప్ చేసుంటాడు." కంక్లూడ్ చేసేశాడు రమణ. "తప్పు అబ్బాయిగారిది అస్సలు కానే కాద్సార్.అంత అందంగా వున్న ఆ పిల్ల దేనని నా బలమైన నమ్మకం."
"కాదంటాడు."
"ఎవరు?"
"దాని తండ్రి రాజయ్య."
"ఎంత ఘోరం?" బాధతో విలవిల్లాడిపోయాడు రమణ. "అంత మాటన్నాడా?"
"అవును. మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు."
"ఇంతకు తెగించినవాడు ఎంతకైనా తెగిస్తాడు సుమండీ. ఒకవేళ మీ ప్రత్యర్ధుల దగ్గరకో, పత్రికల వాళ్ళ దగ్గరికో వెళితే ఆ న్యూస్ పెద్దక్షరాల్లో పత్రికల్లో వస్తే తమరి ప్రిస్టేజేం కావాలి? ఏదో నేనున్నాను పైగా మీ దగ్గ ర బోలెడు డబ్బుంది కాబట్టి సరిపోయింది కాని..."
"అందుకే నీకు ఫోన్ చేశాను."
"అదే పదివేలు సర్" పరోక్షంగా ఎంత ఖర్చుయ్యేది చెప్పేశాడు "మీకు అదో లెక్కని నేననను. కాని ఏదో అబ్బాయిగారు సర్దాపడి చిన్న రేప్ చేస్తే, దానికంత రాద్దాంతం జరగడమే నేనంగీకరిచంలేకపోతున్నాను. ఇక మీరు నిశ్చింతగా వుండండి సర్. పైగా రేపో మాపో మినిస్ట్ర్రిలో అడుగుపెడుతున్నారేమో కూడాను. అబ్బాయిగారు రేప్ తో కొంత మానసికంగా మరికొంత అలసిపోయుంటారు కాబట్టి, వెంటనే నేను రంగంలోకి దిగి సెటిల్ చేస్తాను. అమ్మో, రాజయ్యాగడు ఇంత విశ్వసఘాతకుడన్నమాట! దొంగ గాడిదకొడుకు! గెస్టే హౌస్ లోకి చొరబడి డబ్బు దొంగతనం చేస్తాడా? వాడి అంతు చూస్తాను."
ఏం చేయబోయేదీ ఖచ్చితంగా చెప్పేసి ఫోన్ క్రెడిల్ చేశాడు.
మరో అయిదు నిమిషాలలో ఇద్దరు కానిస్టేబుల్స్ తో పల్లెకి జీప్ లో బయలుదేరాడు.
అప్పుడు టైం సాయంకాలం అయుదున్నర కావస్తుంది.
* * * *
" అమ్మ నా కొడకా! తిన్నింటి వాసాలు లెక్కపెడతావా?" రాజయ్యని పట్టుకుని చితకబాదేస్తున్నాడ యస్సై రమణ.
ప్రాణం కడగంటిపోతుందేమో చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాడు రాజయ్య "అయ్యో... నేను ...అసలు దొంగతనం..."
" హారి బడాచోర్! డొక్కలో బుటుకాలుతో తన్నాడు.
"కూతురి పెళ్ళికి డబ్బు కావాలంటే కాళ్లా వేళ్ళా పడి అయ్యగార్ని అడగాలిగాని సూట్ కేస్ లో చెయ్యి పెట్టి పాతికవేలు కొట్టేస్తావా?"
పెదవి విప్పలేని రాజయ్య గొంతునుండి జవాబు కాక కఈ సారి పళ్ళు కదిలినట్టు భళ్ళున రక్తం చిమ్మింది.
చెంపపైన మరో దెబ్బ తగలడంతో నిస్త్ర్ర్రాణంగా కారుతున్న కన్నీళ్ళు రక్తంతో కలిసి ఉప్పగా మారుతున్నాయి.
పల్లెవీధుల్లో జనం గుంపులుగా నిలబడి చూస్తున్నారు. మరీ చిన్న పల్లెకాదది. పట్టణానికి చేరువగా ఉండడంతో నాగరికత వారికి కొత్తకాదు అయినా ఈ అనాగరిక చర్యని ప్రశ్నించలేకపోతున్నారు.
దేశంలోని లక్షలాది పల్లెల్లో ఇలా పిచ్చుకలపైన పోలిసులు బ్రహ్మాస్త్రాలని సంధించడం కొత్తకాదన్న ఆలోచనో, అదీ కానివాడు పాపమని ప్రశ్నిస్తే పావుగా మారటం తప్పనిసరన్న భావమో- ఇక్కడో బ్రతుకు చదరంగం మీద కదులుతున్న అస్థికలాంటి పావుని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
" పాపం వదిలేయండి యస్సైగారూ!" ఎమ్మెల్యే కొడుకు రణధీర్ అందరిముందూ సానుభూతిని ప్రదర్శించాడు.
"అమ్మమ్మ!వీళ్ళ నొదిలేస్తే మా డిపార్టుమెంటుకి పెద్ద క్వశ్చ నైపోతారు. అంతేకాదు. విప్లపవాలు లేవదీస్తారు.అందుచేత" బరబరా మెయిన్ రోడ్డువైపు ఈడ్చేస్తుండగా పరుగెత్తుకొచ్చింది మల్లి.
వస్తూనే యస్సై కాళ్ళమీద పడింది.
అప్పుడు చూశాడు రమణ మల్లిని.
నడుం నడుం దగ్గర ఒంపులూ , నాపరాయిలా ఉన్న భూజాల నునుపే కాదు, వాళ్ళని చూట్టేసిన మల్లి గుండె మోకాళ్ళకి మెత్తగా తగులుతుంటే మూడ్ లో కెళ్ళిపోయాడు.
" పక్కకి జరిగే లం...!" భుజాన్ని ఒడిసిపట్టుకుని బలంగా లాగేస్తూ వేళ్ళతో మెత్తదనాన్ని స్పృశించే ప్రయత్నాన్ని మరిచిపోలేదు. నిజానికి ఓ మూలకి విసిరేసిన బొమ్మలా పడిపోయింది మల్లి.
" అదిగోపక్కకి జరగమంటుంటే" పక్కకే ఉన్న మల్లిని ఇంకో సారి తాకే ప్రయత్నం చేశాడు రమణ. "అయితే ఏమిటీ? పక్కకే ఉన్న మల్లిని ఇంకోసారి తాకే ప్రయత్నం చేశాడు రమణ."అయితే ఏమిటీ? మీ అయ్య అసలు దొంగతనం చేయలేదంటావు. మరైతే ఆ సంగతి స్టేషనులో రాత్రంతా నిరూపించగలవా? నువ్వు సరేనంటే న్యాయం జరిపిస్తాను."చివరి వాక్యాన్ని రహస్యంగా చెవిలో చెప్పగానే భయంతో బిక్కుమంటూ చూసింది.
నీళ్ళు నిండిన మల్లి కళ్లలో ఇంకా ఆరని భంగపడిన బ్రతుకు నెత్తుటి చారికలు. రమణ కళ్ళలోని భగభగలు మరోసారి అన్యాయం కమ్మని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంటే దిగులుగా వుండిపోయింది.
ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న యస్సై ఇప్పుడు రాజయ్యతో బాటు మల్లి నీ స్టేషనుకు తీసుకుపోదామని మల్లి చేయి పట్టుకుని జీపువైపు నెడుతుంటే సమీపంలో ఓ ఆటో ఆగింది.
అదికాదు అస్థితిలోనూ రమణని అంతగా ఆకర్షించింది.ఆటో లో ముందో మెరుపుతీగ కనిపించింది ఆ తీగ అరక్షణంలో కిందికి దిగింది.
" ఏమైంది?" మెరుపుతీగల ప్రశ్నించింది.
ఆ ప్రశ్న ఆలోచనలు హోర్స్ రెడింగ్ లో బిజీగా ఉన్న రమణను అదాటున కిందికి తోసేసినట్టునిపించడంతో నొసలు చిట్లించాడు.
" మిమ్మల్నే యస్సైగారూ. ఏం చేశారని వాళ్ళనలా హింసిస్తున్నారు?"
" ఏ ఊరు మనది?" అమ్మాయి చేతిలో బ్రీఫ్ కేస్ చూస్తూ ఈ ఊరు కాదని నిర్దారణకు వచ్చేయడంతో నెమ్మదిగా అడిగాడు "నిన్నే!"