ఆమె అందమైన పాపిటకి ఓ ఎర్రరాళ్ళ పాపిటి బిళ్ళ పొదిగింది.
విద్య స్మాల్ టైల్ స్పెషల్ గా వేయించి అందులో చామంతి బిళ్ళ పొదిగింది .
ఓ బుట్టెడు మల్లెపూలు జడలో తురిమింది అక్కా నీ జడ బాగుంటుంది అంటూ.
ఖరీదైన కంచి పట్టుచీర పెద్ద జరీ అంచు ఉన్నది కట్టించింది.
విద్యావతి వద్దు వద్దు అంటున్నా పెళ్లి కూతురు స్పెషల్ మేకప్ చేయించింది.
అందంతో మిలమిలా మెరిసిపోతున్న విద్య ను చూసి చాలా ముద్దొస్తున్నావక్కా అంటూ బుగ్గపై సుతారంగా ఒక ముద్దు పెట్టింది.
చాటుకు తీసుకెళ్లి దిష్టి తీయించింది.
రేణూ అలా చేసేసరికి విద్య ఎర్రని బుగ్గల్లో కెంపులు తొంగిచూసాయి.
అందరి కళ్ళూ ఆమె నాజూకు వయ్యారంపైనే తొణికిసలాడుతున్నాయి.
పెళ్లి పీటలపై విద్య పక్కనే కూర్చున్న కృష్ణకుమార్ ని ఆమె అందాలు చూపు తిప్పుకోనీడంలేదు.
ఏదైనా వింత జరిగి ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని మాటి మాటికీ అటూ ఇటూ చూస్తున్నాడు.
అతను అలా చూడటం గమనించిన పురోహితుడు ఏం నాయనా ఇంకా ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ రావాల్నా అని సందేహంగా అడిగాడు.
అతనికి ఈ పెళ్లి ఓ తమాషా గా ఉంది.
మంత్రాలు చదువుతూ కృష్ణకుమార్ వైపు చూస్తూ ఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక ముహూర్తం దగ్గరపడింది.
తాళి తీసుకుని కట్టు నాయనా అన్నాడు పురోహితుడు కృష్ణకుమార్ ఎంతకూ తీసుకుపోయేసరికి.
రేణూ ప్రేమగా గదమాయించింది తాళి తీసుకుని అక్క మెడలో కట్టండి అంటూ.
ఇక తప్పలేదు.
విద్య మెడలో మూడు ముళ్ళు వేసేప్పుడు కొరకొరా చూసాడు ఆమెని.
అఫ్ కోర్స్ ఆమె తన వైపు చూడనప్పుడు అనుకోండి.
ఎంత తెలీకూడదు అనుకున్నా అందరికి ఇట్టే తెలిసిపోతాయి ఇలాంటి విషయాలు.
అలా కృష్ణకుమార్ పెళ్లి విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది.
యూట్యూబ్ లో వీడియో పెట్టుంటే వన్ మిలియన్ వ్యూస్ వచ్చేవి.
పెళ్లి వరకే రేణూ ఆగలేదు.
ఆ తరువాతి కార్యక్రమాలకి కూడా నడుంకట్టింది దగ్గరుండి.
వద్దు వద్దు అంటున్నా కృష్ణకుమార్ శోభనం రూమ్ లోకి బలవంతంగా తొయ్యబడ్డాడు.
లోపలికెళ్ళగానే కళ్ళు తిరిగాయి అతనికి.
తమ బెడ్ రూమ్ ని మొత్తం మల్లెపూలతో నింపేసింది రేణూ.
తెల్ల చీరలో, గుప్పెడు మల్లెలు సిగలో పెట్టుకుని, పెళ్లి శోభతో మంచంపై కూర్చున్న విద్య అపరంజి బొమ్మలా వెలిగిపోతోంది.
ఆమెను చూసి ఒక్క క్షణం కన్నార్పడం మర్చిపోయాడు.
అంతలోనే సర్దుకున్నాడు.
పెళ్ళైతే చేసింది కానీ రేణూ ఇది తన చేతుల్లోనేగా ఉంది అనుకుంటూ విద్య వైపు చూడకుండా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని బ్యాంకు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మనసును ఎలాగైనా మరల్చాలని.
ఇదిగోండి మీకిష్టమైన స్వీట్ అంటూ ఇచ్చింది విద్య.
అటువైపు చూడలేదు.
చూస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు.
ఏంటి కోపమా నా మీద అంటూ కృష్ణకుమార్ ని అడిగింది.
నీమీదేం కోపం లేదు అన్నాడు.
మరి ఎందుకు ఆ బింకం.
మీకిష్టం లేకుండా ఏదీ తీసుకోను మీ దగ్గరనుంచి సరేనా అంది బేలగా.
ఈ విషయంలో నా తప్పేమన్నా ఉంటే మన్నించండి నన్ను అంది అతని పాదాలు తాకుతూ.
ఇంకేముంది, కరిగిపోయాడు కృష్ణకుమార్.
ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.
నీమీదేం కోపం లేదు రా విద్దూ అన్నాడు.
ఆ విద్దూ అన్న లాలింపు పిలుపు విద్యకి ఎంతో హాయిగా అనిపించింది.
తనని దగ్గరకి తీసుకున్న అతని పెదాలపై తన పెదాలనద్దింది పరవశంగా.
వివశుడైపోయాడు కృష్ణకుమార్.
ఇక ఆగలేదు అతను.
విద్యావతి అందాలు అతన్ని చుట్టేశాయి. ఉక్కిరి బిక్కిరి చేశాయి. మల్లెతీగలా తనని చుట్టుకున్న ఆమెని ఆసాంతం ఆక్రమించుకుని ఆనందపుటంచులకి తీసుకెళ్లాడు.
మొదటి రాత్రే కాదు, మూడు రాత్రులు మూడు నిముషాల్లా కరిగిపోయాయి వారిద్దరి మధ్యా.
పదేళ్ల క్రితం తన హృదయాన్ని లాలిత్యంగా స్పృశించి మౌనంగా నిదురిస్తున్న విద్య నేడు తన అర్ధాంగి.
విద్య తో పెళ్లి విషయంలో రేణూ మీద బాగా కోపం వచ్చినా విద్య తో గడిపిన మూడు రాత్రుల మధుర క్షణాలలో కృష్ణకుమార్ శాంతించాడు.
విద్దూ తో పుష్పకవిమానంలో స్వర్గాన్ని వేల సార్లు చుట్టేశాడు ఆ కొద్దిగంటల్లోనే.
తనకిష్టమైన విద్య వాలుజడతో చాలాసార్లు ఆడుకున్నాడు చిలిపిగా.
వాళ్లిద్దరి ఏకాంతానికి ఏ మాత్రం భంగం కలగకూడదని, వాళ్ళు బయటికి రాకుండా రేణూ టిఫిన్స్, కాఫీ, భోజనం అన్నీ గది లోపలికే పంపించింది.
మరి రేణూ రచయిత్రి కదా. అన్నీ సునిశితంగా అలోచించి చేస్తుంది కదా !
ఎలా తెలిసిందో కృష్ణకుమార్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది విద్య తో అతని పెళ్లి విషయం.
ముఖ్యంగా శైలజకి తెలిసింది.
గంట గంటకీ లండన్ నుంచి ఫోన్ చేసి ఆటపట్టించింది.
ఏంట్రా ఇప్పటిదాకా నువ్వు రామ్ కుమార్ అనుకుంటే నిజంగానే కృష్ణ కుమార్ అయ్యావు అని ఒకటే ఇక ఇకలు పక పకలు.
శైలజ హాస్యాన్ని ఓపికగా భరించాడు తప్పదన్నట్లు.
తన రేణూ కోసమే కదా ఇదంతా అని సర్ది చెప్పుకున్నాడు మనసులో.
అంతకంటే ఇంకేం చెయ్యగలడు పాపం.
ఇద్దరు భార్యల ముద్దు మురిపాలు బాగా ఎక్కువై అంత ప్రేమను ఒడిసిపట్టడం కష్టమవుతోంది కృష్ణకుమార్ కి.
వాళ్ళ అనురాగం, ఆప్యాయతల నడుమ ఊపిరాడటం లేదు. ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
ఓ వారం తరువాత ఏకాంతంలో విద్యావతి అసలు విషయం చెప్పింది కృష్ణకుమార్ కి.
రేణు కి కాన్సర్ డిటెక్ట్ అయ్యింది.
థర్డ్ స్టేజి లో ఉంది.
బ్రతికేది కొద్దికాలమే అని రిపోర్ట్స్ చెప్పాయి.
ఆవిడ డాక్టర్స్ ని కూడా అప్రోచ్ కాలేదు.
ఎక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారో అని.
మన పెళ్ళైతే కానీ ట్రీట్మెంట్ చేయించుకోనూ అని అందరితో ఖరాఖండిగా చెప్పింది.
మీకు ఈ విషయం చెప్పొద్దని మా అందరిచేత వట్టేయించుకుంది కూడా.
అందుకే మీకు ఎవ్వరం చెప్పలేదు అంది.
విద్య చెప్పిన ఆ వార్తకి తన కింద భూమి కుంగిపోయి తాను అందులో పడిపోయినట్లు కృంగిపోయాడు కృష్ణకుమార్.
అతని బాధ వర్ణనాతీతం.
తన కోసం ఇంత చేసిందా రేణూ.
అంతా దాచిపెట్టి తన జీవితం బాగుండాలని తన అనారోగ్యాన్ని కూడా చెప్పలేదా.
అయ్యో రేణూ ఎంత పనిచేసావు అనుకున్నాడు.
ఎలాగైనా తన రేణూని కాపాడుకోవాలి అని ఆమె టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్ కి వెళ్ళాడు ఒక్కడే, ఎవరికీ చెప్పకుండా.
పేరు, వివరాలు చెప్పాడు రిసెప్షన్ లో.
రిసెప్షనిస్ట్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసింది కంప్యూటర్ లో.
సారీ సర్.
మేమే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాము.
రేణూ మేడం గారి ఫోన్ నెంబర్ మా రికార్డ్స్ లో మిస్ అయ్యింది.
అందుకే చెప్పలేకపోయాం.
నిజానికి ఆ రోజు ఇద్దరు రేణుక పేర్లు ఉండేవాళ్ళు వచ్చారు టెస్ట్ కోసం.
మీ మిసెస్ పేరు ఎం రేణుక.
కానీ కాన్సర్ డిటెక్ట్ అయ్యింది యెన్ రేణుక కి.
మీ మిసెస్ కి ఏ ఇబ్బందీ లేదు.
ఆవిడ ఆరోగ్యం నార్మల్ గానే ఉంది.
ఉయ్ ఆర్ రియల్లీ వెరీ సారీ సర్.
ఇలాంటి పొరపాట్లు ఎప్పుడో గానీ మా హాస్పిటల్ లో జరగవు అంది.
హమ్మయ్య అనుకుంటూ ఒకసారి పైకి చూసి భగవంతునికి మనసులోనే నమస్కారం చేసాడు రేణూ కి ఏ ప్రమాదమూ లేదని తెలిసిన తరువాత.
అతనికి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది ఆమెకి ఏ ఆరోగ్య సమస్య లేదని తెలుస్తూనే.
మితిమీరిన ప్రేమ ఎంతకు దారితీస్తుందో అప్పుడు అర్ధమయ్యింది కృష్ణకుమార్ కి.
ఒక ఫాల్స్ రిపోర్ట్ తమ జీవితాలనే మార్చేసింది.
రేణూ తనకేదో జరుగుతుంది, తన జీవితం ముగిసిపోతుంది, తన భర్త ఏమై పోతాడో అని తను ఉండగానే విద్య తో తన పెళ్లి జరిపించి తనని సుఖంగా ఉంచాలని ఆశపడింది.
రేణూకి తన పై ఉన్న ప్రేమకి కళ్ల లో నీళ్లు చిప్పిల్లాయి.
ఎవరూ చూడకుండా కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని హాస్పిటల్ నుంచి బయటికొచ్చాడు ఆనందంగా.
ఇక తదుపరి కర్తవ్యం ఏమిటా అని ఆలోచించాడు.
రెండు కేజీల స్వీట్స్ ప్యాక్ చేయించి, ఇరవై మూరేల మల్లెపూలు కొని ఇంటికెళ్ళాడు.
ఇంట్లో కాలుపెడుతూనే రేణూ, విద్య ఇద్దరూ ఎదురొచ్చారు.
రేణూకి కూడా రోజూ మల్లెపూలు పెట్టుకోవడం అలవాటు చేసింది విద్య.
కృష్ణకుమార్ కి ఒక మల్లెపూలతోనే తట్టుకోవడానికి కష్టంగా ఉంది.
ఇప్పడు రెండూ అంటే ఆమ్మో అనుకున్నాడు భవిష్యత్తు తలచుకుని.
ఎక్కడికెళ్లారండి ఆదివారంపూట కూడా ఇంతసేపయింది అని కంగారు పడుతూ అతని చేతిలోని స్వీట్స్, మల్లెపూలు అందుకుంది రేణూ ఎందుకు ఇవన్నీ తెచ్చారు ఇప్పుడు అంటూ.
చెప్తా చెప్తా తీరిగ్గా చెప్తా అన్నాడు కృష్ణకుమార్ వాళ్ళిద్దరినీ ఉత్కంఠలోకి నెట్టేస్తూ.
విద్యని పిలిచి రాత్రి ఎనిమిది గంటలకి రేణూ పేరెంట్స్ ని, తన పేరెంట్స్ ని, పిల్లల్ని, అతి ముఖ్యంగా శైలజ ని జూమ్ లో వీడియో కాన్ఫరెన్స్ కి పిలవమన్నాడు.