Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 16


    చూడవలసిందంతా చూసేశాక అలసిపోయినట్లు చాపమిదకెళ్ళి పడుకుంది.


                           *    *    *    *

    
    రాధ తర్వాత రాజేంద్ర . టెన్తుక్లాస్ వరకూ చదివి రెండుసార్లు తప్పి యీ చదువంటే నా కసహ్యమనిచెప్పి ఉద్యసన చెప్పాడు. మనిషి అందంగానే వుంటాడు. కాని తనకున్న అందంకన్న వెయ్యి రెట్లెక్కువగా ఊహించకుంటాడు. తనలో ఏదో అతీతమైన అకర్షణ వున్నదని  అతని నమ్మకం. ఆ నమ్మ కాన్నెప్పుడూ సడలించుకొనే ప్రయత్నాలు చెయ్యడు.


    అతని కమ్మాయిలంటే మహాపిచ్చి.ఎప్పుడూ పోజులిస్తూ తిరుగుతూంటాడు. చొరవచేసి అమ్మాయిలను పలకరిస్తూ వుంటాడు కూడా.


    అసలే డబ్బు యిబ్బందుల్లో మునిగివున్న తండ్రని అల్లించి  బెల్లించి రోజూ డబ్బులాగుతుండేవాడు.


    అయిదో, ఆరో జేబులో వేసుకోవటం. ఫ్రెండ్స్ చేసుకొని బాలాదూరు తిరుగుతూ ఘనకార్యం చేస్తున్నాననుకోవటం...


    బాధ్యత తీసుకోకపోవటంతో చాలా థ్రిల్ ఫీలవుతున్నాడు.


    తర్వాతమ్మాయి. గీత. పదహారు  పదిహేడేళ్లుంటాయి. చదువంటే విపరీతమైన శ్రద్ధ. బాగా చదువుకొని పైకి వచ్చి పెద్దపెద్ద ఉద్యోగాలు చెయ్యాలని ఆకాంక్ష. టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యి. ఇంటర్ లో  చేరి రాత్రింబవళ్ళు చదువుతూనే వుంటుంది.


    చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో అదనపు బరువుగా తన యిద్దరు పిల్లలతో సహా  శకుంతల  ఆ ఇంటిలో అడుగుపెట్టింది.


                                                                 10


    పాప పది నిమిషాలనుండి గూలాబిపువ్వు చేతిలో పట్టుకు నిలబడింది.అప్పటికి సాయంత్రం అయిదయింది. ప్రొద్దుటినుంచీ బాబుగారు కనబడలేదు. అతను కనబడకపోతే ఆమెకు చాలా వెల్తిగా వుంది. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు అన్యమనస్కంగా వున్నది. అమ్మటం. డబ్బులు తీసుకోవటం, చిల్లరివ్వటం వగైరాలన్నీ చాలా యాంత్రికంగా చేసింది.


    మధ్యాహ్నం పన్నెండు గంటలప్రాంతంలో ఓ పోలస్ కాన్ స్టేబులొచ్చాడు.


    " ఏయ్! పిల్లా! నీ బాబుగాడి సొమ్మయినట్లు  కొట్టు రోడ్డుమిద పెట్టెసావేమిటి? పెర్మిషన్ తీసుకున్నావా?" అన్నాడు.


    పాప అంతకు ముందేప్పడూ అతన్ని చూడలేదు.


    లేదన్నట్లు తల ఊపింది.


    " ఎందుకు తీసుకోలేదూ? అలా తీసుకోకుండా షాపు పెట్టడం తప్పని తెలీదా?అన్నాడు .దేశంలో ని అవినీతినంతా తుడిచి  వెయ్యటానికి తానే కంకణం కట్టుకున్నట్లు.


    ఊళ్ళో రౌడీలు ముఠాలూ సోడాబుడ్లు  విసురుకుంటూ వుంటారు. ఒకటో.  రెండో అరెస్ట్ లు చేసి వూరుకుంటూ కాలేజీ స్టూడెంట్లు రోడ్లమిద  సైకిళ్లు, స్కూటర్లు అడ్డంగా పెట్టి కార్లమిద పోయేవాళ్లు దారిలేక  యిబ్బంది పడుతూంటే వెకిలి నవ్వులు నవ్వుతూ, పోజులిస్తూ  నిలబడి సైకిళ్లు తియ్యకుండా వినోదిస్తూవుంటే వాళ్ళనేమి అనరు. ఎందుకూ కాలేజి స్టూండెట్స్ తో గొడవ అని చూసీ చూడనట్లు వూరుకుంటారు. సర్విరామంగా జరిగే మర్డర్ కేసుల్లో , దొంగ తనాల్లో రాష్ట్ఱ్రాస్థాయిలో ఆదేశాలొస్తే తప్ప ఒక్క కేసు పగడ్బందీగా యిన్ వెస్ట్ గేట్ చెయ్యరు.ఎస్ ఐ. లు. పోలిస్ స్టేషన్ లలో కూచుని తమకు బుద్ధి పుట్టినప్పుడు నేరస్థుల్ని చితగ్గొడుతూ , లేనప్పుడు పట్టించుకోనట్లు వొదిలేస్తూ యీ దేశాన్ని తామే పరిపాలించస్తూన్నంతగా పోజులు పెడుతూంటారు. ఏ ఎస్.  పి.యో రెడ్డుమిద కారులో వెడుతూ అమాంతంగా తిక్కపుట్టి ఆర్డర్స్  జారీ చేసినప్పుడు గబగబరోడ్లమిద ఆపి వున్న సైకిళ్ళని వ్యాన్ లలో పడేసీ, స్కూటర్ల డిక్కీలు తీసేసుకునీ,  హెల్ మెట్స్ లేకుండా వెళ్ళేవాళ్లని ఆపి జరిమానా విధించి, రోడ్డుప్రక్క పళ్లూ , పిడితక్రింద పప్పూ అమ్ముకొనే బళ్ళవాళ్ళను లాఠీలతో రెండు  దెబ్బలు వేసి, ఆబళ్ళని స్టేషన్ లకు తీసుకెళ్ళి,ఏ షాపులముందో రిక్షాలోంచి దిగుతోన్న ఆ ప్యాసింజర్స్ నూ,ఆరిక్షావాళ్ళనీ విజిల్స్ వేసి  ఉక్కిరిబిక్కిరి చేసీ నానా  హంగామా చేస్తారు. అవినీతీ, గూండాయిజం, రేప్ లూ, హత్యలూ యధాప్రకారం జరిగిపోతూ వుంటాయి. కుంటి, గ్రుడ్డి సమాధానాలు చెబుతూ వాటిని గురించి ఎవరూ పట్టించుకోరు.


    కాన్స్టేబుల్ అటూ యిటూ చూసి చెయ్యి జాపాడు.


    " డబ్బుతే."


     పాపముఖం వివరణమైంది. " డబ్బు దేనికి?"


    .... నువ్వు పెర్మిషన్ లేకుండా కొట్టు పెట్టినందుకు."

 
    పాపకేం చెయ్యాలో తోచక మొల్లో దోపుకున్న చేతి సంచీలోనుంచి అయుదు రూపాయలు తీసిచ్చింది.


    " అయిదేమిటి? పదివ్వు."


    " పదిస్తే-  నాకు చాలవు."


    " చాలవా? అయితే  స్టేషన్ కు రా"


    పాప  హడలిపోయింది. తాను ఆడపిల్ల. పోలిస్ స్టేషన్ కు తీసుకెడితే.... అక్కడ జరిగే అఘయత్యాలను గురించి వినివుంది. మాట్లాడకుండా సంచీలోంచి యింకో అయిదు రూపాయలుతీసిచ్చేసింది.


    కాన్ స్టేబుల్ ఘనకార్యం సాధించినట్లుగా నవ్వాడు.


    " నీ పేరేవటి?"అన్నాడు.


    "పాప"


    "ఇలెక్కడ?"


    పాప తడుముకుంటూ చెప్పింది.


    " చూడూ! ఆడపిల్లని అందునా అందంగా వున్నావు. అకతాయి వెధవలు ఏదో ఒకటి అంటూ వుంటారు. అలాంటి దేదయినా జరిగితే నాకుచెప్పు .డొక్క  చీరేస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.


    పాపకళ్ళలో  నీళ్లు తిరిగాయి.


    పదిరూపాయలు!


    ఎన్ని గంటలు కష్టపడితే సంపాదించగలిగింది! గద్దలా వచ్చి తన్ను కుపోయాడు.


    ఆ తర్వాత మరీ పరధ్యానంగా , దిగులుగా వుండి పోయింది. సూర్యచంద్ర పొద్దుటినుంచీ కనబడలేదేమో గుండె మరీబరువుగా వుంది.


     ప్రతిరోజూ మధ్యలో ఓసారి టీతాగట. మలవాటు. ఇవేళకూడా బార్ లావా   ఆ చుట్టుప్రక్కలున్న షాపుల వాళ్ళకు టీ తీసుకెడుతూ ఆమెకి కూడా అందివ్వబోయాడు.


    "వొద్దు. అహ్మద్" అంది పాప.

 Previous Page Next Page