Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 15


    " ఎలా?" అబ్బురంగా అడిగాడు- " స్వచ్ఛంధ సేవాసంస్థలేమన్నా ఆర్థికం9గా సహకరిస్తుంటాయా?"

 

     "ఎక్కువగా యిక్కడ ఉత్పత్తులతోనే   ఈ ఆశ్రమం మెయిన్ టైన్ చేస్తున్నాము. ఒక్కో మారు స్వచ్ఛంద సేవసంస్థలూ సహకరిస్తుంటాయి"

 

    మరి ప్రభుత్వం ఎంతవరకూ తోడ్పడుతూందన్న రొటీన్ ప్రశ్న వేయలేదు. "నేను  విన్నాను మీ ఆస్తిలో ఎక్కువభాగాన్ని, మీ ఫాక్టరీస్ లో వచ్చిన లాభాల్ని యిక్కడకు  తరలిస్తుంటారని."

 

    " అఫ్ కోర్స్.... మా నాన్న గారి చివరి కోరిక అది?"

 

    " ఏం  ఆ శించి ఇదంతా చేస్తున్నట్టు?" టక్కున అడిగాడు.

 

    "సంతృప్తి"

 

    "చనువు తీసుకుంటే క్షమించాలి. మీ వయసులో వున్న అమ్మాయిలు సహజంగా కోరుకునేది ఈ జీవితం కాదు."

 

     కోపం రాలేదామెకు. నిశ్చలంగా నవ్వేసింది. "అసహజంగానైనా యిలాంటి జీవితాన్ని జీవించాలనిపించింది."

 

    మదర్ థెరిస్సా, అనిబిసెంట్, ఫ్లారెన్స్ నైటింగేల్ లాంటి స్త్ర్ర్రీల జీవితాలని క్షుణ్ణంగా తెలిసిన  నరిస్  మరేదో అడగబోయి అగిపోయాడు.

 

    "మిష్టర్  నరిన్" నిర్లిప్తంగా చెప్పుకుపోయింది. " మా తాతగారు స్వతంత్ర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. బహుశా అదే నాన్నగార్ని ఇన్స్పయిర్ చేసుండొచ్చు. అందుకే ఆస్తిని పరిశ్రమల స్థాపనకు వెచ్చించి కొందరికి ఉపాధి కల్సించాలన్న ఆలోచనతో బాటు యిలాంటి ఆశయానికి  శ్రీకారం చుట్టివుండొచ్చు."

 

     "కాని" క్షణం ఆగాడు సమదిగ్ధంగా  "ఆ ఆశయాన్ని మీలాంటి అమ్మాయి కొనసాగించడం నన్ను ఆశ్చర్యపరుస్తున్నది."

 

    "సో" మరో ప్రశ్నకి అవకాశమివ్వమన్నట్టుగా అంది " ష ల్ ఉయ్ కంక్లూడ్ హియర్?"

 

    ఆమె  వివాహం గురించి అడగాలనుకున్న అతి ముఖ్యమైన ప్రశ్న వేయాలనుకుని ఆగిపోయాడు. " వెల్ మేడం! అసాధారణమైన జీవితాన్ని యింత సాధారణంగా మలచుకుని బ్రతుకుతున్న మిమ్మల్ని అభినందించకుడా వుండలేకపోతున్నాను.  మెటీరియలిస్టిక్ గా బ్రతకడమే యిప్పటి జీవితలక్ష్యంగా మార్చుకున్న యువతలోని ఒక వ్యక్తిగా మీ ఆదర్శాలు ఎంత స్ఫూర్తివంతంగా వున్నాయీ అంటే- దేశంలో ప్రతి యువతీ అక్కర్లేదు. జిల్లాకి  మీలాంటి ఒక్కమ్మయైనా యిలా బ్రతకాలని నిర్ణయించుకుంటే చాలామంది  పీడితుల జీవితాలకి తిరుగలేని ఆసరా దొరికినట్టే. అయితే  చివరగా ఓ ప్రశ్న...."

 

    "అడగండి."

 

    " ప్రతి మహాత్ముడి ఓన్నత్యం  వెనుక ఓ స్త్ర్రీ అదృశ్య హస్తం ఉంటుందంటారు మరి  మీరిలా  సింత్రాపిస్ట్ గా కొనసాగటానికి మీ నాన్న గారి చివరికోరిక మాత్రమేగాక డెఫినెట్ గా మరో వ్యక్తి వుండివుండాలి."

 

    "ఎస్... హి  ఈజ్ ది మేన్. అందరికీ నేను అనలా అని మీరనుకుంటే నాకూ, వీళ్ళకీ అండ నిష్టర్ మిత్ర. హి ఈ జ్ ఎవ్విరిథింగ్  హియర్" అప్పటికే అక్కడకు వచ్చిన మిత్రని పరిచయం చేసిందామె

 

     క్రీనీడలో నిలబడి కరచాలనం చేసిన నరిన్ మిత్రను చూడగానే అప్రతిభుడయ్యాడు.

 

    మిత్ర ఇంతకుముందు పరిచయం లేదు. కాని ఓ జాతీయ స్థాయి వారపత్రిక కరస్పాండెంట్ గా బాంబే అండర్ వరల్డ్ కింగ్స్ గురించి జరిపిన పరిశోధనలో అతన్ని గురించి పూర్వం కొన్ని  వివరాలు సేకరించాడు.అలా  మిత్ర గురించి తెలిసింది ఈ మధ్యనే.

 

     సుమారు మూడు నెలలపాటు బాంబేలోని రెండు గ్రూపులమధ్య జరిగిన రక్తపాతంలో చివరికి గెలుపు సాధించి చీకటి సామ్రాజ్యపు సార్వభౌముడిగా నిలదొక్కుకున్న మాఫియా కింగ్ సర్దార్ కి దక్షణ ప్రాంతపు ప్రతినిధి   అతడు.


    
    'అలాంటి  మిత్ర  ఇప్పుడిలా పరిచయం కావడమేమిటి?'

 

    దేశంలో చాలా ప్రశక్తిగల ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా బలంగా పనిపడిందని నరిన్ నిర్ణయించుకున్న క్షణమదే.

 

                          *    *    *    *


    
    చాలా  అసహనంగా నిద్రలేచింది మేనక.


     ఇంటి  ఆవరణలో జాగింగ్ చేస్తూ ఆలోచించింది. అన్నమాట తప్పడం మిత్రకి అలవాటులేదు. ముఖ్యంగా తన విషయాల్లో యిన్ని నెలల తరువాత కలుసుకున్నాక వస్తానని చెప్పీ మాటతప్పాడు . కనీసం ఫోన్ సైతం చేసిన రాలేదని చెప్పలేదు.

 

    ఇప్పుడామెలో అనుకోని ఆందోళనకి కారణం అదొక్కటేకాదు.ఎమ్మెల్యే అప్పారావు రాష్ట్రహోం మినిస్టరయ్యాడు. అంటే తనని కాకపోయినా తనలాంటి వాళ్ళనెందరినో శాసించగల కీలకమైన వ్యక్తుల్ని నియంత్రించగల స్థాయికి ఎదిగాడు. ఆ విషయం ఆమెకి రాత్రే  బోధపడిపోయింది.

 

     ఎస్సీ స్వయంగా  ఫోన్ చేసి రణధీర్ ని విడుదల చేయడం గురించి మాట్లాడితే నిశ్శబ్దంగా ఉండిపోయింది తప్ప జవాబు చెప్పలేదు.అవకాశ వాదానికి ఓ స్థాయి అంటూ లేదు.    

 

     ఇక్కడ చాలా ప్రముఖుడైన ఓ పోలీసు ఉద్యోగిల ఒక మినిస్టర్ ని సంతృప్తుణ్ణి  చేయడానికి ప్రయత్నిస్తున్నాడు . దానికి తన అభీమానాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నారు.

 

    ఛీ ఛీ!

 

    సరిగ్గా  ఉదయం పదిగంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎ.ఎస్.పి. మేనక రణధీర్, లాయరు సూర్యాల్ని ఇంటరా గేట్ చేయబోయింది.
    


    కోపరేట్ చేయలేదు ఇద్దరూ.ఒకడు హోం  మినిస్టరు కొడుకు . మరొకడు నగర న్యాయవాదుల అండతో పొగరుగా ప్రవరిస్తచున్న క్రి మినల్ లాయరు.

 

     ఓ పక్క న్యాయవాదుల ఆందోళన కార్యక్రమం జరుగుతూనే వుంది.  అయినా ఆరోజు కోర్టులకి వెళ్ళారంతా.

 

    సరిగ్గా పదకొండు గంటలకి రణధీర్ని, సూర్యాన్ని. కోర్టులో హజరుపరచిన మేనక  లాయర్లంతా ఊహించినట్టు బెయిలు పొందే అవకాశమివ్వలేదు.

 Previous Page Next Page