" సో.... మైడియర్ మున్నీ! నన్ను అర్జంటుగా క్షమించేసి కాస్తదూరం జరుగు... ఎవరో వస్తున్నారక్కడ."
"వస్తే నాకేం?" ఆమెలో చలనం లేదు.
"అవకాశం తీసుకుంటారు."
"ఎవరూ?"
నీ డోస్ జీర్ణించుకోలేకపోతున్న లాయర్లు."
" గంగలో దూకనియ్!"
"దూకరు తోసేయాలి మనం" టక్కున చెప్పిన మిత్ర, ఈ సందర్భంలో నీకు ఇష్టమనిపించే ఓ జోక్ చెప్పాలనుంది" అనాడు.
చాలా జటివమనిపించే సమస్యల్ని జోక్స్ లా చెప్పి తేల్చి పారేయడం మిత్రకి ఆదినుంచే వున్న అలవాటు.
" ఓ రష్యన్ , మరో క్యూబా దేశస్తుడు,ఆమెరికాకి చెందిన ఓ పెద్ద బిజినెస్ మేన్
అతనితోపాటు అమెరికాకి చెందిన ఓ లాయరు కలిసి ఓ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. క్రమంగా వారిమధ్య పరిచయం పెరిగింది.ఇంతలో రష్యన్ తన సూట్ కేస్ లోంచి ఓడ్కా బాటిల్ తీసి అందరికీ గ్లాసుల్లో పోసి తాగమన్నాడు. వాళ్ళు తాగుతుండగానే సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్ ని కిటికీలోంచి బయటకి విసిరేశాడట.అమెరికన్ బిజినెస్ మేన్ ఆశ్చర్యపోతూ అడిగాడు "అదేమిటీ?" అంటూ. దానికి నవ్వేసిన రష్యన్ " మా దేశంలో అవసారనికి మించివున్న ఓడ్కాని మేం ఇలాగే పారేస్తుంటాం" అన్నాడు. కొంత సేపయ్యాక క్యూబా దేశస్తుడు ఆ దేశంలో చాలా పేరుగల హవానా సిగర్స్ తీసీతలా ఒకటిచ్చి తనూ సగం పేరెట్లుని బయటకి విసిరేశాడట. అమెరికన్ బిజినెస్ మేన్ ఆశ్చర్యపోతూ అడిగాడు "అదేమిటీ?" అంటూ. దానికి నవ్వేసిన రష్యన్ " మా దేశంలో అవసారనికి మించివున్న ఓడ్కాని మేం ఇలాగే పారేస్తుంటాం" అన్నాడు. కొంతసేపయ్యాక క్యూబా దేశస్తుడు ఆ దేశంలోచాలా పేరుగల హవానా సిగార్స్ తీసితలా ఒకటిచ్చి సగం పేరెట్టుని బయటికి విసిరేశాడు. ఆర్థికంగా చాలా దుస్థితిలో వున్న క్యూబా గురించి తెలిసిన అమెరికన్ మళ్ళీ ఆశ్చర్యపోయి అతన్నీ అడిగాడు.
దానికి క్యూబవ్ వవ్వేస్తూ " మా దగ్గరకూడా హవానా సిగార్స్ అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి విసిరేస్తే తప్పేముంది?" అన్నాడు.
"అంతే...ఏదో ఆలోచన మెరిసిన అమెరికన్ బిజినెస్ మేస్ అమాంతం పైకిలేచి పక్కనున్న అమెరికన్ లాయర్ ని కిటికిలోంచి బయటికి విసిరేశాడు."
పకాల్న నవ్విన మేనక- "అంటే అమెరికాలో లాయర్లూ అవసరానికి మించి వున్నారన్నమాట."
"అది మాత్రమే కాదు. అవసరాన్ని అలజడులు కూడా లేవనెత్తుంటారు కాబట్టి కారులో కూర్చున్నాడు మిత్ర అప్పటికే.
" మీ అమ్మగార్ని చూడాలి. జీప్ లో ఫాలో కానా..."
"నాట్ నౌ. రాత్రికి వచ్చి తీసుకువెళతాను" ఆమె జవాబు చెప్పకముందే ఏదో అర్జంటుపని వున్నట్టు వెళ్ళిపోయాడు.
నిర్విణ్ణిరాలై చూస్తూంది. ధూళి రేపుకుంటూ వెళ్తున్న కాంటెస్సాని.
ఆడంబరాలకి అతీతంగా వుండే విశ్వామిత్ర అస్పష్టంగా తన భేషజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు.అది నిజమో, అలా అనిపించిందో ఆమెకే తెలీదు.
కాని మామూలుగా లేని మిత్ర అప్పటి మిత్రలా ప్రవర్తించాలనుకుంటున్నాడు.
అర్థంకానిదేదో అస్పష్టంగా స్పష్టమౌతూంది. మాటలతో తనను జోకొట్టగల సమర్ధుడని తెలుసామెకు. కాని అప్పటిలా తన ఆలోచనల్ని అంతటితో తుంటేయటానికి సాధ్యం కావడంలేదు.
ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించగల ఓ పోలీసాఫీసరుగా, మేనక ఆశక్షణంలో సన్నగా ప్రకంపిస్తూనే మిస్సవుతున్న 'లింకు' కోసం మెదడుకు పదును పెడుతూంది.
చాలా తెలివైన విశ్వామిత్ర మేనకని అండర్ ఎస్టిమేట్ చేసిందిక్కడే.
* * * *
" మిష్టర్ నరిన్! సమాజాన్ని ఉద్దరించాలని కాదుగాని, సమాజం వెలేసిన నిర్భాగ్యులకి స్థానం కల్పించడమే ఈ ఆశ్రమం ఉద్దేశం" స్వ చ్ఛమైన ఇంగ్లీషులో చెప్పుకుపోతుంది వనిత.
సముద్రానికి చేరువగా , నగరానికి దూరంగా పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆశ్రమాన్ని చూస్తూ విస్మయంగా వింటున్నాడు నరిన్. ఇలస్ట్ర్రేటెట్ వీక్లీ కరస్పాండెంట్.
ఇరవైరెండేళ్ళ వయసుంటుందేమో కాని వనిత అక్కడ ఆశ్రమంలో ని పిల్లలకి, పెద్దవాళ్ళకి పెద్దదిక్కులా అనిపిస్తూంది.
సుమారు రెండునెలలుగా ఇంటర్వ్యూకోసం ప్రయతిస్తూ యిప్పటికిగాని అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన నరిన్ ఎప్పుడో గ్రహించాడు. అతి చిన్న వయసులో ఇలాండి బృహత్తరమైన బాధ్యత తీసుకున్న ఆమెకు 'పబ్లిసిటీ' గిట్టని విషయం.
రెండు ఫ్యాక్టరీలకు యజమానురాలిగా లభల వారసులిగా ఆమె కారుకుంటే చాలా అపురూపమైన జీవితాన్ని గడిపేదే.
కాని కోరి ఈ మార్గంలో అడుగుపెట్టింది. దీనికి సరైన కారణం ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయిన నరిన్, సాంఘికమైన నిబద్ధత గల ఆమ జీవనసరళి మరెందరికో ఆదర్శప్రాయం కావచ్చన్న వాస్తవాన్ని తెలియచేసి, తను పబ్లిష్ చేయబోయే ఇంటర్వ్యూకి ఒప్పించలగలిగాడు.
రాత్రి ఏడుగంటలవేళ కుటీరాల్లాంట్ చిన్నాపెద్దా షెడ్స్ మధ్య నడుస్తుంటే, విద్యుద్దీపాల కాంతిలో ఆమెను చూశాడు నరిన్ ఆమెలో అందాన్ని మించిన సంస్కారం. అంతకుమించి మాటల్లో మార్దవం చాలా గౌరవభావం ఏర్పడేట్టుచేశాయి.
అక్కడ అనాథలైన పసిపిల్లల శరణాలయం, వారికోసం ఏర్పాటు అయిన ఆయాలు, బడి మాత్రమే కాదు, యుక్తవయసులో వున్న అనాథలయిన యువతులతోబాటు వృద్ధులైన స్త్ర్రీలూ వున్నారు. ఆ యువతుల్లో మొన్న వేశ్యలుగా బ్రతికి యిప్పుడు మరోదారిలా బ్రతకాలనుకునే వాళ్ళతోబాటు వితంతువులూ ఉన్నారు.
అక్కడ కాస్మోటిక్స్ తయారీలాంటి వాటితోబాటు టైలరింగ్, పసిపిల్లల ఆటవస్తువుల తయారీ నేర్పుతారు. అలా ప్రతి వ్యక్తికీ తను సంపాదించిన దానితో తను బ్రతుకుతున్నావన్న ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ది మూల ప్రార్ధనామందిరం.
"స్ప్లెండిడ్... మొత్తం స్ట్ర్రెంగ్త్ ఎంత ఉంటుంది?" అడిగాడు
"సుమారు ఆరు వందలదాకా."