భయంతో ఆమె ఉక్కిరి బిక్కరయిపోతూన్నది.
బయట్నుంచి అతను తలుపులు తట్టితట్టి అలిసిపోయాడు. తర్వాత బూతులు తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
శకుంతల సొమ్మసిల్లిపోయినట్లు ప్రక్కమిద కూలబడి పోయింది. ఇక్కడ్నుంచి ఎలా బయటపడాలా అని అలోచించసాగింది. రాత్రి తనకు రక్షణ యిచ్చి భోజన సదుపాయం కలగచేసిన స్ర్రీ మిద ఆమెకు దురభిప్రాయం కలిగింది.
* * * *
మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లాభూలోకమ్మ హోటల్ కొచ్చేసింది. మొదట ఆరగంటసేపు ఆఫీసువ్యహారాలూ ఆవీ చూసుకొని అప్పుడు గుర్తువచ్చి రాత్రి వచ్చిన పిల్ల ఎలా వుంది? అనడిగింది ఓ కుర్రాడినిపిలిచి.
హారాలూ అవీ చూసుకొని అప్పుడు గుర్తువచ్చి రాత్రి వచ్చిన పిల్ల ఎలా వుంది? అనడిగింది ఓ కుర్రాడిని పిలిచి.
"బాగానే వుంది."
" కాఫీ .టి ఫెనూ యిచ్చారా?"
" ఇచ్చాం"
" సరే, అని ఆమెను చూడటానికి గదిలోకి వెళ్ళింది.
శకుంతల స్నానంచేసి శుభ్రంగా కనబడుతూ, కళకళ లాడుతోంది. పిల్లలు ఓ ప్రక్క ఆడుకొంటున్నారు.
"ఎలా వున్నావు పిల్లా" అని పలకరించింది.
" బాగానే వున్నానండీ."
భూలోకమ్మకు ఎందుకో ఆ అమ్మాయంటే జాలి,అభిమానం కలిగిగాయి. ఆమె జీవితం గురించి శ్రద్ధగా అడిగింది.
శకుంతల క్లుప్తంగా తన చరిత్ర గురించి చెప్పింది- ఒక్క లారీలో జరిగిన దురాగతం తప్ప.
" ఇప్పుడేం చేస్తావు?" అనడిగింది భూలోకమ్మ.
" తెలీటంలేదు. మొదట అమ్మా వాళ్ఫ దగ్గర ,కెళ్లాలి. తర్వాత ఉద్యోగంకోసం వెతుక్కోవాలి."
భూలోకమ్మ నవ్వింది. "మి అమ్మావాళ్ళకి నిన్ను పోషించే శక్తి వుందా?"
"లేదు"
" ఉద్యోగాలొస్తా యనుకొంటున్నావు."
శకుంతల మాట్లాడలేదు.
"రెండొందలూ, మూడొందలూ యిస్తారు. అలా యిచ్చినందుకు వాళ్ళని కూడా తప్పు పట్టటానికి వీల్లేదు. ఎందుకంటే నీకున్న అర్హతలకి అంతకన్నా యివ్వటానికి కుదరదు. అంతకన్నా ఎక్కువచ్చివాళ్లూ మెయిన్ చెయ్యలేరు. నా హోటల్లో పనిచేసేవారికి వెయ్యి రూపాయలివ్వమంటే యివ్వగలనా? వాడికి సరిపోయినా . సరిపోకపోయినా- ఆ రేంజ్ లోనే పనిచేయ్యాలి. మిగతావి పై సంపాదన ద్వారా తెచ్చుకోవాలి. మేము వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా చూసీ చూడనట్లు వూరుకోవాలి. అంతకంటే చెయ్యగలిగింది ఏమిలేదు. నీకూ అలాంటి ఉద్యోగాలే దొరుకుతాయి. ఒక పూడకూడా కడుపు నిండదు. పిల్లల్ని చదివించుకోలేవు. పైకి తీసుకురాలేవు. ఎప్పుడూ పేదరికమే. అడుగడుక్కీ సమస్యలే. వీటితో నే నీజీవితం గడిచిపోతుంది.
శకుంతల తల వంచుకుని వింటోంది.
" ఈ సమాజంలో ఆడది వొంటరిగా బతకాలంటే మాటలనుకొంటున్నావా? పదహారేళ్ళ బుడతడి దగ్గర్నుంచి అరవైఏళ్ళ ముసలి ముండాకొడుకుదాకా దాన్ని పాడుచేసే దాకా ఒకటే యావ. నిద్రపోడు. వెనక ఎంతో బలం, బలగం వుంటే గాని ఆడది తన్ని తాను కాపాడుకోలేదు. ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు లొంగిపోక తప్పదు.అట్లా అర్ధం లేకుండా లొంగిపోయి జీవితాన్ని వేస్ట్ చేసుకోవటంకన్నా పరిస్థితి నీకు కలిసిరానప్పుడు నీ అంతట నువ్వే అందులోకి కాలుపెడితే నీ అందాన్నీ ,యవ్వనాన్ని క్యాష్ చేసుకున్నట్లవుతుంది."
శకుంతల వులికిపడింది.
ఆమె భయాన్ని గమనిస్తోన్నట్లుగా భూలోకమ్మనవ్వింది.
" పాడు కావాలంటే నీకు భయం. అవునా?"
శకుంతల కేం జవాబు చెప్పాలో తెలీక కళ్ళప్పగించి చూస్తూ వూరుకుంది.
" అసలా ఊహే లేదు. అలాంటి పనులంటే యిష్టమేలేదు. చూడు పిల్లా, నువ్వు నిజం చెబుతే ఝడుసుకుంటావు గానీ, నా అంచనా ప్రకారం యీలోకంలో ,ఆడవాళ్ళలో నూటికి తొంభయిమంది మానసిక వ్యభిచారులే. నూటికి ముఫ్ఫైయిమంది చదువుకున్నవారు కానీ, అట్టడుగు తలగతుల వారుగానీ, పై క్లాసులవాళ్లు గానీ, పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాతో పర పురుష సంపర్కం వున్నవాళ్ళే. ఇష్టంతో చేశారా? బలవంతంమీద చేశారా? వొళ్ళు కొవ్వెక్కి చేశారా? పరిస్థితుల ప్రాబల్యంవల్ల చేశారా అనేది వేరే విషయం. వాడి పెళ్ళాంతో వీడు, వీడి పెళ్ళాంతో వాడు, తనకన్నా వయస్సులో ఎంతో తేడావున్న చిన్న చిన్న పిల్ల లతో , మరదళ్ళతో , కోడళ్ళతో,అత్తలతో యీ కామ సంబంధం పెట్టుకున్నవాళ్లు కోకొల్లలు. ఈ లోకంలో కొంత మంది నీతిగా బతుకుతున్నారంటే దానికి కారణం పాతి వ్రత్యంమిద మోజు, పవిత్రతమిద గౌరవంవల్లా కాదు. సమాజంలో అల్లరవుతామనో, కడుపు లొస్తాయనో యింట్లో వాళ్ళకి తెలిస్తే చంపేస్తారని భయంవల్ల ,చాలా కొద్దిమంది శీలంమీద విశ్వాసం, భయం భక్తి వున్నవాళ్లు వుంటే వుండవచ్చు. వాళ్ళని వ్రేళ్ళమిద లెక్క చెయ్యవచ్చు.అసలెవరూ దీన్ని తప్పు అనీ ఆనుకోవటల్లా , అనుకొన్నా సమాజపరంగా అనుకొంటున్నారు గానీ, వాళ్ళ మనమసుల్లో వాళ్లుదీన్ని 'తప్పు' అనేభావంతో చూడటం లేదు. కాకపోతే తప్పు అనే ఊత పదానికి అలవాటు పడిపోయారు. ఇంతకన్నా ముఖ్యమైన ఇంకో పాయింటు చెబుతాన్నావిను. అసూయలతో ,అనుమానాలతో, వైషమ్యాలతో, స్వార్ధంతో, పైశాచికత్వంతో, క్రూరత్వంతో,నీచత్వంలో, డబ్బుమిది వ్యామోహంతో, నాగరికత నేర్పిన వికృతత్వంలో, అల్పబుద్దితో యీ ఆడ జాతి కుళ్ళిపోయింది. ఇప్పుడు గృహిణి మునుపటి గృహిణికాదు. ఇప్పటి స్ర్ర్రీ మునుపటి స్ర్రీకాదు.వాళ్ళ ప్రవర్తనా,వాళ్ళ ఆలోచనలూ, అన్నిటికీ మించిన వాళ్ళ ప్రవర్తనా, వాళ్ళ ఆలోచనలూ, అన్నిటికీ స్త్ర్రీకాదు. వాళ్ళ స్వార్ధం చాలా భయంకరంగా, జుగుప్సాకరంగా వుంటాయి. ఇన్ని వికృతాలతో కుళ్ళిపోతోన్న స్త్రీ నన్న జీవనోపాదికోసం వ్యభిచారం చేసే స్త్ర్రీ నేరస్థురాలేమి కాదు. అంతేకాదు. కామంకోసం, విలాసాలకోసం, ప్రేమ అనే నటనకోసం, సాంఘికావసరాల కోసం శీలం పోగొట్టుకోవడంకన్నా డబ్బు సంపాదనకోచేసే పరమ లకిరాతకమైన, భయంకరమైన అనేక పన్లకన్న తనని తాను అర్పించుకోవటం ఎంతో మెరుగైన పద్దితి."