Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 10


    ఈ లోపు శవాలు వ్యాన్ లో వెయ్యడం పూర్తయింది. సర్పభూషణరావు. వ్యాన్ పక్కనే నిలబడి వున్నాడు. ఒక గార్డు అతని దగ్గరకు ఒక తాడు తీసుకొచ్చి చూపించాడు.

 

    నేత్ర ఉపయోగించిణ తాడు అది. దాన్ని చూడగానే ఎస్బీఆర్ భృకుటి ముడిపడింది. మామూలు దొంగలు వాడేది కాదది. కరెంట్ని షార్ట్ సర్క్యాట్ చేసి, హుక్ తో ఎంత బరువైనా ఆపగలిగే ప్రొఫెషనల్ పరికరం.

 

    వచ్చింది మామూలు దొంగకాదు అని తెలియగానే అతను డ్రైవర్ తో "గో.... గో" అని తొందరపెట్టాడు. ఆ శవాలు అక్కడ లేకపోతే సాక్ష్యాధారాలు లేనట్టే. వచ్చిన వ్యక్తిని తరువాత తేలిగ్గా వెతుక్కోవచ్చు. చంపి కాకులకూ, గద్దలకూ వెయ్యచ్చు.

 

    వ్యాన్ బయలుదేరింది.

 

    దాని పైభాగాన చేరిన నేత్ర దానితోపాటే వెళ్ళిపోయాడని అక్కడి వారికి తెలీదు. ఇంకా చెట్టుమీద వెతుకుతోనే వున్నారు.

 

                                    *    *    *

 

    బిల్డింగ్ మీదనుంచి వ్యాన్ మీదకు దూకిన నేత్ర ఆ వాహనం కదలగానే  పైనున్న రాడ్ పట్టుకున్నాడు. గతుకుల్లో పడినప్పుడల్లా వళ్ళు కదిలిపోతూంది ఒకచేత్తో దాన్ని పట్టుకుని, వాకీటాకీలో చీఫ్ తో మాట్లాడాడు. మొత్తం జరిగిందంతా  చెప్పాడు.

 

    "వెంటనే తోటని రెయిడ్ చేయిస్తాను" చీఫ్ అన్నాడు.

 

    "లాభం వుంటుందనుకోను. అక్కడ మీకో గెస్ట్ హౌస్ తప్ప ఏమీ  కనబడదు. ఆలోచించడంలో మనకన్నా ఎస్బీఆర్ ఫాస్ట్."

 

    "నువ్వెక్కడనుంచి మాట్లాడుతున్నావ్?"

 

    "శవాకారాల రూపంలో వున్న  కళేబరాల పైనుంచి" వాకీటాకీ  ఆఫ్ చేసి  చుట్టూ  చూశాడు నేత్ర. అవతల్నుంచి చీఫ్ ఇంకా "హలో..... హలో" అంటున్నాడు.

 

    చిన్న కొండ పక్కనుంచి వెళ్తుంది వ్యాను. పక్కనే నదిలో  నీరు  వేగంగా ప్రవహిస్తోంది. ఈ మనుషుల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అన్న ఆలోచనల్లో అతనుండగానే దూరంగా ఆకాశంలో సన్నటి చుక్క కనబడింది. అతడి చెయ్యి రాడ్ మీద బిగుసుకుంది. అతఃది సునిశితమైన దృష్టికి అదేమిటో వెంటనే  తెలిసింది హెలికాప్టరు.


    
    చిన్న కొండ పక్కనుంచి వెళ్తుంది వ్యాను.  పక్కనే నదిలో  నీరు వేగంగా  ప్రవహిస్తోంది. ఈ మనుష్యుల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అన్న ఆలోచన్లలో రాడ్ మీద  బిగుసుకుంది. అతఃది సునిశితమైన దృష్టికి అదేమిటో  వెంటనే  తెలిసింది హెలికాప్టరు.


    
    నేత్రకి ఈ కేసు కొద్ది కొద్దిగా జటిలమవుతున్నట్టు తోచింది.

 

    హెలికాప్టర్ ఆగగానే వ్యాన్ వెనుకనుంచి కారులో సర్పభూషణరావు దిగి, దాని దగ్గరకు వెళ్ళాడు. కొండకీ, రోడ్డుకీ మధ్యనున్న చిన్నస్థలంలో దిగింది అది. నేత్ర ఊపిరి బిగపట్టి దానివైపే చూస్తున్నాడు. అంతలో ఒక వ్యక్తి అందులోంచి దిగాడు.

 

    హెలికాప్టర్ లో దిగిన ఆ వ్యక్తిని చూసి నేత్ర నిర్విణ్ణుడయ్యాడు. ఏజెంట్ క్యూ. భారతదేశపు నడిగడ్డలో ఏజెంట్ 'క్యూ'! మూడో కంటికి తెలియకుండా, దేశపు సరిహద్దులి దాటి- ఇంతదూరం  వచ్చిన ఏజెంట్ క్యూ!! ఒకటికి ఒకటి కలిపి ఆలోచించాడు నేత్ర. జ్యూరిచ్ లో సర్పభూషణరావుకి టెలిగ్రాం పంపిన వ్యక్తి అతనే అయ్యుంటాడు.

 

    ఆ దేశపు గూఢచారిని ఈ దేశంలో చూడడం కన్నా, భూషణరావుతో చూడడం అపశృతిలా  అనిపించింది నేత్రకి. ఏదో ఘోరమైన విపత్తు జరగబోతున్నట్టు మనసు సూచిస్తోంది. ఇద్దరు నరరూప రాక్షసులు దేశపు నడిబొట్టులో కలుసుకున్నారంటే నిజంగా విపత్తే.

 

    వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏజెంట్ క్యూకి వాన లో వున్నవారిని చూపిస్తున్నాడు. అతడు తలూపి ఏదో  చెబుతున్నాడు.

 

    నేత్ర వాకీటాకీని జేబులోనుంచి తీయకుండానే దాని బటన్ నొక్కాడు. అలా మాట్లాడకుండా నొక్కితే, అది తను ఎక్కడ వున్నదీ సూచిస్తుందనీ, చీఫ్ ఆ కోడ్ చూసి వెంటనే బయలుదేరతాడని అతడికి తెలుసు. చప్పుడు చేయకుండా పిస్టల్ తీసి, ఊహించని వేగంతో వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళాడు.

 


    ఆ హఠాత్సంఘటనకి భూషనరావు బెదిరిపోయాడు.

 

    "నువ్వు విదేశీ తొత్తువని తెలుసుగాని, ఏ దేశానికి పనిచేస్తున్నావో ఇంతకాలమూ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది భూషణరావ్. నిన్ను కటకటాల వెనక చూసే అవకాశం భారత ప్రజలకు యిన్నాళ్ళకు దొరికింది" అన్నాడు నేత్ర.

 

    "నువ్వేమీ నిరూపించలేవు" బింకంగా జవాబిచ్చాడు భూషణరావ్.

 

    "అవసరంలేదు. ఏజెంట్ క్యూ మా బందీగా వుంటే చాలు. మీ  యిద్దర్నుంచీ రహస్యాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసు."

 

    "సంభాషణంతా తాపీగా వింటున్న ఆ విదేశీ ఏజెంటు ఈ చివరి మాటలకు నవ్వి అన్నాడు "అంతకాలం మీ ప్రభుత్వం అధికారంలో వుండదు నేత్రా. రాజలాంఛనాల్తో మమ్మల్ని విడుదల చేయడానికి కొత్త ప్రభుత్వం ఎలా వస్తుందో చూడాలంటే నువ్వు కొంతకాలం ఆగాలి."

 

    నేత్ర మెదడు కాలిక్యులేటర్ కన్నా వేగంగా ఆలోచిస్తుంది. లాకప్ లో ఏజెంట్ క్యూని ఎంత హింసించినా ఒక్క రహస్యమూ బయటకురాదన్నది నిర్వివాదాంశం. సర్పభూషణరావుని జైల్లో ఒక్కరోజుకన్నా ఎక్కువ వుంచనివ్వరు లాయర్లు.

 

    ఈ రెండింటికన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి వుంది.

 

    వీళ్ళిద్దరి మధ్య వున్న సంబంధం బయటపడిందంటే ఆ శత్రుదేశం భవిష్యత్తులో సర్పభూషణరావు సేవలు కోరకపోవచ్చు. లేకపోతే అతడిని చంపెయ్యవచ్చు. సర్పభూషణరావు పొతే ఇక ఈ  రహస్యం శాశ్వతంగా బైటపడదు.

 

    ఏం చెయ్యాలి.....?

 

    అతడి ఆలోచన్లని, నిశ్శబ్దాన్నీ మరోలా అర్థం చేసుకుని క్యూ మళ్లీ నవ్వాడు. "మీ దేశానికి నువ్వు నంబర్  వన్ ఏజెంట్ వైతే , నేను మా దేశానికి నంబర్ వన్ ని. నా గమ్యం నీకు తెలుసుగా. ప్రపంచ పాఠం నుంచి నీ దేశం తాలూకు ఛాయల్ని పూర్తిగా తొలగించడం. ఈసారి ఆ పని చేయకుండా వెళ్ళాను."

 

    "నా కంఠంలో ప్రాణం వుండగా ఆ పని జరగనివ్వను."

 

    "నీ ప్రాణాలు తీయవలసిన అవసరం నాకు చాలా వుంది నేత్రా. ఈ దేశపు అత్యంత ప్రతిష్ఠాకరమైన వ్యక్తి మాకు అమ్ముడుబోయాడని, అతడి లాబ్స్  లో ప్రమాదకరమైన రీసెర్చి సాగుతోందని తెలిసిన వ్యక్తిని నువ్వే. ఆ రహస్యం నీతో సమాధి కాక తప్పదు. నవ్వాడు క్యూ. "మా ఇద్దర్లో ఒకరి మీదకే పిస్టల్ పేల్చగలవు నువ్వు. రెండోసారి పేలేలోపులో నేనూ నా పిస్టల్ పేలుస్తాను. మనం ముగ్గురం చావడం ఖాయం. దాంతో నీ దేశ  సమస్య తీరదు. అవునా.....?"

 

    నేత్ర సమాధానం చెప్పలేదు. దూరంగా వాహనాలు వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నవ్వాడు.

 

    "నిజమే...... నువ్వు అంత వేగంగానూ పిస్టల్ పేల్చగలవు. నీకు  బలమూ, చురుకుదనమూ ఎక్కువ. కాని తెలివితేటలే కాస్త తక్కువ మిస్టర్  క్యూ.  మిమ్మల్ని ఇంతసేపూ మాటల్తో నిలబెట్టాలనే నా ఆశయం నెరవేరింది. మా డిపార్ట్ మెంట్ వాళ్ళు వస్తున్నారు. ఆ కొండ మలుపులో చూడు"

 

    ఏజెంట్ క్యూ నవ్వాడు. అటు చూడలేదు. "నీ కంటే  నాకేం  ఎక్కువ తెలివితేటలున్నాయని నేను అనడంలేదు. కాని పరిస్థితిని నాకు అనుగుణంగా  ఉపయోగించుకోగల శక్తి వుందని మాత్రం నిశ్చయంగా చెప్పగలను. అదిగో అటు చూడు" అన్నాడు.

 Previous Page Next Page