Previous Page Next Page 
గృహిణి పేజి 18

                                 

 

                                              గృహిణి
                                                                          వసుంధర

                             
          

    అందమైన ఆగదిలో ప్రభాత సంగీతం సన్నగా వినిపిస్తుండగా చటుక్కున కళ్ళు తెరిచింది ప్రియ.
    "మేడమ్ - మెలకువ వచ్చిందా?" అన్నదో యువతి వెంటనే.
    "ఊ " అంది ప్రియ ప్రక్కకు చూస్తూ .
    ఎప్పటిలాగానే పక్కలో రాఘవ లేడు. ఎదురుగా ఆ యువతి మాత్రం వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంది.
    ఆ యువతి ఆమెకు పరిచారిక.
    ప్రియకు మొత్తం నలుగురు పరిచారికలున్నారు. నలుగురూ విద్యావతులు. యజమానులను సేవించు కొనడానికై ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ కూడా పొంది వచ్చారు. శిక్షణకు రాఘవ వారిని స్వంత ఖర్చుల పైన తనే పంపాడు.
    ఒక యువతి ఆమె శరీరాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యసూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఆమె చేత వ్యాయామం చేయిస్తుంది. ముఖ ప్రక్షాళనం నుంచి స్నానం వరకూ ఆమె పర్యవేక్షణలో జరుగుతాయి.
    రెండవ యువతి ప్రియను అలంకరిస్తుంది. వేసిన బట్ట వేయకుండా, చేసిన అలంకరణ చేయకుండా - ప్రియ కట్టు, బొట్టు లను శాసిస్తుందామె.
    మూడవ యువతి ఆమె ఆహారపుతవసరాలను చూస్తుంది. అటు ఆరోగ్యం చెడకుండా, ఇటు ప్రియ రుచులకు లోటు లేకుండా పదార్ధాలను తయారు చేయిస్తుందామె.
    నాల్గవ యువతి ప్రియకు మానసిక కొల్లోసాన్ని కలిగిస్తుంది. ఆమె అభిరుచుల కనుగుణంగా కధలు చెబుతుంది. విడియోలు చూపిస్తుంది.
    ఆ నలుగురు యువతులూ అంటే ప్రియకేంతో యిష్టం. స్వతహాగా అందమైన ప్రియ అందచందాలా నలుగురు యువతుల కారణంగా ఇనుమడించాయి. కానీ వారి జీతాలు బ్యాంకుల్లో ఉన్నతోద్యోగంలో పాతిక సంవత్సరాల సర్వీసున్నవారికీ మించి ఉంటుందని ప్రియ రవంత బాధపడుతుంది. భర్త వద్ద. రాఘవ ఆమెను మృదువుగా మందలిస్తాడు.
    ప్రియ సామాన్య మధ్య తరగతి యువతి.
    రాఘవ కోటీశ్వరుని ఏకైక వారసుడు.
    తోలి చూపులో ప్రియ నతడు ప్రేమించాడు. వెనువెంటనే ప్రియకు తన ప్రేమ గురించి చెప్పుకున్నాడు.
    "మన మధ్య అంతస్టుల భేదం ఎక్కువ ---' అంది ప్రియ.
    "మనమిద్దరం ఒక్కటైతే మన మధ్య భేదాలేలా ఉంటాయి ?" అన్నాడు రాఘవ.
    ప్రియ బడులివ్వలేక పోయింది. కానీ - "మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు సూచించిన సంబంధం చేసుకుని వారి పట్ల మీ బాధ్యతను నిర్వహించండి." అంది.
    'ఆ బాధ్యత కంటే నీ పట్ల నాకున్న బాధ్యత ముఖ్యమైనది ....." అన్నాడు రాఘవ. "నీ అందం అపూరపమైనది. నేను సౌందర్యా రాధకుడిని. నీ రూపలావాణ్యాలకు న్యాయం చేకూర్చడం నా బాధ్యత."
    ప్రియ సిగ్గుపడింది. రాఘవ ఆమెను తానెలా చూసుకునేది వివరించాడు. ప్రియ ఆశ్చర్యపడింది.
    "నీ తలితంద్రులతో మాట్లాడి మన వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తాను.' అన్నాడు రాఘవ.
    ప్రియ వారించలేదు. కానీ ఆ వెనువెంటనే బాబూరావు ను కలుసుకుంది.
    బాబూరావు కాలేజీలో లెక్చరర్. ప్రియకు పక్కింట్లో ఉంటున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడతడామేను ప్రయివేటు చెప్పాడు. అతడి పాఠాలంటే మాటలమే కెక్కువగా నచ్చాయి. వారిద్దరూ ఒకరంటే ఒకరిష్టపడేవారన్న విషయం ప్రియ తలిదండ్రుల కర్ధమయేటంత చనువుగా వారి ప్రవర్తన ఉండేది. బాబూరావుకు కట్నం తీసుకోకూడదన్న ఆదర్శముందని తెలిసి ప్రియ తలితండ్రులు సంతోషించారు. చెల్లెలి పెళ్లి కాగానే ప్రియను పెళ్ళి చేసుకోవాలని బాబూరావనుకుంటున్నాడు. అయినా ప్రియ బియ్యే రెండవ సంవత్సరంలో ఉండగా రాఘవ ఆమెను చూశాడు.
    కట్నం తీసుకొని బాబూరావు కంటే కన్యాశుల్కం మివ్వగల రాఘవ ప్రియ తల్లిదండ్రులకు నచ్చడంలో ఆశ్చర్యం లేదు.
    అందుకే ప్రియ బాబూరావు ను కలుసుకుని మొత్తం విషయం చెప్పింది. బాబూరావు మౌనంగా విని - "ఈ పెళ్ళి వల్ల నీ తలిదండ్రుల అంతస్టు పెరుగుతుంది. నీ అందానికి న్యాయం చేకూరుతుంది -" అన్నాడు.
    "కానీ మనమిద్దరం భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నాము. ఆ కలలు నిజం కావాలి - ' అంది ప్రియ.
    "మనం కన్న కలలు సామాన్య మైనవి. ఇప్పుడు నీ జీవితమే ఒక అందమైన కలగా మారబోతోంది" అన్నాడు బాబురావు.
    "నీవు లేకుండా నా భావి జీవితాన్నుహించుకోలేను -' అంది ప్రియ.
    "కానీ నా భావి జీవితంలో నువ్వు లేవు. నా తలితండ్రులు వేరే సంబంధం నిర్ణయించారు. కాదనలేని స్థితిలో ఉన్నాను." అన్నాడు బాబురావు.
    ప్రియ తెల్లబోయింది. కళ్ళ మ్మట నీళ్ళు పెట్టుకుంది. బాబూరావును తిట్టింది, బ్రతిమాలింది.
    బాబురావు మౌనంగా నవ్వాడు.
    ప్రియ వివాహం రాఘవతో జరిగిపోయింది.
    రాఘవ అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆమెనొక దేవతలా అరాదిస్తున్నాడు.
    ప్రియకిప్పుడు నలుగురు పరిచారికలు. ఆమె కోరితే కొండ మీంచి కోతిని దింపి తేగల భర్త. సమాజంలో ఉన్నత స్థానం.
    వివాహమైనాక కొంతకాలం ఆమె స్వర్గ సుఖాలనుభవించింది. ప్రపంచం తెలియలేదు. బాబూరావును కూడా మరచిపోయింది.
    రాఘవ భార్య శారీరక, మానసికోల్లసాని కెన్నో ఏర్పాట్లు చేశాడు. అయితే అతడు వ్యాపారస్థుడు . ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటాడు.
    రాత్రి ఏదో సమయంలో అతడు భార్య సరసన చేరతాడు. కాసేపిద్దరూ ఒకరిలో ఒకరైక్యమై పోతారు. అతడు తీయని మాటలు చెబుతాడు. అతడి సాంగత్యంలో అపూర్వనుభూతిని పొందుతుందామె.
    ప్రియ సౌందర్యాన్ని రాఘవ ఆరాధిస్తాడు. ఆ ఆరాధన ప్రియకు కలిగించే తృప్తి అంతా ఇంతా కాదు.
    "ప్రియా!' అని అతడు పిలిస్తే తనువూ పులకరిస్తుందామెకు.
    రాత్రి అతడికి దగ్గరగా జరిగి పడుకుంటే ఏదో తెలియని మత్తు ఆమెనావహిస్తుంది. కానీ ఒకరాత్రి చూస్తె అతడు పక్కలో ఉండడు. ఆమె అతడి కోసం తడుము కుంటుంది.
    మొదటిసారి అలా జరిగినప్పుడామె అతణ్ణి అడిగింది . "రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారు ?" అని.
    "నీవు నా భార్యవు. అందువల్ల మనిద్దరిదీ ఏకశయ్య కావాలి. నీ అందం సన్నమితంగా ఆకర్షిస్తుంది. అందుకని నిన్ను దగ్గరగా తీసుకుంటాను. తీసుకుని ఊరుకోలేను. ఒకరిలో ఒకరు ఐక్యమవుతాం. అంతటితో నాకు తృప్తి కలగదు. కానీ దేవతగా నిన్నరాధించే నేను నా కోర్కెల నదుపు చేసుకొనడం కోసం నీకు దూరంగా ఉంటాను. నిన్నపురూపంగా చూసుకుంటాను నేను. అందుకే నీ పక్కలో ఎక్కువసేపుండను-' అన్నాడు రాఘవ.
    భర్త భార్య వద్ద కోర్కెల నదుపు చేసుకొనడమేమిటో ప్రియకు అర్ధం కాలేదు. అలాగని తీరని కోర్కెలతో ఆమె శరీరం వేగి పోవాల్సిన స్థితి రాఘవ కారణంగా ఏర్పడనూ లేదు. అయినప్పటికీ భర్త పరాయి స్త్రీలకు మరుగుతున్నాడన్న అనుమానం ప్రియకు వచ్చింది. తన అనుమానాన్ని ఎంతో కాలం దాచుకోలేదామే.
    ఆమె అనుమానాన్ని వింటూనే రాఘవ బాధగా - "నీ అనుమానం నిజమని ఋజువు చేయి. నువ్వే శిక్ష విధించినా భరిస్తాను." అన్నాడు.
    ప్రియ భర్త పైన గట్టి నిఘా వేసింది. ఆమెకు ఋజువులు దొరకలేదు. ఆమె భర్త ముందు తన ఓటమి నంగీకరించి - "మీరు నాకోసం మీ సమయం వెచ్చిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది." అంది.
    "నీకు భవంతులు కావాలంటే చెప్పు, పరిచారికలు సంఖ్య పెరగాలంటే చెప్పు, నగలు కావాలంటే చెప్పు క్షణాల మీద ఏర్పాటు చేయగలను. నన్ను మాత్రం నీకు దూరంగా ఉండనీ. నేనెక్కడున్నా నీ గురించే ఆలోచిస్తుంటాను. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా నీ తలపులు నన్ను వీడవు.' అన్నాడు రాఘవ.
    "మీరు నాకు దూరంగా ఎందుకుండాలి."
    'దగ్గరగా ఉన్నప్పుడు నా మనసెలా అదుపు తప్పుతున్నదీ నాకు తెలుసు. నా మనసు నదుపు చేసుకోవడాని కున్న ఏకైక మార్గం నీకు వీలైనంత దూరంగా ఉండడం. ఆ దూరం మన మధ్య ఆకర్షణను పెంచుతుంది. నా కారణంగా నీ అందం మాసిపోకుండా కాపాడుతుంది." అన్నాడు రాఘవ.
    "నా అందం త్వరగా మాసిపోతుందని మీ భయమా?"
    "నీ అందం మాసేది కాదని నాకు తెలుసు . అలాగని మాపడానికి ప్రయత్నించలేను గదా " అన్నాడు రాఘవ.
    అతడి మనసులో ఏమున్నదో ప్రియకు తెలియదు. కానీ భర్త తనను వేయి కళ్ళతో కనిపెడుతున్నాడని ఆమెకు తెలుసు. అమెమనసుకు రవంత కష్టం తోచినా, శరీరానికిసుమంత గాయమైనా అతడికి వెంటనే తెలిసిపోయేది. వెతుక్కుంటూ వచ్చి విలవిలాడిపోయేవాడు.
    'ఇంత చిన్న విశేషం మీకెలా తెలుస్తుంది ?" అని ప్రియ ఆశ్చర్యపడుతుంది.
    "నేను నీకు దూరంగా ఉన్నానని నీ అనుమానం. నా మనసెప్పుడూ నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది." అంటాడు రాఘవ.

 Previous Page Next Page