Previous Page Next Page 
గృహిణి పేజి 19


    అందరూ ప్రియ అదృష్టవంతురాలని అంటారు.
    ఆమె సాధారణ మధ్య తరగతి యువతి. పెళ్ళి కానప్పుడు తన పనులు తాను చేసుకోనడమే కాక యితరుల పనులు కూడా చేసేదామే. ఇప్పుడామె పనులు చేయడానికే కాక ఇతరుల పనులు చేసిపెట్టడానికి కూడా పరిచారికలున్నారు. ఆమె అంతస్థు నింతగా పెంచిన భర్త ఆమె నుంచి కృతజ్ఞతా భావాన్నా శించడానికి బదులు తనే కృతజ్ఞతాభావంతో వంగి పోతున్నాడు. ఆమె నున్నత స్థానంలో ఉంచి అరాదిస్తున్నాడు.
    రాఘవ ప్రేమారాధన గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు. అంతటి కోటీశ్వరుడు విలాసాల జోలికి పోకుండా కేవలం భార్యనలా ఆరాధించడం ఒక విశేషమనేవాడు.
    "విశేషం నా ప్రేమలో కాదు. నీ అందంలో వుంది. నారు పోసిన వాడు వీరు పోస్తాడు. భగవంతుడు నీ అందానికి న్యాయం చేకూర్చడం కోసమే నన్ను సృష్టించాడు. నాకు సిరులిచ్చాడు." అంటాడు రాఘవ.
    వివాహమై ఏడాది గడిచాక క్రమంగా వాస్తవంలోకి రాసాగింది ప్రియ. అప్పుడామెకు బాబూరావు గుర్తుకొచ్చాడు. అతడు తనను నిరాకరించాడన్న విషయం కూడా ఆమెకు గుర్తొచ్చింది. అతడి నొకసారి కలుసుకొని తన అదృష్టాన్నతడు గుర్తించేలా చేయాలనుకుంది. ఒకరోజామే స్వయంగా వెళ్ళి అతణ్ణి కలుసుకుంది.
    బాబూరావామేను అభిమానంగా పలకరించాడు. ఆమె చెప్పిందంతా విని - "నీకిలాంటి అదృష్టం పడుతుందని తెలియడంతోనే - నీ అందానికి తగిన న్యాయం చేకూరుతుందని అనుకున్నాను. అందుకే నిన్ను నిరాకరించాను. నాకిప్పుడేంతో సంతోషంగా ఉంది." అన్నాడు.
    ప్రియ తెల్లబోయి - "నామీద ప్రేమతో కాదు- స్వార్ధంతోనే నన్ను నిరాకరించావు. ఇప్పుడూరికే అబద్దం చెబుతున్నావు -" అంది.
    'నిన్ను కాక వేరేవరినైనా వివాహం చేసుకున్నప్పుడు నేను చెప్పిండబద్దమేనని నేనూ నమ్ముతాను -' అన్నాడు బాబూరావు.
    ప్రియ నిశ్చేష్టురాలై - "అయితే నీవిక వివాహమే చేసుకోవా?" అంది.
    ప్రియ ప్రశ్నకు కాలమే బదులిచ్చింది.
    ఇప్పుడు ప్రియకు వివాహమై పది సంవత్సరాలు దాటింది. ఆమె కిద్దరు పిల్లలు. పెద్దవాడు విజయ్ కు ఆరేళ్ళు. రెండో పిల్ల లతకు మూడేళ్ళు. పిల్లలను కనడం వరకే ప్రియకు బాధ్యత. వారిని చూసుకునేందుకు , రాఘవ కుటుంబ సాంప్రదాయకనుగుణంగా పెంచడానికీ వేరే పరిచారికలున్నారు. చక్కగా ముస్తాబై వున్నప్పుడు వారినామే కాసేపు ముద్దు లాడుతుంటుంది.
    ఇద్దరు పిల్లల తల్లయినా ప్రియలో మార్పేమీ లేదు. రాఘవ ప్రేమలోనూ మార్పు లేదు. బాబూరావు జీవితంలోనూ మార్పులేదు.
    అతడు వివాహం చేసుకోలేదు. ప్రియ మాత్రం వివాహమైనాక తొలిసారి అతణ్ణి కలుసుకున్న రోజు నుంచి ఇంతవరకూ ప్రతిరోజూ వెళ్ళి అతణ్ణి కలుసుకుంటుంది, పక్క దిగలేనంత జబ్బు చేసి నప్పుడూ , రెండు పురుళ్ళ సమయంలోనూ మాత్రం ఆమె అతణ్ణి కలుసుకోలేకపోయింది.
    సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి తొమ్మిది వరకూ ఆమె ప్రతి రోజూ బాబూరావు గదిలో గడుపుతుంది. అక్కడికామే వీలైనంత రహస్యంగానే వెడుతుంది. అందుకోసం ఆమె ఒక రెండు వాటాల యిల్లు కొంది. ఒక వాటా బాబూరావు కద్దేకిచ్చింది. రెండో వాటాను తన అభిరుచుల కనుగుణంగా అలంకరించుకుంది. ఆ యింటినో మధ్యతరగతి కుటుంబాని కద్దేకిచ్చింది. అందులో ఒక పెద్ద గది ఆమె కెప్పుడూ ప్రత్యేకించబడింది. ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏకాంతంలో స్వంగీతం వింటూ పుస్తక పఠనం చేస్తానని ఆమె చెబుతుంది. ఆ గదిలోంచి బాబూరావు వాటాకు వెడుతుందామె.
    అక్కడ ఇద్దరూ ఎంతో చనువుగా మసులుతారు.
    ఆమె అతడి ఇల్లంతా సర్ది పెడుతుంది. వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఒకరి ఒడిలో ఒకరుండి ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు.
    వారీవిధంగా రహస్యంగా కలుసుకుంటున్నప్పటికీ ఇద్దర్నీ ఆ సమయంలో చూసిన వారెవరికైనా వాదిద్దరూ ఒకరికోసం ఒకరుగా పుట్టిన ప్రేమికులనీ, ఎన్నో ఏళ్ళుగా కలిసి జీవిస్తున్న దంపతులనీ అనిపిస్తుంది.
    అయితే అలా అనుకునే అవకాశం ఇంతవరకూ ఎవరికీ రాలేదు. అందుకు వారినలా చూడాలి కదా!  
    "ప్రియా! నీవిలా రావడం నీ భర్తకు తెలిస్తే ప్రమాదమేమో?" అని విధిగా ప్రతిరోజూ ఒక్కసారైనా అంటాడు బాబురావు.
    "ప్రేమ ప్రమాదాలకు భయపడదు - ' అంటుంది ప్రియ.
    "నీవు కూడా వివాహం చేసుకుంటే నాకెంతో తృప్తిగా ఉండేది." అంటుంది ప్రియ ప్రతిరోజూ.
    "వివాహమైతేనేం , కాకుంటే నేం - నీవు నా గృహిణి వే కదా!" అంటాడు బాబూరానందుకు బదులుగా.
    ప్రియకు ప్రమాదమని తెలిసి కూడా బాబురావామెను రావద్దని వారించడు. ఆమె సమక్షం అతడికి కలిగించే ఊరట అంతా ఇంతా కాదు. అందుకే ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకూ బాబూరావీ ప్రపంచంలో అన్ని బంధాలు తెంచుకుంటాడు. ఆ సమయంలో అతడు స్నేహితులను కలవడు. ఎప్పుడైనా బంధువు లొచ్చి అతడింట వుంటే బాబూరావు ప్రాణం విలవిలలాడిపోతుంది.
    "జేవితమంతా యిలాగే గడిచిపోతే నేను భగవంతుణ్ణి కోరడానికేమీ ఉండదు- ' అన్నాడు బాబురావోకసారి.
    అదేమాట ప్రియ తన మనసులో అనుకుంది.
    కానీ జీవిత మేవ్వరికీ సాఫీగా నడవదు.
    
                                               2
    విజయ్ కు పదిహేనేళ్ళు నిండాయి.
    ఆరోజుతడి పుట్టినరోజు వేడుక.
    మధ్యాహ్నం మూడింటికే ఆ వేడుక ఏర్పాటు చేసింది ప్రియ.
    ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరింటికి తన సమయాన్ని వృధా చేసుకోదామె.
    ఆ వేడుక సాయంత్రం జరగాలని విజయ్ పట్టుబట్టాడు. అతడి స్నేహిరులు కొందరు సాయంత్రం తప్ప రాలేమన్నారు. కానీ ఆ ఇంట్లో ప్రియ పట్టుదల ఒక్కటే నెగ్గుతుంది.
    విజయ్ కోపం వచ్చింది. ముభావంగానే వేడుక చేసుకున్నాడు.
    తనయుడి సంతోషాన్ని కూడా కాదని తల్లి పొందే అనుభవమేమిటో అతడి ఊహ కందలేదు.
    'అమ్మా! నేనూ నీతో ఆ గదికి వస్తాను ." అన్నాడు విజయ్.
    ప్రియ ఒప్పుకొలేదు.
    తల్లి అక్కడేం చేస్తుందో చూడాలని విజయ్! కుతూహలం చెలరేగింది. అందుగురించి అతడో పధకం ఆలోచించాడు.
    ఒకరోజున విజయ్ ఆ ఇంటిని క్షుణ్ణంగా పరీక్షించాడు. బాబూరావింట్లో నించి ఆగదిలోకి ప్రవేశించే అవకాశముందని గ్రహించాడు.
    ముందుగా తల్లి గదిలోని లోపల గడియ తీసేశాడు.
    బాబురావింటి వాటాలో రహస్యంగా ప్రవేశించడానికి బాత్రూమ్లో ను ఎన్నుకున్నాడు.
    ఆ చిన్ని కుర్రాడి బుర్రలో ఇలాంటి పదకముందని అటు బాబూరావుకు గానీ, ఇటు మధ్యతరగతి కుటుంబానికి గాని , ప్రియకు గానీ తెలియలేదు. ఫలితంగా అతడి పధకం నిర్విఘ్నంగా నెరవేరింది.
    కానీ విజయ్ చూడకూడని దృశ్యమే చూశాడు.
    తన తల్లి పరాయి పురుషుడితో ఎంతో చనువుగా....
    విజయ్ షాక్ తిన్నాడు.
    ఆడవాళ్ళు పరాయి పురుషులతో చనువుగా మసలడం విజయ్ కుటుంబంలో వింత కాదు. కానీ అందుకింత రహస్యం అవసరం లేదు.
    ఒక్కసారిగా విజయ్ కు తల్లి అంటే ఏహ్యభావం కలిగింది.
    ప్రియగానీ, బాబూరావు గానీ విజయ్ ని చూడలేదు.
    తన తండ్రి తల్లిని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ తల్లి కన్న కొడుకును కూడా మరిచి ఇక్కడకు వచ్చి పరాయి పురుషుడితో....
    విజయ్ వయసు పదిహేఏళ్ళు అయినా - దృడంగా, ఎత్తుగా యువకుడిలా ఉంటాడు. యువకుడికి ఉండేటంత అనుభవం లేకపోయినా పరిజ్ఞానమకడికుంది.
    అక్కణ్ణించి ఒక్క ఉదుటున విజయ్ వెనక్కు మళ్ళి, వెతుక్కుంటూ వెళ్ళి , తండ్రిని కలుసుకున్నాడు. తను చూసింది చెప్పాడు.
    రాఘవ మ్రాన్పడిపోయాడు. అయితే త్వరగానే తేరుకుని, "కంగారు పడకు , ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను తెలుసుకునే వరకూ నువ్వు తెలుసుకున్న నిజం నిజం కాదు -' అన్నాడతను.

 Previous Page Next Page