Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 6

 

    "సాధ్యమైనంత త్వరలో"
   
    "ఇప్పుడే సాధ్యంకాదా?" రెట్టించారు.
   
    "నో.... అతను ప్రస్తుతం ఇండియాలో లేడునోరు జారాడు అసకల్పితంగా.
   
    "మరి ఉద్విగ్నంగా అడిగారంతా.
   
    ఇక చెప్పక తప్పదనిపించింది. "ఇంచుమించు ఇలాంటి అసిన్ మెంట్ కోసమే ఫీలఫ్సీన్స్ ప్రభుత్వం అభ్యర్ధనపై అక్కడ అడవుల్లో వున్నారు. దయుంచి పభ్లిష్  చేయకండి."
   
    "అదేం... ఒక అసాధరణమైనా ఆహ్వానంపై వెళ్ళిన ఆ న్యూస్ ని ఎందుకు రహస్యంగా వుంచాలి?"
   
    "అదీ చైతన్య కోరిందే ... తను ఈ దేశం వదిలిపేట్టి ఓ ప్రమాదాన్ని  ఆహ్వానిస్తూ మరెక్కడికో వెళ్ళినట్టు అతడి తల్లికి తెలియకూడదన్నది అతడి అభిప్రాయం."
   
    "ఓ.కే. ఎక్స్ ప్రెస్ విలేఖరి ఉత్కంఠంగా అన్నాడు...... "ఈ విషయం గోప్యంగా నే వుంచుతాం.కనీసం అసిన్ మెంట్ ఏమిటో చెబుతారా?"
   
    "అదీ  అతను తిరిగొచ్చాకనే అయితే బాగుంటు౦దేమో" మరో ప్రశ్న రకముందే చెప్పాడు అనిల్ కూమార్. "సుమారు పన్నెండుదేశాల నుంచి అనుభవజ్ఞులయిన వేటగాళ్ళు పిలిఫ్సీన్స్ లో అడుగు పేట్టి ఓ టీమ్ లా  పోరాటం సాగిస్తే ఇప్పటికి మిగిలింది ఇద్దరు మాత్రమే."
   
    "తక్కినవాళ్ళు తిరిగి వెళ్ళిపోయారా?"
   
    "లేద __ప్రాణాలు కోల్పోయారు"
   
    "వ్వాట్?"

    "యస్ మిగిలిన ఇద్దరిలో చైతన్య ఒకడు. ఇప్పటికీ వెనక్కీ వచ్చేయమని ఆదేశాలదించాం. మరో 24 గంటల గడుపుకావాలనుకున్నారు. అంటే గెలుపు కనీ, ఓటమి లేనిది మరో రోజులో..."
   
    "చాలా ఖరీదైన రిస్క్ తీసుకుంటూన్నారన్నమాట"
   
    "యస్ ! దటీజ్ చైతన్య..."
   
                                                *    *    *    *
   
    మరణహొమాన్ని సృష్టించే తుఫానులకీ, నిరంతరం మండే అగ్నిపర్వతాలకీ  అలవాటుమైన  పశ్చిమ ఫసిమిక్ తీరంలోనిపిలిఫీన్స్ దీవిలో రాత్రి పదిగంటలవేళ........
   
    రాజధాని మనీలాకి నూటయాభై కిలోమీటర్ల  దూరంలోని 'సియర్రామాడ్రే' పర్వత ప్రాంతపు అడవిలో హాఠాత్తుగా నిశ్శబ్దం చెదిరి పోయింది. ఓకే ట్రీస్ పై నిద్రపోతున్న పక్షులు భయంగా రెక్కలు కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరాయి.
   
    పెనుగాలి తాకినట్టు పొదలు అటూ__ ఇటూ ఊగిసాలాడుతుంటే  మసక వెన్నెల్లో సమాధిలా ముడుచుకుని వున్న గుట్టపైనుంచి కు౦దేళ్ళు, స్థావరాన్ని విడిచి పరుగుతీస్తున్నాయి.
   
    ముందు మృత్యుఘోషలా వినిపిమ్చిమ్దిఒ బుస......
   
    మరుక్షణం  గుట్టపై గుహలా వున్న కలుగులోనుంచి తల బయటకి పెట్టింది విషసర్పం  కింగ్ కోబ్రా .ప్రపంచంలోనే అతి పొడవైన సర్పంగా ఖ్యాతి సంపాదించిన కోబ్రా పొడవు ఇరవై ఏడు అడుగులు.కొన్ని నెలల క్రితందాకా మొత్తం దేశంలో గొప్పటూరిస్టు స్పాట్ గా పేరుగాంచిన ఆ ప్రాతాన్ని శ్మశానస్థంలంగా మార్చింది ఈ సర్పమే.
   
    మందగించిన టూరిస్టు లా మూలంగా ప్రభుత్వానికి కోట్ల పెసో(ఫిలిఫ్సీన్ కరెన్సీ) ల నష్టానికి గానీ, అఅరణ్య ప్రాంతంలో నివసించే వందల నీగ్రోలు, నామర్ల తెగలు ప్రాణాలు కోల్పోడానికిగాని కారణ పట్టిన స్పోటకంలా వికృతంగా వున్నాయి.
   
    ముందు గుట్టపై వున్న వాటర్ టాంక్ పై పడగనానించి దిక్కులు చూసింది. సుమారు ఇరవైరెండు అడుగుల ఎత్తుదాకా లేచిన సర్పం ఇప్పుడు బలిసిన సింధూర వృక్షంలా వుంది.
   
    కిందఏదో చప్పుడై౦ది.
   
    అంతే ప్రాణభీతితో పరుగెత్తుతున్న కుందేలు వంటిపై కోబ్రాకోరలు దిగబడ్డాయి.
   
    అర నిముషం వ్యవధిలో కుందేలు ఆ పాము గొంతులోకి జారింది.
   
    బ్రతుకు తీపితో కుందేలు ఇంకా ప్రయత్నించి ఇబ్బంది పెట్టిందేమో సర్పం తోక విసురుగా విదిలించింది. ఆ తాకిడికి ఒక బండరాయి స్థానభ్రంశం చెంది వేగంగా గుట్టపై నుంచి క్రిందికి దొర్లింది.
   
    శశిరాత్రి వజవజా వణికిన చప్పుడుతో దివీటీల్లా మండుతున్న కళ్ళతో దిక్కులు పరికించి నెమ్మదిగా పడగని నేలపై నానించిన కోబ్రానైనా కదా తెర్చాలని ఎదురుచూస్తున్న కాలసర్పం అది.
   
    సరిగ్గా అదే సమయంలో......
   
                       *    *    *    *   
   
    "సారీ చైతన్యా ... నేను వెళ్ళాలి" నలభయేళ్ళ మోరిటోనా అన్నాడు గెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తూ.
   
    "అంటే...... హాఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నమాట" రైఫిల్ క్లీన్ చేస్తూ అడిగాడు చైతన్య యదాలాపంగా.
   
    "యూ.... ఇట్సే సడెన్ డెసిషన్ "జపాన్ దేశానికి చెందిన మోరిటోనా ఆ దేశంలో పేరుగాంచిన హంటర్... నిన్నటివరకు అందరికీ చేతన్యకీ అబ్బురంగానే వుంది.
   
    "మిస్టర్ చైతన్యామనది చాలా స్వల్పపరిచయం. సరిగ్గా పదిహేడురోజుల క్రితమే అనుకుంటాకదూమనం కలసింది."
   
    చైతన్య జవాబు చెప్పలేదు. మోరిటోనా తదేకంగా చూస్తున్నాడు.
   
    "పన్నెండుమంది హంటర్స్ ని వివిధ దేశాలనుంచి రప్పించిన పిలఫ్సీన్స్ ప్రభుత్వం అప్పుడే పది శవాలని రవాణా చేసింది. బహుశా మనకోసమూ అలంటి ఏర్పాట్టుల్లో మునిగి వుంటుంది."

 Previous Page Next Page