ప్రజల్లో అందోళన. చలన చిత్రరంగంలో అలజడి.
"సరైనా రక్షణలేకుండా అడవిలో ఘాంటింగ్ ఎలా ప్లాన్ చేసినట్టు? తెలుగు చిత్ర నటీనట సమాఖ్య,సాంకేతక నిపుణుల సంఘాలు నిర్మాతల్ని తూర్పారబడుతూ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. జరిగిన నష్ట్నికి నిర్మత గోవర్ధనం గుండెలు బాదుకున్నాడు.
పోలీసుదళాలుఅడవిని గాలించాయి. అయినా విజయ శవాన్ని గాని, ఓ చిన్న ఆధారాన్ని గాని సంపాదించలేకపోయాయి.
ఆ సంఘటన జరిగిన మూడోవరోజు ఉదయం హావుదరాబాద్ లోని చీఫ్ కన్వర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అనిల్ కూమార్ తో.
"ఇప్పుడేం చేయబోతున్నారు" నిలదీశాడు ఎక్స్ ప్రెస్ విలేకరి
"ఈ ప్రశ్న అడగాల్సింది నన్నుకాద.పోలీసు డిపార్ట్ మెంట్ ని" అసహనంగా అన్నాడు అనిల్ కూమార్.
"కాని విజయ మిస్సయింది అడవిలో."
"కావచ్చు మేం అనుమతిచ్చింది ఘాంటింగ్ వరకు మాత్రమే. అక్కడ రక్షణ విషయంలో వాళ్ళు పోలీసుల సహాయం తీసుకోవలసింది."
"అసలు అలాంటి ప్రమాదకరమైనా అడవిలో ఘాంటింగ్ మీరు అనుమతేలా ఇచ్చారు?"
"ప్రతి అడవీ ప్రమాదకరమైనదేగా"
"అలా జనరలైజ్ చేయకండి మిస్టర్ అనిల్ కూమార్. కూనాం అడవిలో ఎన్ని దారుణాలు జరిగాయో ఏడాదిక్రితం దినపత్రికలూ తిరగేస్తే చాలు."
"అవును. అది అప్పటి మాట."
"అప్పుడేకాదు. ఇప్పటి మాట కూడా."
అవాక్కయి చూస్తున్నాడు అనిల్ కూమార్.
ఎందుకిలా ఆశ్చర్యపోతున్నారు అనిల్ కూమార్ గారూ...అక్కదాదవిలో ఎందరో యువతులు అదృశ్యమైనప్పుడు ఫార్మల్ గా వేటగాళ్ళనిపంపారు బహుమతుల్ని ప్రకటించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారం మయిందన్న మాట తప్ప ఆ జంతువేదో తెలుసుకోగలిగారా?"
గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
"ఆఫ్ కోర్స్ శవాల దొరికితే తప్ప జంతువులకోసం మాటేసి అవకాశం లేదు. అనుభవజ్ఞలయిన వేటగాళ్ళుఅప్పటికీ ప్రయత్నించారు రోజులపాటు. అ తర్వాత అమ్మాయిలూ అదృశ్యం కావడం ఆగిపోయింది. ఇకముందు దారుణమే కాదు, నేరంకూడా. ఇప్పటికీ అక్కడ అనర్దాలు కొనసాగుతూనే వున్నాయి."
"కని..." అనిల్ కూమార్ మరేదో చెప్పాబోతుంటే అదే విలేఖరి అడ్డుపడ్డాడు.
"ఇప్పుడు మమ్మల్ని మీరు మాటలతో జోకోట్టలేర్రుమిస్టర్ అనిల్ విజయంకోసం అడవిగాలిస్తున్న పోలీసులకి చాలా దూరంలో ఇద్దరు యువతుల శవాలు దిరిక్యి గుండెలనుంచి కడుపుదాకా చీల్చబడిన ఆ శవాలు మిస్సయిన గిరిజన యువతుల్లోని వ్యక్తులవిగా గిరిజనలచే గుర్తించబడ్డాయి. కూడా. అంటే ఆ జంతువు స్తైర్యవిహారంఇంకా కొనసాగుతూన్నట్టేగా?"
నిశ్చేష్టుడైపోయాడు అనిల్ కూమార్ . నిన్నరాత్రి మాత్రమే తనకే తెలిసిన విషయం అంతవేగంగా ప్రెస్ ని చేరడంతో తప్పదోవ పట్టించేప్రయత్నం వలన ఇక ప్రయోజనం లేదనుకున్నాడు "యస్ __ నాకు రోపోర్టు అందింది కనీ.... " నిశ్శబ్దంగా అరక్షణం పాటు అందరివేపు చూశాడు "ఆ క్రూరమృగం ఇంతవరకూ హతమార్చిన యువతులలో మాకు లభ్యమైన ఈ రెండు శవాలు మాత్రమే"
"అంటే ..." టక్కున అడిగాడు విలేఖరి. "ఈ ఆధారాలతో ఇక ప్రొసీడ్ కావాలనుకుంటున్నారా, లేకపోతె మరికొన్ని అనర్ధాలు జరిగేదాకాఎదురుచూడాలనుకుంటున్నారా?"
"చాలా జటిలమైన ప్రశ్నది.సరిగ్గా ఏడాదిక్రితం ఎలాంటి సందిగ్ధతంలో అతడు కేసు ముంగించాడో ఇప్పుడూ ఇంచుమించు అదే సంశయంలో వున్నాడు."
"మిస్టర్ అనిల్ కూమార్ ! ఒక ప్రముఖ నటి అంతర్ధానంతోతప్ప మరుగున పడిపోయిన ఈ విషయం ఈ రోజు మా దాకా వచ్చినా ఇది ఇంతటితో ఆగదు అసలు దీనంతటికి కారణమైన మృగాని మీరు సంహంరించలేక అడవిలో ఈ దారుణాలు అగేదాక మా 'ఫాలో ఆఫ్' కోనసాగుతూనే వుంటుంది."
"వెల్" తల పకిమ్చాడు అనిల్ కూమార్ "అంతదాకా నేనూ మిశ్రమించనని హామీ ఇస్తున్నాను.,"
"అంటే ..... మళ్ళీ వేటగాళ్ళని రంగంలోకి రప్పిస్తారా?"
"నో" సాలోచనగా అన్నాడు. బహుమతిని ఆశించో లేక వేటని ఓ స్పోర్ట్ గా తీసుకుని అడవిలో అడుగుపెట్టిన వాళ్ళతోనోఇది సాధ్యమవుతుందని నేననుకోను .సమస్యను తనదిగా భావించి డెడికేషన్ తో ముందుకు సాగిపోగల వ్యక్తి కావాలి."
"అతడికి వేటలోనూ ఆ సాధారమైన అనుభవం వుండాలిగా?"
"ఆఫ్ కోర్స్ ... అలాంటి అన్ని అర్హతులున్న వ్యక్తికేమో అసిన్ మెంట్ అప్పచెప్పాబోటున్నను."
"ఎవరతను?" ఉత్కంఠంగా అడిగాడు ఎక్స్ ప్రెస్ విలేఖరి.
"ఒకనాడు పాలేరు అడవుల్లో మెనీటర్స్ గా మారిన పులుతో తలబడి ఆ మారణహొమంలో తన చేల్లినే సమిదిగా మార్చుకున్నది గ్రేట్ మార్క్స్ మాన్ ఎఫ్. డి ఎఫ్. ఓ."
"చైతన్య?" పది కంఠాలు ఒకసారి పలికాయి.
"యస్"
"మార్వలెస్ . ఎప్పుడు పంపుతున్నారు?"