Previous Page Next Page 
ది రైటర్ పేజి 17

    "ఇంతకీ నువ్వనేదేమిటీ ...."
   
    "నీ వయస్సెంత....."
   
    "సుమారు పాతికేళ్ళు....."
   
    "అంటే ఎంత వయసుని వృధాగా ఖర్చు చేసావో చూసావా" నవ్వింది జాలిపడుతున్నట్టు __ అసలు రచియితగా ఏదో కొద్దిపాటి పేరు నైతే సంపాదించుకున్నావుగాని మగాడిగా నీశక్తిని నిరూపించుకునే  ఒక్క ఘనకార్యమయినా చేయగలిగావా..."
   
    ఏం ఆశించి  అమె ఎలా మాటాడుతుందో వైదేయకి అర్దంకాలేదు __
   
    "ప్రేరేపించి రెచ్చగొట్టి పరాకాష్టను చేరుకునేదశలో దూరం జరిగి ఇప్పుడామె తీరుగాటుగా ప్రీచ్ చేస్తుంటే ఉడుకేత్తుకు పోతున్నాడు.
   
    "పదిహేనేళ్ళు వయసులో గ్రోసియా ప్రపంచానికి మొదటిసారిగా ఎన్ పై క్లోపీడియా అన్న పదాన్ని పరిచంచేసి ఆ పేరుతో ఓ పుస్తకాన్ని రూపొందించాడు....అదే వయసులో ఫ్రెంచ్ రచయత విక్టర్ క్యూగో ఫ్రెంచి అకాడమీకి ఓ పాట రాసాడు.... పదహారవయేట తండ్రి అద్వర్యంలోవున్న సైన్యానికినాయకత్వం వహించాడు అలెగ్జాండర్ ..... అల్ ఫ్రేడ్ నోబుల్ ఇరవై రెండేళ్ళు వయసులో డైనమైట్ ను కనిపెట్టాడు..... ఇరవైనాలుగేళ్ళు వయసులో న్యూటన్ భూమ్యాకర్షణ సిద్దాంతాన్ని కనుగొని రుజువుచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తాడు."
   
    "ఇదంతా నాకెందుకు చెబుతున్నావు...." విసుగ్గా అడిగాడు.
   
    "మగాళ్ళంటే వాళ్ళే అని చెప్పడానికి......మగతనాన్ని నిరూపించుకునే మార్గాలు అవే అని నీకు స్పష్టం చేయటానికి ....మిస్టర్ వైధేయా తెలివిలేని జంతువులకి క్రిమికీటకాలకి సామాన్యమయిన పెక్స్ తో ణీ పరిణతిని అంచనా వేసుకునే కంటే ఇలాంటి చరిత్రల్ని సృష్టించి మగాడిని పించుకోవాలి. నిజానికి నేనుకోరుకునే మగతనమిది.....అలాంటి మగాడికే  నేనీ సౌ౦దర్యాన్ని తొలిసారి అంకితం చేసేది."
   
    అవాక్కయి నిలబడిపోయాడు.
   
    "ఏం కష్టమనుకుంతున్నావా? పార్కులో అర్ధంలేని సాహసంచేసిఓ మగాడిచేత చెంపదేప్ప తిన్న నువ్వు ఇలాంటిచరిత్రకు వారసుడ్నేలాకాగలవని అలోచిస్తున్నావా? మిస్టర్ వైదేయా! ప్రాక్టికాలిటీకి అన్వయించని నీ మేధస్సు కేవలం కాగితానికే పరిమితం చేయకు... నీకు నేను హస్తం అవసరమని నువ్వనుకుంటే రా? నీతో నేను చేతులు కలుపుతాను...... కమాన్"
   
    జోన్ ఆఫ్ ఆర్క్ లా యుద్దనీతిని గురించి శాస్రముక్తంగా బోధిస్తున్న కౌటిల్యునిలా దర్శనమిచ్చింది క్షణంపాటు.....
   
    "కాని...." సాలోచనగా చూసాడు.
   
    "ఏంటి సందేహం __"
   
    "అసలు నేను ఎలాంటి చరిత్ర సృష్టించాలని...."
   
    "చెబుతాను వైదేయా! వందమందైనా చేయనిది లక్షమందిని ఆశ్చర్యపరిచేది ఏదైనా అది చరిత్రే __ అది క్రైం కావచ్చు.... మరో రకమయిన సెన్సేషనల్ ఏక్ట కావచ్చు."
   
    ఎదురుగా నిలబడ్డ రోషణి సామాన్యమయిన ఆడపిల్లలా కనిపించలేదు..... ఇంత అందమయిన ఆడపిల్ల ఇలా దారుణంగా ఎందుకాలోచించగలుగుతోంది అన్న ఆలోచన కలిగిన తోలి క్షణమిది __
   
    "ఏం ___ఎందుకలా చూస్తున్నావు"
   
    "చట్టబద్దంకాని నేరాలు కూడా చరిత్ర నేలా సృష్టించాగలనో" అర్ధంకాక__"

    హేళనగా నవ్వింది ___ "నేరం ..... చట్టం..... " వత్తిపలుకుతూ వికృతంగా నవ్వింది ...అలా అధిక్యటగా భావిస్తున్న ఈ శతాబ్దంలో పక్కనున్న వాడ్ని యుక్తిగా సమాధిచేసి పైకి సాగిపోవడమే నిజమయినపురోగమనంగా భావిస్తున్న ప్రస్తుత కాలంలో డబ్బుతో నేరాన్ని చేయించి మళ్ళీ ఆ డబ్బుతోనే నేరాన్ని న్యాయంగా మార్చగలుగుతున్నఈ సమాజంలో నిలబడి చట్టం నేరం అంటూ జంటపదాల్ని వల్లించడం నీ అసమర్దతనీ కప్పిపుచ్చుకోవటానికి వాడే అందమయిన పదజాలమంటే అంగీకరీస్తావా?"  
   
    నిశ్సబ్దంగా వింటున్నాడు కలవంచుకునే __
   
    "నేరం చేయటం కాడునేరం __ చట్టానికే దొరికేట్టు చేయడమే నేరం."
   
    నెమ్మదిగా తలపైకేత్తాడు.....
   
    "తెలివైనవాడు తెలివిలేనివాడు అంటూ వర్గీకరించింది ఈ చిన్నవైనిద్యమే"
   
    బరహితంగా చూస్తున్నాడు......
   
    "అయినా ప్రత్యర్దిని గెలవాలనుకున్నప్పుడు అటలో ఉపయోగించిన ఒడుపు యుద్దంలో శతృవుని సంహరించడానికి సన్నినవ్యూహం నేరాలేలా అవుతాయి __ నిజానికి అదే తెలివుంటే ...." ఆమె శరీరానికి చుట్టుకున్న చీరని వైదేయని రెచ్చగొట్టేలా కొద్దిగా తొలగించి నిలబడింది....
   
    ఆమె నవ్వుకి అందమయిన నగ్నశరీరం జలతారు శరణాల ఊగుతూంది.....         

 Previous Page Next Page