Previous Page Next Page 
ది రైటర్ పేజి 14

    పరిసరాల్నీ సద్దుమణిగినా భార్య చెరువులో కూర్చున్న ఆ వ్యక్తిగుండెల్లో ఇముడ్చుకోలేని సంచలనం.....
   
    అతడికి తెలియకుండానే ఓ సన్నటి నీటి పోరా అతడి కళ్ళనునింపి నేలపైకి జారాలని విఫల ప్రయత్న చేస్తూంది.......

    పెద్దలు నిర్ణయించిన పెళ్ళివారిది.....
   
    అయినా పెళ్ళయాక భార్యను ఆపురూపంగానే ప్రేమించాడు.
   
    రెండుసంవత్సరాల దాంపత్య జీవితం కలలోనూ గడచిపోయింది.
   
    ఆ తర్వాతే తెలిసిందో భయంకరమైన వాస్తవం ___
   
    చాలా మామూలు భార్తలా ఆమెనుంచి కొద్దిపాటి అనురాగాన్ని కోరుకున్నాడు __
   
    ఆత్మార్పణ కోసం దురాశ పడకపోయినా అణుమాత్రం అభిమానాన్ని పొందాలనుకున్నాడు__
   
    కాని ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆమె మనసే కాదు శరీరమూ మరొకరితో పంచుకుంటూ౦దని......
   
    అతని కళ చెదిరిపోయింది..... 
   
   
    ఉద్యోగారీత్యా కేంప్ లకు వెళుతూంటేఆ వ్యక్తి హాఠాత్తుగా ఓ రాత్రి తిరిగివచ్చి పక్కంటి అబ్బాయితో వెలగబెడుతున్న వ్యవహారాలన్నీ కళ్ళారా చూసాడు____
   
    గుండె పగిలింది ___
   
    వాస్తవం తనకు తెలిసినట్టు భార్యకు తెలియకూడదని ఆ రాత్రి వెనక్కివెళ్ళి ఓ హొటలు గదిలో మకాం చేసాడు......
   
    మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చేక ఎప్పటిలా అతడ్ని పెనవేసుకుని "ప్రతి రాత్రీ మీరే కల్లోకోస్తున్నారు,. ఈ కేంపుల బెడద ఎప్పుడోదుల్తుందండీ" అని ప్రేమను నటిస్తుంటే నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ వుండిపోయాడు......

    ఒక బరి తెగించిన ఆడది మామూలు భార్యకన్నా ఎంత గొప్పగా నటించగలిగేదే తెలుసుకున్నందుకు కాదు అతడి కళ్ళు చేమ్మగిల్లింది.....
   
    అపురూపంగా పెంచుకున్న మమతల పొదరిల్లు చాలా నికృష్టంగా కూలిపోయినందుకు ....
   
    పగ తీర్చుకోలేదు..... పల్లెత్తి మాటలేదు.
   
    మరింత ప్రేమను పెంచేడు ఆ రోజు నుంచీ.....ఫలితం లేకపోయింది ____
   
    ఆ పరిసరాల్నుంచి మకాం మార్చేడు...... కాని ఆమె మనసు మారలేదు.
   
    తను గమనించిన విషయం భార్యకు తెలియాలని తిరిగివచ్చిన భార్యను ఒకటి రెండుసార్లు అడిగాడు ఆ అబ్బాయెవరని......
   
    బుకాయించింది ఎవరో తన వెంటపడుతున్నాడని.....
   
    నిర్లిప్తంగా నవ్వుకున్నాడు ___
   
    నిద్రలేని ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.....
   
    సమస్యని జీర్ణించుకుని బ్రతకలేడు.......
   
    భార్యను మరోకరి సొత్తుగా వూహించుకోలేడు......
   
    అలా అని ఆమెపై ప్రేమను చంపుకుని విడిచి పెట్టులేడు.......
   
    అంతే ..... ఏదో ఏదన్నా ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు నాల్రోజుల క్రితమే......
   
    రెండురోజులనుంచి ఒంట్లోనలతగా వుందని మంచంపేట్టి నిద్రపోతున్న భార్యను చూస్తూ ఈజీచైర్ లో వెనక్కీ జారగల బడ్డాడు ఆ వ్యక్తి ......
   
    అతని చేతిలో వారపత్రిక వుంది......
   
    అలవోకగా ముడిచిన పెజీలోని లక్షరాల కేసి చూస్తూ వుండి పోయాడు కొంతసేపు......
     
      అది వైధేయ రాస్తున్న సీరియల్ "మారణహొమం" లో ఓ పేజీ ....
   
    "అర్సినేక్ ట్రయాక్సైడ్ ......AS3 O2
   
    రంగు రుచి వాసనలేని మెటాలిక్ పాయిజన్ ......
   
    197.84 మా లేక్యులర్  వెయిట్ గల ఆ విషం మిలియన్ భాగాలుగా విభజించి అందులో ఇరవై పాళ్ళనుఆహారంలో కలపి ఇస్తే చాలు..... రెండుమూడు గంటల్లో ప్రాణం పోతుంది.......
   
    FULMINANT TYPE ..... POISON FOR HOMICIDE.
   
    వణుకుతున్న చేతుల్తో ధనుంజయ చిన్న పొట్లాంలోని ఆర్సెనిక్ ట్రాయాక్సైడ్ కాఫీలో భార్య కందించాడు. ఆమె నిద్రకు పక్రమిస్తుండగా.......
   
    ఆమె భర్తవైపు కృతజ్ఞతగా చూస్తూ బడలికగా మంచంపై వాలిపోయింది......
   
    కొన్ని క్షణాలు అలాగే చూస్తూ వుండిపోయాడు ధనుంజయ.....
   
    మరో అరగంటలో పల్స్ రేట్ పెరిగింది...... బ్లడ్ ప్రెషర్ తగ్గింది.... ఆమె రక్తంతో విషం జీర్ణించుకుపోతున్న సూచనగా ......
   
    మూసుకున్న ఆమె కనురెప్పలు అలజడిగా కదిలాయి.....
   
    ధనుంజయ తెలుసు చివరగా ఏం జరుగేదీ......
   
    చిన్న మూలుగు వినిపించడంతో తలతిప్పి చూసాడు అవ్య __వారపత్రికను పక్కనపెడుతూ.
   
    మంచంపై పడుకున్న అతడి భార్య చేతితో గుండెల్ని అదుముకుంటోంది.......
   
    ఉద్వైగంతో ముందుకు వంగేడు......   

 Previous Page Next Page