అప్పటికి అర్దమైంది.... తన పిరికితనాన్ని సాషాస్రీయంగా ఎలా పోగొట్టుకోవచ్చో ఆమె చెబుతున్నదని.....
ఎవరీ అమ్మాయి.....
ఎందుకు తన జీవితంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తూంది.....
ఎందుకని అల్లరి చేస్తూంది. మరెందుకనితనకోసం యింట ఆరాటపడుతూంది.
"అనవసరంగా బుర్ర పాడుచేసుకోకు "
బేరర్ తెచ్చిన ఆలోచనలనుంచి తేరుకోలేదు .
వైధేయ ఇంకా ఆలోచనలనుంచి తేరుకోలేదు.
"హి హూ నోస్ అండ్ నోస్ నాట్ హీ నోస్, హీ ఈజ్ ఎ స్లీవ్. వెక్ హిమ్ అన్నది అరబిక్ సామెత..... అదే నేను చేస్తున్నది ...... బయలు దేరడమా"
మంత్ర ముగ్డుడిలా ఆమె వెంట బయటకి నడిచాడు.....
అమే అర్ధం కావటంలేదు.... అందగత్తెకాదు అంతకుమించి ఎన్నోఆయుధాల్ని దాచుకున్న అమ్ముల పొదలా వుందామే......
పోర్టికోలోకి వచ్చారిద్దరూ....
"ఇప్పుడెంటి పోగ్రాం....." ఆమె అడిగింది.
బారులుగా తీర్చనట్లుగా కార్లకు సమీపంలో నిలబడ్డ రోషిణి అక్కడున్నఛీరుచీకటి పారద్రోలే కాంతి రేఖలా వుంది పేరుకు తగ్గట్టు......
ఎదురుగా హుందాగా నిలబడ్డ రోషిణి ప్లాస్టరాఫ్ పారిస్ తో పోత పోసిన విగ్రహంలా నిండైన స్టోస్టవంతో కనిపిస్తుంటే తమాయించుకోలేనట్టు రెండడుగులు ముందుకు వేసాడు.......
చిరుగాలికి లయబద్దంగా నర్పిస్తున్న యామీనీ కుంతలాల్ని సుతారంగా సవరించుకుంటూ "వెళ్దామా" అంది...... "ఈ రోజుకిక అదృశ్యంకానా" అని అడిగిన గంధర్వ కన్యలా.......
"ప్లీజ్ అసంకల్పితంగా అన్నాడు.
అతని పెదవులు సన్నగా ప్రకంపిస్తున్నాయి.
"మాటాడు మహానుభావా"
తేరుకుని "ఆ! వెళ్దాం " అన్నాడు.
"ఎక్కడికి ..." అడిగింది.
"ఇంటికి...."
"పద......" ముందు తను సరిగ్గా వినలేదేమో అనుకున్నాడు. ఆ తర్వాత ఆమె రెండడుగులు నడవబోతే "ఎక్కడికి" అంటూ త్రోటుపాటతో ఆమె చేయిపట్టుకున్నాడు.
"ఇంటికేళ్దామన్నా వుగా..... మీ ఇంటికే"
వైధేయ కళ్ళు ఆశ్చర్యంతో అనందంతో విచ్చుకున్నాయి.
"నిజంగానా " అబ్బురంగా అడిగాడు ....
"ఏం ..... నిన్ను రేప్ చేస్తానేమో అని భయంగా వుందా"
ఒక వల్కనో పెటీయాలనీ పగిలి లావా కాక కత్రిశాబ్ది పరవళ్ళు మరిచిన వైధేయ హఠాత్తుగా ఆమెను దగ్గరకు తీసుకుని వేగంగా చాలా వేడిగా పిచ్చిగా అదిమి అల్లరిచేస్తూ ..... సెకండ్లు ...... లిప్తులు.....
"ఒద్దు" సన్నగా మూలిగింది.
"ప్లీజ్" మరింత గట్టిగా హత్తుకున్నాడు.
"సారీ" ఆమె వెనక్కీ జరగాలని ప్రయత్నించింది.
"కాదనకు......" శివమెత్తినట్లు వూగిపోతున్నాడు.
"నన్నంత సునాయాసంగా పొందలేవు వైధేయా" సీరియస్ గా అంది.
"అంటే.... " జంకుతూ చేష్టలుడిగినట్లు నిలబడిపోయాడు.
"అంటే.... రంగానికి బహిరంగంగా సోద్దపడే పిచ్చి మొద్దూ..... ఇంటి దగ్గరైతే నువ్వు ఎదక్కుండానే అంతా సమర్పించుకుంటూ అంటున్నా" నవ్వింది ఎప్పటిలా.
శరీరమంతా తిమ్మిరెక్కిపోతున్నట్లుగా వుంది.
"ఛ...... చీర పాడైంది...."
పెనుగులాటలోఆమె ఓ డాట్సన్ కి జారబడింది..... ఎన్నోరోజులుగా ఆ కారు అక్కడే వుందో మీద దళసరిగా ధూళి పేరుకుపోయింది.
వైధేయ చేతులు ఎత్తైన ఆమె వృష్టభాగాన్ని తాకుతుంటే ఓ చేత్తో అతడి చేతిని మరో చేత్తో అతడి బుగ్గని పట్టుకుని "దూళి దులుపుదువు గాని..... ఇంటికి పద" అంది చిలిపిగా ___
అంతే ___
కలలోలా నడిచాడు ఆమె వెంట.....
ఒక మేగాటన్ను పది లక్షల టి సమానమైతే రేండో ప్రపంచయుద్దంలో హిరోషిమాపై అమెరికా వేసిన బాంబు శక్తి పన్నెండు వేల అయిదువందల టి ఎన్ టి ___
ఇప్పుడు అగ్రదేశాల వద్ద నున్న అణ్వాయుధాళశక్తి హిరోమా పై వేసిన బాంబుకంటె పదిలక్షల రెట్లు ఎక్కువ .....
వైధేయకి తెలియదు రోషిణి అంతకు మించి శక్తి గలగదని........
* * * *
ఆ రాత్రి........
భాగ్యనగరంలోని సీతాఫల్ మండి ప్రాతంలోని ఓ ఇంట నిద్ర పోతున్న భార్యకేసి చూస్తూ కూర్చుని వున్నాడో వ్యక్తి......
ఆకాశం నిర్మలంగా వుంది ఎప్పటిలా ......
నేలపైన అమావాస్య చీకటి కేసిచూస్తూ నక్షత్రాలు బెదురుగా మిణుకుమంటున్నాయి.