Home » Vasundhara » వరమివ్వని దేవత

     "నేనా? పెళ్ళా?" అన్నాడు మోహన్.   
    "లత నాకు భార్య. ఈ ప్రపంచంలో ఏ భర్తా నాకు లాంటి సందేశాన్ని మోపి ఉంటాడనుకోను. నువ్వు పెళ్ళి చేసుకుంటే __ నా కంటె గొప్ప త్యాగం చేసినట్లవదు" అన్నాడు రామారావు.   
    రామారావు వెళ్ళిపోయాక మోహన్ బాగా ఆలోచించాడు. కధ చాలా  వరకూ తనదారికి వచింది. ఒక దేవత తనకు వరమివ్వడానికి సిద్దంగా ఉంది. అందుకు తను చేయవలసిన తపస్సు  శశికళ అనే పిల్లాతో పెళ్ళి. తన అందాన్నీ డబ్బునీ చూసి ఏ ఆడపిల్లనయినా పెళ్ళికి సిద్దపడుతుంది. పెళ్ళి చేసుకోవడంవల్ల ఆ పిల్లకేగానీ తనకు నష్టముండదు. భార్య ఉంటే తనకు మరికొన్ని సదుపాయాలుంటాయి. ఆడపిల్లలను వశపరచుకోవడానికి తను భార్యనే ఉపయోగించవచ్చును. భార్య ఇంట్లో, ఉండగా, తానింకెవరిటో కులికినా ఎదుటివాళ్ళు అనుమానించరు.    
                                                                           15   
    "కూర్చోండి "  అంది శశికళ.   
    మోహన్ కూర్చున్నాడు. అతను  శశికళవంకనే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉందీ పిల్ల! అనుకున్నాడు. ఆమె వేషధారణ అతనికి మరింతగా వచ్చింది.
    "ఏదో చెప్పాలనుకున్నారు?" అంది శశికళ.   
    మోహన్ తన తండ్రిగురించీ తన ఆస్తి గురించీ చెప్పాడు.
    "మీరు మీ నాన్నగార్ని గురించే కానీ, మీ గురించేమీ చెప్పాలేదు" అంది శశికళ.   
    "నా గురించి చెప్పడానికేముంది? ఆయనకు నేను ఏకైక వారసుణ్ణి. ఆర్జన ఆయనది అనుభవం నది" అన్నాడు మోహన్.   
     "ఇదేనా మీరు చెప్పాదల్చుకున్నది?" అంది శశికళ.    
    "ఇంకా ఉంది. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు మోహన్.   
     శశికళ ఉలిక్కిపడి అతనివంక చూసి,  "|ఏమన్నారూ?" అంది.   
    అతను మళ్ళీ చెప్పాడు   
    "పెళ్ళికి నన్నెలా ఎన్నుకున్నారు మీరు? నన్నేప్పుడు ఎక్కడ చూశారు?" అంది శశికళ ఆశ్చర్యంగా.   
    "కొంత కాలంగా నేను అమ్మాయిల వేటలో ఉన్నాను. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్నది నా అభిమతం. వరం రోజులూ మీకు తెలియకుండా మీ వెనకే తిరుగుతున్నాను. అన్నివిధాల మీరు నాకునచ్చారు. మీరు అనుకూలిస్తే పెళ్ళి చేసుకుందామానుకుంతున్నాను" అన్నాడు మోహన్.   
    "మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో ? తెలియదు నేను మాత్రం మీ గురించి తెలుసుకోవలసింది ఉంది. నా పెళ్ళికి కొన్ని షరతలున్నాయి. వింటారా?" అంది శశికళ.   
    మోహన్ దెబ్బ తిన్నాడు. తన విషయం విని, ఎగిరి గంతులేస్తుంది. అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. మనిషి బాగా ఘటికురాలులా ఉంది. "చెప్పండి" అన్నాడతను.
    "పెళ్ళి కాగానే ఆస్తి అంతా నాపేరిట వ్రాయాలి. ఇంటి వ్యవహారాలన్నీ నాకు అప్పజెప్పి, మీరు వంటింటి బాధ్యత తీసుకోవాలి. నకనుసన్నలలో  మసలుకుంటూ నా ఆజ్ఞను మిటి మీరకుండా ఉండాలి. నా స్వంత వ్యవహారాల్లో  మీరు జోక్యం చేసుకోకూడదు. నాతో తప్ప మీరు ఇతరులతో వ్యవహరాలుండకూడదు. ఈ శరతలకు అంగీకరిస్తూ కోర్టు పేపరుమీద వ్రాసి తొక్కకండి. ఇదే నేను మీకు చెప్పగలిగింది." అంది శశికళ.   
    "మోహన్ ముఖం ఎర్రబడింది. ఆవేశంతో వళ్ళు కదిలింది. 'పెళ్ళి చేసుకుంటానని అడగడమే నీ బ్రతుక్కో పెద్ద, గౌరవం. అలంటిదానిని ఇంత అవమానకరమైన  షరతలు కూడా పెడతావా?  అనుకున్నాడు మనసులో. అతను లేచి నిలబడి __"సహనానికి అంతు ఉంటుంది. మీరు నాకు నచ్చారని ఇక్కడకు వచ్చాను. నాతో పెళ్ళికి ఒప్పుకుంటే అది మీకు అదృష్టమయుండేది. అదృష్టాన్ని కళ దన్నుకుంటున్నారు. మీ ఇష్టం!" అన్నాడు.   
    శశికళ అదోరకంగా నవ్వింది, "మిస్టర్ మోహన్! మీరు చాలా గొప్పవారు కాదనను. నేను ఒక  సామాన్యమైన ఉద్యోగస్థరాల్ని నిజమే! అయితే నన్ను పెళ్ళి చేసుకోవాలని మా ఇంటికెందుకు వచ్చారు? మనిద్దరికీ పరస్పరం పరిచయంలేదు. ఒకర్నొకరు ప్రేమించకోలేదు. నేను కాస్త అందంగా ఉంటే ఉండవచ్చు. కానీ నన్ను మించిన అందగత్తెలెందరో ఈ లోకంలో ఉన్నారు. అయినా మీరు నన్నే వెతుక్కుంటూ వచ్చారు. ఒక అర్దనరీ స్టెనో గ్రాఫర్ని _ ఓ లక్షదికారికి కొడుకు ప్రేమ భిక్ష అడుగుతున్నాడు  ఆ అమ్మాయి నిరాకరించింది. ఇప్పుడు ఎవరు గొప్ప? ఒక లక్షధికారిగా గర్వపడతారా? లేక నావంటి సామాన్యురాలిచే తిరస్కరించపడిన అతిసామాన్యుడిగా దుఃఖపడతారా ? పెళ్ళి చేసుకొనేందుకు నావంటిది తప్ప దొరకని  అధమస్తాయికి మీ జీవితం పడిపోయింది. లేకపోతె మీరు నా ఇంటికి రారు. అందుకు కారణం పడిపోయింది. లేకపోతె మీరు నా ఇంటికి రారు. అందుకు కారణం ఏమిటి? లోపం మీ ప్రవర్తనదే అయుండాలి. ఆ ప్రవర్తనసరిచేసుకుంటే మే చుట్టూ నావంటివాళ్ళు తిరిగే పరిస్థితి ఏర్పడవచ్చు . అదీగాక ఒక తండ్రి చాటు బిడ్డగా పెరిగిన మీకు వ్యక్తిత్వం ఉండే అవకాశంలేదు. అటువంటప్పుడు పెళ్ళి జరిగినా, మీరు ఒక భార్యచాటు భర్తగా జీవించడం తప్ప గత్యంతరం లేదు. అందుకే నేనలా  అన్నాను. అదీకాక నాకు మగవాళ్ళంటే అసహ్యం, ఆడదాన్ని మనిషిగా కాకా, విలాస వస్తువుగా చూసే అ జాతీమీద నాకు పగ ఉంది. వివాహం చేసుకుంటే నేను నా షరతలను లోబడిన వాడినే చేసుకుంటాను."   
    మోహన్ ఆమె చెప్పినవన్నీ ఓపికగా విని, "ఆడవాళ్ళు విషయంలో నా అంచనా మరోసారి దెబ్బ తింది." అని అక్కణ్నుంచి కదిలాడు.   
    అతని బుర్ర తీవ్రంగా పని చేస్తోంది నిజమే, శశికళ ఎక్కడ తనెక్కడ? ఆ మాటకొస్తే లత ఎక్కడ, తానెక్కడ? లతను మించిన సౌందర్య వతులను తను డబ్బుతో కొనుకున్నాడు. అలాంటి తను వారిముందు ఎందుకు లోకువైపోయాడు?"
    మోహన్ కాళ్ళు తిన్నగా రామారావు ఇంటికే వెళ్ళాయి. రామారావు అతన్ని ముభావంగా ఆహ్వానించాడు.   
    "నేనిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?" అన్నాడు మోహన్.   
    "ఊహించడానికి ప్రయత్నించలేదు" అన్నాడు రామారావు.   
    "ప్రయత్నించి లాభాముండదు, ఊహించలేవు" అన్నాడు మోహన్.   
    "చెప్పు" అన్నాడు రామారావు .   
    " ఆ దేవతను ఇలా పిలు" అన్నాడు మోహన్.   
    "దేవత ఎవరు?" అన్నాడు రామారావు అర్ధం కానట్లు.   
    "ఈ ఇంట్లో ఉండే దేవత వేరే ఎవరు? నీ భార్య లత!" అన్నాడు మోహన్.   
    "నువ్వుంటే అమెరాదు" ఆన్నాడు రామారావు.
    "రామారావ్? నాకు ఆవేశం తెప్పించకు . ఆమె తప్పక వస్తుంది. ఒకప్పుడు దురుద్దేశ్యంతో వస్తున్నానని తెలిసి కూడా మీ దంపతులు నన్ను మీ ఇంటికి ఆహ్వానించారు. ఇప్పుడు సదుద్దేశ్యంతో వచ్చాను. ఆ దేవతను చూసి కానీ వెళ్ళను. వెంటనే పిలు!" అన్నాడు మోహన్.
    రామారావు  ఆశ్చర్యంగా మోహన్ వంక చూశాడు. ఆజ్ఞాపిస్తు నట్లుగా చూస్తున్నడతను. మోహన్ చూపిలిప్పుడు కొత్త రకంగా ఉన్నాయి.   
    రామారావు లోపలకు వెళ్ళి భార్యను పీల్చుకుని వచ్చాడు. లత వస్తూనే మోహన్ వంక చిరాగ్గా చూసింది.   
    మోహన్ చటుక్కున రెండడుగులు ముండుకుకేసి ఆమె కాళ్ళమీద పడ్డాడు. ఈ సంఘటనకు రామారావు లత కూడా ఆశ్చర్యపడ్డారు.   
    మోహన్ ఆమెపాదాలు స్పృశించి లేచి నిలబడి "ఒకప్పుడు మీ అక్కగార్ని పాదాలను ఇలాగే స్పృశించారు. కానీ ఇప్పుడు నాలో ఎలాంటి దురుద్దేశ్యాలూలేవు. నా తప్పు క్షమించమని కోరుతూ మీ పాడాలంటుకున్నాను" అన్నాడు.   
    లత రామారావు అతనివంక ఆశ్చర్యంగా చూశారు.   
    మీరు దేవత. దేవతను వరమడిగి పెద్ద తప్పుచేశాన్నేను. వరాలడగడం మంచి లక్షణం కాదు. బ్రాలనడిగెవారు అల్పులు, స్వార్ధపరులు నేచులు, మంచివాళ్ళు సమర్ధులు వరాలడగలరు తమకు కావలసినదీ, తాము కోరుకుంటున్నదీ స్వశక్తితో సాధీంచుకుంటారు. శ్రమపడకుండా ఫలితం పొందాలనుకునే సోమరులు తొక్కే అనేక అడ్డదారులలో పరాలదగదమొకటి. దేవతలు నాలోని నీచత్వాన్ని ప్రోత్సహించారు. ఇన్నాళ్ళకు నాకు వరమివ్వని ఓ దేవత దొరికింది.   
    నా ఆలోచనా పరిధిని మార్చింది. ఈ దేవత నేర్పిన పాఠంలో నా జీవితం ఇకముందైనా సాకరమార్గంలో నడుస్తోందన్న ఆశ నాకుంది. కృతఙ్ఞతలు చెప్పుకోవడం కోసం మాత్రమె ఇప్పుడోచ్చాను.  ఇంతవరకూ నేను వరంకోసం తపస్సుచేశాను. ఆ తపస్సు చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నాలోని మార్పు శాశ్వతమో, తాత్కాలికమో  నాకే తెలియదు. మళ్ళీ నా మనసు తప్పుదారిన పడితే మీలాంటి వరమివ్వని దేవతలు ఎదురుకావాలన్న దొక్కటే నా కోరిక. ఇంక మీ గద్దర సేలవు తీసుకుంటాను."   
    ఈ మాటలు చెప్పి మోహన్ శరవేగంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.   
                                 16   
    ఎయిర్ పోర్టు లో రామారావు, లత, మాధవి, రతన్, ఉన్నారు. ప్లేనుపస్తాయిని  అర్ధగంట లేటు.   
    "ఇటువంటి చోట ఈ విధంగా ఎదురుచూసే శుభ ఘడియలు వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు" అంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra