"అయన నిర్ణయానికి నేనూ ఆశ్చర్యపడ్డాను. నాకోసం అయన అమేరికా వదిలి వచ్చేస్తారని నేననుకోలేదు. అప్పుట్లో దామోదరం నన్ను ప్రేమించాడని హడావడిపడి నాన్నగారు నాకీ పెళ్ళి చేసారు. అలా దామోదరం ప్రేమ కారణంగా మా పెళ్ళి జరిగింది. మళ్ళీ ఇప్పుడు దామోదరం శశికళను పెళ్ళి చేసుకోబోవాటంతో మేమిద్దరం మళ్ళీ కలుసుకోగలుగుతున్నాం" అంది మాధవి.
"నువ్వు శశికళను సూచించడం బాగానే ఉంది. అతని కారణంగా ఆమెకు మగవాళ్ళంటే ఉన్న దురభిప్రాయం కూడా పోతుంది." అంది లత.
"మనమీద గౌరవంతో శశికళ అతన్ని వెంటనే అంగీకరించింది. అనవసరపు ప్రశ్నలతో అతన్ని ఇబ్బంది పెడుతుందేమో నని భయపడ్డాను" అంది మాధవి.
"ఏమైతేనేం మీ కారణంగా దామోదరం వంటింటి పాలయ్యాడు" అన్నాడు రామారావు.
"లత వంటింట్లో ఉంటే నువ్వూ అక్కడే ఉంటావుగదా! దామోదరం విషయంలో మాత్రం భిన్నంగా ఎందుకుంటుంది? అలా ఉంటేనే మంచిది" అంది మాధవి.
"ఈ కంటికి ఈ దెబ్బలు దూరం కాదు _ నేనూ చూస్తానుగా మీ కాపురం . నువ్వు కోరిన వరం ఇచ్చి బావగారు అమెరికా వదిలిపేట్టి ఇండియా వచ్చేస్తున్నారు. ఇప్పుడాయణ ఎన్ని వరాలు కోరతాడో ఇవ్వకుండా ఉండగలవా? అందులో ఈ వంటింటి సమక్షం కూడా ఉండి తీరుతుందని నా నమ్మకం " అంది లత.
"అసలైన దేవతలు వరాలివ్వని మోహన్ అన్నడన్నావ్. అయినా భార్యాభర్తల మధ్య వరాలేమిటి? ఉండేవన్నీ హక్కులే" అంది మాధవి.
"అయితే మనం అసలైన దేవతలామంటావ్?" అంది లత నవ్వుతూ.
"అసలోనకలో తేలియదుగాని మీరు వరమివ్వని దేవతలు" అన్నాడు రామారావు.
సరిగ్గా అప్పుడే విమానం వస్తున్నట్లు ప్రకటన వినబడింది. అందరూ లేచారు.
మరికొద్ది క్షణాల్లోవిమానం విమానాశ్రమంలో దిగింది. మాధవి భర్త కోసం అత్రుతుగా ఎదురు చూస్తోంది.
విమానం తలుపులు తెరుచుకున్నాయి. ఒక్కొక్కరే విమానం వెంకట్ ఆమె గుర్తించింది. కానీ అతన్ని చూసి బాగా ఆశ్చర్యపడింది. మూడు నెలల్లో ఎంత మార్పు?
వెంకట్ చేతిలో చిన్న భ్రీఫ్ కేసు మాత్రం ఉండి. అతను వేగంగా నడుస్తున్నాడు. అతని కళ్ళు మాధవినీ, ఆమె పక్కనే ఉన్న బాబునీ చూశాయి. వాళ్ళను చూస్తూనే అతని వేగం పెరిగింది.
ఒక్క పరుగున బాబును సమీపించి, బాబూ!" అని వాణ్ణి గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు.
బాబు కంగారుగా విడిపించుకుందుకు ప్రయత్నింస్తూంటే. "ఈయనే బాబూ, మీ నాన్న!" అంది మాధవి.
రామారావు తన్ను తాను పరిచయం చేసుకుని అతని వద్ద లగేజి స్లీవ్ తీసుకున్నాడు. లగేజ్ కలెక్ట చేయడానికి అతనితో పాటు లత కూడా వెళ్ళింది.
"నాన్నగారికి నేనెలా తెలుసు?" అన్నాడు బాబు ఆశ్చర్యంగా.
మాధవి వెంకట్ వంక చూసి, "అవును మీ గెడ్డం" అని వాక్యం పూర్తీ చేయకుండానే, "అవి నా బాబుకు నచ్చవు. అయినా వాటిని అమెరికాతో సంపాదించాను. నీ కెక్కడివేమీ ఇష్టముండదుగదా అని వాటిని అక్కడే వదిలిపెట్టాను" అని, "బాబూ, నేను నీకు నచ్చానా?" అనడిగాడు అత్రుతుగా.
బాబు మాట్లాడకుండా ఈ అపరిచితుడివంక వింతగా చూశాడు.
ఊహించని ఈ మలుపు ఈ తన జీవితంలో ఎలా సాధ్యపడిందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నా మాధవి వారిరువురి సంభాషణా వినడం లేదు.
___: అయిపోయింది:___