Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 25

    ఈ మధ్యలో ఆమెకు ఎదురైనా అనుభవాలు మగ తోడులేని ఆడదానివంక సమాజంలో ఎన్ని కళ్ళు ఆశగా చూస్తుంటాయో తెలియజేశాయి. ఆ ఇంటినీ ఆమె అధిగమించగలిగింది. కానీ తన నిర్ణయం లోని అవివేకం అస్పష్టంగా ఆమెకు గోచరించసాగింది. ఆ పరిస్థితుల్లో  ఆమెకు మోహన్ గురించి తన ఆలోచనలకూ  గల తారతమ్యం  ఆమెను చాలా బాధించింది. తనలో ఏదో బలహీనత చోటు చేసుకొంటో౦దని  ఆమెకు అర్దమయింది.   
    అందుకు కారణం కూడా ఆమె గ్రహించింది. ఆడదాని అనుగ్రహం  కోసం ఎంత నీచస్థాయికయినా దిగజారిపోగల మోహన్  వంటి మనుష్యుల్నీ ఎదుర్కోవడానికి తనకు శక్తి చాలలేదు. ఒకసారి మోహన్ కి లొంగితే  ..... అని అంతటితో ఆగదు. అలా అలా తనను పతనం చేస్తుంది. తన వయసు మనసును జయించే రోజు ఏదో ఒకనాడు వస్తుంది. ఆ విషయం తను చాలా ఆలశ్యంగా గుర్తుంచింది. అప్పుడేం చేయాలో? ఆమెకు తోచలేదు.   
     ఆ బాబుకు తను తల్లి. వెంకట్ తండ్రి, బాటు లేకపొతే తన ఆలోచనలెలా ఉండవో తెలియవు. బాబుకు దామోదరాన్ని తండ్రిని చేయడానికి అప్పట్లో మనస్కరించలేదు. అది తనకూ దామోదరానికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. కళ్ళ ఎదుట మసలే ఆ కుర్రవాడు  తనకూ, వెంకట్ కూ ఉన్న ఒక నాటి సంబంధాన్ని  అనుక్షణమూ దామోదరానికి గుర్తు చేస్తూంటాడు. అది అతను కొంతకాలం మాత్రమే సహించగలడు. ఏదో ఒక రోజున అగ్నిపర్వతం బ్రద్దలవుతుంది.     
    పోనీ అలా జరగదనుకుందామనుకొన్నా ఇప్పటికి సమయం మించిపోయింది. బాబుకు తెలుసు. అతను తన తండ్రికాడని తెలుసును. తనక్కావాలనుకుంటున్న మగతోడుకోసం బాబును విడిచి ఉండలేదు.  ఇప్పుడేవారినో తీసుకొచ్చి బాబుకు తండ్రి అని చెప్పలేదు. ఈ సమయంలో వెంకట్ తన సమస్యకు సులభతరం చేశాడు. అయితే?     
    కొద్ది సంవత్సరాలుగా  ఆమె మనసు భర్తను ద్వేషిస్తోంది. అనుకోకుండానే ఆమె  మనసు  దామోదరాన్ని ఆరాధిస్తోంది. తన కోసం అవివాహితుడుగా  ఉండిపోతున్న  అతని మీద ఆమెకు సానుభూతి పెరుగుతోంది. 'ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి?"   
    "నాకు అలోచించుకునెందుకు వ్యవధి కావాలి" అంది  మాధవి.   
    "ఎందుకు?"
    "దామోదరంతో మాట్లాడాలి" అందామె.   
    వెంకట్ అసహనంగా, "అతని   గురించి విన్నాను. అతనితో  ఏం మాట్లాడాలి?" అన్నాడు.   
    "అతను నా గురించి పెళ్ళి చేసుకోవడం మానేశాడు. అతనాలాగే ఉండిపోతే నేను సంతోషంగా ఉండలేను" అంది మాధవి.    
    "ఇంతకాలం  పెళ్ళి చేసుకునివాడు ఇప్పుడు మారతాడని గ్యారంటీ ఏమిటీ?"   
     "ఇంతవరకూ అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో  వచ్చిన మార్పు నా ఆలోచనలో  కూడా మార్పు తీసుకు వచ్చింది. మీరు మారేనని  తెలిస్తే అతనూ మారతాడేమో?" అంది మాధవి.   
     'చాలా తెలివిగా మాట్లాడింది'. అనుకున్నాడు వెంకట్. ఆ తెలివి, ఆ అందం, ఆ ప్రేమ, ఆ అభిమానం _ కావాలని తను దూరం చేసుకున్నందుకు  వెంకట్ మనసుకు బాధ కలిగింది. అతను నెమ్మదిగా "మాధవీ _ సెటిలవ్వాలన్న  ఆలోచన నాకు మొదట్నుంచీ ఉంది. నన్ను ఇంటికి కట్టి పడేయడం కోసం అమ్మా నాన్న బలవంతపు  పెళ్ళి చేశారు. అందులో నా బాధ్యత  లేదనలేదు. కానీ  నేను ఆ బాధ్యతను  గుర్తించలేదు.  ఏదో ఆర్నెల్లు జీవితం  ఎంజాయ్ చేసి ఫారిన్ వెళ్ళి చేశారు. అందులో నా బాధ్యత లేదనలేదు. కానీ నేను ఆ బాధ్యతను గుర్తించలేదు. ఏదో ఆర్నెల్లు జీవితం ఎంజాయ్ చేసి ఫారిన్ వెళ్ళి పోయాను. నిన్ను వదిలి పెట్టెయాలనుకున్నాప్పుడు నేరం  చేసిన అనుభూతి కూడా కలగలేదు. కానీ నీ ప్రవర్తన అనను నేరస్తుణ్ణి చేసింది. నువ్వు నాకు గౌరవమిచ్చి నా కోసం పెళ్ళి మానేసి అలా ఉందిపోవటం వల్ల నా మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతొంది. నేనిప్పుడు నీ అనుమతి కోసం ఇక్కడకు రాలేదు. నిన్ను కూడా తీసుకుపోవాలనే వచ్చాను. ఆలోచించుకునేందుకు ఎక్కువ వ్యవధి ఇవ్వలేను. కావాలంటే రెండ్రోజులు ఇక్కడే ఉంటాను." అన్నాడు.   
    అతని మాటల్లో అధికారం ధ్వనిస్తోంది. మాధవి అసహనంగా అతని వంక చూసి _ " ఒకసారి మీరు నన్ను అకారణంగా వదిలి పెట్టెశారు. మరోసారి అలా చేయరని నమ్మకమేమిటి?" అంది.   
    "అప్పుడు నిన్ను నాకు మరొకరు అంతగట్టారు. అప్పుడు నేను ఫారిన్ మైకంలో ఉన్నాను ఇప్పుడు నేను నీ మైకంలో ఉన్నాను. నాకై నేను నే కోసం వచ్చాను." అన్నాడు వెంకట్.   
    మెల్లగా మాధవి ముఖం వికసించింది. భర్త మాటలు ఆమెకు సంతోషాన్ని కలిగించాయి. అతని వంక అభిమానంగా చూస్తూ, "నిజంగా మీరు నా మైకంలో ఉన్నారా?" అంది.   
    "నిజంగా" అన్నాడు వెంకట్.   
    "అయితే ఒక పని చేయండి. నా కోసం అమెరికాను వదిలి పేట్టి ఇండియా వచ్చేయండి." అంది మాధవి అతని వంకే పరిశీలనగా  చూస్తూ.
    అతని ఉలిక్కిపడి, "ఏమితన్నావ్?" అన్నాడు.   
    "అమెరికా మూలంగానే మీరు నాకు దూరమయ్యారు. నా మూలంగా మీకు అమెరికా దూరం కావాలి" "నేను ఎకనామిక్స్ స్టూడెంట్స్ ని దేశం మీ చదువుకోసం ఎంత ఖర్చు చేసిందో నాకు తెలుసు. ఆ శిక్షణలో మీరు మరో దేశానీకుపయోగపడ్డం నేను హర్షించలేను.  నాకోసం ఈ మాత్రం చేయగలిగితే నిజంగా మీరు నన్నూ, బాబునూ మనసారా అమ్దరిస్తున్నట్లు గ్రహించాగలుగుతాను."  అంది మాధవి.   
    "నాకు ఆలోచించడానికి కొంత వ్యవధి కావాలి" అన్నాడు వెంకట్ చటుక్కున.
    "మైకంలో ఉన్న వాళ్ళకు ఆలోచించుకునే వ్యవధి అవసరముండదు" అంది మాధవి.   
    "నా మైకాన్ని నువ్వు విడగోట్టావు. నేను తర్వాత ఉత్తరం రాస్తాను. అంటూ లేచాడు వెంకట్   
    మాధవి అతని వంక విర్లిప్తంగా చూసింది.        
                                                               14   
    "అతన్ని మార్చడం పెద్ద కష్టం కాదు" అన్నాడు సైకలిజిస్టు.   
    రామారావు ఆశ్చర్యంగా, "మోహన్ గురించేనా మీ రీ మాట అంటున్నది?" అన్నాడు.   
    "అవును. అతని గురించే! ఆ మార్పు కూడా మీ వల్లనే రాగలదని నాకు నమ్మకం.  ఎందుకంటే ఇంతవరకూ బంధుమిత్ర వర్గంలో అతనికి సరైన ఆదరణ లభించలేదు. నీ ఆదరణ అతన్ని కొంతవరకూ మార్చింది. అప్పుడప్పుడు తన ప్రవర్తనకు అతను పశ్చాత్తాప పడుతున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని గుర్తించి అతని జాలి పట్ల మీరు జాలి ప్రదర్శించాలి. ముఖ్యంగా మీ భార్య నుండి అతనికి సానుభూతి లభించాలి. ఆమె గురించి అతను చూపించే పట్టుదలను అతనికి మంచి చేయడానికి ఉపయోగించవచ్చును"   
    "ఎలా?" అన్నాడు రామారావు.   
    "ఉదాహరణకు అతని దృష్టి పెళ్ళి మీదకు మళ్ళించవచ్చు. అతని పెళ్ళి చేసుకుని స్థిరపడ్డాక అతని కోరిక తీర్చుతానని మాటిస్తే అతని బుద్ధి ఆ దారిలో పని చేస్తుంది." అన్నాడు సైకలిజిస్టు.   
    "అతను నిజంగా పెళ్ళి చేసుకుని స్థిరపడితే ?"   
    ఇదే ప్రశ్న రామారావినీ, లతనీ కూడా వేధించింది. సైకాలజిస్టు వారిద్దరిలో  ఒక వారం రోజులు ఈ విషయమే చర్చించాడు. తన వాక్యంలో అయన వారికి నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు బుర్రలో కెక్కించాగలిగాడు . మోహన్ ని వివాహం చేసుకునే ఆడది దొరకాలి, దొరికేక ఆ పెళ్ళి జరగాలి _ పెళ్ళి జరికాగా మోహన్ మారడనేముంది? _ అన్నీ కలిపి వచ్చి అప్పతిఏ మోహన్ మారకపోతే లత తన నైతిక విలువలను కాస్త సడలించవచ్చు. జీవితంలో అతని మళ్ళీ చేది పోకుండా వాగ్ధానం తీసుకోవచ్చు.   
    చాలా ఇబ్బంది రకమైన ఈ సూచనలను రామారావు జీర్ణించుకోలేకపోయాడు కానీ ఆశ్చర్యంగా లత మోదించాగలిగింది.   
    సైకాలిజిస్టు లేనప్పుడామే  భర్తతో, "మన సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక మార్గముంది. మోహన్ పెళ్ళి చేసుకుని స్థిరపడే పక్షంలో నేను వాడి కోరికను అంగీకరిస్తాను" అంది.   
    "ఏమిటీ?" అన్నాడు రామారావు ఆశ్చర్యంగా.   
    "మోహన్ శశికళను పెళ్ళి చేసుకోవాలి. అప్పుడే తన కోరిక తీరుస్తుంది" అంది లత.   
    రామారావు ఆశ్చర్యంగా, "ఎంత గొప్ప ఐడియా వచింది నీకు అన్నాడు.   
    లత నవ్వి "క్రెడిట్ మీ పరిచయానిదే లేండి!" అంది.   
    రామారావు ఆలోచిస్తున్నాడు. శశికళ పురుషద్వేషణి. విచ్చల విడిగా ప్రవర్తిస్తుంది. మగవాళ్ళంటే ఆమెకు భయంలేదు. మోహన్ కి  అసలుసిసలు జోడీ! ఈ పెళ్ళిజరగదు. అదే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం. లేకపోతె మోహన్ ఇంకో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఈసారి బ్రతకవచ్చు.   
    "కర్మంజాలక ఈపెళ్ళి జరిగితే?" అన్నాడు రామారావు.   
    "నాలో కాస్త మార్పు వచ్చేసరికి మీలోని మగాడు బయటకి వస్తున్నాడు." అని నవ్వింది లత. "నిజంగా వాళ్ళ పెళ్ళి జరిగితే శశికళ తన మొగుణ్ణి వంటిల్లు దాటి బయటకు రానిస్తుందా?"   
    రామారావు తృప్తిగా నవ్వాడు. తమ సమస్యకు పరిష్కారం లభించిందనే అతనికి అనిపించింది.   
    ఆరోజే అతను మోహన్ ణి కలుసుకున్నాడు. రామారావు లెక్క ప్రకారం పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది.   
    "నీకో  శుభవార్త! లత నీ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది" అన్నాడు రామారావు.   
    "ఏమిటది?" అన్నాడు మోహన్ ఉత్సాహంగా. సైకలిజిస్టు అతనికి చెప్పాడు. తన పత్రిభలో ఆ దంపతుల మనసులు మార్చగలిగానవి.   
    "లతకో ప్రాణ స్నేహితురాలుంది. ఆమె పేరు శశికళ. ఆమె పురుషద్వేషిణి. అమెనో ఇంటిదాన్ని చేయాలని లత ఆశ!    ఆమెను నువ్వు పెళ్ళాడగలిగితే నీ కోరిక తీరుస్తుంది" అన్నాడు రామారావు.   

 Previous Page Next Page