"బాబూ!" అని గట్టిగా పిలిచింది. మాధవి. పిలిచినా వేంటనే పరుగెత్తుకువచ్చాడు రతన్. "అంకుల్ నిన్ను చూస్తారట. అందుకని పిలిచాను" అంది మాధవి.
రతన్ వెంకట్ వైపు చూశాడు. అతనికున్న గెడ్డం, మీసాలు చూస్తె వాడికి కాస్త భయం వేసింది. కానీ వెంకట్ కళ్ళు వాడి వంక ఆప్యాయంగా చూస్తున్నాయి.
కొడుకును చూడగానే వెంకట్ కళ్ళు చెమర్చాయి. వాణ్ణి దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకోవాలని అతనికి ప్రతిబింబం కనబడింది. అవును _ నిజానికి వాడు తన ప్రతిబింబం!
మాధవి శ్రద్దగా భర్త అనుభూతుల్ని గమనిస్తోంది. అప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి. కొంగుతో కళ్ళోత్తుకుంటూ౦డగా వెంకట్ కుర్చీలోంచి లేచి చటుక్కున రెండడుగులు ముందుకు వేసి బాబును ఎత్తుకుని గుండెలకు హత్తుకుని, వాడి బుగ్గల్ని ముద్దులతో ముంచెత్తాడు. అతడి పితృప్రేమ హఠాత్తుగా పొంగి పొరలినట్లుంది.
రతన్ కంగారుపడి ఈ కౌగిలి నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వెంకట్ వాణ్ణి వదలలేదు. వెంకట్ తను కుర్చీలో కూర్చుని, వాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టుకుని _ నీ పేరు చెప్పవూ?" అన్నాడు.
"నన్నోదిలేస్తానంటే చెబుతాను" అన్నాడు రతన్.
వెంకట్ ఉలిక్కిపడ్డాడు. 'కన్నకొడుకు ఎంత మాటన్నాడు? అవును _ అనకేం చేస్తాడు? తనకూ వాడికీ కన్న అనుబంధమేముంది?"
"చెప్పు _ వదిలేస్తాను " అన్నాడు బాబు మూడు అక్షరాలను ఒత్తిపలుకుతూ.
"అలాగా ... చాలా బాగుంది. నీ పేరు నీ కోసం నేనో మంచి బొమ్మ తెచ్చాను. తీసుకుంటావా?"
"చూపించండి " అన్నాడు రతన్ కూతుహాలంగా. వెంకట్ అబద్దం చేబుతున్నాడని వాడి అనుమానం. అయితే వెంకట్ కుర్చీకి పక్కనే పెట్టిన భ్రీఫ్ కేస్ లోంచి ఒక బొమ్మ తీసి రతన్ కిచ్చి _ "దీని పొట్ట మీద నొక్కితే పాత పాడుతుంది." అన్నాడు.
రతన్ ఆ బొమ్మ చూసి చాలా సంబరబడ్డాడు. హఠాత్తుగా ఈ అంకుల్ మీద వాడికి ఎంతో సదభిప్రాయం కలిగింది.
కాసేపు బాబును అవీ ఇవీ వాగిమ్చి, "మీ నాన్నగారింట్లో లేరా?" అన్నాడు బాబు.
మాధవి కళ్ళోత్తుకుంది. వెంకట్ ఏదో మాట్లాడబోగా గొంతు పెగలలేదు. నెమ్మదిగా గొంతు సవరించుకుని , "నువ్వు మీ నాన్నగార్ని చూడలేదా?" అన్నాడు.
"లేదు. కానీ ఎలా వుంటారో తెలుసు."
"ఎలా చెప్పను _ నాకు బొమ్మ గీయడం రాదుగా?" అన్నాడు బాబు బాధగా.
"పోనీ నాకులా ఉంటరేమో చెప్పు!" అన్నాడు వెంకట్.
"ఛీ! మీరు గెడ్డం మీసాలతో బూచాడిలా వున్నారు. మా నాన్నగారికి గేద్దాలూ, మీసాలూ వుండవు, ఎంతో బాగుంటారు" అన్నాడు బాబు.
వెంకట్ నిట్టూర్చి వాణ్ని వదిలిపేట్టి, "నీకు బొమ్మతో ఆడుకోవాలనుందిగా _ వెళ్ళి ఆడుకో" అన్నాడు.
సంభందించిన బాణంలా బాబు అక్కణ్ణుంచి పరుగెత్తి తల్లి దగ్గర బొమ్మ అందుకుని లోపలకు పరుగెత్తాడు.
మళ్ళీ కొద్ది క్షణాలు వారిద్దరిమధ్యా నిశ్శబ్దం......
"నేనిప్పుడు ఇక్కడికెందుకోచ్చానో తెలుసా?" అన్నాడు.
"తెలియదు . కానీ చెబితే తెలుసుకోవాలనుకుంది." అంది మాధవి.
"అమెరికాలో నా జీవితం వేరు. క్షణం తీరుబడిలేని జీవిత మది. ఆఫీసులో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చేసరికి మనసు, శరీరం కూడా విశ్రాంతిని కోరతాయి. షాపింగులతోనూ, టెలివిజన్ చూడ్డంతోనూ మిగతా రోజు గడిచిపోయింది. వారానికి రెండ్రోజులు సెలవు లోస్తాయి. ప్రతి సెలవలకూ మా కారులో ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళి వ్వస్తూంటాం. ఎప్పుడైనా సెలవు రోజున ఇంటిపట్టున వుండడం జరిగితే ఇంటిని కొత్త రకంగా తీర్చిదిద్దితూం లేదా తోటపని చేస్తాం. ఇవిగాక స్నేహితుల ఇళ్లకు వెళ్ళాడాలు , రావడాలు.... ఎక్కడా మరో ఆలోచనకు అవకాశంలేని జీవితమది.
"అలాంటి జీవితంలో నీగురించి పూర్తిగా మరచిపోయాను. ఐతే ఆ జీవితం నాకు నచ్చలేదు. అక్కడలేని సదుపాయాలు లేవు. దొరకని సుఖాలు లేవు. అందుకే ప్రతివ్యక్తి జీవితమూ స్వార్ధనికే పరిమితమైపోయి ఉంటుంది. ఎదుటివాడి గురించీ, పక్కవాడి గురించీ బంధువుల గురించీ, స్నేహితుల గురించీ, క్షణం కూడా ఆలోచించడానికి తీరుబడలేని అ జీవితం మానసికంగా నన్ను బాగా క్రుంగదీసింది. నీకు నేను అన్యాయం చేశానని తెలుసు. అందుకే ఇండియాకు రాబుద్ధి వేసేదికాదు. మా వాళ్ళు రాసే ఉత్తరాల్లో నీ గురించి రాయవద్దని మరీ మరీ వ్రాశాను. దాంతో వాళ్ళు మానేశారు. నీ గురించి నేను వినకూడదనుకొంటున్నానంటే అర్ధం! నా మనసులో ఏదో తప్పుచేసిన భావం ఉందన్న మాట! ఇటీవలే నాకూ, నా భార్యకూ చెడింది. విడాకులిచ్చేసుకున్నాం. మా ఒక్కగానొక్క బిడ్డను తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేముందు ఆమె నా మానసిక సంఘర్షణ చూసి, "టేకిట్ ఈజీ అని సలహా ఇచ్చింది.
"అందుకు నేను నా భార్యను తప్పుపట్టాను. ఆమె మనిషి మంచిది. మనసు మంచిది. కొద్దికాలంగా మా ఇద్దరికీ చాలా విషయాల్లో అభిప్రాయబేధాలు వస్తున్నాయి. అందుకామె వారి సమాజ న్యాయాన్ని పాటించింది. విడిపోయినంత మాత్రాన మా ఇద్దరికీ శత్రుత్వం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండియాకు సెలవుమీద వచ్చి నిన్ను గురించి విన్నాను. అక్కడ నాకు జరిగిన దానికీ, ఇక్కడ నేను విన్న దానికీ ఎంత వ్యత్యాసం? మూడుముళ్ళ బందానికీ, ఆర్నెల్ల కపురానికీ నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయబూసుకున్నావు. ఇది అర్దవంటమైనదో కాదో తెలియదుగానీ అపూర్వం!
అపూర్వమైన నీ ప్రేమానురాగాలకు నోచుకున్న నేను ఎంతో అదృష్టవంతుడ్నినిపించింది. ఆ క్షణంలో నేనేదో పెద్ద హీరోలా ఫీలయ్యి నీకేడురుగా వచ్చి నిలబడి నీ కళ్ళలోని ఆరాధన చూసి పరవశించాలనుకున్నాను. ఐతే ఇమ్క్కడికివచ్చి నిన్ను చూసేవరకూ నేను నీపట్ల అన్యాయంగా ప్రవర్తించాననీ నేను నీకు ఉన్నతమయిన దానివనీ స్పురించలేదు. నా అలోచలంతగా దిగజారిపొయింనందుకు నేనిప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను నీపట్ల చాలా నేనిప్పుడు ఎంతో సిగ్గు పడుతున్నాను. నేను నీపట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను నీపట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను మన్నించమని కోరుతున్నాను. నేనిప్పుడు నిన్నదిగేది ఒక్కటే. "నాతో అమెరికాకు రాగలవా?" అన్నాడు వెంకట్.
మాధవి త్రుళ్ళి పడింది. అతనినుంచి ఈ ఆహ్వాన్నాన్నమే ఆశించలేదు. నిశ్చేష్టురాలై ఆమె అతనివంకే అలా వస్తే చూస్తూ కూర్చుండి పోయింది.
వెంకట్ మళ్ళీ మాట్లాడలేదు. ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న వాడిలా మౌనంగా ఉందిపోయాడు. ఆమె పెదవులు ఎప్పటికి కదులుతాయా అన్నట్లు అత్రుతుగా ఎదురుచూస్తున్నాడు.
మాధవి ఆలోచిస్తుంది. వెంకట్ తనను వదిలిపెట్టిన కొత్తలో ఏదో వింత ఆవేశం తననావహింది. వివాహంపట్ల విరక్తి కలిగింది. జీవితంలో మళ్ళీ వివాహం చేసుకోరాదనీ అనుకుంది. ఎట్టి పరిస్థితుల్లల్లో తన తన నిర్ణయం సడలకూడదనుకొంది. అందుకోతగ్గ మనోస్థయిర్యం తనకిమ్మని దేవుణ్నీ ప్రార్ధించుకుంది. ఆ పరిస్థితుల్లో చెక్కుచెదరని దామోదరం ప్రేమ ఆమె జీవలనత పుష్పించడానికి మరో అవకాశంగా ఆమెకు కనిపించలేదు. తన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భగవంతుడు పెట్టిన పరీక్షిగా ఆమె దాన్ని భావించింది. అందుకే పంతంకొద్దీ దామోదరాన్ని దూరంగా వుంచింది. డైవర్షన్ కోసం చదువు మొదలుపెట్టింది.