Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 18

    సెకండ్ షో సినిమాకి వెళ్ళాలన్నా, అర్దరాత్రి భీచికి వెళ్ళాలన్నా ఆమెకు భయం లేదు. ఆమె ముఖంలో ఏదో నిర్లక్ష్యం వేలుగుతూంటు౦ది.   
    శశికళకు చాలామండి మగవాళ్ళతో పరిచముందనీ చాల మండి చెప్పుకుంటు౦టారు. కానీ తనతో పరిచయమున్న ఏ మగవాడికీ ఆమె అందని పాండుగానే ఉండిపోయింది. ఆ విషయం చాలమంది ఒప్పుకోరు.   
    శశికళ డిక్టేషన్స్  తీసుకునే ఇద్దరాఫీసర్ల లోనూ, రామారావు ఒకడు. రామారావు శశికళను బాగా అభిమక్నిమ్చే వాడు. అందుక్కారణం ఆమె ఏకాగ్రత. నోట్స్ తీసుకోవడంలోనూ, టైపు చేయడంలోనూ తప్పులు చేయడం చాలా అరుదు ఆమెకు.   
    ఒకసారి ఆమెతో __ "నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోక పోతే చిన్న కామెంటు చేస్తాను." అన్నాడు.   
    "ష్యూర్ !" అంది శశికళ.   
    నీ డ్రస్సులు మరీ ప్రోవోకింగ్ గా ఉంటున్నాయి. చీర ఎందుకు కట్టుకోవు?" అన్నాడు.
    "చీర కూడా ప్రోవోకింగ్ గా కట్టుకోవచ్చు. జాకెట్ కూడా ప్రోవోకింగ్ గా కుట్టించుకోవచ్చు. చీరకూ ప్రోవోకింగ్ కూ సంబంధం లేదు" అంది శశికళ సీరియస్ గా   
    "ఒప్పుకున్నాను. కానీ అలా ఎందుకు ద్రాస్ చేసుకుంటావు?"   
    "చట్టరిత్యానేరం కాదు కాబట్టి" అంది శశికళ.   
    "నేరమని నే నానడం లేదు. ఈ రోజులు మంచివి కావు.  నువ్వు ఇబ్బంద్దుల్లో పడొచ్చు" అన్నాడు రామారావు ఇబ్బందిగా. ఆమె సమాధానాన్ని బట్టి ఆమెకు తన కామెంట్ నచ్చలేదని రామారావును అర్ధమయింది. తీరా మొదలు పెట్టాడు కాబట్టి సంబాషణ కొనసాగిస్తున్నాడు కానీ, అతనికి త్రుంచేయాలనే ఉంది.   
    "నాకు భయం లేదు. ఒక్కసారిగా పదిమంది మగవాళ్ళకు సమాధానం చెప్పగలను. అది భౌతికం. మానసికంగా నాకు మగవాళ్ళంటే భయం లేనేలేదు. మీరు మన్నిస్తానంటే చెబుతాను. __ మగావాళ్ళంటే నాకు అసహ్యం" అంది శశికళ. అప్పుడామే కళ్ళల్లో ద్వేషాన్ని స్పష్టంగా చూశాడు రామారావు.   
    "ఎందుకని?" అన్నాడు ఆశ్చర్యంగా రామారావు.   
    "ఎందుకేమిటి? ఈ ప్రపంచం మగవాళ్ళది. ఆడది వాళ్ళకు బానిస. వాళ్ళ విలాస వస్తువు." అంది శశికళ కసిగా.   
    "నీ అభిప్రాయం బాగానే ఉంది. కానీ మగవాళ్ళంతా దుర్మార్గులేనంటావా?"   
    "ఇంచుమించు అంతే?"   
    రామారావు మాట్లాడలేదు. అతను కాస్త దెబ్బ తిన్నాడు.   
    "అయాం సారీ రామారావుగారూ! మిమ్మల్ని నావుపిఇమ్చాలని నా భిప్రాయం కాదు. నా అనుభవాన్నిబట్టి గ్రహించింది నేను మీకు చెప్పాను. ఇన్ని వందల కోట్ల ముందున్న ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒకటీ  అరా మంచి మగాడున్నడేమోనాకు తెలియదు" అంది శశికళ.   
    "ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ఒకరినొకరు అర్ధం చేసుకోవాలిగానీ పరస్పర ద్వేషాలతో  సాదించెదేముంది?" అన్నాడు రామారావు.   
    శశికళ అదోలా నవ్వి _ "అందరాడవాళ్ళూ నాకులా ఉండదు గదా! మా నాన్న మా అమ్మనెంత బాధ పెట్టాడో నేను కళ్లారా చూశాను" అంది.   
    శశికళ తనింటి కధను క్లుప్తంగా అతనికి చెప్పింది.   
    శశికళ తండ్రికి అన్ని వ్యసనాలూ ఉన్నాయి. సంపాదించేదంతా బయటే తగలేసేవాడు. ఇంట్లో పెళ్ళాన్ని కొట్టేవాడు, తిట్టేవాడు. తను అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ, భార్య శీలాన్ని శకించేవాడు. శశికళకు ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అర్ధాంతరంగా తండ్రిపోయాడు. అప్పట్నుంఛీ వాళ్ళ జీవితం సుఖంగా లేకపోయినా ప్రశాంతంగా ఉంది. శశికళ తల్లి కష్టపడి కొడుకునూ, కూతుర్నూ చదివించింది. అయితే పెద్ద కొడుక్కు అన్నీ తండ్రి పోలికలే వచ్చాయి. శశికళ డిగ్రీ కోర్సు సగంలో ఆపి స్టెనోగ్రఫిలో ట్రయినింగ్ ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుంది. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఆమెతో ఉంటున్నారు. తల్లి, పెద్ద కొడుకుకోసం బాధపడుతుంది. వాడు ఎవత్తినో పెళ్ళి చేసుకుని నానా అవస్థలూ పడుతున్నాడు. తమ్ముళ్ళ౦టే  శశికళకు పెద్ద ఇష్టంలేదు. ఏదో తల్లి బాధ పడుతుందని వాళ్ళ పోషణ చూస్తోంది.   
    "ఇలాంటి కధలు చాలామందికి ఉన్నాయి. అయితే అలాంటి పురుషుల శతం ఎంతో ఉండదు" అన్నాడు రామారావు.   
    "బాధ భరించే వాళ్ళకు తెలుస్తుంది. మా అమ్మ  ఆ నాన్న నేలా భరించిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది" అంది శశికళ.   
    "ఓ మంచి కుర్రాణ్ణి చూసి పెళ్ళి చేసుకుంటే నీ పురుషద్వేషం పోతుంది." అన్నాడు రామారావు.   
    శశికళ విరగబడి నవ్వింది. "మీరే చూసి పెట్టండి. నేనూ చూస్తున్నాను మంచి కుర్రాడికోసం. కుర్రాడు నేను చెప్పినట్లు వినాలి. నా కనుసైగలో మాసాలుకోవాలి. వంట బాగా చేయాలి. నా పర్మిషన్ లేకుండా గుమ్మం కదలకూడదు."   
    "చాలు!" అన్నాడు రామారావు.   
    శశికళ నవ్వు ఆపి, "ఎప్పటికైనా ఇలాంటి కాపురం చేయాలన్నదే నా ఆశయం" అంది.
    రామారావు మళ్ళీ ఆమెతో డ్రస్ గురించి మాట్లాడలేదు. ఆమె డ్రస్ లో  మార్పు రాలేదు.   
    శశికళ గురించి రామారావు భార్యతో చాలా పర్యాయాలు చెప్పాడు. ఆమె డ్రస్  గురించి మాట్లాడినట్టు చెప్పిన రోజు లత అతన్ని చాలా వేళాకోళం చేసింది.   
    "ఆ అమ్మాయి చాలా మంచిది కాబట్టి అలా జవాబు చెప్పింది. లేకపోతె ఆమె దుస్తుల్నీ పట్టి పట్టి ఎవ్వరు చూడమన్నారు?" అంది లత.      
    రామారావు ముఖం మూడ్చుకుని, "ఒకసారి ఆమెను మనింటికి పిలుస్తాను. ఆమెను చూస్తె నువ్వే కంగారు పడతావు. అలాగే ప్రతిరోజూ ఆ మాయి నా ఎదుట నిలబడి డిక్టేషన్ తీసుకుంటుందా అని బెంగ పెట్టుకుంటావు. ఆమె అలా డ్రస్ చేసుకోవడం   మగవాళ్లందరికీ ఇష్టమే. నేను మంచివాణ్ణి కాబట్టి అభ్యంతర పెట్టాను...." అన్నాడు.

 Previous Page Next Page