Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 12

    "అది  మాఅమ్మ నాతో ఆడే అట. ఆ అటపడి నువ్వూ నాకు అమ్మవై పోవాలనుకుంటున్నావు! అప్పుడు నామీద కసితీర్చుకుంటావు
    వాడి మాటలకు వసంతలక్ష్మి తెల్లబోయింది. ముక్కుపచ్చలారని ఈ పసివాడి మనసులో ఎవరింత విషం పోశారో?" అంది.
    "సవతి తల్లికి ఉత్తినే అలా కసి ఉంటుందిట"
    "అలాగని ఎవరు చెప్పారు నీకు?"
    "ఎవరూ చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు"
    "అబద్దమాడితే మీ అమ్మమీద ఒట్టు, నీకలాగని ఎవరుచెప్పారో నిజం చెప్పు...."అంది వసంతలక్ష్మి.
    బాబు ఏడుపు ముఖం పేట్టి __"నన్నే మీ అడగొద్దు. నేను నీకేమీచెప్పను. ముందు అమ్మ మీద ఒట్టుతీసెయ్" అన్నాడు.
    "నేను తియ్యను ..." అంది వసంతలక్ష్మి.
    "తియ్యకపోతే నేనేచేస్తానో తెలుసా?" హెచ్చరించాడు బాబు. వాడి గొంతులో అప్పుడే ఏడుపు ద్వనిస్తోంది. వాడి వాటం చూస్తే ఏడ్చేలా వున్నాడనిపించింది వసంతలక్ష్మి . ఆఖరికామే అనుమానం ప్రసాదు మీదకు కూడా వెళ్ళింది. అతడికి పెళ్ళిచేసుకోవడం ఇష్టంలేదుకానీ అమ్మాయిలను తనచుట్టూ తిప్పుకోవాలని ఉండి _ ఆడపిల్లలతో మంచి మాటలు చెబుతూ బాబును పెళ్ళికి విముఖంగా తయారుచేస్తున్నాడా అని ఆమెకు అనిపించింది కానీ అదంత సమంజసంగా తోచలేదు.
    నిరంజనరావును మాత్రం ఆమె ఊహ మాత్రం కూడా అనుమానించలేదు.
    బాబు మనసు మార్చడం  గురించి  అదేపనిగా ఆలోచించగా, వసంత లక్ష్మికి మార్గం వాడీడు పిల్లల స్నేహం.
    ఈ ఆలోచన రాగానే వసంతలక్ష్మి మనసులో శైలజ మెదిలింది.
    శైలజ కు నాలుగేళ్ళు . బొద్దుగా ముద్దుగా ఉండడమేకాక వయసు మించిన కబుర్లు చెబుతుంది. ఈడుకు మించిన తెలివితేటలున్నాయి. దానికీ వసంతలక్ష్మి కీమించి స్నేహముంది. అమెతరుచుగా దానికికథలు చెబుతూంటుంది.
    ఏ వయసులోనైనాసరే  అబ్బాయిలు అమ్మాయిలంటే ఆకర్షించబడతారు. బాబుమీద శైలజను  ప్రయోగించాలన్న ఆలోచన తనకింతవరకూ తట్టనందుకు వసంతలక్ష్మి తన్ను తానే నిందించుకుంది.
    శైలజకు వసంతలక్ష్మి  అంటే చాలా ఇష్టం కాబట్టి అది అమెగురించి బాబుకు మంచిగా చెబుతుంది. ఆ విధంగా బాబుకు ఆమెపైన ఏర్పడిన దురభిప్రాయాలు క్రమంగా తొలగిపోతాయి. బాబు మనసులో విష బీజాలు నాటిందేవరో కూడా శైలజ ద్వారానే తెలుసుకుని విరుగుడుఅలోచించవచ్చు.
    ఇలా ఆలోచించుకుని వసంతలక్ష్మి ఒకరోజు సాయంత్రం వరలక్ష్మి ఇంటికి వెళ్ళింది. వరలక్ష్మి శైలజ తల్లి.ని చూస్తూనే __"ఏమమ్మా వసంతా __ మా శైలజకోసమో ...."
    వరలక్ష్మి వసంతలక్ష్మి ని చూస్తూనే __"ఏమమ్మా వసంతా __ మా శైలజకోసమా  ...." అనడిగింది.
    అవునండి __ చాలారోజులుగా అది మా ఇంటికి రావడంలేదని నేనే వచ్చానీరోజు " అంది వసంతలక్ష్మి.
    "ఏమో __ దానికి నీమీద కోపం వచ్చిందట. నువ్వు మెట్లెక్కుతుండగా కిటికీలోంచిచూసి వెంటనేపరుగున వెళ్ళి బెడ్రూంలోపడుకుంది" అంది వరలక్ష్మి.
    వసంతలక్ష్మి నెమ్మదిగా బెడ్రూంలోకి వెళ్ళి మంచంమీద దొంగనిద్ర    నటిస్తున్న శైలజకు సమీపించి _-"అమ్మదొంగా __ నువ్విక్కడున్నావా __ నీదీ దొంగనిద్రని నాకు తెలిసిపోయిందిలే" అంది.
    శైలజ చటుక్కున లేచికూర్చుని __"నువ్వు నాతో మాట్లాడొద్దు నాకు నీమీద కోపం వచ్చింది" అంది.
    "ఎందుకట?"
    "నువ్వు మా యింటికి ఎందుకు రావడంలేదు?" అంది శైలజ.
    "ఇప్పుడొచ్చనుగా"
    శైలజకేమనాలో తెలియక __"సరేలే __కోపంపోయింది" అంది.
    మా శైలజ బంగారుతల్లి నేను నీతో పెద్ద పనిమీద వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆ పనిచేయలేరు...." అంది వసంతలక్ష్మి.
    శైలజ కళ్ళు పెద్దవయ్యాయి.__ "చెప్పు  చేస్తాను" అంది.
    "ఈ విధిలో బాబులేడూ __ వాడితో నువ్వు స్నేహం కట్టాలి" అంది వసంతలక్ష్మి.
    "వాడా __ వాడికి చాలా గీర ...." అంది శైలజ.
    "ఏం __ నిన్నేమైనా అన్నాడా?" అంది వసంతలక్ష్మి .
    "ఏమీ అనలేదుగానీ అందరూ నన్నుచూడగానే ముద్దుగా ఏమే శైలూ అని పలకరిసతారా __ వాడుమాత్రం నన్నుచూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. "
    "అదా __ పాపం వాడికి అమ్మలేదు. అందుకని అలా వుంటున్నాడు. వాడు చాలా మంచివాడు తెలుసా!" అంటూ వసంతలక్ష్మి శైలజకు బాబు మీద జాలిగోలిపేలా విశేషాలు చెప్పింది.
    "అమ్మో __ అమ్మకాకుండా ఎలా?" అంది శైలజ . దానికి ఎన్నో సందేహాలు వచ్చాయి.
    నాన్నతో సరదగానే ఉంటుంది కానీ నిత్యజీవితంలో చిన్నపిల్లలు అమ్మ అనడం అవసరం చాలా ఉంటుంది. అమ్మ కలపి పెడితే ఏమ్తిన్నాబాగుంటుంది అమ్మ జోకోడితే ఇట్టేను మత్తువచ్చేస్తుంది. నాన్న వంటిలాకాక అమ్మవళ్ళు మెత్తగా ఉంటుంది. నాన్న ఊళ్ళోలేకపోయిమా అమ్మవుంటే చాలనిపిస్తుందీ. అమ్మఊరికేడితే అమ్మతోపాటే వెళ్ళిపోవాలనిపిస్తోంది తప్పితో నాన్నతో ఉండిపోవాలనిపించదు.
    శైలజ మాటలు విమ్తిన్నప్పుడు బాబు ఏంపోగొట్టుకున్నాడో వసంతలక్ష్మికి అర్దమయింది. ఆ లోటు తను తీర్చగలదా?
    కళ్ళలో తిరిగిన నీళ్ళు తుడుచుకుని __"చూశాడా __పాపం అమ్మలేక ఆ బాబు ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. నువ్వు వాడితో స్నేహంకట్టి వాడి దిగులు పోగొట్టాలి. అప్పుడు నీకేంతో పుణ్యంవస్తుంది. " అంది వసంతలక్ష్మి.
    "అలాగే __ అలాగేచేస్తాను...... వాడెక్కడున్నాడిప్పుడు?" అంది శైలజ.
    "వాలింట్లోనే ఉంటాడు. వల్ల నాన్నకూడా నీ కన్నకులాగే చీకటి పడితేగానీ ఇంటికిరాడు......"అంది వసంతలక్ష్మి.
    శైలజ అప్పటికప్పుడు బయల్దేరటానంది. కొత్తస్నేహితుడి పరిచయం కోసం అది కొత్తగా ముస్తాబవ్వాలనుకుంది. వేసుకున్న ఆకుపచ్చరంగు గౌను విప్పేసి గులాభి రంగు గౌను వేసుకుంది. ఉన్న ఒక్కజడనూ రెండు  పిలకజడలనూ మార్చి చుకుంది. ముఖమంతా పౌడరు మెత్తుకుంటే వసంతలక్ష్మి తువ్వాలుతోతుడిచి సరిచేసింది. వసంతలక్ష్మి దానికి బొట్టుకూడా పెట్టింది. అటుపైన బూట్లూ సాక్సూ వేసుకుంటానని పేచీ పెడితే వాళ్ళమ్మ ఒప్పుకోలేదు హవాయి స్లీప్పరసే వేసుకుని వెళ్ళమంది. ఏ కళనుందో  మారాం చేయకుండా ఒప్పికుని వసంతలక్ష్మి తో బయల్దేరింది.
    ఆమె దాన్ని తీసుకుని ప్రసాదు  ఇంటికి వెళ్ళింది. అక్కడ డ్రాయింగ్ రూంలోని దృశ్యం చూసి ఆమె ఆశ్చర్యపడింది.
    అక్కడ సోఫాకు ఎదురుగా నేలమీద బాబు కూర్చునివున్నాడు. వాడి కెదురుగా నీల కూర్చునివున్నది. నీల వయసుకూడా నాలుగేళ్ళ! అది ఉదయ పక్కింట్లోవుండే శాంతదేవీ కూతురు.
    నీల బాబుకు ఉదయ మంచితనాన్ని గురించి చెబుతోంది. ఉదయ ఎంత గొప్పదో చెబుతోంది.
    "ఆ పిన్ని అంటే నాకు అమ్మకంటే ఎక్కువిష్ణ౦" అంది చివరికి నీల.
    బాబు కళ్ళు పెద్దవయ్యాయి_"నీకు మీ అమ్మకంకూడా ఇష్టమైన వాళ్ళున్నారా?" అన్నాడు.
    వసంతలక్ష్మి రెండడుగులు వెనక్కువేసి గుమ్మంబయటకు వచ్చింది.
   తను అనుమానంలో అబద్డంలేదు. ఉదయ చాలా తీవ్రంగా ప్రసాదు కోసం ప్రయత్నాలు చేస్తోంది? తనకంటే ముందుగానే ఆమె నీలను రంగంలోకి దింపింది.
    తనిప్పుడెం చేయాలి?
    పోటీనుంచి విరామించుకోవాలా లేక ప్రయత్నాలు చేయాలా?
    ఆమె క్షణం ఆలోచించి  _"నేను లోపలకు రాను నువ్వే వెళ్ళు ఆ నీలూ ఉంది చూడు అది బాబుకు ఉదయ గురించి గొప్పలు చెప్పేస్తోంది నువ్వు నా గురించి ఇంకా గొప్పగాచెప్పాలి. నీలూకంటే నువ్వే తెలివైనదానివి. అందుకని బాబు నీ మాటే వింటాడని నాకు తెలుసు...." అంటూ శైలజకు చంకదించింది.
    "అయితే నేను పెడతాను" అంటూ శైలజ లోపలకు  వెళ్ళడానికి ఉత్సాహపడింది.
    "ఊం" అంది వసంతలక్ష్మి .
    కోడిపందెంలో అప్పుడే వదలబడిన  కోడిపుంజులా లోపలకు దూకింది శైలజ.
    వసంతలక్ష్మి వెంటనే అక్కణ్ణుంచి బయటకు వచ్చేసింది.
    అప్పుడే ఆమెకు ఉదయ ఎదురయింది.
    స్నేహితురాండ్రిద్దరూ ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు.
    "నువ్వేం చేశావో నేను చూశాన్లే" అన్నట్ట్లున్నాయి ఉదయ చూపులు ఆమె కన్నుల్లో కలవరపాటుగా కనబడుతున్నది.
    ఇద్దరూ కూడా ఒకరినొకరు పలకరించుకోలేదు కనీసం చిరునవ్వులు కూడా చిందించలేదు ఓక్కక్షణం అలా చూసుకుని ఎవరిదారిన వారు వెళ్ళి పోయారు.
                                                                           15
    ఒకరోజున ప్రాసాద్  నిరంజనరావు కు కబురుపెట్టాడు. నిరంజనార్వు ఆశ్చర్యపడుతూనే అతడింటికి వెళ్ళాడు.
    "మా కంపెనీలో  ఒక కాళీవచ్చింది . అది పూర్తిగా నా చేతుల్లో వున్న ఉద్తోగం ఎరుగున్న వాళ్ళ కేవరినైనా  ఇచ్చి సాయపడాలని నా తాపాత్రయం ఎరిగున్న వారింట్లో సందర్భంలో మేగురించి తెలిసింది. మాకు కావాలసింది.  గ్రాడ్యుయేట్ నెలకు ఏడో౦దోల యాభై జీతం రోజుకు ఎనిమిదిగంటల పని వారానికోరోజు సెలవు. ఉద్యోగంలో చేరాక మూడు సంవత్సరాలదాకా ఏ ప్రమోషన్ వుండడు . ఏడాదికి పాతిక రూపాయలు ఇంక్రిమెంటు౦ది. నేను తలచుకుంటే రేపేవచ్చి మీరు ఉద్యోగంలో చేరగలరు" అన్నాడు ప్రసాద్.   

 Previous Page Next Page