ఎవరిని పెళ్ళిచేసుకోవాలనుకున్నా ముందు బాబు అంగీకారంకావాలి! ఇంతకాలం ఈ విషయమై తనేరంగామలోనికి దిగాలనుకున్నాడు.
ఒకరిజు బాబునుపిలిచి __"నీకు అమ్మకవాలా?" అన్నాడు.
"ఊం" అన్నాడు బాబువెంటనే.
ప్రసాదు వాడికెలా చెప్పాలో అని అలోచిస్తున్నాడు.
"అమ్మ చచ్చిపోయిందిగా __ మళ్ళీ ఎలావస్తుంది?" అన్నాడుబాబు.
"ఆ అమ్మరాదు __ ఇంకో అమ్మ వస్తుంది" __ అన్నాడు ప్రసాదు.
"అంటే?"
"కొత్తఅమ్మ...."
"కోటఅమ్మ అంటే సవతితల్లి అవునా?'
ప్రసాదు తడబడి "అవును కానీ సవతితల్లులందరూ చేద్దవాలుండరు అన్నాడు.
"నాకు సవతితల్లి వద్దు__" అన్నాడుబాబు.
"ఎందుకని?"
"సవతితల్లి గురించితనకున్న భయంకరమైన ఊహలన్నీ బాబుతండ్రికి చెప్పుకున్నాడు.
"ఎవరుచెప్పారివన్నీ నీకు?" అన్నాడు ప్రసాదు ఆశ్చర్యంగా.
బాబుచెప్పాలనే అనుకున్నాడు. కానీ ఎట్టిపరిస్థితులోనూ తన పేరు చెప్పవద్దనీ, అందువల్ల బాబుకే ప్రమాదమనీ నిరంజనరావు మరీ మరీ వాడినిహెచ్చరించిఉన్నాడు.
"ఎవరో చెప్పాడమెందుకు? అన్నీ నాకే తెలుసు__" అన్నాడు బాబు.
అలా అన్నప్పుడు వాడి ముఖం చూదముచ్చటగా వుంది. ప్రసాదు వాడిని చటుక్కున బుగ్గలమీద ముద్దుపెట్టుకుని __"నువ్వు చాలా చిన్నవాడివి. నీకు తెలియనివి ఈప్రపంచంలో చాలా వున్నాయి" అన్నాడు.
"నేను చిన్నవాడినైనా సరే __ సవతి తల్లి గురించి అన్నీ నాకు తెలుసు అన్నాడు బాబు కచ్చితంగా.
"అందుకే నీకు కొందర్ని చూపిస్తాను. వాళ్ళలో ఎవరు నీకు నచ్చితే వాళ్ళే నీకు కొత్త అమ్మ" అంటూ ప్రసాదు తల్లి ఎన్నికలో బాబుకన్న ప్రాముఖ్యతను వివరించాడు.
"నాకెవ్వరూ నచ్చారు" అన్నాడు బాబు.
"చూడకుండా అలా మాట్లాడకూడదు."అ అన్నాడు ప్రసాదు. ఎంత దాచుకుందామన్నా విసుగుదాగలేదు.
బాబు వెంటనే ఏడుపు ప్రారంభించాడు.
"ఎందుకురా ఏడుస్తావు?" అన్నాడు ప్రసాదు.
"నాకు తెలుసు నకిష్టంలేకపోయినా నువ్వు కొత్తమ్మను తెస్తావు. ఆ అమ్మ నన్ను కొడుతుంది. తిడుతుంది. "అంటూ ఏడుపుకోనసాగించాడు బాబు.
ప్రసాదు నిసాహయమ్గా బాబువంకచూశాడు. బాబు ఏడుపులో నటన లేదు. కొత్త అమ్మ పేరు వినగానే వాడు భయపడుతున్నాడు. ఎవరో వాడిని కొత్తఅమ్మ గురించి బాగా భయపెట్టారు. వాళ్ళెవరైవుంటారు?
ప్రసాదు బాబును భయపెట్టారు. "వాళ్ళేవరైవుంటారు?
ప్రసాదు బాబును దగ్గరగా తీసుకుని __ నువ్వేడిస్తే నేను చూడలేను. ఈయింట్లో నీకిష్టంలేనిపనేది జరగదు . సరేనా?" అన్నాడు.
బాబు తృప్తిగా తలాడించి __"అలాగని ఒట్టేయి" అని తన చేతిని చాపాడు. ఆప్రయత్నంగానే ప్రసాదు బాబు చేతిలో చేయి వేశాడు.
ఆ రాత్రి బాబు నిద్రపోయాక ప్రసాదు శేనయ్యనుపిలిచి __"బాబుకి నువ్వేం చెబుతున్నావో నాకు తెలియదు. వాడికి కొత్తమ్మంటే భయంపట్టు కుంది" అన్నాడు.
శీనయ్య జరిగిదర్డంచేసుకుని __ అయ్యో! తమరోకఇంటివారు కావాలనీ __ బాబుకు తల్లిలేనిలోటు తీరాలనీ నేనెంతగానో తాపాత్రయపడుతున్నాను. నేను బాబునెందుకు కొత్తమ్మ పేరు చెప్పి భయపెడతాను?" అన్నాడు.
"నువ్వనినేనునలేదు. బాబు సంరక్షణంటా నువ్వే చూస్తున్నావుకదా! వాడితో ఎవేరెవరు ఏమేం మాట్లాడుతున్నరావు కాస్త కానిపేట్టి చూస్తుండు. వాడి మనసుని విషపూరితం కాకుండా చూడాల్సిన భాద్యతనీదే!" అన్నాడు ప్రసాదు.
శీనయ్య ఆలోచనలోపడ్డాడు. ఈ విషయంలో తన భాద్యతను సరిగా బిర్వర్తించలేదని వాడికీ అనిపించింది బాబు మనసులోకి ఎవరువిషమేక్కిస్తూన్నరో వాడికీతెలియలేదు. నిరంజనరావు కూడా బాబును చేరేదీస్తున్నాడు. తెలిసినా బాబు మనసులోకి విషమెక్కించే అవసరం అతడికుంటుండన్న స్పురణ కూడా రాలేదు వాడికి.
"బాబూ! తమరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాను. అవసంతలక్ష్మి పెళ్ళిచేసుకోండి బాబు బాయనమ్మ కంటికి రెప్పలా చూసుకుంటుంది. పెళ్లయ్యాక బాబుకే ఆ విషయం తెలిసిస్తుంది. "అన్నాడు శీనయ్య కాస్తధైర్యంచేసి
ప్రసాదు చురుగ్గా వాడికళ్ళలోకిచూసి __"నేను పెళ్ళిచేసుకుంటానంటే, వాళ్ళు పిల్లనిసతారా? ఆ పిల్ల ఒప్పుకుంటుందా?" అన్నాడు.
"మీరు ఊం అనండిబాబూ _నేనుచితికేలమీద సంబంధంకుదీరేర్చస్తాను" అన్నాడు శీనయ్య.
ప్రసాదు అలోచిస్తున్నట్లుగా __"పెళ్ళి చేసుకోవాలంటే ముందొకసారి నేనా అమ్మాయితో మాట్లాడాలి. నీకు చేతనైతే ఒకసారి అ అమ్మాయి మనింటికి తీసుకునిరా నేను తనతో మాట్లాడి ఏవిషయమూ తేల్చుకుంటాను అన్నాడు.
"అలాగే బాబూ " అన్నాడు శీనయ్య.
వాడి మాటల్లో ద్వనించిన నమ్మకానికి ప్రసాదు ఆశ్చర్యపడ్డాడు.
శీనయ్య వసంతలక్ష్మి తన ఇంటికి తీసుకుని రాగాలడా? ఒకసారి జరిగిన అనుభవం తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ధైర్యంగా తనతోమాట్లాదగలుగుతుందా? ఒకవేళ తను మళ్ళీ చొరవచేస్తే!
అయితే శీనయ్య ధైర్యమువేరు. వాడికి సుబ్రహ్మణ్యంగారి కుటుంబం బాగా పరిచమైంది. ఈ సంబంధాన్ని తను తప్పక కుదర్చుగలనని నా వాళ్ళకు మాటకూడా ఇచ్చాడు.
12
ఉదయ రోజూ సాయంత్రం భీచికి వేడుతున్నది. నిజానికి తరచూ బీచుకి వెళ్ళే అలవాటామేకులేదు.
ప్రసాదు ను అతడి ఆఫీసు గదిలో తిరస్కారించాక అతడిముఖంమళ్ళీ చూడకూడదని ఆమె అనుకున్నది. కానీ అంతలోనే వివేకం ఆమెను హెచ్చరించింది. ఆమాత్రం తప్పును తాను క్షమించకపోతే ప్రసాదు ను శాశ్వతంగా మర్చిపోవాల్సుంటుంది.
ప్రసాదు యోగ్యుడైన వరుడు, అతడిలో అవగునాలున్నా వివాహానికి అభ్యంతరంకావు. అతడి గురించి ఎందరో ఆడపిల్లలు తల్లిదండ్రులు పోటీపడుతూంటారు. కన్నకొడుకుమీద అభిమానంతో ఆగాడు కానీ అతడు తలచుకున్న మరుక్షణంలో నే అతడి వివాహం జరుగుతుంది.
ప్రసాదుకు తను నచ్చినమాట వాస్తవం. అందుకే అంత చొరవగా ప్రవర్తించాడు. తనను చూసి తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. తనంటే అంత ఆకర్షణవున్న పురుషుడు తనకు భర్త అయితే జీవితం స్వర్గధామమే! అదీకాక మగవారికి అందని ఆడపిల్లలపై మోజుఎక్కువుంటుందంటారు. ఆ విధంగాకూడా అతడికి తనపై ఆకర్షణ పెరిగివుంటుంది.
ఉదయకు ప్రసాదుపై కోపంవచ్చినమాట నిజం. ఆ అక్కసునంతా ఆమె నిరంజనరావు అనే దుత్తపై ప్రదర్శించాక __ఆమెలోని వివేకంమేల్కొని హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఫలితంగా ప్రసాదు తాత్కాలికావేశంలో పోరాపాటు చేశాడనీ, తన పొరపాటుకతడు చింతిస్తున్నడనీ తనకు క్షమార్పణలు చెప్పుకునేందుకు ఆత్రుతపడుతున్నాడనీ ఆమెకు అనిపించింది.
అయితే అతడామెకు క్షమార్పణలేలాచెప్పుకుంటాడు? ఉదయ అతడికి కలుసుకునే అవకాశమివ్వాలి తనంతట తాను చొరవచేసి కలుసుకునేటందుకతడికి ధైర్యంచాలదు. ఆ పార్దంచేసుకోబడతాననే భయం అతడికుంటు౦ది.
తను పూర్తిగా అతడి మనసులోంచి తొలగిపోకూడదని ఉదయ బీచికి వెళ్ళడం ప్రారంభించింది. బీచివద్ద అతడికి కనబడే విధంగా అతడికి దూరంగా కూర్చునేది. ఒకటి రెండు రోజులు బాగా జనానికి దగ్గరగా కూర్చున్నప్పటికీ తర్వాత ఆమె ఏకాంతానికి అనుకూలమైన విధంగా కూర్చోసాగింది.
మరి ప్రసాదుకు క్షమార్పణ అడిగే అవకాశం కల్పించాలికదా!
బీచివద్ద ప్రసాదు ఆమెను చూశాడు. గతంలోనూ ఆమె తనను పలకరిమ్చకపోవడం చూసి భయపడ్డాడు. ఆమె బీచివద్ద తన్నవామాపర్చ గలదేమో నన్న భయంతో ఆమెను పలకరించలేదు. అయితే రోజులు గదిచేకొద్దీ అతడిలో ధైర్యం పెరగసాగింది.
తను తప్పుచేశాడు. ఆమెను క్షమార్పణ అడిగి తన నిజాయితీ రుజువు చేసుకోవలసిన బాధత అతడికున్నది.
అతడింకరాడా, తనతోమాట్లాడడా అని ఉదయ అధైర్యపడుతూంటే ఏమైనా తనుపెళ్ళి ఆమెతో మాట్లాడాలన్నధైర్యం అతడిలో పెరిగిపోసాగింది.
అలా పదిరోజులు గడిచేక ఒకరోజున అతడు తనుకూర్చున్న చోటనుంచి లేచివెళ్ళి ఆమెను సమీపించి __"హాలో!" అన్నాడు.
ఉదయ అతడివంక కోపంగా చూడాలని అనుకున్నది. అలాచూస్తె అతడు భయపడి వెళ్ళిపోతాడేమోనని భయపడింది. ఆప్యాయంగా నవ్వలనుకుంది. అలా నవ్వితే తానతడికి లోకువై పోతానే మోనని సంకోచించింది.
ముఖాభావంగా __"హాలో!" అంది.
అదేచాలునని ప్రసాదు అనుకున్నాడు. అతడామేకు దగ్గరలో కూర్చుని మిమ్మల్ని క్షమించమని అడిగే ధైర్యం నాకిప్పటికీ వచ్చింది." అన్నాడు
ఉదయ మాట్లాడకుండా ఎదురుగా ఎగసిపడుతున్న సముద్రపుటలు వంక చూస్తున్నది. ఆమె మదిలోని భావసంచలనమూ అదేవిధంగా వున్నది.
"నేను సచ్చీలతకు ప్రాధాన్యతనిచ్చే మనిషిని జీవితంలో అలాంటి పొరపాటును చేయలేదు. కానీ మీరే ఎంత చొరవగా నా జీవితంలోనికి వచ్చి పెళ్ళి ప్రసక్తి తెచ్చారు. అది కలో, నిజమో నాకు తెలియలేదు. నా మనసు వశంతప్పింది. ఆలోచనలు దారితప్పాయి. తప్పుచేశాను. మీ వివేకం సచ్చీలత మిమ్మల్ని కాపాడాయి. నావల్ల జరిగిన తప్పుకు మీరు నన్ను మన్నించాలి"అన్నాడు ప్రసాదు.
ఉదయకు జవాబెం చెప్పాలో తెలియలేదు.
"నిజం చెప్పేస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ పెద్దలతో చెప్పిమరీ మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. అంతవరకూ మీతో మాట్లాదాదానికి కూడా ఏకాంతాన్నభిలషంచను" అన్నాడు ప్రసాదు.
ఉదయకీ మాటలు వినగానే సంతోషం మిగతా అన్ని భావాలనూకమ్మేయేగా "నిజంగా?" అంది.
"మీరు నన్ను క్షమించారన్నమాట...." అన్నాడు ప్రసాదు.
"ఇందులో క్షమించదానికే ముంది? మీరు కాస్త తొందరపడ్డారు. తొందరపాటువల్ల ప్రమాదముంటుందని తెలిసి నేను జాగ్రత్తగా వున్నాను...." అన్నది ఉదయ.