"ఫర్వాలేదు ఆత్మీయులైన వాళ్ళే అలా పిలుస్తారు."
"ఇప్పుడు మీ కాకలిగా లేదా?"
"ఆకలిగా లేక పోవటానికి నాలో ఏ రుగ్మత లేదుగా?"
"ఇంట్లో ఏం నరంజామా వుందో తెలీదు. ఉన్నదాంతో ఏమయినా చేస్తాను. ఇద్దరం ఫిప్టీ తిందాం. ఏం?"
"అంత ఆదరణగా భోజనం పెడతానంటే ఎందుకు వద్దంటానండీ?"
విరాజి లేచి ఒక్కొక్క సరంజామా వెదికి తీస్తూ వంట ప్రయత్నం మొదలు పెట్టింది.
"ఏమిటిలా వెదుక్కుంటున్నారు?" మీరు వంట చేసుకోరా?" అనడిగాడు గౌతమ్.
"బుద్ధి వచ్చినప్పుడు చేసుకుంటూ వుంటాను. లేకపోతె కాఫీ తాగి ఊరుకుంటాను. నా ఒక్కదానికోసం వంట అనగానే ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. అంటూ అతని ముఖంలోకి చూసి "అదేమిటి? మరీ అంత బడలిగా కనిపిస్తున్నారు ఆ కుర్చీలో వీలు లేకపోతె మంచంమీద కూచొండి. గోడకు జారిగిలపడి కూచుంటే కొంచం సుఖంగా వుంటుంది." అంది.
"అబ్బే ! వొద్ద౦డి" అన్నాడు గౌతమ్ మొహమాట పడుతూ.
"ఫర్వాలేదండి." ఈ మొహామాటానికి పోయే మానవుడు పోగొట్టుకుంటూ వుంటాడు.
అప్పటికీ అతను కదలక పోయే సరికి "లేస్తారా? రెక్క పుచ్చుకుని లేవదియ్యమంటారా?" అంది విరాజి.
ఆమె నిజంగానే అంత పని చేస్తుందని అతడు గన్ చుఫ్ గా లేచి మంచం మీద జారగల బడ్డాడు.
చాలా దూరం నడిచి వొచ్చి వుండటముచేత శరీరము అలసిపోయి వుండటముచేత అతనికి మంచము మీ ద కూర్చోగానే హాయి యనిపించింది. నిద్రకూడా వొచ్చినట్లని పించింది. కాని మామాటపడి నిగ్రహించుకున్నాడు.
విరాజి మళ్ళీ వంటపనిలో మునిగి మధ్యలో "పాఠకుల స్థాయికి రచయిత దిగజారటమా? లేక తన స్థాయికి పాఠకులిని ఎదిగేలా చెయ్యటమా _ యీ నాటి రచయిత ముఖ్యంగా నిర్ణయించుకోవాల్సి వుంది." అన్నది.
"పాఠకులిని తన స్థాయికి తీసుకు వెళ్ళ గలిగినందుకు అసలు రచయితకు ఓ స్థాయి అంటూ వుండాలి." అన్నాడు గౌతమ్ .
విరాజి కిలకిలమని నవ్వింది. చాలా గొప్ప . సత్యం చెప్పావు_ అసలు సాహిత్యంలో సంబంధము లేకుండా కేవలము రచనా సరళి మీద జిమిక్స్ మీద ఆధారపడి పాఠకులిని ఓ భ్రమలోవుంచి గొప్ప రచయితులుగా చలామణి అయేందుకు అవకాశమున్న రోజులివి విజ్ఞానంతో కాని పరిశీలనలో కాని అతను చాలా ఎదిగి వుండాలి. ఉత్తమ రచయిత కాజారినవారు పాఠకులిని దృష్టిలో పెట్టుకోకుండా రచనలు చెయ్యమని నేను చెప్పను. కాని పాఠకుల దగ్గరకు టాను వెళ్ళకూడదు. పాఠకులిని తనతోబాటు తీసుకు వెళ్ళగలిగాలి.
"కాని జాగ్రత్తగా ఆలోచిస్తే _ అది సాధ్యమవుతుందా?"
"కళ విషయానికొస్తే ఏదీ అసాధ్యంకాదు. సత్యజిత్ రే మృణాళ్ సేన్ ప్రేక్షుకుల స్థాయికి డిగి వచ్చారా లేక ప్రేక్షకులని వాళ్ళ ఎత్తుకు తీసుకువేడుతున్నారా? పోనీ పేరు ప్రఖ్యాతలు వాళ్ళకేమైనా తక్కువ అంటే దేశీయం గానే కాకుండా విదేశాల్లో కూడా యించు మించు ప్రపంచమంతటా కూడా వాళ్ళ పేర్లు మారుమ్రోగి పోయినట్లు వాళ్ళకి అవార్డులు వచ్చినట్లు ఇంకేవరికిజరగలేదే" అంది విరాజి.
గౌతమ్ కొంచంసేపు తీవ్రంగా అలోచించాడు. "పాఠకుల స్థాయికి దిగి రావటమంటే కమర్షియల్ గా మారటమనేగా మీ ఉద్దేశ్యం" అన్నాడు.
విరాజి అవునన్నట్లు తల ఊపింది.
"మరి చాలామంది గొప్ప కళాకారులలో కూడా యీ కమర్షియల్ దృష్టి కనిపిస్తుంది. బాల మురళీ కృష్ణ , రవిశంఖర్, బిస్మిల్లా ఖాన్, లతా ఘంగేష్కర్ _ వీళ్ళంతా తమ ఆర్ట్ ద్వారా డబ్బుచేసుకుంటున్నారు కదా"
"డబ్బుకోసం ప్రజల అభిరుచికి తగ్గట్టు తమనితాము రూపొందించు కోవటాన్ని కమర్షియల్ అనటం అంటారుగాని తమ విలువల్ని పోగొట్టుకోకుండా తాము నిలబడ్డ మెట్టుపై నించి క్రిందికి దిగిరాకుండా డబ్బు చేసుకోవటం తప్పేమికాదు. బాల మురళీకృష్ణ సంగీతంలో తనకున్న ఉన్నత శ్రేణి స్థాయిని గాడి తప్పకుండానే శ్రోతల్ని తనవైపు మలచుకున్నాడు. అలాగే సితారా వాద్యంలో రవిశంకర్ "వీళ్ళిద్దరు కూడా జనాకర్షణ శక్తి కోసం కొంత మడికట్టుకోవడం తగ్గించారన్న విమర్శిలో నిజం లేకపోలేదు. కాని కళా విలువల్ని విడిచి పెట్టలేదన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. బిస్మిల్లాఖాన్ వంటి గొప్ప కలాకారుడని యింకోకర్ని ఊహించలేము అతని షేహనాయ వింటూనే యీ ప్రపంచానికి దూరంగా పారిపోయి, అడవుల్లో ఒంటరిగా కూర్చుని మూగగా రోదించినట్లు, గుండెల్లో విషాదగీత ప్రతి ధ్వనించినట్లు, నరాల్ని నెమ్మదిగా తెగ కోసినట్లు వింత అనుభూతి . ఇహా లతామంగేష్కర్ _ ఆమెలో ప్రతిభ ఎంత వున్నా ఆమె కమర్షియల్ అర్టిస్టూగానే తనకేరీర్ మొదలు పెట్టింది. అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఓంతకన్నా మించిన నిజరూపం అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసినా, పూర్తిగా ప్రదర్శించలేదు కదా?"
ఉన్నట్లుండి గౌతమ్ అడిగాడు _ నీ వన్నట్లు జనాంతకం కావటానికి తోలోడల్కాలిచ్చి . కళాకారులంతా పూర్తీగా కళామయమైపొతే ప్రపంచంమేలా వుంటుంది?"
విరాజి నవ్వుతూ అంది __ "నీకా భయమక్కర్లేదు. అలా ఎన్నటికి జరగదు. ఎవరికీ కావాల్సిందే వారికెప్పుదోఒ దొరుకుతూనే వుంటుంది."
"గౌతమ్ మొదలకుండా వూరుకున్నాడు.
కాసేపామే అతనివైపు నుంచి దృష్టి మరల్చి వంటవైపు మసగు లగ్నం చేసింది.
ఓ పావు గంట గడిచాక ఆమె "హమ్మయ్య! అయిపోయింది" అంటూ తలేత్తి చూసేసరికి అతను మంచంమీద వాలిపోయి కళ్ళు మూసుకుని వుండటం కనిపించింది.
"గౌతమ్ " అని పిలిచింది.
అతను కల్లేదు.
చేతులు కడుక్కుని పమిట చెంగుతో తుడుచుకుని మంచం దగ్గరగా వచ్చింది. అతను మంచి నిద్రలో వున్నాడు. అలసిపోయినట్లు కనబడు. తోన్న ముఖాన, గాలిలేకపోవటం వల్ల చిరుచేమటలు అలుముకుంటున్నాయి. ఆమె విసేనకర్ర తీసుకుని, కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కుని విసేనకర్రతో అతనికివిసరసాగింది.
అలా విసురుతూ అతని ముఖంలోకి ఆ ప్రయత్నంగా పరీక్షగా చూసింది. ఇరవైమూడేళ్ళు వయసుకంటే ఎక్కువ వుండదు. లేతదనం __ కొంచెం అమాయకత్వం కళ్ళుతెరచి వున్నప్పుడు __ వాటిలో గోచరించే పట్టుదల ఆమెకు గుర్తుకొచ్చింది.
ఏ మనిషియినా ఓ రూపం ధరించటానికి అభిలాష కన్న పరిస్థితులే ఎక్కువగా కారణం. ఇవన్ని సరిగ్గా మలచ గలిగితే గొప్ప రచయిత అవడానికి అవకాశముంది అనుకుంది.
దాదాపు అరగంట తర్వాతగౌతమ్ కదిలాడు. ఒక ప్రక్కకి వొత్తిగిలబోతూ కళ్ళు "అరె! ఇదేమిటి?" అంటూ లేచి కూర్చున్నాడు.
"ఏం జరిగిందని అంత ఉలికిపాటు?
"మీరు నాకు విసురుతున్నారా? అన్నాడు సిగ్గుగా .
"ఏం విసిరితే?"
"మీరు పరాయి స్త్రీ అయివుండి ......
"ఇప్పటిరోజుల్లో పరాయిస్త్రీలే విసురుతారు ....._ సొంత స్త్రీలకన్న " అంది విరాజి క్రీ గంట ఓ చూపు విసిరి.
ఆ చూపుకు అతను మరీ లజ్జితుడై నాడు. "ఎంత సేపయింది నేను పడుకుని?"
"ఓ అరగంట దాటివుంటుంది. భోజనం చేద్దామా? మీకు ఆకలి వెయ్యటం లేదూ?"
"చాలా!"
"లేవండి మరి"
అతను లేచి చెయ్యి కడుక్కుని వొచ్చి ఆమెతోబాటు చాపమీద కూర్చున్నాడు.
గిన్నెల్లో అన్నం. కూర, పప్పు అన్ని కొంచెం వున్నాయి. రెండుగాజు ప్లేట్లలో యిద్దరికీ సగం సర్దింది.
"పిఫ్టీ ఫిఫ్టీ."
గౌతమ్ నవ్వాడు.
"గౌతమ్! మనమిద్దరం ఎప్పటికైనా కలసి మంచి బ్యాలే తయారు చేయాలి , థాట్ మనం ఇద్దాం. మనమిద్దరం కలసి గేయాలు రాయగలిగితే రాద్దాం. లేకపోతె ఏ కవి సాయమైనా తీసుకుందా౦. "
గౌతమ్ తల ఊపాడు.
"ఎప్పటికైనా ఓగొప్ప బ్యాలే తయారుచేసి అపూరూపమైన నాట్య ప్రదర్శన యివ్వాలని న అచిరకాల వాంఛ . ఉదయశంఖర్ తర్వాత అలాంటి సజీవమైన, సమాజపరమైన నాట్యకళ అంతరించపోయింది. "అంది విరాజి. ఆమె గొంతులో ఎప్పటికైనా తన ఆశ నెరవేర్చు కోవాలన్న పట్టుదల ధ్వనిస్తుంది.
"నా శాయనిశాక్తులా సహకరిస్తాను." అన్నాడు. గౌతమ్.
"యాంత్రికంగా , రుచులేకుండా బతకడం చాలా డుర్భరమనిపిస్తూ వుంటుంది గౌతమ్. ఒక్కోసారి యీ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది చాలా పిచ్చి ఆలోచన అనుకో. ప్రస్తుతం. అయిదారుట్యూషన్లున్నాయి. అంతా డబ్బులున్న వాళ్ళ పిల్లలే. వాళ్ళు అడిగినట్లు చెప్పటానికి సిద్దపడితే యింకా చాలా ట్యూషన్లు వచ్చేవి కాని ఆ తల్లిదండ్రులుకి ఒకటే యావ. తమ పిల్లలకు వెంటనే సినిమా ఛాన్స్ రావాలనీ, సినిమాల్లో వేషాలేసేసి డ్వాన్సులు చేసెయ్యాలనీ? అందుకని దూరంగానే వుంచేశాను.
"సినిమాలంటే మీకెందుకంత కోపం?"