Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 7

    లెటర్ చదివిన అమల కసిగా 'ఎంత మోసం!' అనుకుంటూ పళ్ళు కొరుక్కుంది.

    "మోతీ అనే స్నేహితురాలు తనకి లేదు. ఈ భగవాన్ గాడు తను రానే లెటర్స్ నాన్నగారికి, నాన్నగారు రాసే లెటర్స్ తనకి నిజంగా అందిస్తున్నాడా? లేక వాడు ఆడే నాటకంలో ఇదీ ఓ భాగమా?" అని ఆలోచించి చిన్న ప్లాన్ పన్నింది. నిజంగా తాను రాసే లెటర్ నాన్నగారికి అందితే, "మోతీ గురించి రాశావు? ఆ నీ స్నేహితురాలెవరో మాకు తెలియదు. ఎందుకిలా రాశావు?" అంటూ తప్పక రాసేవారు నాన్నగారు.

    "మోతీ అనే స్నేహితురాలు నీకు లేదు. ఎందుకిలా మీ నాన్నగారికి రాయవలసి వచ్చింది," అంటూ గద్దించుతూ మరో లెటర్ కిటికీలో ఉంచేవాడే భగవాన్.

    మధ్యమధ్య ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఈ విషయంలో నిన్న పొరపాటు చేశావు. జాగ్రత్తగా ప్రవర్తించు అంటూ భగవాన్ లెటర్స్ కిటికీలో ఉంచుతూనే వున్నాడు. కాబట్టి భగవాన్ ఆడుతున్న లెటర్స్ నాటకం ఇది. ఏం చేయాలి?

    అమ్మ, నాన్నగారికి నా విషయం అసలు తెలియదు. నేనేమైపోయానో అని దిగులు పడుతూ ఉండి వుంటారు. పోలీసు రిపోర్టు ఇచ్చారేమో అని ఆశ పడదామా అన్నా భగవాన్ గాడు అంతదూరం రానీయడు. బెదిరించి నన్ను లొంగదీసుకుని పిచ్చిదాన్ని చేశాడు. అక్కడ నాన్నగారిని మరోవిధంగా బెదిరించి నా గురించి పోలీసుల దాకా పోకుండా చేసి వుంటాడు.

    "భగవాన్! తాటిని తన్నేవాడుంటే తల తన్నేవాడు ఆపై వుంటాడు. భుజంగరావు గారు ఉత్తములు. వారికి ద్రోహం తలపెట్టావు. వారి ఆస్తి చేజిక్కించుకోటానికి బెదిరించి పావులా నన్ను వాడుకుంటున్నావు. అంతేగాక, నీమాట గత్యంతరం లేక వింటున్నందుకు నాటకంపై నాటకం ఆడుతున్నావు. జరిగింది భుజంగరావు గారితో ఒక్కమాట చెపితే మంచు విడిపోయినట్లు కధ విడిపోతుంది. భుజంగరావుగారితో నే చెపుతూ వుండగా విని నన్నో, భుజంగరావుగారినో పై లోకానికి తరలిస్తావు. నీవాడుతున్న నాటకానికి పైనాటకం ఆడి నీ అంతు తేల్చకపోతే నా పేరు అమల కాదు."

    చాణుక్య శపధంలా తనలో తాను శపథం చేసింది అమల.

    "ఏం చేయాలి? ఏం చేస్తే ఈ ఇంట్లోంచి బైట పడతాను. ఏ విధంగా ర్ర్ ఇంట్లోనే దాగున్న మోసగాడైన భగవాన్ గుట్టు బైటపడుతుంది?" తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంది అమల.

    లెటర్ ని భద్రంగా భగవాన్ అంతకు క్రితం చెప్పిన విధంగా ప్లవర్ వాజ్ లోపల వుంచి ప్లవర్ వాజ్ లో పూల గుత్తి సర్దింది.
    "తిరుగులేని పధకం...... భగవంతుడు బైటకోచ్చే ప్లాను," ఆలోచిస్తూ కూర్చుంది అమల.
   

                                     6


    "తల్లీ రోజా! మన కృష్ణ వస్తున్నాడమ్మా," ఓ లెటర్ చేతిలో పట్టుకుని భుజంగరావు, అమల వద్దకు వచ్చి సంతోషంగా చెప్పాడు.

    "కృష్ణా! ఎవరు?" గబుక్కున అమల అడిగి తన పొరపాటు తెలుసుకుంది. వెంటనే పిచ్చిగా చూస్తూ వుండిపోయింది.

 Previous Page Next Page