Previous Page Next Page 
శతఘ్ని పేజి 4

 

    దేశమును ప్రేమించుమన్నా......మంచి అన్నదిపెంచుమన్నా....... అన్నాడు

    నండూరి సుబ్బారావు"
    
    "ఆమాటన్నది నండూరికాదు. గురజాడ"
    
    "శభాష్" నోరు జారడం తనహక్కన్నట్టు వెంటనే కరెక్ట్ చేసుకున్న ముఖ్యమంత్రి గారు వెంటనే అన్నారు "గురజాడగారంటే నాకూ బాగా గురి కాబట్టి వెంటనే ఆయనచెప్పిన జాడలోనడవాలని బలంగాతీర్మానించుకున్నాను."
    
    టాపిక్ మళ్ళిస్తున్నాడని బోధపడిపోయిన విలేఖరి పట్టుసడలటం యిష్టంలేనట్టు అడిగాడు "నిన్నరాత్రి జరిగిన ఓ మానభంగం గురించి మనం మాటాడుకుంటున్నాం"
    
    "దీన్నిబట్టి అర్ధమౌతూంది మీ ప్రెస్ ఎంత బలహీనంగా పనిచేస్తున్నదీ......"
    
    ఈ అభియోగమేమిటో అర్ధం కాలేదు.
    
    "అవును....." విలేఖర్ల కేసి ఉద్రేకంగా చూస్తూ అరిచాడు "నిన్నరాత్రి నగరంలో జరిగింది మానభంగం కాదు..... అయిదులో నాలుగు"
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    
    "అవును అయిదులో నాలుగు."
    
    "రెండుపది రెండు పదిహీను అంటూ బ్లాక్ మార్కెట్ టిక్కెట్స్ రేట్లు గురించి మాటాడినట్టుకాక విషయాన్ని సూటిగా చెప్పడం బెటరు"
    
    రాజారాంగారి అసలు పేరు రాములు అయితేరాములు పేరుతో ఆయనబ్రతికే రోజుల్లో సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునేవారు.......
    
    "నేనసలే ప్రాక్టికల్ మనిషిని" హుంకరింపులా అరిచాడాయన...... (ఇక్కడ ప్రాక్టికల్ మనిషంటే అర్ధం తనగతాన్ని గుర్తుచేసి ఎద్దేవాచేస్తే ప్రాక్టికల్ గా కాలో చెయ్యో తీయించేస్తానని చెప్పడం....... గతంలో ఓ గూండాగా కూడా బ్రతికినరాములు ఉరఫ్ రాజారాంగారు యిప్పటికీ గూండాలతోనే పరిపాలన కొనసాగిస్తున్నవాడు.)
    
    "అంచేతనేను చెప్పేదేమిటంటే......." ఎదురుగా కూర్చున్న రిపోర్టర్స్ లో బ్లాక్ మార్కెట్ అన్న మనిషెవరా అని గుర్తించే ప్రయత్నం చేస్తూ పాయింటుకి వచ్చాడు......
    
    "అయిదులో నాలుగు అంటే అర్ధం.......నిన్న రాత్రి నగరంలో అర్ధరాత్రి స్వేచ్చగా నడవాలని ప్రయత్నించిన అయిదుగురిలో నలుగురు రేప్ చేయబడ్దారని......."
    
    ఉలిక్కిపడ్డారంతా......
    
    "మీకెలా తెలుసు?" ఓ ఇంగ్లీషు దినపత్రికరిపోర్టర్ అడిగాడు.
    
    "ఆ అయిదుగురూ ప్రస్తుతం ఇదిగో ఈ పక్క గదిలోనే ఉన్నారు కాబట్టి......"
    
    తమముందున్న రాజకీయనాయకుడు ఓ చిత్రమైన వ్యక్తిగా తెలుసుకాని యింత విచిత్రమైన మనిషిగా తెలుసుకున్నక్షణమది.....
    
    పియ్యేకేసి చూశాడు చీఫ్ మినిస్టర్.......
    
    అరనిముషం వ్యవధిలో అయిదుగురు అమ్మాయిలు పత్రికా విలేఖర్ల ముందుకొచ్చి నిలబడ్డారు......
    
    ఈ ప్రదర్శన ఏమిటో ఎవరికీ తోచలేదు.
        
    పైగా సిగ్గుపడాల్సింది పోయి ఓగొప్ప నిర్వాకంలా తమముందుకురప్పించడం మరింత ఆశ్చర్యం కలిగించింది.
    
    అదికాదు......
    
    సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై అయిదేళ్ళలో వున్న అమ్మాయిల్లో ఓ అఘాయిత్యానికి గురైన ఛాయల్లేవు.
    
    "ఈమెపేరు అనసూయ ........ ఇందాక మీకుచెప్పిన సంఘటనలో నలుగురి చేత ఒకేసారి రేప్ చేయబడిన యువతి......"
    
    అదోపరిచయంలా చిరుగర్వంతో నమస్కరించింది.
    
    "మిగతావాళ్ళపేర్లు లక్ష్మి, సుజాత, సీత, సావిత్రి ....... కాకపోతే ఈ నలుగురిలో మానభంగం కాకుండా వెనక్కి రాగలిగింది సావిత్రి...... అంటే వెళ్ళినఅయిదుగురిలో నలుగురుమానభంగానికి గురికాగ సావిత్రి మాత్రం క్షేమంగా గమ్యానికి చేరింది"
    
    "గమ్యమేమిటి...... చేరడమేమిటి" ఓ విలేఖరి ఇక నిగ్రహించుకోలేకపోయాడు.
    
    "అర్ధరాత్రయినా ఆడది స్వేచ్చగా తిరిగితే తప్ప యీ దేశానికి నిజమైనస్వతంత్రం వచ్చినట్టుకాదూ అన్నారు గాంధీగారు....." ముఖ్యమంత్రి గుర్తుచేశారు సవినయంగా.
    
    "అయితే".
    
    "అందుకోసం బ్రోతల్ హవుస్ లో నుంచి అయిదుగురు అమ్మాయిల్ని ఎన్నుకుని నగరంలో అర్దరాత్రి వేళనడిచి రమ్మన్నాను"
    
    "వ్వాట్" కోరస్ లా అరిచారు విలేఖర్లంతా.
    
    "కంగారుపడకండి, నేనసలే ప్రాక్టికల్ మనిషినిగా ...... అందుకే పూర్వం చక్రవర్తులు అర్ధరాత్రి మారువేషాల్లో నగర సంచారం చేయించినట్లు సంసార స్త్రీల్లా
    
    యీఅయిదుగుర్నీ పంపి......."
    
    "హారిబుల్....." అప్రతిభుడిలా అన్నాడు విలేఖరి"ప్రాక్టికాలటీ అంటేయిలాంటి దారుణమా?"
    
    "కాదు" బలంగా వక్కాణించారు ముఖ్యమంత్రి" ఈ విధంగా గాంధీగారు చెప్పిందాంట్లో ఎంత శాతం నిజముందో తెలుసుకున్నాను"
    
    "ఏమిటానిజం......"
    
    "అన్నిరాష్ట్రాలలో నూరుశాతం మానభంగాలు జరుగుతుంటే నాపాలనలో ఎనభై శాతమే జరుగుతున్నాయి ..... అంటే ఇరవై శాతం మనభంగాల్ని నేను నివారించగలిగానని అర్ధం" అయిదుగురిలో ఓ సావిత్రి క్షేమంగా తిరిగి రావడంతో ఎంత శాంతి భద్రతలు కాపాడబడుతున్నదీ మేథమేటికల్ గా వివరించాడు. వెంటనే సదరు వేశ్యలకి బోనస్ కూడా యిచ్చి పంపించమనిపియ్యేని ఆదేశించాడు...
    
    అయిదుగురూ వెళ్ళాక"అంచేతసోదరులారా"
    
    ఇరవైశాతంతో సంతృప్తి పడనినేను ముందుగా అసమర్ధుడైన డి.జి.పి. కి ఉద్వాసన చెప్పాను...... యింకా" అంటూ ఆగేరు క్షణం.
    
    "సెలవివ్వండి"

 Previous Page Next Page