Previous Page Next Page 
వెలుగుబాట పేజి 35


    
    "పెళ్ళీ! పెళ్ళేమిటి? అతడంటే ఈ అమ్మాయికి రోత అంటుంటే ఇంకా పెళ్ళి అంటావేమిటి? నువ్వూ నూకాలమ్మలాగే ఆలోచిస్తున్నావా?"
    చురుక్కున తగిలింది ఆ మాట! అవును, తను నూకాలమ్మలాగే ఆలోచిస్తోంది. తనే కాదు, ఈ నాటి  అత్యాధునిక సమాజం ఆలోచించటానికి ఇంకా ఎన్ని తరాలు గడవాలి.
    "కుమార్! నువ్వు నూచించే పరిషార్కము ఏమిటి?"
    "ఈ అమ్మాయి హాస్టల్ వుండి చదువుకుంటుంది. ఆ చదువుకయ్యే ఖర్చంతా సుబ్రహ్మణ్యమే  భరించాలి. ఆ తరువాత నర్స్ ట్రైనింగ్ అయ్యాక లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుంది. తనకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంటుంది."
    రాధ కళ్ళు తళుక్కున మెరిసాయి. ఆ గదిలో అడుగు పెట్టిన ఇంతసేపటికి ఆమె ముఖంలోకి కొత్త వెలుగు వచ్చింది. ఝాన్సీ మాత్రం "ఇదంత తేలిగ్గా  జరిగేది కాదు కుమార్! లోకమంతా కుమార్ లే  అనుకోకు. ఏ తప్పూ చేయని ఈ అమయాకురాలి గతం ఈమెను నీడలా వెన్నంటి బాధిస్తూనే వుంటుంది" అనుకుంది. ఏది ఏమైనా, రాధని ప్రస్తుతం చదువులో పెట్టడమే మంచిదని ఝాన్సీ కూడా ఒప్పుకుంది. స్త్రీలయినా, పురుషులయినా మొదట తమ ఒప్పుకుంది. స్త్రీలయినా, పురుషులయినా మొదట తమ కాళ్ళమీద తాము నిలవాలి. ఆ తరువాతే , మిగిలిన సమస్యల పరిష్కారం ముందు రాధ మనసు తెలుసు కున్నాక ఆ తర్వాత నూకాలమ్మని సుతరామూ ఒప్పుకోలేదు "నా కూతురు చెడిపోయిందని అందరూ దుమ్మెత్తి పోయ్యరా?" అంది. దాన్నెవడు పెళ్ళిచేసుకుంటాడ"ని నిలదీసింది. "పుట్టబోయే బిడ్డ బ్రతుకుమాత్రం అన్యాయమయిపోదా?" అని లబలబ లాడింది.
    కుమార్ ఆమెని శాంతపరిచి నచ్చజెప్పాడు. "సుబ్రహ్మణ్యం చెవులుపిండి అతడిని నీ కూతురితో కాపురం చేయించటం అతి తేలిక. కాని, నువ్వు సంఘం, పరువూ- నీతీ వీటినిగురించి ఆలోచించక, నీ కూతురి గురించి ఆలోచించు మొదట రాధకీ అతనితో ఉండటం ఇష్టంలేదు. రెండోది బలవంతాన ఉన్నా, ఒక భార్యని మోసం చేసిన వాడు, రెండో భార్యని మోసం చెయ్యడని ఏముంది? అప్పుడు మాత్రం రాధగతి ఏంకావాలి?, మరో ముగ్గురు పిల్లలతో  వీధిన పడటం తప్ప నిజంగా నీ కూతురి మేలు కోరే దానివయితే, అతడు నీ బిడ్డని ఏలుకోవాలని గాక, రాధ చదువుకయ్యే ఖర్చంతా అతనే భరించాలని పేచీ పెట్టు-" అన్నాడు.
    కుమార్ మాటలన్నింటిలో 'ఒక భార్యని మోసం చేసినవాడు, రెండో భార్యని మాత్రం మోసం చెయ్యడని ఏముందీ?" అన్న మాటలు నూకాలమ్మ మనసులో బాగా  నాటుకున్నాయి. భయంగా అయోమయంగా చూస్తూ, "మీ దయ  బాబూ! మీ కేది మంచిదనితోస్తే అది చెయ్యండి-" అని దండం పెట్టేసింది.
    కన్నీళ్ళతో ఆ అమాయకురాలీని చూస్తే ఎంతో జాలి వేసింది ఝాన్సీకి. సంఘాన్ని ఎదిరించలేదు. చూస్తూ చూస్తూ కన్న కూతుర్ని నరకంలోకి తొయ్యలేదు.
    రాధతోనూ నూకాలమ్మతోనూ ఒక అవగాహనకు వచ్చిన తరువాత, అప్పుడు సుబ్రహ్మణ్యశాస్త్రిని పిలిపించాడు కుమార్. రాధని పెళ్ళిచేసుకున్నట్లు, నూకాలమ్మ దగ్గర ఫోటోలతో సాక్ష్యం వుందిగనుక  నూకాలమ్మ కోర్టుకి వెళితే తన ఉద్యోగమే పోతుంది కనుక, రాధను భార్యగా అంగీకరించటానికి బదులు రాధ చదువుకయ్యే ఖర్చు భరించటానికే సంతోషంగా ఒప్పుకున్నాడు శాస్త్రి. రాధకు పుట్టబోయే బిడ్డ గురించి అతడు ఆలోచించనే లేదు. నాగమాంబకున్న సంతానాన్ని గురించి పట్టించుకుంటున్నాడు గనుకనా?!

                                                              *    *    *


    కుమార్ ఆస్పత్రిలో అచ్చమాంబ దగ్గర దగ్గర నేల రోజులుంది ఈ నెలరోజులూ ఆమెను ప్రత్యేక శ్రద్ధతో చూశాడు కుమార్. మేరీ బాలయ్యలు కూడా ఆవిడ బాధతో ఏ కాస్త మూలిగినా, వెంటనే ఆవిడ దగ్గరకువచ్చి ఏమికావాలో చూసేవారు. చెమ్మగిల్లిన కళ్ళతో కుమార్ రాగానే రెండుచేతులూ జోడించేది అచ్చమాంబ. "ఛ! ఛ! యేమిటండీ ఇది! మీరు నాకు నమస్కారం చెయ్యటం యేమిటి?" అని ఆప్యాయంగా జోడించిన ఆ చేతులను విడదీసేవాడు. ఝాన్సీ గవర్నమెంట్ ఆస్పత్రిలో డ్యూటీ అవర్స్ లో మాత్రం వుండి, మిగిలిన సమయమంతా తల్లి దగ్గరే వుండేది. నాగమాంబ ఇంట్లో వంట మాత్రం చేసి, కారియర్ తీసుకుని ఆస్పత్రికి వచ్చేసేది. చాలా సార్లు కుమార్, నాగమాంబ, ఝాన్సీలు కలిసి భోజనం చేసేవారు.
    అచ్చమాంబ పూర్తిగా కోలుకుంది ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. బరువు పనులు చేయొద్దనీ, అనవసరపు ఆందోళనలు పెట్టుకోవద్దని మరీ మరీ చెప్పాడు కుమార్.
    నాగమాంబ అసలు భర్తతో మాట్లాడటం లేదు. భోజనం చెయ్యమని కూడా అడగటంలేదు. అతడే పెట్టుకుని  తింటున్నాడు. అచ్చమాంబ ఇంటికి వచ్చిన తరువాత ఒక రోజు "ఇక్కడ  వున్నది చాలుగాని, ఇంటికి బయలుదేరు" అన్నాడు భార్యతో.
    నాగమాంబ చీదరగా చూసి, నేను ఎక్కడికీ బయలుదేరాను" అని చెప్పింది ఖచ్చితంగా.
    "అదేమిటి? ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళని వుంటాం?"
    "అదే నేనూ చెప్పబోతున్నాను. ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళిని వుంటారు? వీలయినంత త్వరలో బయలుదేరండి"  పరమ నిర్లక్ష్యంగా అంది. భార్య నిర్లక్ష్యాన్ని భరించలేని శాస్త్రి తనకు అలవాటయిన ధోరణిలో ఉగ్రరూపం ధరించి "ఏమిటే ఆ పెడసరపు ధోరణి? నన్నే ఇంట్లోంచి పొమ్మంటున్నావా?" అన్నాడు.

 Previous Page Next Page