Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

   

     ఒకసారి ఒకమ్మాయి రాత్రిపూట చాలాసేపు బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూనే ఉందట. తెల్లవారుజామున వాళ్ళ బంధువులెవరో వచ్చి చెప్పారుట ఆ అమ్మాయి తల్లికి సీరియస్ గా వుందని. ఆ విషయం చెప్పడానికి ఎస్.టి.డి చేస్తే రాత్రంతా లైన్ దొరకలేదని! ఈ అమ్మాయి బయల్దేరి వెళ్ళేసరికి ఆవిడ పోయిందట కూడా. ఫోన్ తరువాత అలాటి విశేషాంశం చీరెలు.
   
    హాస్టల్ కి చీరెలమ్ముకునే అబ్బాయి ఒకడు వస్తుంటాడు. తెగ వాగుతుంటాడు. బాంబేనించి, అహ్మదాబాద్ నించి తెచ్చానంటాడు. అతిమామూలు చీరెలే అయినా అమ్మాయిలు ఎగబడి కొనుక్కుంటారు. ఇన్ స్టాల్ మెంట్ లో డబ్బు కడతారు. మర్నాటినుంచీ  డబ్బుల్లేవని అందర్నీ అడుగుతూ కనిపిస్తారు.
   
    భోజనం విషయంలో మాత్రం చాలామంది సఫర్ అయ్యేవారే. ఆ పల్చటి రసాన్ని చూసి నీరసపడి, తినకుండానే గుడ్లనీరు కుక్కుకుని బయటకు వస్తారు. డబ్బున్న అమ్మాయిలు అప్పటికప్పుడు హోటళ్ళకి వెళ్ళి తిని వస్తారు. మిగతావాళ్ళు ఆ వయసులో శరీరానికి కావలసిన పోషక పదార్ధాలు లేక నీరసపడిపోతారు.
   
    కిరణ్మయి మరో విషయం గమనించింది.
   
    చదువు విషయంలో మాత్రం చాలామంది తగిన శ్రద్ద తీసుకోవడం లేదు. మామూలు రోజుల్లో సరదాగా గడిపేస్తుంటారు. పరీక్షలు వచ్చినప్పుడు రాత్రీ, పగలూ కష్టపడతారట. దానికంటే క్రమశిక్షణతో రోజుకో రెండు గంటలు చదువుకి కేటాయిస్తే ఎంత బావుంటుంది అనుకుంది.
   
    క్లబ్ రూంలో టి.వి. ఉంది. అన్నిరకాల మ్యాగజైన్స్ వస్తాయి. చిత్రహార్, చిత్రలహరి, సినిమాలకు, సినిమా పత్రికలకున్న డిమాండు విజ్ఞానదాయకమైన ప్రోగ్రాంలకు లేదు. సాయంత్రం నాలుగయ్యేసరికి హాస్టల్ చాలా సందడిగా వుంటుంది. అందరూ చక్కగా తయారవుతారు. సినిమాలకు, షికార్లకు వెళతారు. బయట మైదానంలో కొంతమంది అమ్మాయిలు, వాళ్ళ బోయ్ ఫ్రెండ్స్ తో సందడిగా వుంటుంది. మరికొందరమ్మాయిలు పుస్తకాలు పట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ ఆ జంటలని గమనిస్తుంటారు.
   
    హాస్టల్ గురించి ఇన్ని వివరాలు సేకరించగలిగింది కాని అపురూపలక్ష్మి గురించి గాని, ఆమె ఆత్మహత్య గురించి కాని ఎలాంటి సంభాషణా కిరణ్మయి చెవిన పడలేదు. వాళ్ళంతా ఆ విషయన్ని పూర్తిగా మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. ఎలా తన పరిశోధన కొనసాగించడం? అనుకుంది.....
   
    .......ఆ మరుసటి రోజు ఆమెకి అనూరాధ యాదృచ్చికంగా కలిసింది.
   
                                   *    *    *
   
    ప్రతిరోజూ తెల్లవారుజామునే 'మోర్నింగ్ వాక్' చేయటం కిరణ్మయికి అలవాటు. హాస్టల్లో అయితే, వెనక తోటలో పచార్లు చేసేది. తనింకా ఇక్కడ ఎంతకాలం వుండాలో, ఏం చెయ్యాలో ఆమెకి అర్ధంకావడంలేదు. ఆలోచనల్లో పడి కిరణ్మయి తోటలోకి వచ్చిన అమమయిని వెంటనే గమనించలేదు. అప్పుడప్పుడే విచ్చుకుంతున్న్ వెలుగురేఖల్లో అస్పష్టంగా కనిపించిందా ఆమ్మాయి. ఆమెకూడా తనను చూసి ఆగిపోయినట్లు గమనించింది కిరణ్మయి.
   
    "ఎవరిది?" అడిగిందా అమ్మాయి అనుమానంగా.
   
    "నా పేరు కిరణ్మయి. మెరు నిన్న ఇందూ గదికి వచ్చారు కదూ" అని అడిగింది.
   
    "అవును. నా పేరు అనూరాధ. రూం నెంబరు ట్వంటీ టూ."
   
    "నేను వచ్చి వారం దాటింది."
   
    "నేను ఊరెళ్ళి నిన్ననే వచ్చాను. బి.యస్.సి చదువుతున్నాను. మీరు?"
   
    "నేను ఎమ్. ఫిల్ లో చేరడానికి వచ్చాను. మీకు కూడా మార్నింగ్ వాక్ అలవాటా?" అడిగింది కిరణ్మయి.
   
    "అంతగా అలవాటు లేదు. రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. అందుకే ఇలా తిరుగుదామని వచ్చాను" అంది అనూరాధ. లేత వెలుగులో ఆమె కళ్ళలో మళ్ళీ విషాదం కదలాడింది. ఈమె అపురూపలక్ష్మి స్నేహితురాలు. ఈమెద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చుననే ఆలోచన కలగ్గానే కిరణ్మయి ఆమెతో చనువుగా మాట్లాడటం మొదలు పెట్టింది. కానీ అనూరాధ ఏమీ సహకరించలేదు. మాటల్ని మధ్యలో త్రుంచేసి అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
   
    సరిగ్గా అప్పుడే ట్రాన్సిష్టరులోంచి వార్తలు మొదలయ్యాయి. భారత, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆ రోజే కాన్పూరులో మొదలవ బోతోంది.
   
                                 *    *    *
   
    తొమ్మిది గంటలయ్యేసరికి కిరణ్మయి రెడీఅయి క్లబ్ రూంలో టి.వి. దగ్గర కూర్చుంది. క్రికెట్ అంటే ఇష్టం వున్న అమ్మాయిలు వస్తారు. సహజంగా రాయన్నను చూడగానే లక్ష్మి టాపిక్ వస్తుంది. వాళ్ళేం మాట్లాడుకుంటారో వినాలని వెనకపక్క ఓ మూలగా కూర్చుంది కిరణ్మయి.
   
    మ్యాచ్ మొదలైంది. భారతజట్టు ఫీల్డింగ్ చేస్తున్నారు. పద్నాలుగో ఓవర్ రాయన్న బౌల్ చేయటానికి వచ్చాడు. క్లోజ్ అప్ లో అతడిని చూస్తుంటే ఒకప్రక్క సంతోషం, మరోవైపు చెప్పలేని ఉద్వేగం. ఇదో కొత్త అనుభవం. క్రికెట్ గురించి ఆమెకంత బాగా తెలీదు. కాని రాయన్న ప్రతి కదలికనూ చూసి ఆనందించగలుగుతోంది. ఎంతగా ఆటలో లీనమయినా ఏ క్షణంలో పోలీసులనించి పిలుపు వస్తుందోనని అతడు మధనపడుతోనే వుంటాడు. దగ్గరుండి ధైర్యం చెప్పగలిగే అవకాశం లేకపోయింది.
   
    ఆశ్చర్యకరంగా మ్యాచ్ చూడడానికి మధ్యాహ్నం దాకా ఎవరూ రాలేదు. లంచ్ తర్వాతకూడా వంటరిగానే కూర్చుని చూస్తోంది కిరణ్మయి ఎవరో గదిలోకి వచ్చినట్లు అలికిడై తలతిప్పి చూసింది. అనూరాధ కిరణ్మయి స్నేహపూరితంగా నవ్వింది. అనూరాధ నవ్వులో జీవంలేదు. ఆమె కళ్ళు టి.వి. స్క్రీన్ మీద రాయన్నమీద కేంద్రీకరించుకుపోయాయి. అయితే ఆమె కళ్ళలో కోపంలేదు. బాధ వుంది. అసహ్యం లేదు. వేదన నిండిన కళ్ళు పగ అంతకన్నా లేదు. అసహాయత ఉంది.
   
    "స్కోర్ నూటపది, రెండు వికెట్లు పడ్డాయి! కపిల్ ఒకటి, రాయన్న ఒకటి తీసుకున్నారు" అంది కిరణ్మయి మాటలు కలుపుతున్నట్లు.
   
    "ఆహా" అంది అనూరాధ పొడిగా ఆమెతో సంభాషణ ఎలా కొనసాగించాలో అర్ధంకాలేదు కిరణ్మయికి.
   
    "మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా?" అడిగింది.
   
    "ఇష్టమే" అంది. కిరణ్మయి మరేదో అడగబోయేంతలో సడన్ గా లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనూరాధ. ఆమెకు రాయనన బాగా పరిచయం అని అర్ధమవుతోంది. ఆమెతో మాట్లాడాలని చాలా ఆరాటంగా వుంది కిరణ్మయికి. అరగంట దాటినా ఆమె తిరిగి రాకపోయేసరికి కిరణ్మయి లేచి టి.వి. కట్టేసి ఇరవై రెండో నెంబరు గదిలోకి నడిచింది.
   
    అనూరాధ దిండులో తలదూర్చుకుని పడుకునుంది. కిరణ్మయి గదిలో కెళ్ళింది. ఆమె వూహించినట్లుగా అనూరాధ ఏడవటంలేదు. నిద్రపోతోంది. పక్కనే టేబుల్ మీద కాంపోజ్ టాబ్లెట్లున్నాయి. రెండు వేసుకున్నట్లుగా పక్కన ఖాళీ కాగితం చెపుతోంది.
   
    కిరణ్మయి నిరాశగా తన గదిలోకి వెళ్ళిపోయింది.
   
    ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు.
   
    అనూరాధని తన 'మౌనం' లోంచి బయటకు లాగటం ఎలాగో అర్ధంకాలేదు. హాస్టల్ లో మిగతా అమమయిలు కూడా ఈ హత్య గురించి పూర్తిగా మాట్లాడుకోవటం మానేశారు. కిరణ్మయికి వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అర్ధమైంది. ఎంత త్వరగా ఎగ్జయిట్ అవుతారో అంత త్వరగా మరిచిపోతారు కూడా.
   
    వాళ్ళని మళ్ళీ కదపాలంటే - ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి?
   
    ఆ రాత్రి తెల్లవారుతుండగా - ఏం చెయ్యాలో ఆమెకు తట్టింది.
   
    ఆ మరుసటిరోజు ప్రొద్దున్నే ఆమె వెళ్ళి లాయర్ వెంకటరత్నాన్ని కలుసుకుని మాట్లాడింది. పట్టులో తేనెవుందో లేదో తెలుసుకోవాలంటే ముందు కందిరీగల్ని కదిలించాలి కాస్త కష్టమైనా సరే.
   
                             *    *    *

   
    సాధారణంగా ఆదివారాలు హాస్టల్లో తొమ్మిదింటికిగాని తెల్లవారధు. కానీ ఏడుగంటలకే పెద్దగా గోల, హడావుడి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్డెన్ స్వరం గేటు బయటికే వినిపిస్తోంది. కిరణ్మయి, అనూరాధ మార్నింగ్ వాక్ నించి తిరిగివస్తున్నారు.
   
    "ఆదివారంనాడు వార్డెన్ పొద్దుటే భర్త, పిల్లల్నీ వదలి వచ్చిందంటే కొంపలు మునుగుతున్నాయన్నమాటే. ఏమిటో చూద్దాంపద" అంది అనూరాధ.
   
    హాస్టల్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. వార్డెను ఆఫీసురూమ్ తెరిచి వుంది. అంతా నీట్ గా సర్దేశారు. వార్డెనుమాత్రం అక్కడ లేదు. అంట్లగిన్నెలు బయట పడేసిన వాళ్ళమీద అరుస్తోంది.
   
    "ఏమిటో మన అదృష్టం. ప్రధానమంత్రిగాని వస్తున్నారా మన హాస్టల్ కి?" అడిగింది అనూరాధ నిలబడ్డ అమ్మాయిని.
   
    "అదేం కాదులే అపురూపలక్ష్మి హత్య విషయంలో ఎంక్వయిరీ చేయడానికి లాయర్ ఎవరో వస్తున్నారట" అందా అమ్మాయి. అనూరాధ ముఖం మాడిపోయింది.
   
    "కిరణ్మయీ, ఈ రోజు మన పిక్చర్ ప్రోగ్రాం కాన్సిల్ చేద్దాం. నేను మా బంధువులింటికి వెళ్ళాలి. మర్చిపోయాను" అంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra