Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 31

ఏదో కలలోంచి తెప్పరిల్లుతున్నదానిలా జలజని చూసింది అణు ఆమె మాటలు నిజమే పెళ్ళైన దగ్గర్నుంచి తనాశించిన దానికి విరుద్దంగా మానసికంగాను, శారీరకంగాను కూడా విపరీతమైన శ్రమని ఎదుర్కోవలసివచ్చింది. శక్తి మించిన శ్రమ తన విగ్రహాన్ని, వివేకాన్ని, ఆలోచనా శక్తిని తగ్గించిందేమో?
"ఇంతకీ నే నెందుకు వచ్చానో, ఆ విషయం అడగవెం?"
"నన్ను చూడ్డాని కొచ్చుంటావు."
"తప్పు, నిన్ను చూడ్డానికి నేను రాను. ఎందుకంటె నన్ను చూడ్డం వల్ల నీకు అనండం కలగదని నాకు తెలుసు కనుక......పని కట్టుకుని నిన్ను ఉల్లాస పరచడానికెలా ప్రయత్నించనో, అలాగే పని కట్టుకుని నీ మనసు గాయపరచి, ఏడిపించటానికి కూడా ప్రయత్నించను. "జలజ ఫ్రాంక్ నెస్ కి దిమ్మెరపోయింది అణు. జలజ వ్యక్తితాన్ని హర్షించినా హర్షించలేకపోయినా యీ ఫ్రాంక్ నెస్ కి మాత్రం మెచ్చుకోకుండా వుండలేకపోయింది
"సరే ఎందుకోచ్చావో చెప్పు" అంది చిరునవుతో.
"అమ్మయ్య! ఇన్నాళ్ళకి నేను చూడాలనుకున్న చిరునవ్వు నీ మోహంలో చూడగలిగాను. ఇహ నీతో స్నేహం చేసినా చేయలేక పోయినా ఫ్రీగా మాట్లాడేయగలను. మీ భర్త గారికి సంబంధించిన ఓ సమాచారం మోసుకొచ్చాను నేను. కాకీ యూనిఫాం గుండా కాగితం యిచ్చి పోయిన దగ్గిరనుంచి విలవిల్లాడిపోతున్నాడు జీవన్. పోలీసులకి చేస్తే అవతలి వాళ్ళు నిజంగా ఏ కిరాతకానికి పాల్పడతారో అనే భయంతో షెర్లాక్ హోమ్స్ లాగ లేదా యుగంధర్ లాగో తనే భయల్దేరి రాగని ఎక్కడ దాచారో తెలుసుకుని తీసుకు రావాలనుకుంటున్నాడు. ఈ డాన్ కిగ్జోట్ గారు ఒకసారి చావుతప్పి కన్ను లొట్టబోయి తప్పించుకున్నారు. ఈసారి వాళ్ళు ప్రాణాలతో వదలరు."
ఆందోళన దాచుకోలేక పోయింది అణు.
"వద్దని చెప్పలేకపోయావా?" అంది. వెంటనే జలజ నవింది.
"నేను శరత్ బాబూ హిరోయిన్ అనుకున్నావా?" నా మాటవిని వొట్టు పెట్టుకోవడానికి. అతడు వెళ్తే నాకేం , ఉంటె నాకేం. ఇందాక నువన్నట్లు నన్ను సినిమాకి తీసుకెళ్ళడానికి జీవన్ కాకపోతే మరొకరు దొరుకుతారు ఆ సమయానికి."
చెయ్యి వూపి టాటా చెప్పి వెళ్ళిపోయింది.
స్తబ్దంగా కూర్చుండిపోయింది కొన్ని క్షణాలు అణువేద. జలజని అభిమానించినా , అభిమానించ లేకపోయినా, ఆమె మాటల్లోని చేదు నిజాలను, ఆమె వివేకం కాదనలేకపోతోంది నిజమే! "ఆధునికత" అనే డానికి సరిహద్దు రేఖలు ఎవరు నిర్ణయించగలరు? మనకేం కావాలో మనం చక్కగా ఆలోచించుకుని స్థిరంగా నిర్ణయించుకుని ఆ ధ్యేయంతో ముందుకు సాగాలి.
"నాకేం కావలి?" తనని తను ప్రశ్నించుకుంది అణువేద నిజాయితితో.
"నా భర్త, నా పాప" టక్కున సమాధానం చెప్పింది మనసు. ఒకాసారి తనతో తను రాజీ పడిపోయాక, పరిస్థితులతో రాజి పడటం అంత కష్టంగా తోచలేదు అణుకి. సమస్యల నేదుర్కోవడం వాటిని నిదానంగా వివేకంతో పరిష్కరించుకుంటూ రావడం ఆమెకి కొత్తగాదు. రాగ కోసం మనసు సలసల కాగుతున్న నూనెల మరుగుతున్నా చీర మార్చుకుని హాస్పిటల్ కి బయలుదేరింది.
స్పెషల్ రూమ్ లో బెడ్ మీద జీవన్ లేడు. గుండె లయ తప్పింది. హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ ని అడిగితే అతడు ఖంగారు పడి నర్సుల నడిగాడు. వాళ్ళు తెలియదన్నారు. కుర్చీలో కూర్చుని రెండు చేతుల చూపుడు వ్రేళ్ళతో కణతలు నొక్కుకుంది అణు. జీవన్ కోసం కూడా పోలీసు రోపోర్టు యివాలా? అంత చికాకులో తనలో తను నవ్వుకుంది. నర్సుని పిలిచి అయన పరిస్థితి ఎలా వుంది? ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా చెప్పారా?" అని అడిగింది నిజానికి ఆ నర్సుకి జీవన్ పరిస్థితి ఎలా వుందో తెలియదు. కాని చాలా మంది లాగ ఆ నర్సు తనకి తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోలేదు. " అస్సలు లేవకుండా వున్నారు ఎవరో అమ్మాయి ఆయనతో వుందిగా! ఆవిడతో వెళ్ళారేమో?" అంది.
గతుక్కుమంది అణు. జలజ ఏమిటో ఇప్పటికి తనకి బాగా తెలియబట్టి గాని, లేకపోతే ఆమాటలు నమ్మేసి ఉండేది.
స్త్రీ పురుష సంబంధాల విషయంలో లోకమంతా యించుమించు ఒక్కలాగే ఆలోచిస్తుంది. నర్సుతో వాదించడం ఇష్టం లేక మాట్లాడలేదు. హాస్పిటల్ లో వుండి చేసేదేమిటని యింటికి బయలుదేరబోతుండగా ఒంటినిండా కట్లతో బాగా అలసిపోయి వడలిపోయిన ముఖంతో చేతిలో భ్రీఫ్ కేస్ తో వచ్చాడు.
"ఒంట్లో ఇలా వుండగా ఎక్కడికెళ్ళారు?" అడిగింది. ఆ గొంతు వినగానే కొండంత దైర్యం వచ్చింది జీవన్ కి. చాలా రోజులైంది అణు గొంతు అలా విని. ఇటివల కాలంలో ఆ స్వరంలో వచ్చి చేరిన మంచుగడ్డలు కరిగిపోయాయి. మాటలకి మధ్య అడ్డుగా వున్న ఇనపతెర చిట్లిపోయింది. కసురుకున్న తల్లి తిరిగి లాలించి నప్పుడు పసిపాప నవినట్లుగా నవాడు.
"డబ్బు కోసం బయల్దేరాను. ఆ వెధవకి కావలసింది డబ్బు అది వాళ్ళకిచ్చేసి, రాగని తీసుకొచ్చేస్తాను.'
"డబ్బు తెచ్చారా? ఎక్కడిది?"
"పాతికవేలు ఆ హుమేషాగాడు రాగని వొదిలేస్తాడు."
"డబ్బు ఎక్కడిది?" మళ్ళీ అడిగింది.
వెలవెలబోతూ చేసిన తప్పు ఒప్పుకుంటున్న ధోరణిలో "అప్పు తెచ్చాను వర్క్ షాప్ తాకట్టు పెట్టి......"
నోటమాట రాలేదు అణుకి. అప్పులు, అప్పులు....అప్పులు ఎలా తిర్చగలమన్న ఆలోచన లేకుండా సునాయాసంగా అప్పులు చేయడం ఇతనికి బాగా అలవాటైపోయింది. ఆ వర్క్ షాప్ ఇతనితో ప్రారంభింపజేయడానికి అణు ఎన్ని ప్రయాసలు పడిందో జీవన్ కి తెలుసు. అయినా ఆ విషయాలేవీ ఆలోచించడు. ఆ మాట కొస్తే ఏ విషయము ఆలోచించడు. ఇతనితో వాదించి ప్రయోజనం లేదు. నిట్టూర్పు అణచుకొని "డబ్బు తీసికెళ్తే మాత్రం వాళ్ళు పాపని వొదులుతారని నమ్మకమేముంది? వాళ్ళు క్రిమినల్స్ మనోహర్ గారికే ఈ విషయం ఒదిలి పెడితే అయన ఏదో ఒక వుపాయం ఆలోచిస్తారు."
"ఆ ఉత్తరం నువు చదవలేదా? పోలీసులకి చెప్తే రాగనే కాక, నిన్ను కూడా నాశనం చేస్తానన్నాడువాడు."
తనకోసం ఆరాటపడుతున్న భర్తని చూసి ఆప్యాయంగా నవింది." ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఆ బ్రీఫ్ కేస్ ఇలా యివండి. డబ్బు ఎక్కనుంచి తెచ్చారో ఆ వివరాలు కూడా ఇవండీ."
బుద్దిమంతుడైనా పిల్లాడిలా బ్రీఫ్ కేస్ అణుకి యిచ్చేసాడు. "ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను" అని అణు నోట వినగానే కొండంత దైర్యం వచ్చేసింది జీవన్ కి. అణు తలచుకుంటే ఏదైనా సాధించగలదని అతనికి గట్టి నమ్మకం. గుండాల చేతుల్లోంచి రాగ తప్పించుకు వచ్చేసినట్లే స్థిమిత పడిపోయాడు. మనసులో రంపపు కోతని అనుభవిస్తూ కూడా కళ్ళల్లో దైన్యాన్ని వెనక్కి నెట్టుకుంటూ కర్తవ్యాన్ని నడుం కడుతోన్న అణుని చూసి అతడాక్షణంలో పూర్తిగా కరిగిపోయాడు. అంతకు ముందు నుంచి పెరిగి పెద్దదౌతున్న పశ్చాత్తాపం నిస్సంకోచంగా బయటి కొచ్చేసింది. అణు చేతులు తన చేతుల్లోకి తీసుకుని , "ఐ అమ్ వెరి వెరి సారి అణు! అమ్మతో మొదలైన మన చికాకులు అక్కయ్య రాకతో బాగా పెరిగిపోయాయి. ఇక మీదట అమ్మని, అక్కని వేరే ఉండమంటాను. కావాలంటే వాళ్ళకి డబ్బు సహాయం చేస్తాను గాని మనతో ఉండనియ్యను" అన్నాడు.
ఇలాంటి మాటలు అతని నోట వినగలనని అణు ఎన్నడూ వుహించలేదు. పంతాలు పట్టుదలలు కొన్ని సంవత్సరాలుగా సాధించలేనిది, రెండు చల్లని మాటలు, కొద్దిపాటి అనునయం సునాయాసంగా సాధించింది. అతని క్రాఫులోనికి చెయ్యి పోనిచ్చి ఆప్యాయంగా నిమిరింది.
"త్వరలోనే కోలుకుంటారు డిశ్చార్జి అయ్యేవరకు రెస్టు తీసుకోండి. మళ్ళీ ఏ సాహసాలు చెయ్యొద్దు" బుజ్జగింపుగా చెప్పింది అణు. ఇంటికొచ్చేసరికి సూట్ కేసులు, గుమ్మం ముందు పరచుకుని ఉన్నారు రాణి అచ్చయ్యమ్మాదేవి, సులభ.
కీచుమని భయంతో అరిచిన అరుపు. అప్పటివరకూ గోడకానుకుని కూర్చుని అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న యమ్మాయమ్మ ఆ అరుపుకి లేచి కూర్చుంది. ఆ అరుపు రాగా నోటి నుంచి వెలువడింది. ఏదో ఆకారం రాగ పక్కనుంచి నాల్ల్గుకాళ్ళ మీద ముందుకి సాగిపోతోంది. అప్పటివరకు రాగకి కాపడం పెట్టిన వేడినీళ్ళ గిన్నె ఆ ఆకారం మీదికి విసిరింది యమ్మాయమ్మ "అబ్బా!" అన్న అరుపు వినిపించింది ఆ అరుపు వింటూనే ఆకారాన్ని గుర్తుపట్టింది జాన్ గొంతు అది.
"సచ్చినోడా! నీకు మా దగ్గిరేం పనిరా?" మెటికలు విరిచింది. గిన్నె మోకాటి చిప్పకి తగలడం వల్ల బాధ అణచుకోలేకపోతున్నాడు జాన్.
"అమ్మతోడు. నా మనసులో ......నేనూరికే......"
"నువు, నీయమ్మ, నీ ముఖం ఎదవ బతుక్కి వొట్లోకొటి తక్కువైయ్యాయి. నేనెవర్నననుకుంటున్నావో, నా జోలికొచ్చావంటేనా తడాఖా చూపిస్తా." నవేడు జాన్.
"నీకోసం రాలేదే వెర్రి మొగమా! చంటి పిల్లని అన్నీ దెబ్బలు కొట్టెను ఎట్టా వుందో చూద్దామనొచ్చాను"
"పోరా పెడి మొహంగాడా! నువో మనిషివి. నీకో ఆలోచన ఇంకోసారి నా ఎపు అడుగేసేవో చలిమిడి ముద్దయిపోతావు జాగ్రత్త"

 Previous Page Next Page