"ఫోఫో!" అటు తిరిగి పడుకున్నాడు జాన్ రాగ వులికిపడుతూ, ఇది వరకటి కంటే భయంతో యమ్మాయమ్మని కావలించుకుని గుండెకి తల అనిచ్చి పడుకుంది. భయం లేదన్నట్లు రాగ వెన్నుని నిమురుతూ వుండిపోయింది యమ్మాయమ్మ ఆ మిగిలిన రాత్రి ఆమె నిద్ర పోలేడు. రకరకాల ఆలోచనలు పధకాలు ఆమె మనమ్సులో అల్లిబిల్లిగా అల్లుకుంటూ తెగిపోతున్నాయి. సుబ్బయ్య బాగా అలిసిపోయే పనులు ఏం వేశాడో అతను. జాన్ మాత్రం వుండుండి దొంగచూపులు యమ్మాయమ్మ వేపు చూస్తూనే వున్నాడు.
తెల్లావారే సరిగి రాగ కొంచెం కోలుకుంది. ఆ పిల్లకి తన పరిస్థితి అర్ధమైనట్లుంది. ఏ పేచీలు పెట్టకుండా యమ్మాయమ్మ చెప్పినట్లు విని కాలకృత్యాలన్ని తీర్చుకుంది. సుబ్బయ్య ఎక్కడ్నుంచో పాలు బ్రెడ్ తీసుకొచ్చాడు. వెర్రి ఆకలితో వుందేమో వద్దు అనకుండా అవి తినేసింది. జాన్ వ్యవహారంలోకి దిగాడు.
"ఆ డాన్సరమ్మ ఇంటికాడకెళ్ళి సూసోచ్చావా?"
"ఆ! ఇంటి బయట మఫ్టిలో యిద్దరూ పోలీసులున్నారు పోలీసుచూపులు ఏ బుట్టలో వున్నానే గుర్తుపట్టగలను. దీన్ని బట్టి అక్కడ పోలీసులు హెచ్చరికలోనే వున్నారన్నమాట. మనం తొందరపడి డబ్బు కోసం బెదిరిస్తూ ఆవిడకి ఫోన్ చేసినా , వెళ్ళీ అడిగినా దొరికిపోవచ్చు కొంచెం ఆగుదాం."
"ధూత్తేరి! ఆగటం గిగటం పనికి రాదు. ఈ లోపల ఏం కొంప మునుగుద్దో ఎవడు సేప్పగలడు? ఈ లం.....కూనని అమ్మి పారేత్తాను. మన డబ్బులు మనకొస్తాయి. మనదారిని మనం పోవచ్చు."
ఆప్రయత్నంగా రాగని దగ్గరికి అదుముకుంది యమ్మాయమ్మ ఆమె చురుకైన బుర్ర క్షణాలలో ఒక ప్రణాళిక రూపొందించింది.
"పిచ్చి పనులు చెయ్యకు. ఈ పిల్ల ఫోటో అన్నీ రైల్వే స్టేషన్ లకి, అన్నీ బస్ స్టాఫ్ లకి, అన్ని పోలిస్ స్టేషన్లకి పంపించారు. కరపత్రాలు అచ్చేసి బస్సుల మీద రైలు పెట్టెల మీద , హొటల్ గోడల మీద అన్నీ చోట్ల అతికించారు. ఆ పిల్లని తీసుకుని నువు అమ్మడానికి బయల్దేరితే , నువ్వు నీతో పాటు మేము పోలీసు చేతుల్లో చిక్కుకుంటాము. ఈ పిల్ల సుఖంగా వాళ్ళమ్మని చేరుకుంటుంది. నేనో ఉపాయం చెప్తాను విను. నేనేలగోలాగ ఆ డాన్సర్ యింట్లో ప్రవేశం సంపాదిస్తాను అతి జాగర్తగా మనం కోరిన డబ్బిస్తే పాప నప్పగిస్తామని లేకపోతే ప్రాణాలకి ప్రమాదమని నచ్చజెప్తాను. ఆవిడ దగ్గర బోలెడు డబ్బుంది. ఒక్కగా నిక్క కూతురంటే ప్రేముంది అంచేత మనకి తప్పకుండా డబ్బు లోచ్చేస్తాయి. నాల్రోజులాగు."
"సరే" వెంటనే ఒప్పుకున్నాడు జాన్. అతన తొందరగా అతడొప్పుకుంటాడని ఆశపడలేదు యమ్మాయమ్మ చాలా ఆనందించింది. పాపకి స్నానం చేయించి తన ఫ్రాక్ చింపి అడ్డదిడ్డంగా కుట్టిన గౌను తొడిగింది. పాప చిరాకు పడలేదు సరికదా బుట్టలా వచ్చిన ఆ గౌను చూసి సరదాగా నవింది. తనపట్ల యమ్మాయమ్మ చూపిస్తున్న సానుభూతి , ప్రేమ ఆ లేత మనసు గుర్తించింది. అయితే ఆ ప్రేమ ఎలాంటిదో దేనికి దారి తీస్తుందో తెలుసుకునే పరిజ్ఞానం మాత్రం లేదు. తన గొను చింపి పాపకి గౌను కుట్టాక మిగిలిన బట్టలకి సూది గుచ్చేసి ఒక వారగా పెట్టి, " ఇవాళకి టైము లేదు, రేపు ఇంకొక గౌను కుడ్తాను." అని చెప్పింది. "థాంక్స్" అంది రాగ ముద్దుగా. "నేనెప్పుడైనా మళ్ళీ మా మమ్మీ దగ్గర కెళ్తే నీకు మంచి ప్రజెంట్ ఇస్తాను, " అంది. యమ్మాయమ్మ నవ్వి "ఏమిస్తావో చెప్పి" అంది.
"ఏం కావాలన్నా యిస్తాను. మమ్మీ నేనేం కావాలన్నా యిస్తుంది. మమ్మికి నామీద కోపం రాడు. వచ్చినా "సారీ" అంటే పోతుంది" యమ్మాయమ్మ జాలిగా పాపను నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. "సరే అయితే నువు మీ మమ్మీ దగ్గర కెళ్ళావు నాకు డాన్సు నేర్పుతావా?"
తెల్లబోయింది రాగ.
"నేనా? నేనేం నేర్పుతాను. మమ్మీ నేర్పుతుంది." అంది.
"నాకు మీ మమ్మీ నేర్పే డాన్సు అక్కరలేదు. నువే నేర్పాలి"
రాగ వెంటనే ఉత్సాహంగా.
"నాకు కొంచెం కొంచెం వొచ్చు కావాలంటే ఇప్పుడే నేర్పుతాను."
"నాకు ఇంగ్లీషు డాన్సు కావాలి."
"ఓ! నాకు టిస్ట్ ఒచ్చు" యమ్మాయమ్మ అవకతవకగా కుట్టిన గౌను కొసలు రెండు చేతులతోనూ పట్టుకుని ట్యూన్ సన్నగా హమ్ చేసుకుంటూ టిస్ట్ చేసింది. పిల్లలకి తమని ఎవరేనా గొప్ప చేసినపుడు అనందం మరెందులోనూ కలగదు. రాగ మొహం సంతోషంతో, గర్వమ్తో వెలిగిపోతోంది. యమ్మాయమ్మ కోరుకున్నది సరిగ్గా అదే ఆ పిల్లని దగ్గర చేర్చే శక్తి ఎలాగూ లేదు. కనీసం ఆనందంగా వుంచగలిగితే కొంతైనా మనసుకి శాంతి కలుగుతుంది.
పాప టిస్ట్ పూర్తీ చేశాక "వండర్ ఫుల్" అని పొగిడి బుజ్జగింపుగా తల నిమ్,నిమిరి , "రాగా! నేను బయటికి పని మీద వెళ్తున్నాను. సాయంత్రానికి వచ్చేస్తాను. నువు ఎక్కడికి వేళ్ళకు. వెళ్ళనని ప్రామిస్ చెయ్యి."
పాప వెంటనే ఆ చేతిలో చెయ్యి వెయ్యలేదు.
"ప్లీజ్ రాగా!....."
"నేను మమ్మికి ఫోన్ చేసి సారీ చెప్పాలి" దినాతిదీనంగా ప్రాధేయపడుతున్నట్లు అంది. ఒక్క నిమిషం ఆలోచించింది యమ్మాయమ్మ.
"నువు బయటికి ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేస్తే నేనే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి "మీ పాప మీకు సారీ చెప్పమంది" అని చెప్పోస్తాను."
"ప్రామిస్.....?"
"మరి నువు కూడా ఎక్కడికి కదలనని ప్రామిస్ చెయ్యాలి. "రాగ యమ్మాయమ్మ యిద్దరూ ఒకరినొకరు ప్రామిస్ చేసుకున్నారు రాగ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తండ్రికి లాగే రాగకి కూడా తల్లి శక్తిలో అంతులేని నమ్మకం. తను సారీ చెప్తే అమ్మకి తనమీద కోపం పోతుంది. తప్పకుండా తనని వీళ్ళ దగ్గర్నుంచి తీసుకుపోతుంది. పాపకి టాటా చెప్పి వెళ్ళిపోయింది యమ్మాయమ్మ.
వెదురు తట్ట, చేట, పూసలు మొదలినవి సంపాదించి ఎడుకులసాని వేషంలో బయల్దేరింది. ఒకపక్క జీన్సులో ఆధునికంగా కనపడుతూనే మరో వంక ఎరుకులసానికి చెయ్యి చూపించి సోదె చెప్పించుకునే వాళ్ళకి మనదేశంలోను, ఏ రాష్ట్రంలోను కొరత లేదు ఇప్పటికి నగరపు నడిబొడ్డున కూడా సోదెమ్మలు అప్పుడప్పుడు దర్శనమిస్తూనే వుంటారు. "ఆధునికురాలైన అణువేద యింట్లోకి సోదేమ్మలా ప్రవేశించగలనా అనే అనుమానం వచ్చినా ఆమెను నమ్మించగల మంత్రం తన దగ్గిరుందనే ధైర్యంతో బయల్దేరింది.
అణు మెట్లెక్కి డోర్ తెరుస్తుండగానే అత్తగారూ, ఆడపడుచు చెరో వైపు నుంచి రాగాలందుకున్నారు.
"నీకింత కష్టం వస్తుందనుకోలేదే తల్లి!" అని అత్తగారు లబదిబ లాడింది. "ఆ పసికూన ఎలా వుందో? ఏం చేస్తోందో? తిందో తినలేదో? తల్లికోసం ఎంత అలమటిస్తుందో? తలచుకుంటే గుండె పగిలిపోతోంది" అని గుండె బాదుకుంది సులభ. తలుపు తాళం తీసి లోపల అడుగు పెట్టింది. చిత్రంగా వాళ్ళిద్దరూ ఏడుపులు వింటుంటే అణు మనసులో అంతకుముందున్న దుఖం ఆవిరైపోతూ ఏదో నిర్లిప్తత ఆవహించసాగింది.
"లోపలికి రండి" అంది యిద్దరిని వుద్దేశించి శాంతంగా అణు. అంత శాంతంగా నిబ్బరంతో వుండడం తల్లి కూతుళ్ళీద్దరికి భ్రాంతి కలిగించింది. అణు వెక్కి వెక్కి ఏడుస్తునో, రోగంతో మంచంలో తీసుకుంటూనో, ఒంటి మీద తెలివి లేని దశలో కూతుర్ని పలవరిస్తునో తమకి కనిపిస్తుందనుకున్నారు వాళ్ళు.