Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

  

      సుధాకర్ అతడి చెయ్యి తీసుకుని చాలాసేపు గీతల్ని పరీక్షించి, కొంచెం సేపు కళ్ళు మూసుకుని తెరిచి, "అదృష్టరేఖ చాలా బ్రైట్ గా వుంది. తప్పక విజయం సాధిస్తారు" అన్నాడు.
   
    "కానీ గర్డిల్ ఆఫ్ వీనస్ మీద స్టార్ తయారవుతూంది కొత్తగా. అది అశుభ సూచకం కదా" సుధాకర్ విస్తుబోయి మొహంలో ఆ భావం కనిపించకుండా జాగ్రత్తపడటం గమనిస్తూ అన్నాడు. "అది నిజమే అనుకోండి, కాని ఫర్వాలేదు. హెడ్ లైన్ బావుంది కదా."
   
    "మౌంట్ ఆఫ్ మూన్ మీద స్పాట్ చూడండి. అక్కడ కాదు. మౌంట్ ఆఫ్ మూన్ ఎక్కడో మీకు తెలీయదల్లే వుంది. పోన్లెండి, ఇక ఆ సంగతి వదిలెయ్యండి." రవితేజ అతడి మొహంలోకి చూస్తూ అన్నాడు. వాడిపోయిన మొహంతో సుధాకర్ పేలవంగా నవ్వి, "ఇపుడిప్పుడే నేర్చుకుంటున్నాను" అన్నాడు.
   
    అంతలో మాధవి రెండు కప్పులతో వచ్చింది.
   
    "టీ తీసుకోండి."
   
    రవి టీతాగి, లోపలికి వెళ్ళాడు. "నేను వెళ్లొస్తాను" అని సుధాకర్ అనటం వినిపించింది. "ఫర్వాలేదు కూర్చోండి" అంటూంది మాధవి ఐదు నిమిషాల తర్వాత రవి వచ్చాడు. వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా కూర్చుని వున్నారు. సుధాకర్ ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నాడు.

    "అదేమిటి అల అమౌనంగా కూర్చున్నారు?" అన్నాడు రవితేజ వస్తూ అంతలో అతడి దృష్టి టేబుల్ మీద వున్న చిన్న ప్యాకెట్ మీద పడింది. "అదేమిటి?" అడిగాడు.
       
    "చిన్న గిఫ్ట్ మాధవిగారి కోసం-" అన్నాడు.
   
    "నిన్న మీరుకూడా పిక్నిక్ వెళ్ళారా?" వాచీ పెట్టుకుంటూ అడిగాడు. "అక్కడే మాధవిగారు పరిచయం అయ్యారు" అన్నాడు సుధాకర్ నిన్న పరిచయమైతే, ఈ రోజే గిఫ్ట్ పట్టుకురావటం చీప్ ట్రిక్ - కేవలం హెడ్ లైన్, లైఫ్ లైన్ లాటి రెండు మూడు పదాలు నేర్చుకుని ఆడవాళ్ళకి జ్యోతిష్యం చెప్పటం అంతకన్నా చౌకబారు ట్రిక్. ఆడవాళ్ళకి ఈ సంగతి తెలీదో, లేక తెలిసీ తెలియనట్టు నటిస్తారో అర్ధంకాదు. "నేను వెళ్తాను ఆఫీసులో పనుంది-" అంటూ బయల్దేరాడు రవితేజ.
   
    మాధవి పోర్టికోవరకూ వచ్చి, "సాయంత్రం తొందరగా వస్తారా?" అంది.
   
    "నాకు చాలా ఆశ్చర్యంగా వుంది సుమా!"
   
    "ఏమిటి?"
   
    "పెళ్ళయిన ఇన్నాళ్ళకి మొట్టమొదటిసారి నువ్వీ ప్రశ్న అడగటం".
   
    ఆమె మొహం చిట్లించి, "ఏమిటి మీ ఉద్దేశ్యం?" అంది.
   
    అతడు కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ, తనలో తాను అనుకున్నాడు. "గిల్టీ ఫీలింగ్ మనిషిని కొద్దిగా మారుస్తుందేమో సుమా" అని.
   
                                       *    *    *
   

    అతడు ఆఫీసుకి వెళ్ళేసరికి ఆఫీసు కట్టేసే టైమైంది. చాలామంది వెళ్ళిపోయారు. ప్రియంవద అతడికోసం ఎదురుచూస్తూ వుంది. "ఈ రోజు ఆలస్యమావుతుద్న్హి వుండమన్నారు" అంది.
   
    "అవును చాలా పని వుంది. ఇంట్లో చెప్పొచ్చావా?"
   
    "చెప్పానండీ!"
   
    అతడు వరుసగా ఉత్తరాలు డిక్టేషన్ ఇవ్వటం ప్రారంభించాడు. ఎనిమిదింటి వరకూ ఆమె టైప్ చేసిన ఉత్తరాలమీద సంతకం పెట్టాడు. ఆఖరి ఉత్తరం టైప్ డిక్టేషన్ చేస్తూ వుండగా ఫోన్ మ్రోగింది.
   
    ఆఫీసంతా నిర్మానుష్యంగా వుంది.
   
    "హల్లో".
   
    "నేను మాధవిని".
   
    "ఏమిటి చెప్పు."
   
    "నాకు కారు కావాలి."
   
    "అదేమిటి, ఫియట్ వుందిగా?"
   
    "అది స్టార్ట్ అయి చావటంలేదు. లక్షసార్లు చెప్పాను. దాన్ని అమ్మెయ్యమని మీరసలు నా మాట...."
   
    "సర్లే సర్లే - మళ్ళీ పంపిస్తావా? నేను ఇంకో గంటసేపు వుంటానిక్కడ. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు?"
   
    "సెకెండ్ షోకి".
   
    "నువ్వు దిగి, నాకు పంపించు."
   
    "మీ కసలే మతిమరుపు. మీ రింటిదగ్గర దిగాక మళ్ళీ హాలుకి పంపకపోతే వాళ్ళ ముందు నవ్వులపాలు కావాల్సి వస్తుంది."   
   
    "ఎవరితో వెళ్తున్నావు? వాళ్ళకి కారు లేదా?"
   
    "మిసెస్ పాండేతో? వాళ్ళముందు దేభ్యం మొహం పెట్టుకుని మీ కారులో వస్తానని చెప్పమంటారా?"
   
    "అక్కర్లేదులే, పంపుతున్నాను?" అతడు ఫోన్ పెట్టేసి, బెల్ కొట్టి డ్రైవర్ ని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ప్రియంవద పుస్తకం మీద పిచ్చిగీతలు గీస్తూంది అంతసేపూ.
   
    అతడు తిరిగి డిక్టేషన్ మొదలు పెట్టాడు. మరో పది నిమిషాలు డిక్టేషన్ ఇచ్చాడు. ఆ ఉత్తరాలు ఆమె టైప్ చేసి తీసుకొచ్చేసరికి అరగంట పట్టింది. టైమ్ తొమ్మిదిన్నర కావొస్తూంది.
   
    కారు రాలేదు. అతడు విసుగ్గా టైమ్ చూసుకున్నాడు. ఈపాటికి సినిమా కూడా ప్రారంభించి వుంటారు. ఇంకా వీళ్ళ మేకప్ లు పూర్తి అయ్యయో లేదో.
   
    "నేను వెళ్ళొచ్చా సార్" అని అడిగింది.
   
    "బాగా రాత్రయింది. నేను డ్రాప్ చేస్తానుండు" అని అతడు ఇంటికి ఫోన్ చేశాడు. వంటమనిషి ఎత్తి 'అమ్మగారు సినిమాకి వెళ్ళారు సార్' అన్నాడు.
   
    "కారు పంపించాను, వచ్చిందా?"
   
    "వచ్చింది సార్ అందులోనే వెళ్ళారు. అరగంట అయింది".
   
    అతడు విసుగ్గా ఫోన్ పెట్టేశాడు. మరో పదినిముషాలు గడిచాయి. అద్దాలవతల నుంచి ప్రియంవధ టైప్ మిషన్ ముందు కూర్చొని గోళ్ళమీద చిన్న గుడ్డతో పాలిష్ చేస్తుంది. హాలంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా వుంది. బయట తలుపు కవతల బోయ ఇంకా ఎంతసేపు అన్నట్టు ఆవలిస్తూన్నాడు.
   
    అతఃడు ఇంటర్ కమ్ లో ఆమెని పిలిచి, "నువ్వు వెళ్ళిపో, నాకు కారు రావటం ఆలస్యం అయ్యేట్టూ వుంది" అన్నాడు. ఫర్వాలేదు వుంటానంది ఆమె.
   
    సమయం పావుతక్కువ పది కావొస్తుంది.
   
    అతఃడు రిసీవర్ ఎత్తి మిసెస్ పాండే ఇంటికి ఫోన్ చేశాడు. ఆమె లేదు. పాండే ఎత్తాడు ఫోన్. "ఏమిటి విశేషం? ఇంత రాత్రి ఫోన్ చేశారు?" అని అడిగాడు.
   
    "మాధవి కారు పంపుతానంది. ఇంకా రాలేదు. అసలు తయారై బయల్దేరారో లేదో అని."
   
    పాండే బిగ్గరగా నవ్వాడు. "ఇంకా మేకప్ లోనే వుంటారేమో అన్న అనుమానం వచ్చిందా? అదీ నిజమేలే అరగంట ఆలస్యంగా బయల్దేరారు. కానీ మొత్తంమీద బయల్దేరారు వనజావాళ్ళు రావటమే ఆలస్యం అయింది-"
   
    రవితేజ చేతిలో రిసీవర్ అప్రయత్నంగా బిగుసుకుంది.
   
    "వ...న....జా... వాళ్ళు.....
   
    "హల్లో"
   
    ........
   
    "ఆ చెప్పండి-"
   
    "నా కారు పంపనా?"
   
    "వద్దు వద్దు బహుశ హాల్ కి వెళ్ళి పంపుతుందేమో" అన్నాడు రవితేజ- అనవసరంగా ఆయనకీ శ్రమ ఇవ్వటం దేనికన్న ఉద్దేశ్యం ధ్వనించేటట్టూ అతడి ఆలోచన్లు మాత్రం ఎక్కడో వున్నాయి. వనజా - వాళ్ళు.
   
    "ఇంట్లో ఎవరూ లేరుగా, ఇక్కడికే రాకూడదూ ఓ గంట కూర్చుని వెళ్ళవచ్చు..." అట్నుంచి పాండే అన్నాడు.
   
    "లేదు మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను."
   
    "సరే మీ ఇష్టం అన్నట్టు మీ కంపెనీ ఈ సంవత్సరం బోనస్ షేర్లు ఇస్తూందటగా. కంగ్రాట్స్ మీ బ్యాలెన్స్ షీట్లు చూస్తున్నాను. మీ ప్రోగ్రెస్ చూస్తూంటే మతిపోతూంది."
   
    "థాంక్యూ వుంటాను" ఫోన్ పెట్టేశాడు.
   
    వనజా-వా.....ళ్ళు.
   
    అతడు తల విదిలించాడు.
   
    ప్రియంవద అతదివైపే చూస్తూంది. అతడు బోయ్ ని పిలిచి 'నువ్వెళ్ళు' అని చెప్పాడు. "ఒక టాక్సీ పంపమని క్రింద టైమ్ ఆఫీసులో చెప్పి వెళ్ళు-"
   
    "అలాగే సర్" అని బోయ్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ఇద్దరే మిగిలారు. ఫోన్ లో అతఃది సంభాషణ, తరువాత టాక్సీ పంపమని బోయ్ కి చెప్పటం విన్న ప్రియంవధ, విషయం అర్ధమైనట్టు మౌనంగా వుండిపోయింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రవి అన్నాడు.
   
    "నువ్వు ఒక కార్డు ఇచ్చావు గుర్తుందా ప్రియంవాదా. ఏ వయసులో అమ్మాయిలు ఎవర్ని ఇష్టపడతారు అన్నది వ్రాసి! అందులో నువ్వు కేవలం పెళ్ళికాని ఆడవాళ్ళ గురించి మాత్రమే వ్రాసేవు. పెళ్ళయినవాళ్ళ గురించి నీకు బహుశ తెలిసి వుండదు-" అతడు పూర్తిచెయ్యబోయి ఆగాడు. అతడు అనదల్చుకున్నది - భర్త కష్టపడి సర్వసౌఖ్యాలు అమరుస్తూ వుంటే, ఇంట్లో ఏమీతోచని స్త్రీలు ముఖ్యంగా హై సొసైటీలో రకరకాల వ్యాపకాలకి ఆకర్షితులవుతారనీ - ఇంట్లో భర్త దగ్గిర దొరకని 'గుర్తింపు' బయటవారి దగ్గిర దొరికితే అది నిజమైన ఆప్యాయత అనుకుంటారనీ! కానీ అతడు పూర్తి చెయ్యలేదు. అతడికి తనస్థానం గుర్తుకువచ్చి ఆగిపోయాడు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఎంతో తూచి తూచి మాట్లాడే ఆ ఎగ్జిక్యూటివ్, ఒక సెక్రటరీ దగ్గిర ఆ మాత్రమైనా తొణికాడంటే - అతడు ఆ క్షణం ఎంత మానసిక సంచలనాన్ని అనుభవిస్తున్నాడో అర్ధం అవుతుంది. అతడు పూర్తిగా చెప్పకపోయినా ఆమె అర్ధం చేసుకున్నట్టు అంది-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra