Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

 

      "తప్పించుకుందాం అనుకున్నావురా..దొంగరాస్కెల్!" అంది సుకుమారి వగరుస్తూ.
   
    రావు 'కెవ్వు'మని అరిచి మళ్ళీ పారిపోదాం అని ట్రై చేశాడు.
   
    సుకుమారి అతని మీదపడి "ఆడదంటే అబల కాదురా.... సబల" అంది.
   
    "నన్ను వదిలెయ్. నా చర్మంతో నీకు చెప్పులు కుట్టిస్తాను" అన్నాడు ఏడుస్తూ రావు. సుకుమారి వెటకారంగా నవ్వి అతని షర్ట్ సర్రున చింపేసింది.
   
    "నీకేం కావాలన్నా ఇస్తాను.... నన్ను వదిలెయ్" లబలబలాడాడు.
   
    సుకుమారి అతని ప్యాంట్ పట్టుకుని లాగేసింది.
   
    "నాకు ఎయిడ్స్.... తెలుసా?" ఆఖరి ఆశగా అడిగాడు రావు.
   
    "నిజమా?" సుకుమారి అతన్ని నేలమీద నుండి లేవకుండా తొక్కిపెడుతూ అడిగింది.
   
    "అయినా వదలవా?" ఆశ్చర్యంగా అడిగాడు రావు.
   
    "ఇన్నాళ్ళూ ఏ అమాయకుడికీ ఆ రోగం అంటించడం ఇష్టంలేక అలా వుండిపోయాను. నాకు నీలాగే ఎయిడ్స్!" జవాబిచ్చింది సుకుమారి.
   
    "ఓ.... నో....!" పెద్దగా అరిచాడు రావు. ఆ తర్వాత ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటూ- "నన్ను వదిలిపెట్టు. నీ తమ్ముడి లాంటివాణ్ణి... కాదు.... అన్న లాంటివాణ్ణి ప్లీజ్!" అని కన్నీళ్ళతో అర్ధించాడు.
   
    "ఏరా! ఇలా ఏడుస్తూ తమని వదిలిపెట్టమని అర్ధించే ఆడపిల్లళ మొహాలు గుర్తుకొస్తున్నాయా? ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ చేసుకో" అంది సుకుమారి. రివ్వున వీచేగాలి తప్ప అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. ఆమె చెప్పేది అర్ధంకావటానికి అతడికి అరక్షణం పట్టింది.
   
    అవాక్కయి చూశాడు.
   
    సుకుమారి అతని మీదనుండి లేస్తూ "ఎంతమంది ఆడపిల్లల్ని నీ కామాంధకారానికి బలిచేశావో.... ఎంతమంది ఉసురు పోసుకున్నావో... నాకు సాక్ష్యాధారాలతో సహా తెలుసు! నీ మీద ఓ ఆడపిల్ల హెడ్డాఫీసుకి కంప్లైంట్ చెయ్యడంవల్లే నేను ఏక్షన్ తీసుకోవడానికి మీ బ్రాంచ్ కి వచ్చాను. నాకు శీలం అంటే నమ్మకం లేదు. ఆ విషయం మా ఆయనకి కూడా తెలుసు. నాకెన్నో వివాహేతర సంబంధాలున్నాయి. వాటికి పెద్దప్రాముఖ్యత లేదుకూడా!....ఇన్నాళ్ళకి నేను నా శీలాన్ని ఫణంగా పెట్టి ఒక మంచిపని చేసానన్న సంతృప్తి మిగుల్తోంది. అందుకే మీ బ్రాంచ్ కి వచ్చాను. ఒక వ్యక్తి, అది పురుషుడు కావొచ్చు.... స్త్రీ కావొచ్చు..... తన కిష్టంలేని వ్యక్తితో సంబంధం పెట్టుకోవటం నరకం. అది తెలిసి కూడా నీలాటి నీచులు, మీ హోదా ఉపయోగించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నీ గురించి నాకు కంప్లైంట్ చేసింది ఎవరో తెలుసా? ధరణికాదు. ఒక్కక్షణం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. నీ గురించి కంప్లైంట్ వచ్చినప్పటినుంచీ నీకు తగ్గ పనిష్మెంట్ విధించడానికి తగిన సమయంకోసం చూస్తుండగా నువ్వే అవకాశం కల్పించావు! ఇప్పుడర్ధం అయిందా మనసు లేని కామం ఎలా ఉంటుందో......ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుని నిన్ను శాపనార్ధాలు పెట్టి ఉంటారో? అవన్నీ నేడు ఫలించాయి. అనుభవించు!" అంది.
   
    అతన్ని నగ్నంగా అలాగే వదిలేసి అతని బట్టలన్నీ ఉండగా చుట్టి అతని కార్లో పడేసింది.
   
    ఆ తరువాత కారు స్టార్ట్ చేసి ముందుకి తోసి వదిలేసింది.
   
    రావు అరుస్తూ ఉండగా.... కారు నెమ్మదిగా లోయలోకి జారిపోయింది. ఆపైన పెద్ద విస్ఫోటం జరిగినట్లుగా ఆ నిర్జన ప్రదేశంలో ప్రతిధ్వనించింది.
   
    "ఏమిటి నీ ఉద్దేశ్యం?" రావు ఏడుస్తూ అడిగాడు. ఆమె అతని చుట్టూ ఒక వృత్తం గీసింది.
   
    ఆమె అతన్ని సోదా చేసి "నీ దగ్గర పైసా లేకుండా, ఒంటిమీద గుడ్డలు లేకుండా ఈ అడవిలో వదిలిపెట్టి వెళ్ళాలన్నదే నా ఆలోచన! నువ్వు నీ చుట్టూ గీసిన ఈ గీత దాటి అడుగుకూడా ముందుకి వెయ్యలేవు! ఎందుకంటే ఇది లక్షణరేఖ కంటే పవర్ ఫుల్! ఆడది గీసిన రేఖ! ఒకవేళ రావడానికి ప్రయత్నిస్తే..... అదిగో అది చూసుకుంటుంది మిగతాకథ" అంది.
   
    రావు భయంగా ఆమె చూపించిన వైపు చూశాడు.
   
    పెద్ద జాగిలం....నోట్లోంచి నాలుక వేలాడేసుకుని ఆమె కార్లోంచి బయటకు దూకింది.
   
    "సీజర్- వీడు అడుగు కదిపితే వీడి పని పట్టు..." అంది సుకుమారి. రావువైపు తిరిగి "డానికి పదిహేనురోజులు ఫుడ్ అక్కర్లేదు. మళ్ళీ పదిహేను రోజులయ్యాక ఆకలేస్తుంది. ఎదురుగా ఏం ఉంటే అది పీక్కు తినేస్తుంది. అల్సేషియన్ లో ఒక తెగ! ఆఫ్రికా నుండి తెప్పించాను. నీచీటర్ అంటారు. ఆ గీత దాటకుండా ఉంటే పదిహేను రోజులవరకూ నీ ప్రాణానికేం ప్రమాదం లేదు.....బై....వస్తా...." అంది.
   
    రావు ప్రాణభయంతో అరుస్తూ "మేడమ్.... తల్లీ..... అమ్మా.... నన్ను కాపాడు..... నాకు బుద్దొచ్చింది. ఇప్పట్నుంచి ప్రతి ఆడదానిలో తల్లినీ, చెల్లినీ చూస్తాను. నన్ను నమ్ము....ప్లీజ్!" అని ముందుకి రాబోయాడు.
   
    నీ చీటర్ 'గుర్..... ర్....' మంటూ లేచింది. గభాల్న ఆగిపోయాడు.
   
    "నిన్ను నమ్మనురా. నరమాంసానికి అలవాటుపడిన క్రూరజంతువెంతో.... అసహాయులమీద అధికారం చూపి అవసరాలు తీర్చుకునే నువ్వూ అంతే! వదిలిపెడితే... మళ్ళీ మామూలే. నిన్ను చచ్చినా నమ్మను! గుడ్ లక్!" సుకుమారి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
   
    రావు దిగంబరంగా ఆ అడవిలో తన చుట్టూ తనే గీయించుకున్న వలయంలో చిక్కి ఏడుస్తూ కూర్చుండి పోయాడు. అతని ఎదురుగా నాలుక బైట వేసుకుని ఆశగా, ఆబగా చూస్తూ కాపలా కూర్చుంది నీ చీటర్!
   
                                     *    *    *
   
    "నీ చీటర్!" విస్మయంగా ఉచ్చరించింది ధరణి. "మేడమ్ ఆఫ్రికానుండి తెప్పించారా?"
   
    ఇడ్లీల్లో కారంపొడి నంజుకుని తింటూ "గాడిదగుడ్డు!" అంది సుకుమారి.
   
    "నీచమైన వెధవల్ని తింటుందని చెప్పేందుకు ఆ పేరు పెట్టాను. ఆ వెధవకి ప్రాణభయం వల్ల ఊరకుక్కకీ అల్సేషియన్ కీ తేడా తెలీలేదు" అంది.
   
    "మరి.. మరి అతనికి నిజం తెలిస్తే...." అంది ధరణి.
   
    నిజం తెలిసి ఎప్పటికో బయటపడినా ఈ లోపు చలివాత పడడం ఖాయం! ఓ వేళ అలా కూడా తప్పించుకున్నా బట్టలు లేకుండా మట్టి కొట్టుకుపోయినవాణ్ణి అందరూ పిచ్చివాడనుకుని రాళ్ళతో కొడతారే కానీ ఎత్తుకొని ఆంధ్రాలో దింపరు. చూద్దాం....ఏం చేస్తాడో!" అంది.
   
    గీత కృతజ్ఞతగా "మా కోసం ఎంతో రిస్క్ తీసుకున్నారు మేడమ్....మీకు మా అందరి తరపునా ధన్యవాదాలు" అంది.
   
    సుకుమారి నవ్వేసింది. "ఇంతవరకూ తెచ్చుకున్నారు కాబట్టి ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సుకుమారి అవసరం అయింది. మొదట్లోనే అయితే ధరణే సరిపోయేది. ధరణీ..... టు నిప్ ఇన్ ద బడ్ ఈజ్ ఆల్వేస్ రైట్! బైదిబై ఈ రోజు నుంచీ నువ్వే బ్రాంచ్ మేనేజర్ వి.....కంగ్రాట్యులేషన్స్!" అంది.
   
    "మేడమ్!!" ఇంకా ఆశ్చర్యపోయింది ధరణి.
   
    గీతా, వనజా, లక్ష్మీ మొదలయిన స్టాఫ్ అంతా ఆనందంగా "కంగ్రాట్స్.. కంగ్రాట్స్" అంటూ ఆమెని అభినందనలతో ముంచెత్తారు.
   
    "లాంగ్ లివ్ సుకుమారీ మేడమ్" అన్నారు అందరూ.
   
    సుకుమారి వెళ్ళిపోతూ వుంటే ఈసారి ఆమె భారీకాయం ఎబ్బెట్టుగా, ఎగతాళిగా కనిపించలేదు. మనిషి వ్యక్తిత్వం బయట పడ్డాక రూపం కనిపించడం మానేస్తుంది.
   
    ఆడపిల్లలు అందరూ గౌరవంగా నమస్కరిస్తూ వీడ్కోలు చెప్పారు.
   
                                            2
   
    ధరణికి చాలా సంతోషంగా వుంది. తన ప్రమోషన్ విషయం ఎప్పుడెప్పుడు శ్రీధర్ కి చెప్పాలా అని ఆమె మనసు ఉత్సాహంతో ఉరక లేస్తోంది.
   
    ధరణి ఆటో దిగి డబ్బులు చెల్లించి ఇంట్లోకి వెళ్ళబోతూ అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి కాస్త షాక్ కి లోనయింది. ముందు వరండాలో తన భర్తతో ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ కనిపించాడు.
   
    "రండి" విక్రం లేచి నిలబడుతూ తనే ఆహ్వానించాడు.
   
    ధరణి భయంగా శ్రీధర్ వైపు చూసింది. అతడు మామూలుగానే కనిపించాడు.
   
    "మీరు .... మీరూ..." అంది సందేహంగా.
   
    "దేవుడూ మేథ్స్ టీచర్ ఒకలాంటివారే! ఒక ప్రాబ్లెం తర్వాత ఒక ప్రాబ్లెం ఇస్తూనే పోతారు. ముఖ్యంగా మా డిపార్ట్ మెంట్ వాళ్ళకి!" అన్నాడు చిన్నగా నవ్వుతూ విక్రం.
   
    "వాట్ హాపెండ్? త్వరగా చెప్పండి" కంగారుగా అడిగింది.
   
    "రిలాక్స్ మేడమ్! ప్రమాదం ఏం కాలేదు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    ధరణికి ఆ మాటతో కాస్త ఊపిరి అందినట్లయింది.
   
    "కానీ.... ప్రమాదం జరిగే సూచనలున్నాయి."
   
    ధరణి మళ్ళీ భయంగా చూసింది. "శ్రీ...ఏమైంది?" భర్తని అడిగింది.
   
    "నీ తమ్మున్నే అడుగు ఏం ఘనకార్యం చేశాడో.. స్పృహ వచ్చాక!" కాస్త కోపంగా అన్నాడు శ్రీధర్.
   
    "స్పృహ వచ్చాకనా? నాకేం అర్ధంకావడంలేదు.....కాస్త విపులంగా చెప్పండి" అరిచింది ధరణి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra