Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

           

                          

 

                                      అధ్యాయం - 5
   
   
    పిల్లలు పుట్టగానే హడావుడిగా తమ మొక్కులు తీర్చుకోవడానికో తమ అభిరుచుల్ని ప్రదర్శించుకోవడానికి పేర్లు పెట్టేసే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. భవిష్యత్తులో ఈ పేరువల్ల తమ పిల్లలు ఎలాంటి ఇబ్బందైనా ఎదుర్కోవలసి వస్తుందా అని. శ్వేతా, సౌందర్యా, విశాలాక్షీ, అపురూప, సుకేశిని, సుందర్ లాంటి పేర్లు. ఒకవేళ వాళ్ళు అందుకు విరుద్దంగా తయారైతే హాస్యాస్పదంగా మారతాయి. అటువంటి కోవలోకే వస్తుంది సుకుమారి పేరు కూడా!
   
    సుకుమారి నడుస్తూ ఉంటే నేల అదురుతుంది. ఆమె ఇంకోళ్ళతో కలిసి సరదాగా లిఫ్ట్ ఎక్కితే అది పైకి వెళ్ళే ప్రసక్తే లేదు. వెయింగ్ మిషన్ మీద నిలబడి రూపాయి బిళ్ళవేస్తే "ఒకసారి ఒకే మనిషి ఎక్కే వీలుంది" అనే కార్డు వస్తుంది. ఆమెకు జాకెట్టు కుట్టాలంటే రెండు మీటర్లబట్ట అరకొరగా సరిపోతుంది. ఆమె పొరపాటుగా ఎవరికాలన్నా తొక్కిందంటే ఆ వ్యక్తి కాలు మళ్ళీ పనిచేస్తుందన్న నమ్మకం లేదు. ఇన్ని విశేషగుణాలూ ప్రత్యేకతలూ గల సుకుమారి ఆ ఆఫీసుకి రావడం ఒక విశేషం.
   
    సంఘమిత్రా ఇంజనీరింగ్ ఆఫీసు ధనధనలాడిపోయింది. కొత్తగా వచ్చిన ఆ శాల్తీని చూసి రావు ముఖం మాడిపోయింది. కారణం ఆవిడ ఆ సంస్థ చైర్మన్ గారి భార్య, ఆ కంపెనీకి ఎమ్.డి. కావడమే!
   
    అనుకోని ఆవిడ హఠాత్ ఆగమననికి స్టాఫ్ అంతా విస్మయానికి లోనయ్యారు. రావు ముఖం కర్చీఫ్ తో తుడుచుకుంటూ, అందర్నీ ఆవిడకి పరిచయం చేస్తున్నాడు.
   
    ముందుగా నడుస్తున్న ఆవిడ "సీ..... మిస్టర్ రావ్" అని హఠాత్తుగా వెనక్కి తిరిగే సరికి అప్పుడే ముందుకి అడుగేస్తున్న రావు, ఆమె మీదకు తూలాడు. కొంచెం వయసుమీరిన వాడవటం చేత నిలదొక్కుకోలేక ఆమెని ఆసరాగా పట్టుకోవలసి వచ్చింది. ఆ పట్టుకోవటం అనాలోచితంగా ఆమె అబ్జెక్షనబుల్ పార్ట్స్ అవటంతో అతడి పరిస్థితి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. క్షణకాలం కట్రాటే అయ్యాడు. అయితే అందుకు భిన్నంగా సుకుమారి "మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నా ఛాంబర్ కి రండి" అంది.
   
    వణుకుతూన్న కాళ్ళతో అతడు ఆమె వెనకే ఆ గదిలోకి ప్రవేశించాడు.
   
    "నాకు చాలా ఆకలిగా వుంది" అన్నదామె.
   
    దానికి తనేం చెయ్యాలో అతడికి తెలియలేదు.
   
    "స్నాక్స్ తెప్పించండి" అంది.
   
    రావు బుద్దిగా తలాడించి వెంటనే బోయ్ చేత కాఫీ టిఫిన్లు తెప్పించాడు. వుఫ్ అని వూదేసి, ఆ తర్వాత కాఫీ గటగటా త్రాగేసి బ్రేవ్ మని త్రేన్చింది.
   
    తరువాత కుర్చీ వెనక్కి వాలి "మీకు పెళ్ళయిందా?" అని అడిగింది.
   
    "నాకా?" ఆశ్చర్యపోతూ అడిగాడు రావు.
   
    "అవును....మీకే...."
   
    "అయింది" ఆమె ఆ ప్రశ్న ఎందుకడిగిందో అర్ధంకాక, అయోమయంగా అన్నాడు.
   
    "ఒక వారం రోజులపాటు ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పండి. నేను ఇక్కడ పని నేర్చుకోవాలనుకుంటున్నాను. రాత్రిళ్ళు ఆలస్యం అయినా సరే.....బైదిబై- నాకు మీరు పనిలో సాయం చెయ్యాలి. అంతా వివరంగా చెప్పాలి. మా ఆయన విదేశాల్నుంచి తిరిగి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోవాలి. నాకు సయం చేస్తారా?"
   
    "తప్పకుండా...." ఏడవలేక నవ్వుతూ అన్నాడు.
   
                                      *    *    *
   
    ఆ తరువాత రెండ్రోజులు గడిచాయి. ఆ రెండ్రోజుల్లోనూ రావు ఒక్క విషయం గమనించాడు. సుకుమారి పికి భోళాగా భారీగా కనిపించినా పని విషయంలో చాలా స్ట్రిక్టు. అంతేకాదు, అనుకున్నపని అయ్యేదాకా నిద్రపోదు. అదంతా బాగానే వుంది కానీ, బావోలేనిది ఒక్కటే.
   
    కాగితాలు అందిస్తున్నప్పుడు ఆవిడ కావాలని చేతివేళ్ళు తాకటం!!! ఏమీ తెలియనట్టు మొహం పెట్టటం!
   
    ఆఫీసులో కొత్తగా ఎవరైనా అమ్మాయి చేరినప్పుడు తను అలాగే చేసేవాడు!!
   
                                   *    *    *
   
    ధరణి గులాబీరంగు ప్లెయిన్ జార్జెట్ చీరలో అప్పుడే విరబూసిన గులాబీలా ముగ్ధమోహనంగా ఉంది. ఆమె ముఖంలో అందం కంటే గ్రేస్ ఎక్కువగా ఉంటుంది. హాల్లో కూర్చుని సీరియస్ గా పని చేసుకుంటున్న ధరణిని గ్లాస్ వెనక నుండి చూస్తున్నకొద్దీ తన ఓటమి రావ్ ని రెచ్చగొడ్తోంది. ఇంక ఉపేక్షించి లాభం లేదని వెంటనే ఫోన్ అందుకున్నాడు.
   
    ధరణి రింగ్ అవుతున్న ఫోన్ వైపు ఓసారి  చూసి అది రెండుసార్లు మోగాక దానిమీద చెయ్యి వేసింది.

    రావు గొంతు సవరించుకున్నాడు. ఓసారి టై సరి చేసుకున్నాడు. కళ్ళు మూసుకుని "హలో!" అని కళ్ళు తెరిచాడు.
   
    అద్దం అవతల్నుంచి ధరణి కనిపిస్తూండగా, ఇట్నుంచి ఫోన్ లో మాట్లాడటం చాలా థ్రిల్లింగ్ గా వుంది.

    ధరణి టేబిల్ ముందు నిలబడి, ఇద్దరు ఇంజనీర్లు ఏదో చర్చించుకుంటున్నారు. అప్పుడప్పుడు అడ్డుగా వస్తున్నారు.
   
    ఆర్కిటిక్ ఆఫీసులో పనిచేస్తున్నందుకు మొట్టమొదటిసారి బాధపడ్డాడు రావు. ఇంజనీర్ల ఇద్దరి మధ్యా డ్రాయింగ్ షీట్ అడ్డుగా వుంది. ఇంజనీర్లు ఇంకా డిస్కస్ చేస్తూనే వున్నారు. ఈ లోపులో అట్నుంచి అసహనంగా... "....హలో" అని వినపడటంతో ఈ లోకంలోకి వచ్చాడు.
   
    "నేను... రావుని" మృదువుగా అన్నాడు.
   
    "చెప్పండి."
   
    "నా మీద నీ అభిప్రాయంలో ఏదైనా మార్పు వచ్చిందా?"
   
    అట్నుంచి చిన్న నవ్వు "....వచ్చింది"
   
    రావు ఊపిరి బిగపట్టి "ఏమిటి?" అన్నాడు.
   
    "మీకు అవతలివారి మనసు తెలుసుకోవటం రాదని"
   
    రావు ఒక క్షణం షాక్ తిని, వెంటనే సర్దుకుని అన్నాడు. "ఇంకా ఎన్నోరోజులు నిన్ను చూస్తూ అలా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మనం ఆనందతీరపు అంచులు తాకడానికి నేనో మార్గం ఆలోచించాను. ఫస్ట్ వీక్ లో నేను ఊటీలో దాస్ ప్రకాష్ లో రూం బుక్ చేయిస్తాను. నేను వెళ్ళిన రెండోరోజున బయల్దేరి నువ్వురా. ఇద్దరం ఓ వారం హేపీగా గడిపేద్దాం. ఏం మాట్లాడవు?" అడిగాడు రావు.
   
    "ఏం మాట్లాడను... ఐయామ్ ...ఐయామ్ వెరీ హేపీ!"
   
    రావు ఓ క్షణం తబ్బిబ్బయి వెంటనే గడగడా "గుడ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో, నేను సెకెండ్ నాడు బయల్దేరుతాను. నువ్వు ఫోర్త్ న బయల్దేరి వచ్చెయ్! ఈ సంగతి మూడో కంటికి తెలియకూడదు" అని రిలీఫ్ గా నిట్టూర్చాడు!
   
    "ఓ.కే... డన్!" అని ఫోన్ పెట్టేసింది ఆమె.
   
    రావుకి అంతా కలలాగా అనిపించింది. కోపంతో మండిపడి నానామాటలు అంటుందేమో, ఉద్యోగం వూడిపోతుందని బెదిరిద్దాం అని సిద్దంగా ఉన్న మనిషికి, అవతలి నుండి ఇంత త్వరగా గ్రీన్ సిగ్నల్ రావడం పరమాశ్చర్యం కాక మరేమిటి! కర్చీఫ్ తో మొహం నిండా పట్టిన చెమటని తుడుచుకున్నాడు.
   
    ఇంజనీర్లు డ్రాయింగ్ తీసుకుని ప్రక్కకి తొలగిపోయారు.
   
    ఇప్పుడు అతనికి ధరణి స్పష్టంగా కనపడుతోంది.
   
    ఆమె ముఖంలో చీకాకూ, కోపం ఏమీలేవు! ఆమె ముఖం నిర్మలంగా, ఇంకా అందంగా వుంది.
   
    గీత ఆమె టేబుల్ దగ్గరికి రాగానే ఆమె నవ్వుతూ ఏదో అంది. ఆ నవ్వు అద్భుతంగా వుంది.
   
    రావు రివాల్వింగ్ చైర్ లో వెనక్కి వాలి కూర్చుని, తల క్రింద రెండు చేతులూ పెట్టుకుని ధరణిని రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఆమెతో గడపబోయే అద్భుతమైన రాత్రులు వూహించుకుంటూ వుంటేనే అతనికి ఒంట్లో నుండి కరెంట్ ప్రవహిస్తున్నట్లుగా అవుతోంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra