ఇలా వొకరిని వొకరు వెదుకుతూ తిరుగుతూ వుంటే ఎలా? అందుకని ఓ మిఠాయి దుకాణంవద్ద నిల్చుని నీకోసం ఎదురు చూడసాగాను. నీవు యింకా రాలేదు అన్న భావన మనస్సుకి తగిలినప్పుడల్లా కన్నీరు చెక్కిళ్ళుదాటి జాకెట్ ను తడిపేది. అప్పుడే ఆ క్షణంలోనే అంతవరకూ నేను ఎరుగని బాధ, దుఃఖం అనేది జీవితంలో ప్రారంభమైంది. ఆనాటినుంచీ ఒక్కసారయినా ఒక్క చిరునవ్వు అయినా నవ్వానా_నిన్ను చూసేవరకు చీకటిపడటం ప్రారంభించింది. మనసునిండా దుఃఖం పులుముకుంటుంటే.... ఏడ్వటం ప్రారంభించాను. ఎవరు ఓదార్చుతారు? ఓదార్చగలవాళ్ళూ_ఓదార్చవలసిన వాళ్ళూ దూరమయ్యారు. ఎంతగా ఏడ్చానో ఏమో? ఏడ్చి ఏడ్చి అలాగే మగతగా కన్ను మూశాను. ఎంతసేపు నిదురపోయానో! బహుశా ఎక్కువసేపు అయివుండదు.
    ఎవరో ఓ వ్యక్తి నన్ను నిదురలేపాడు నల్లగా, బలిష్టంగా కరుడుగట్టిన రాక్షసత్వంలా వున్నాడు. నన్ను నిదురలేపాక, ఎవరు? ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు.  
    నేను గట్టిగా ఏడ్చేసి అంతా చెప్పాను. నీవద్దకు తీసికెడతాననీ యిద్దరం కలిసి వెడదాం రమ్మనీ పిలిచాడు. వెంట వెడితే ఎక్కడికో తీసికెళ్లాడు. అప్పుడు నాకు ఏమీ అర్ధంకాలేదు. కానీ ఎవరో ఫాస్టర్ అతను. అతనికి నన్ను అమ్మాడు. ఆయన అందమైన నన్ను చూసి మురిసిపోయాడు. నన్ను మభ్యపుచ్చి, బెదిరించి ఎలాగో బాంబే తీసికొని వెళ్లాడు. వెళ్ళేముందు నన్ను గురించిన సమాచారమంతా సేకరించాడట. నేనెవరో కనుక్కున్నాడట. నీవు నన్ను వెదుకుతూ అతన్ని కూడా అడిగేవట. నీ ఫోటోకూడా ఒకటి తీశాడట! నా తలిదండ్రులెవరో వారికి అండదండలెవరో విచారించాడట.
    తనతోపాటు నన్ను బాంబేకి తీసికెళ్లాక ఏవేవో చెప్పాడు. నా వాళ్ళకి అప్పగించటానికి నా అడ్రస్ తెలియదట. నేను మన ఊరిపేరు చెపితే అదెక్కడుందో ఎవరికీ తెలియలేదన్నాడు. మోసం చేసేవాళ్ళు ఎన్ని యైనా చెబుతారు. ఏమైనా చేస్తారు. స్థానిక పత్రికల్లో ప్రకటించీ అదీ వ్యర్ధమైందని అబద్ధం కల్పించాడు. మోసగాళ్ళు అందరూ అలా ఉండలేరు కదా!
    క్రమంగా వాతావరణాన్నిబట్టి నేను అందర్నీ మర్చిపోయాను. కానీ ఓ నెల గడిచాక ఓ చిత్రమైన కల వచ్చింది. అందులో నీవు జ్వరంతో బాధపడుతున్నావట. చదువుకోనని, చదువు అక్కర్లేదని అంటున్నావట. నీవు మరేమీ చెప్పకున్నా నాకు తెలిసిపోయింది నీ రహస్యం.
    నీవు నన్ను గురించి బాధ పడుతున్నావు. నాకోసమే చదువు మానుకుంటున్నావు_అనీను. అందుకని ఆ కలలోనే చెప్పాను చదువు మానొద్దు. బాగా చదువు.... డాక్టరువికా.... ప్రజాసేవ చెయ్.... ఏనాటికైనా నేను నిన్ను వెదుక్కుంటూ వస్తాను. మళ్ళీ తప్పక కలుస్తాం ఇద్దరం! మరచిపోవద్దు__అన్నాను.
    ఆ తర్వాత ఒక్కొక్కరే నా మనస్సునుంచి మాయం కాసాగారు. నేను మరిచిపోయినా పోతున్నా అతనుమాత్రం ఎప్పటికప్పుడు మనవాళ్ళని మరచిపోకుండా ఇక్కడి విషయాల్ని సేకరించుకుంటూ వుండేవాడట. అవన్నీ ఈమధ్యే బయట పడ్డాయ్....
    మెల్లిగా నేనూ చదువులో పడ్డాను. ఎంత ప్రేమవున్నా, ఎంత అభిమానంవున్నా మనిషివెంట మనిషి చావటం అరుదు వేణూ! మనిషి ప్రపంచంలో పరిస్థితులకి దాసుడు కానిదెప్పుడు? యెప్పుడో మా స్నేహితురాలు నా ఆటోగ్రాఫ్ లో రాసింది. "హాయిరే ఇన్సాన్ మజ్ బూరియన్ పాన్ రహనే భీ కిద్నే దూరియాన్" యెంత అనుభవ పూర్వకంగా ఉన్నాయామాటలు. క్రమంగా చదువుతోబాటు లోకజ్ఞానం రావడంతోపాటు నా స్థితి నాకు అర్ధం అవసాగింది. అప్పటినుంచి అతన్ని అనుక్షణం అసహ్యించుకుంటూ బ్రతికాను.
    అతన్ని అడుగడుగునా చీత్కరించుకుంటూ నిందిస్తూ దరిదాపులకి రానివ్వకుండా ఒక్క ఆర్ధిక విషయాల్లో మాత్రమే అతనిపై ఆధారపడుతూ గడపసాగాను. నా అభిమానాన్ని సంపాదించాలని అతనెంతో యత్నించాడు. రకరకాలుగా పిండివంటలు చేయించేవాడు. ఒకటైనా వాసన చూడకుండా నెట్టివేసేదాన్ని. ఖరీదైన చీరెలు, జాకెట్లు తెచ్చేవాడు. అదే షాపులో వాటిని వాపస్ చేసి చవకరకం తెచ్చుకుని పలువుర్లో అవమానం చేసేదాన్ని.
    నా విషయాలు ఏవీ నాకు గుర్తులేవు. అయినా అతని మోసం మాత్రం బాగా గుర్తుంది. అనుక్షణం ఆ విషయం అతని ముందు ప్రస్తావించి బాధించేదాన్ని. నోరు మెదపనిచ్చేదాన్నికాదు. బుసకొట్టే నాగుబాముని చూసినట్టు బెదిరిపోయేవాడు.
    ఆడది చీత్కరించుకుంటే అవతల మనిషిలో ప్రేమ ఉత్పన్నమౌతుందన్న మాట ఏమో నాకేమీ తెలియదు. నాకు తెలిసిందల్లా మనిషి మీద వ్యామోహం పెరుగుతుందనే! అందుకేనేమో క్రమంగా అతనిలో నాపై వ్యామోహాన్ని దాచుకున్న కృత్రిమ ప్రేమలాంటిది ప్రారంభమైంది. దాంతో అతనిపై నాకు అసహ్యం మరీ అధికం కాసాగింది.
    భారతీయుడిలా వేదాంతం మాట్లాడేవాడు. అచ్చం హిందువుల వేదాంతసారాన్ని వల్లించేవాడు. అయినా అతని కుచ్చిత తత్వం బాగా బయట పడేది. బియ్యే చదివిన నాకు అతను అతని చర్యలు మైక్రో స్కోప్ లో సూక్ష్మక్రిముల్లా కనిపించేవి. ఎప్పుడూ అతని స్వల్ప తప్పిదాన్ని కొండంతగా చేసి చూపి నిందించేదాన్ని.
    చివరికి ఈమధ్య తనని పెళ్ళి చేసుకోమని వేధించటం ప్రారంభించాడు. భరించలేక చీత్కరించి అసహ్యంతో వెలిగ్రక్కితే నా కధంతా వెలికివేశాడు.
    ఒక్కసారిగా అగ్నిగోళంలో పడిన మానవుడిలా నా మనస్సు జ్వలింపసాగింది. ఎంతమోసం.... ఎంత  క్రౌర్యం.... మనిషా? పశువా? యెవరైనా ఇంతటి కుచ్చితబుద్ధితో అంత క్రౌర్యంతో అంత చిన్నవయస్సు వాళ్ళని అలా చేస్తారా? భగవాన్ నీ అవతారములతో పునీతమయిన ఈ భారతదేశములో ఇలాంటి కుచ్చితులు అవతారమెత్తుతున్నారే! యెంత అన్యాయం జరుగుతోంది?
    నీ విషయం తలచుకుంటే ఓ వేపు నవనాడులూ జ్వలినింటే, మరోవైపు ఆనందం తల మునకలయ్యేది. చివరికి స్తుష్కర్షగా చెప్పేను. నిన్ను ప్రేమించానని. నిన్నే ప్రేమించగలనని.... పెళ్ళి చేసుకుంటే నిన్ను చేసుకుంటానని కానీ కంఠంలో ఊపిరి వుండగా తనలాంటి నీచుడిని కన్నెత్తి కూడా చూడనని ఆశ వదులుకోమని చెప్పాను.
    కానీ అతడు వికటంగా నవ్వుతూ నీకు పెళ్ళయి పోయిందనీ, నిన్ను మరచిపోవటం మంచిదనీ, అలా కాకుంటే జీవితంలో ఇక నాకు ఏదీ దక్కదని, ఒకవేళ నేను నీపై ఆశలు పెంచుకున్నా, పెంచుకొని వుండినా పెంచుకోబోతున్నా అవి అడియాసలేనని గాలి మేడల్లాగా కూలిపోతాయని చెప్పాడు.
    ఆ క్షణంలో అతను చెప్పినదంతా అబద్దమనుకున్నాను. బెదిరింపు మాత్రమేనని దుర్మార్గులు కార్యసాధన కోసమై ఏమైనా అంటారని అనుకున్నాను. కానీ అతను హేళనగా నా ముఖంమీద కొట్టినట్టుగా నవ్వుతూ మీ ఇద్దరి ఫోటోని నాకు చూపినపుడు నన్నింకా భగవంతుడు ఎందుకు బ్రతికించాడా అనిపించింది.
    చావాలనుకునే క్షణాలు జీవితంలో రానే కూడదు. కానీ కర్మవశాత్తు వచ్చాక చావు వరించడమే ఉత్తమం. కానీ, చావలేం. బ్రతికీ, చచ్చి వుండునట్లు వుండలేక వుండే పరిస్థితి మాత్రము యే మనిషికీ కూడ రాకూడదు.
    కానీ మనసులో ఓవేపు చిన్నగా అనుమానం తగుల్తుతూనే వుంది. పదేళ్ళుగా నేను కనబడకపోవటంతో నన్ను మరచిపోయినా నేను కనుపించిన మరుక్షణంలోనే నాపై పూర్వం ఉన్న అభిమానం, ప్రేమ, స్నేహం, వాత్సల్యం అవి ఎక్కడికి పోవని ఎప్పటిలా నేను నీ విరజల నీతో సన్నిహితంగా వుండగల్గుతానని.
    అందుకే అతనికి ఏమీ చెప్పకుండా ఓ చిన్న ఉత్తరం రాసేసి ఓ నాటిరాత్రి హఠాత్తుగా బయల్దేరి వచ్చేశాను. అందులో నాకు మైనారిటీ వెళ్ళిందని, నా తలిదండ్రుల్ని కలుసుకోటానికి వెళుతున్నాననీ ఏమాత్రం అల్లరిచేసినా పోలీసు కమీషనర్ కి అంతా తెలియజేసి అరెస్టు చేయిస్తాననీ వ్రాశాను.   
    ఇంక ఏ గలభా జరిగినా అతనికేనష్టం అని మౌనం వహించిందల్లే వుంది. పైగా నేనిక్కడికి వచ్చేస్తున్నది రాయలేదు. అయినా అతనికి తెలుసుననుకో. ఖచ్చితంగా ఇక్కడికే వస్తానని. కానీ భయం అందులో నీవెంట పడితే కాల్చి పారేస్తానని కూడా రాశాను.
    కానీ భగవంతుడు ఎప్పుడూ నెగటీవ్ కంటే భయంకరమైన విషాద సంఘటనలు ఎలా సంభవిస్తాయ్. లోకంలో ఆయనే మైనస్ లో కూర్చోకుంటే_ఇక్కడికి వచ్చాక. ఇంకేమని చెప్పను వేణూ!
    శక్తినంతా వుపయోగించి కన్నీటిని ఆపుకుంటూ అన్నాడు" విరజా! నాకోసం.... నాకోసం....ఈ దౌర్భాగ్యుడి కోసం ఇంతగా దుఃఖించావా!"
    మానవుడు ఎంత తెలివిపరుడైనా కావచ్చు. కానీ దుఃఖం నయయాలలో మాత్రం అతడి మెదడు మొద్దుబారిపోతుంది.
    "నన్ను పిచ్చిదానివి అనేవాడివే వేణు. కానే నేను నీకోసం కాకపోతే నేను నీకోసం కాకపోతే మరెవరి కోసం దుఃఖిస్తాను. ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని కలిగించే వాడివి నీవొక్కడివే. దుఃఖం అనేది నా భయానికి వచ్చిందంటే అది నీ వియోగాన్ని గురించే. నిన్ను నేను నేనంత పదిలంగా మనసులో బంధించుకున్నావో తెలుసా వేణు."
    హఠాత్తుగా ఆమె చేతిని అందుకుని గుండెలకు రాచుకుంటూ విషన్న వదనంతో రుద్దకంఠంతో అన్నాడు.
    "ఈ జీవితం ఇంకా మిగిలే వుందంటే అది నీ కోసమేనేమో విరజా! చాలు విరజా! ఈ జీవితంలో పొందవలసినన్ని అనుభవాలు పొందాయి. నిన్ను మళ్ళీ చూళ్ళేనేమోననుకున్న భావన నన్నెంతగా దహించిందో అదహనునికే తెలుసు. అయినా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా విరజా."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra