"తెలీదు సార్!"
    తొమ్మిదింపావు దాటింది ఒక్కరూ రాలేదు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. కొండమీదికెళ్ళి ఆఫీసర్ల మెస్సులో వున్నారేమో అని చూశా. అక్కడా లేరు. ఆఫీసర్లని నాతో తీసుకొచ్చా.
    ఇంతలో ఒక్కొక్క సార్జంటూ వస్తున్నాడు. వాళ్ళు అంతకి ముందే స్వంత మెస్సులో చిత్తుగా తాగి, బైటకొచ్చి, అక్కడి కక్కడేదారి తప్పిపోయి, చెట్ల చుట్టూ, రాళ్ళ చుట్టూ తిరుగుతూ కక్కూసుల్లో దూరుతూ వాళ్ళలో వాళ్ళే కొత్తవాళ్ళలా మా క్లబ్బుకి దారి అడుక్కుంటున్నారు.
    మొత్తానికంతా వచ్చేసరికి తొమ్మిదిన్నర దాటింది. "అందరూ దయచేసి కూచోండి" నేను.
    ఎవరెట్ అనే సార్జంతు "ఎందుకూ?" అన్నాడు. అంతా గొల్లున నవ్వేరు అతను మూడు చక్కర్లు తిరిగి నవ్వుతూ డ్యాన్సు చేసేడు.
    "ప్లీజ్ ప్లీజ్! అంతా కూచుంటే మనం ఆరంభిద్దాం" నేను దీనంగా అన్నా.
    మరో సార్జంతు తూలుతూ లేచి, "ఆరంభం ఎప్పుడో అయింది. మళ్ళీ ఆరంభించే దేవిటి? అని అహహహ ని నవ్వేడు. తిరిగి అంతా గొల్లున నవ్వేరు.
    నలుగురైదుగురు తెల్లవాళ్ళు కౌంటరు దగ్గరకి జొరబడి "ఏయ్ లహరీ! పపల్ పానీ దేవ్!" అన్నారు గ్లాసులు కౌంటరు మీద టకటకలాడిస్తూ లహరీ వాళ్ళకి పోసేడు.
    అంతే! జూలో జంతువులన్నీ బొంలు విరుచుకు బైటకొచ్చినట్టు అంతా ఒక్కసారి కౌంటరు మీద విరుచుకు పడ్డారు. గ్లాసులు టకటక లాడించేరు. కౌంటరెక్కిపోయేరు. అది విరిగిపోయింది. నిండు సీసా లందుకున్నారు. కార్కులు టపటపా ఎగిరేయి. గళాసులు, సీసాలు తుబ్బె తుబ్బెలయేయి. హాలంతా గాజు పెంకులమయం.
    ఒకమూల ఒకడు బుల్ బుల్ వాయిస్తున్నాడు. ఓసీ చప్పట్లు కొడుతున్నాడు. కొందరు అడుగులు వేస్తున్నారు. కాయితపు గొలుసులు తెంచికొందరు మెళ్ళో వేసుకున్నారు. కొన్ని ఓసీ యితర ఆఫీసర్ల మెళ్ళో వేసేరు. ఒక దగ్గిర అ రు ళ య్య "ఎన్. ఎస్, కృష్ణన్, టి. ఎ. మధురం"ని అనుకరిస్తూ హాస్యం చెప్తూ పాటలు పాడుతూంటే వింటూన్న వాళ్ళు విరగబడి నవ్వు తున్నారు.
    హాలు తొడతొక్కిడి గా వుంది. ఈలోకుంజన్ అనే మళయాళీ సిపాయి బాకు తీసి, చేతులూ కాళ్ళూ జోరుగా తిప్పుతూ "నాకు డ్యాన్సు" చేసేడు. ఎవడిపీక ఎగురుతుందో అని జంకా. కాని అలాంటిదేం జరగలేదు.
    నిషాయెక్కుతూన్న కొద్దీ వెర్రి వికారాలు మారుతున్నాయి.
    పోలయ్య డ్రైవరు, యాభై యేళ్ళవాడు. నల్లగా పొడూగ్గా సొండులా వుంటాడు. తెల్లటి పళ్ళు, బట్టతల, అతను పెళ్ళికూతురు. ఒక సార్జంటు పెళ్ళి కొడుకు. మాత్యూసు మత గురువు. చిరిగిపోయిన కాగితపు గొలుసు ముక్క గ్రంథంలా పట్టుకుని చదువుతూ వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేడు. వాళ్ళు కాయితపు గొలుసులు ఒకరి మెళ్ళో ఒకరువేసుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని అక్కడే రెండడుగులు 'హనీమూన్' ప్రయాణం చేసేరు. పక్కనున్న బెంగాలీ టర్నలు మిత్రా "ఒర్ పోలయ్యా! నువ్వు పెళ్ళి కూతురివా" అని యెగతాళి చేసేడు. పోలయ్యకి కోపం వచ్చింది. అంత వరకూ తను పెళ్ళికొడుకంటున్నాడు. కాని నిజం తెలియగానే కోపం మండిపోయింది, సార్జంటు మీద, మాథ్యూస్ మీదా భూతంలా తిరగ బడ్డాడు. అక్కడొక చిన్నకుమ్ములాటయింది. కాని సర్దుకుంది.
    ఆటలు-పాటలు మాటలు. నృత్యాలు, తోపు లాటలు, దొమ్ములాటలు, హాలు వెదురు గోడలు వంగిపోతున్నాయి. అక్కడక్కడ విరిగిపోయేయి రాత్రి పన్నెండైంది. అంతా యేదో స్వర్గంలో వున్నారు. ఇంతలో గణేశన్ అనే ఫిట్టరు గుభీమని బల్లెక్కి నిలబడి "ఫ్రండ్స్, రోమన్స్, కంట్రీ మెన్" అని ఆరంభించి అరవంలో యేదో లెక్చరు దంచేడు. అంతావిని చూసి సార్జెంటు మేజరు మరొక బల్లెక్కి "ఓ యంగ్ లోకిన్ వార్! కమ్ టు ది వెస్ట్" అని పాడి. "దేర్ వజ్ రేసి-గ్ అండ్ చెకింగ్ ఇన్ కే నోబిలీ..." అని చివాల్న జన సమూహంలోకి గెంతి గుర్రపుదాట్లేసేడు. వెంటనే హాహాకారం బైల్దేరింది. ఒక వందమంది బల్ల లెక్కి దొమ్మరి నృత్యం చేసేరు, టేబిలుకి ఒక కోడు విరిగితే మిగిలిన మూడు కోళ్ళ వేపూ జరిగేరు. రెండో కోడు విరిగితే విరగని రెండు కోళ్ళ వేపు సర్దుకున్నారు. కాని నృత్యం అవలేదు అన్ని కోళ్ళూ విరిగితే, టేబిలు తోబాటు కిందబడ్డారు. కాని నృత్యం మానలేదు. ఫర్నిచరంతా అగ్గి పుల్లలై పోయింది.
    చాలా మందికి తెలివితప్పిపోయింది. కిందపడి దొర్లుతున్నారు. గది బయటికి దొర్లి పోయారు. గుట్ట యేట వాలు మీదికి దొర్లిపోయేరు.
    రెండు గంటలకి అంతా సమాప్తమైంది.
    అది "ఆర్శిస్పీన్ డే సెలిబ్రేషన్"

                                      21

    యుద్ధం ముగిసింది. కాని యింకా యుద్ధ వాతావరణం వుంది. సైన్యాల విడుదల కార్యక్రమం ఆరంభమైంది.
    సుభాస్ చంద్ర బోసు తయారు చేసిన 'ఆజాద్ హింద్ ఫౌజు" వీరులు యుద్ధఖైదీలుగా జట్లు జట్లుగా స్వదేశం వస్తున్నారు.

 

                             
    దేశం నూతన రాజకీయ వాతావరణంతో తుకతుక లాడుతూంది, దేశం దాస్యవిముక్తి పొందే శుభసూచన లగుపిస్తున్నాయి.
    కలకత్తానించి బ్రిగేడియర్ బయీయెమ్ యీ తనిఖీ పర్యటన చేస్తూ చిట్టగాంగు వచ్చేడు.అక్కడ 404 లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏరియా హెడ్ క్వార్టర్సుంది. ఏరియా కమాండర్ కల్నలు జేమ్సు, చండశాసనుడు, అతని పేరు వింటే పిట్టలు నీళ్ళు తాగవు. ఆఫీసర్ల గడగళ్ళాడ్తారు.
    బ్రిగేడియర్ తో కల్నలు కూడా తిరుగు తున్నాడు. వాళ్ళిద్దరూ మా యూనిటు తనిఖీ చెయ్యడానికొచ్చారు. యూనిటంతా చూసి. ఆఫీసులో నాతోకూడా కాస్సేపు మాట్టాడేరు, అయితే నీకు యూనిటు ఆరంభదశ నించీ ఆఫీసు వ్యవహారాల్లో అనుభవముందన్న మాట.....
    'ఔను సర్"
    బ్రిగేడియర్, కల్నలు ఒకరి మొహం ఒకరు చూచుకున్నారు. "నువ్వు పదిమంది చేత పని చేయించి ఆఫీసు నడవగలవన్న మాట.....
    "అలాగే భావిస్తున్నా సర్...."
    వాళ్ళిద్దరూ తిరిగి మొహాలు చూచుకొన్నారు. కల్నలు నా వివరాలన్నీ చిన్న నోటు పుస్తకంలో రాసుకొన్నాడు.
    నాలుగు రోజుల తరవాత నాకు ఏరియా ఆఫీసుకి బదిలీ అయింది.
    ఇది నాకు మంచిదే కాని మనసు చివుక్కు మంది. ఈ యూనిటు పుట్టక ముందొచ్చి. నేను, ఓసీ మొదట అడివిలో వెదుళ్ళు విరిచి నవి ఆరంభించేం. ఇక్కడ పిన్ను దగ్గర్నించి ఏనుగులం తేసి యంత్రాలు. లారీలు అన్నిటికీ నేనే ఇండెట్లు తయారు చేశా. ఈ యూనిటు సిబ్బందితో నాలుగేళ్ళు గడిపా, అందరి గౌరవం అభిమానం పొందా. వాళ్ళందర్ని విడిచిపెట్టడం కష్టంగా వుంది. కాని తప్పదు,
    ఈ బదలాయింపుతో నా హోదా పెరిగింది. నాకు వైస్రాయి కమీషనొచ్చింది. ఓసీ వాళ్ళ మెస్సులో నాకు వీడ్కోలు విందు చేసేడు.
    ఏరియా ఆఫీసులు యెతైన కొండమీదు న్నాయి. అక్కడికి వెళ్ళడానికి సుమారు మూడు వందల మెట్లుంటాయి. కార్లు, లారీలు వెళ్లడాని, విశాలమైన తిరుగుడు మార్గం వుంది,
    మా ఆఫీసు చాలా పెద్దది, అంతా ఆఫీసర్లేకి విభాగానికి నేనే పెద్ద. నా దగ్గర యిద్దరు ఓయసు టైపిస్టులున్నారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక సార్జంటు కూడా వున్నాడు. తన పేరు స్టటన్. అతను "చీఫ్ క్లర్కు ట ను వెళ్ళగానే అతని కాహోదా పోయింది, అతనికి పనిరాదు. ఫైళ్ళు మొయ్యడవే తెలుసు.
    స్టటన్ టైపిస్టుల మీద అధికారం చలాయించే వాడు. వాళ్ళని తిట్టేవాడట, ఆ సాయంత్రం మగ టైపిస్టు భట్టాచార్జీ అన్నాడు. జమదార్ సాబ్! వీడింత వరకూ చీఫ్ క్లర్కుగా చలామణీ అవుతున్నాడు. ఇప్పుడు నువ్వొచ్చాకా సి.సి. అంటే చీఫ్ కూలీ, ఫైళ్ళు బాగా మోస్తాడు.
    నేను పనిలో ప్రవేశించడానికి వెళ్ళినపుడు. మొదట నాకదివరకు పరిచయం వున్న "రిఫ్రిజేషన్ ఆఫీసర్" కెప్టెన్  న్యూసమ్ దగ్గిరకెళ్ళా. అతను నన్న మొదట కల్నలు దగ్గిరకి తీసుకెళ్ళి తరవాత మిగిలిన ఆఫీసర్లందరితో పరిచయం చేసేడు. అప్పుడు మాతో కల్నలు కూడా వున్నాడు.
    "ఇతను మిస్టర్ భట్టాచార్జీ, టైపిస్టు..." కెప్టెన్ న్యూసమ్. "తప్పులు కొట్టడంలో ప్రసిద్ధుడు..." కల్నల్.
    నేను నవ్వేను.
    "మిస్ ఉమ. టైపిస్టు, తప్పులు కొట్టదు కాని ఎప్పుడూ పరాకే. నువ్వావిన్ని మేల్కొలపాలి"
    నేను నవ్వలేదు. ఉమ వేపు తదేకంగా చూశా. గుండె కొట్టుకొంటూంది. కల్నల్, కెప్టెను వెళ్ళి పోయేరు. నేను ఉమ దగ్గిర కెళ్ళా.
    "నీ పేరు... ఉమ?"
    "ఔను సర్..." భయంగా అంది.
    "నాకు నమ్మకం లేదు..."
    "ఏం సర్.....? నిజంగా నాపేరు ఉమ..."
    నా చుట్టూ స్టటస్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.
    "జమదార్ సాబ్? కొన్ని అర్జంటు కాయితా లున్నాయి..." స్టటన్.
    "ఫరవాలేదు......ఇప్పుడే వస్తున్నా....మిస్ ఉమా"
    మీ దేవూరు?.
    "ప్రస్తుతం ఈ వూరే..." ఉమ.
    "జమదార్ సాబ్! పదిన్నరైంది. మరో పావుగంటకి కల్నల్ సాబ్ నిన్ను పిలుస్తాడు. ఇవాళ బుధవారం. ఏరియా ఆర్డర్లు తయారు కావాలి...." స్టటన్.
    "తొందరపడకు, ఆయన పిల్చినప్పుడు వెళ్తా అన్నట్టు సార్జంటు స్టటన్! నీ సీ టెక్కడ?..."
    "ఆ గదిలో- ఆఫీసర్లగదిలో..."
    "అక్కడెందుకూ? నీ సీ టెక్కడికి మార్పించేస్తా. ఇవాళ నించీ యిక్కడే పనిచెయ్యి..."
    స్టటన్ గునుస్తూ వెళ్ళిపోయేడు.
    "మిస్ ఉమా! చిట్టగాంగు మీ స్వగ్రామమా?"
    "కాదు, మాది కొమిల్లా..."
    'నిన్నెక్కడో చూసినట్టుంది. బాగా తెలిసినట్టుంది. కాని..."
    'అసంభవం నేను మిమ్మల్నిదివరకెన్నడూ చూళ్ళేదు."
    "అసంభవం!! ఔను. అచ్చంగా అలాగే అంటుంది పద్మ."    
    "పద్మ! ఓహో! మా పద్మని మీకు తెలుసా?"
    "ఏ పద్మ?" అమాయకంగా ప్రశ్నించా.
    "మా అక్క నాలాగే వుంటుంది. నాకంటే మూడేళ్ళు పెద్ద"
    "ఆమె ఉద్యోగం చేసేదా?"
    "ఔను, కలకత్తాలో, చాలా కాలమైంది వుద్యోగం మాని..."
    "మీది కొమిల్లా..."
    "ఔను మా నాన్నగారు పోయేరు. బెంగతో పోయేరు..."
    "ఓహో! అయితే రంగూన్ ట్రేడింగ్ కో వాళ్ళు నీకేమైనా అవుతారా!"
    "ఆ కంపెనీ యజమాని మా పెదతండ్రి గారే..."
    "నిజం?...."
    "నిజం..."
    "నీలాగే....నీలాగే వుంటాడు- ఆషూ..."
    "ఆషూ....నా తమ్ముడు. ఇక్కడే ఒక మిలిట్రీ యూనిట్లో "బాయ్" గా పనిచేస్తున్నాడు"    
    "భగవాన్!....నీకు లహరీ తెలుసా?"
    ఆమె గాభరాపడి, దిక్కులు చూసి తల దించుకుంది. స్టటన్ గబగబ వచ్చేడు.
    "జమదార్ సాబ్! నువ్వు కాఫీ తాగుతావా! టీనా?"
    "ఏదైనా సరే..."
    "నో నో...ఏదో ఓటి చెప్పాలి..."
    "టీ ప్లీజ్!"
    వెళ్ళిపోయేడు.
    "అయితే నువ్వు మిస్ ఉమని. పద్మ చెలలిని."
    "మీకు పద్మని తెలుసా?"
    "ఒకసారి నేను, ఆమె కలిసి లాంచిలో పద్మా నదిమీద ప్రయాణం చేశాం, చాలాకాలం కిందట. అంతే పరిచయం. పద్మ ఎక్కడుంది?"
    ఆమె జవాబు చెప్పలేదు. నాకు కల్నల్ దగ్గిర్నించి పిలుపొచ్చింది.
    ఒంటిగంటైంది. లంచ్ వేళ, భట్టా చార్జీ గబగబ మెట్లవేపు వెళ్ళిపోతున్నాడు.
    నేను ఏరియా ఆఫీసుకి బదిలీ అయిపోయినా, సిక్స్తిండియన్ క్యాంపులోనే వుంటున్నా. అందుకు యెవ్వరూ అభ్యంతరం చెప్పలేదు.
    "మిస్ ఉమా! నాతో మా యూనిటుకి రాకూ డదూ? కలిసి భోంచేద్దాం..." నేను.
    "ఎందుకండీ. నేను టిఫిను తెచ్చుకున్నా..."
    "అయితేనేం. మెట్లకింద జీపువుంది..."
    "క్షమించండి, ఇవాళ కాదు..."
    "నీతో మాట్లాడాలి. ముఖ్యమైన విషయం. మా యూనిటుకి రేపు సాయంత్రం రా..."
    "మీ యూనిటుకా..." జంకుగా అంది.
    "ఔను, అంటే సిక్స్తిండియన్. ఇప్పటికీ అదే న యూనిటని భావిస్తా.
    "ఒద్ధండీ. మరెక్కడైనా..."
    "అలా అనకు. నువ్వక్కడికే రావాలి. లహరీ వున్నాడుగా. నాకు అతన్ని ఆశ్చర్యంలో ముంచాల్నుంది."
    "ఒద్దు సర్..."
    "ఏం ఫరవాలేదు, రేపు సాయంత్రం మీ యింట్లో వంట చెయ్యొద్దు. చెల్లెళ్ళందర్నీ తీసుకురా. అఘా ఎలాగూ అక్కడే వుంటాడు. అతిథివిగా నువ్వు నాపక్క కూచుంటే లహరీ చేత నీకు వడ్డింపిస్తా."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra