"ఎన్నాళ్ళకి?"
"వారంలోపే"
"రోజుకు ముప్పయి రూపాయలు"
"సరేముందు సగమే యిస్తాను." సేనాపతి అని పిలవబడే నడి వయస్సు వ్యక్తీ ఒక గుడిసెలోకి వెళ్ళి అందులో వున్నవాళ్ళతో ఏదో మాట్లాడాడు. ఐదు నిమిషాల్లో యువతి యువకుడు, యిద్దరూ పిల్లలు చంకలో చిన్న చిన్న మూటలు పట్టుకుని గంపలో కుండలు సర్దుకుని బయటికొచ్చేశారు. క్షణాలలో కొంత దూరంలో వున్న ఖాళీ స్థలంలో నాలుగు వైపులా వెదురు బొంగులు పాతి దాని పైన ఈతాకుల చాప పరిచి గుడిసె తయారు చేసుకుని అందులో చేరిపోయారు. రాగ నేత్తుకున్న యమ్మాయమ్మతో కలిసి జాన్, సుబ్బయ్యలు గుడిసెలో ప్రవేశించారు. అది తాటాకుల గుడిసె మట్టిగోడలు , మట్టినేల, ఏ సామాను లేదు.
"ఇక్కడెలా పడుకోవడం?" అడిగింది యమ్మాయమ్మ.
"అని కోసం హంసతూలికాతలపలు, ముఖమలి దిళ్ళు వస్తాయి రాజు గారి దగ్గర్నుంచి నోరు మూసుకుని పడుకోండి" కసిరాడు జాన్.
భువనేశ్వర్ లో బయలుదేరినప్పట్నించి రాగ యమ్మాయమ్మ వొళ్ళోనే వుంది. చేతులు లాగుతుంటే కింద పడుకోబెట్టింది. ఆ మట్టి నేల తెనుకి రాగకి తెలివొచ్చింది. కొన్ని నిమిషాలు తానేక్కడుందో అర్ధం కాలేదు. చుట్టూ వున్న చీకటి భయపడి, " అమ్మా!" అని ఏడుపు ప్రారంభించింది.
"నోర్ముయి! గొంతు వినిపిస్తే నరికి పోగులు పెడ్తాను." చెయ్యెత్తి రాగ దగ్గిరగా వచ్చాడు జాన్. చటుక్కున ఆ పాపని గుండెల్లో దాచుకుని "నువు ఫో! నేను సముదాయిస్తాలే" అంది యమ్మాయమ్మ ఆ చీకట్లో బయటికి వెళ్ళి పోయాడు జాన్, సుబ్బయ్య వెనక నించి ఎక్కడికి?" అని అరిచాడు కాని సమాధానం రాలేదు. అతని మనసు జీవన్ మీది ప్రతీకారంతో నిండి వుందని అర్ధమైంది.
జాన్ వెళ్ళిపోయాక యమ్మాయమ్మ తన బేగ్ లో నుంచి ఉతికి ఇస్త్రీ చేసిన చీర తీసి, నేలమీద పరిచి రాగని పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. రాగ లేచి కూర్చుని ఆకలి, " అని ఏడుపు ప్రారంబించింది. ఆరోజు నుంచి తరువాత ఏమి తినలేదు ఆ పాప యమ్మాయమ్మ గుండెల్లో రాయి పడింది. పోలిసుల కంట పడకుండా తప్పించుకోవాలనే తాపత్రయంతో పాప ఆహారం మాట పూర్తిగా మరిచిపోయింది. టౌన్ కి దూరంగా విసిరేసినట్లున్నాయి ఆ గుడిసెలు చుట్టూ ప్రక్కల దుకాణాలు ఏం లేవు. ఆ గుడిసెల్లో వాళ్ళని పాలు, పంచదార , బ్రెడ్, బిస్కెట్లు మొదలైనవి అడగటం యెంత హస్యాస్యపదంగా వుంటుందో యమ్మాయమ్మకి తెలుసు. చేసేది లేక, "ఉర్కోమ్మా ఉర్కో. పొద్దున్నే హొటల్ లో తిందాం" అని బుజ్జగించింది.
"నాకు పెరుగు అన్నం కావాలి" అని ఏడ్చింది రాగ చాలా సేపు ఏడ్చో, ఏడ్చి ఆకలితో నీరసంతో సొమ్మసిల్లి నిద్రపోయింది.
నిద్రలో వుండుండి "అమ్మా!" అని కలవరిస్తూ ప్రక్కన పడుకున్న యమ్మాయమ్మా చుట్టూ తన లేత చేతులు వేసి హత్తుకుంటోంది. మనసు తరుక్కుపోసాగింది. యమ్మాయమ్మకి వేడి వేడి అన్నంలో కూరలు, పెరుగు వేసుకుని తిని, పళ్ళు తిని పాలు తాగి మెత్తని ఫోమ్ బెడ్ లో తల్లి పక్కన వెచ్చగా పడుకోవలసిన యీ పసికందు యీ మురుకి గుడిసె కటిక నేల మీద ఆకలితో పడుకుని అమాయకంగా తననే నమ్ముకుంటోంది. ఈ పాప భవిష్యత్తు ఏం కాబోతోంది? ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు కదిలి గుండె గుభిల్లుమంది సుబ్బయ్య కూడా గుడిసెలోంచి బయటికి వెళ్ళి దాదాపు రెండు గంటల తరువాత వచ్చాడు చేతిలో బిస్కెట్టు ప్యాకెట్టుతో.
"పాపకి కనీసం యీ బిస్కెట్లు పెట్టు" అన్నాడు ఆ బిస్కెట్ల కోసం యెంత దూరం నడిచాడో, యెంత శ్రమ పడ్డాడో అతని ముఖం చెప్తోంది. "మాలోను మంచివాళ్ళున్నారు" అనుకుంది యమ్మాయమ్మ.
"నిద్రపోతోంది ఇప్పుడు లేపోద్దు ఉదయం చూసుకుందాం" అంది యమ్మాయమ్మ సుబ్బయ్య మనసులోనూ అదే ఆలోచన పాప భవిష్యత్తు ఏం కాబోతోందో?
తెల్లవారు ఝామున ఐదు గంటల సమయం. తూర్పు రేఖలు విచ్చుకోలేదు. ఎక్కడో దూరాన ఒక కోడికూత వినిపిస్తోంది వుండుండి. ప్రయత్నించిన యమ్మాయమ్మకి నిద్ర రావడం లేదు. గతానికి సంబంధించిన ఆలోచనలు మనసును తొలుస్తున్నాయి. ఎక్కడ పుట్టిందో ఎలా పెరిగిందో యెంత ప్రయత్నించినా గుర్తురావడం లేదు మొదటిసారిగా తనూ ఒక మనిషి నన్న జ్ఞానం కలిగింది పేవ్ మెంట్ మీదనే ఆ క్షణం నించి ఒకటే పోట్లాట. తిండికోసం, బట్టకోసం, పేవ్ మెంట్ మీద చిన్న జాగా కోసం పోట్లాట, పోట్లాట అలా పోట్లాడుతూనే ఎందరితోనో జట్లు కలిసింది. మరెందరితోనో విడిపోయింది. ఎన్నో భాషలు, మరెన్నో విద్యలు, మరెంత గడుసుదనం వంట బట్టించుకుంది.
"నేవెవరో పెద్దింటి పిల్లవై వుంటావు. లేకపోతే యింత తెలివి వుండదు" అన్నాడొకసారి ఒక గాంగ్ లీడర్. తన తల్లి తనని కని పేవ్ మెంట్ మీద పారేసిందేమో అనుకునేది ఇన్నాళ్లూ. ఒకవేళ ఇప్పుడు రాగని కిడ్నాప్ చేసినట్లే ఒకప్పుడు తనని కూడా ఎవరైనా కిడ్నాప్ చేసి పేవ్ మెంట్స్ మీద పారేశారేమో? చీకటి పొరల్లోకి ఇప్పుడెలా చూడగలదు? పక్కన ముడుచు పడుకున్న రాగని చూడగానే కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. అంతలో గుడిసె కున్న వెదురు తాడిక చప్పుడైంది. చటుక్కున లేచి కూర్చుంది యమ్మాయమ్మ మరో మూల పడుకున్న సుబ్బయ్యని లేపింది. అతడు కూడా లేచి కూర్చుని విన్నాడు. వెదురు తడిక మీద కర్రతో కొట్టిన చప్పుడు. సుబ్బయ్య వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా కాకీ బట్టల్లో పోలిస్ కానిస్టేబుల్ నెత్తి మీద ఎర్ర టోపీ గుండె జారిపోయింది యమ్మాయమ్మకి. బింకంగా నిలబడ్డాడు సుబ్బయ్య.
"ఎవరు మీరు? ఆ పిల్ల ఎవరు? కరుకుగా వున్న గొంతుకతో అడిగాడు పోలీసు. యమ్మాయమ్మ ముందుకొచ్చింది. ఎప్పట్లా యింగ్లీషులో, "ఈ అమ్మాయి నా కూతురు. నువెందుకిక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు?" అని డబాయించింది పోలీసు తన లాఠీతో యమ్మాయమ్మ జబ్బ మీద చిలిపిగా కొట్టాడు.
"ఏయ్ పిల్లా! ఇంగ్లీషులో మాట్లాడితే బెదిరిపోతాననుకోకు ఫోటోతో సహా పాప మిస్సయినట్లు అన్నీ సర్కిల్స్ కి వార్త లోచ్చేశాయి. రాత్రికి రాత్రి మీరిద్దరూ ఈ పిల్లతో ఇక్కడికి వుడిపడ్డట్టు వార్త వచ్చేసింది పదండి పోలిస్ స్టేషన్ కి...." అని యమ్మాయమ్మని రెక్క పుచ్చుకుని బయటికి లాగేడు. సుబ్బయ్య , యమ్మాయమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం చెయ్యాలా! అన్నట్లు.
"కదిలారంటే పెల్చేస్తాను." అన్నాడు పోలీసు. సుబ్బయ్య పోలీసు మాటలకి లొంగిపోయి గుడిసెలోంచి బయటి కోస్తున్నట్లు నటిస్తూ పోలీసు వెనక్కి వచ్చి చటుక్కున అతని రెండు చేతులు విరిచి పట్టుకుని మోకాలు వొంచి డొక్కలో తన్నాడు ఆ దెబ్బకి ధన్ మని క్రింద పడ్డాడు. సుబ్బయ్య మళ్ళీ మీదికి రాబోతుంటే పోలీసు గట్టిగా "ఒరేయ్ నన్ను కొట్టకురా! నేను జాన్ ని " అని అరిచాడు అచ్చ తెలుగులో తెల్లబోయారు యమ్మాయమ్మ సుబ్బయ్యలు. ఏందో అనుభవం వున్నవాళ్ళు కూడా పోల్చుకోలేనంతగా రూపం మార్చుకోగలిగాడు జాన్.
లేచి దుమ్ము దులుపుకుని నవేడు గొప్పగా నెత్తిమీద ఎర్ర టోపీ తిసేసాడు. జుట్టు రంగు మారింది. కనుపాపల రంగు మారింది. కనుబొమ్మల తీరు మారింది. మొహం మీద అక్కడక్కడ చేరిన నాలుగైదు పులిపిరి కాయలు ముఖంలో రేఖలన్ని మార్చేశాయి. మూడంగుళాల ఎత్తున్న బూట్లతో ఎర్ర టోపీతో ఎత్తు పెరిగినట్లు భ్రమ కలుగుతున్నాడు.
"ఓర్నీ! ఈ వేషం ఎప్పుడేశావు?" అడిగాడు సుబ్బయ్య లోలోపల యింకా ఆశ్చర్యపోతూ కింద పెదవి పంటి కిందకి తీసుకుని ఉపిరి బిగపట్టింది యమ్మాయమ్మ జాన్ గాడు తన అంచనాలకు మించిన గడుగ్గాయిలా వున్నాడు. వీడితో వ్యవహారం కష్టమే కావచ్చు. "రాత్రికి రాత్రి ఈ వేషంలోకి దిగాను మొదట జీవన్ గాడికి చెప్పాలి. అందాక ఈ వేషం అవసరం. మనం నాలుగైదు రోజులు అక్కడే వుండవలసివొస్తుంది నేను వచ్చి పోతుంటాను.