Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 23

ఈ పిల్ల జాగ్రత్త. మీరు నాకు చెయ్యి యియ్యాలని చూశారో....." సుబ్బయ్య భుజం మీద స్నేహంగా తట్టాడు. "అదేమిటి జాన్! మనమంతా ఒకటి గాదూ! ఆ మాత్రం నమ్మకం లేకపోతే యెలా?" అన్నాడు. యమ్మాయమ్మ వైపు క్రూరంగా ఒక చూపు విసిరాడు. ఆ ఒక్క చూపులో భాషలో చెప్పలేని బెదిరింపులన్ని వున్నాయి. సందడికి రాగ అందరిని చూసింది. మెల్లిగా యమ్మాయమ్మ దగ్గిర కొచ్చి చెవిలో నంబర్ వన్ కి వెళ్ళాలి." అంది.
యమ్మాయమ్మ చెయ్యి పట్టుకుని బయటికి తీసికెళ్తే "చీ! ఇక్కడా? బాత్రుమ్స్ లెవూ?" అంది. ఒక్క నిట్టూర్పు విడిచింది యమ్మాయమ్మా ఈదేశంలో ఆరుబయట సంసారం చేసుకునే కుటుంబాలు చాలానే వున్నాయని ఈ పసిపాపకి ఎలా అర్ధమౌతుంది?" నే అడ్డుగా వుంటానులే వెళ్ళు" అంది. అటు తిరిగి అటూ ఇటూ చాపి పట్టుకుని. విధి లేక యమ్మాయమ్మ చెప్పినట్లు రాగ యేడుపు ముఖంతో "డాడీ దగ్గరికి పోదాం అక్కడ .....ఉంటాయి." అంది.
"అలాగే! పేచీలు పెడ్తే ఆ పోలీసువాడు ఎత్తుకుపోతాడు."
"పోలీసువాడు ఎత్తుకుపోడు ఎడ్రస్ చెప్తే యింటి దగ్గర దింపే.....మిస్టర్....."
జాన్ దగ్గరికి వెళ్ళబోయింది రాగ. చెయ్యి.....ఆపింది యమ్మాయమ్మా నెమ్మదిగా రాగ చెవుల్లో
"వాడు పోలీసు పెద్ద దొంగ. పోలిసైతే పోలిస్టేషన్ లో వుంటాడు. రోడ్డు మీద.....వాడు జాని మనతో వుంటాడా?" అంది. భయంగా చూసింది.
"పోనీమా అమ్మ దగ్గర దింపేయి. డాడీని తరువాత చూస్తాను" ఎంతో జాలేసింది. యమ్మాయమ్మకి ఈ పిల్లకి తల్లి తండ్రి యిద్దరూ కావాలి. తల్లి దగ్గరున్నపుడు తండ్రి కోసం పరిగెట్టింది. తల్లిని విడిచి పెట్టి ఇరవై నాల్గు గంటలు కాకుండానే తల్లి కోసం బెంగ పెట్టుకుంటుంది. కొత్తగా వచ్చిన విడాకుల చట్టాలు, పునర్వివాహాలు యివన్నీ నిజంగా మంచికే వచ్చాయా? పాత సమాజం రూపుమాసిపోయి సరికొత్త సమాజం రూపుదిద్దుకునే లోపల రాగ లాంటి పసికందులు యెందరు నలిగిపోవలసివస్తుందో!
"బ్రెష్ చేసుకుంటాను. టూత్ బ్రెష్ పేస్ట్ వున్నాయా?" అడిగింది రాగ. పక్క గుడిసెలోంచి యింత బొగ్గుపొడి తీసుకొచ్చి రాగ చేతిలో పోసింది యమ్మాయమ్మ ఉహ వచ్చినప్పటి నుంచి ఏనాడూ బొగ్గుపొడితో యెవరైనా పళ్ళు తోముకోవడం చూడని రాగ చేతిలో బొగ్గుపొడి వైపు అమ్మయకంగా చూసింది. ఆ పసిపిల్ల పరిస్థితి అర్ధం చేసుకుని అదొక ఆటగా బొగ్గుపోడితో పళ్ళు తోముకోవడం నేర్పించింది యమ్మాయమ్మా చిన్న పిల్లలు అతి త్వరగా పరిస్థితులతో ఎడ్జెస్ట్ అయిపోతారు. మోచేతి వరకు బొగ్గుపొడి కార్చుకుని ముఖం నిండా మసి పులుముకుని ఎలాగో పళ్ళు తోముకోవడం పూర్తీ చేసింది రాగ. రాత్రి సుబ్బయ్య తెచ్చిన బిస్కెట్ల పేకెట్ ఓపెన్ చేసి రాగకి పెట్టింది.
"బ్రేక్ ఫాస్ట్ కి బిస్కెట్స్ తినరు. ఈవినింగ్ టీ లో తింటారు" అంది రాగ.
ముచ్చటైన ఆ పిల్ల మాటలు వింటున్న కొద్ది పాప మీద మమకారం పెరుగుతోంది యమ్మాయమ్మలో.
"నా తల్లివి కదూ! ఇప్పుడివి తిను. తరువాత ఏదో చూస్తాను. అని నచ్చజెప్పి తినిపించింది. తెల్లవారి వెలుగు రేఖలు వ్యాపించాక గుడిసెల్లో మనుష్యులంతా బయటికొచ్చేశారు. పిల్లలంతా గుడిసెలకు కొంచెం దూరంగా రోడ్ల మీదే మలవిసర్జనకు కూర్చుంటున్నారు. పందులు కుక్కలు యదేచ్చగా మనుష్యులతో చెట్టపట్టాలేసుకు తిరిగితిన్నాయి. గుడిసెలో వాడిన నీళ్ళు ఒక వారకి పోగుపడి మురిక్కుంట ఏర్పడింది.
దాని మించి దోమలు జుమ్మని వెళ్తున్నాయి. గుడిసెల్లోని మగవాళ్ళు కాని, ఆడవాళ్లు కాని ఆ మురికి గుంటని పూడ్చాలని ప్రయత్నించకపోగా యెప్పటి కప్పుడు వాడిన నీళ్ళు ఆ గుంటలో పోస్తున్నారు. ఒక ఫర్లాంగు దూరంలో రోడ్డుమీద నున్న మునిసిపాలిటి కుళాయి దగ్గర నిల్ల వంతు కోసం ఆడవాళ్లు ఒకరితో వొకరు పోటీలు పడుతూ వొకరి నొకరు నిస్సంకోచంగా బండబూతులు తిట్టుకుంటున్నారు.
"ఛ ఛ బేడ్ వర్డ్స్!" అంది రాగ అసహ్యించుకుంటూ.
ఒక తట్టలో ఇడ్లీలు పచ్చళ్ళు పెట్టుకుని అమ్మేవాడు వచ్చాడు గుడిసెల దగ్గరికి. పిల్లలంతా వాడిమీది కెగబడ్డారు. తల్లులు పిల్లల నదిలిస్తూ ఎవరిక్కావలసిన ఇడ్లీలు వాళ్ళు అల్యూమినియం పళ్ళేలలో పెట్టించుకున్నారు. యమ్మాయమ్మ రాగ కోసం ఇడ్లీలు కొంది. "ఇది నేను తినను. ఈగలు ముసురుతున్నాయి" అంది.
"నీయమ్మ ఇలాతే" యమ్మాయమ్మ చేతిలోంచి ఆకులక్కుని ఇడ్లి పచ్చడిలో ముంచుకుని మింగేశాడు జాన్.
"వుండు ఇప్పుడే వస్తాను" అని రాగతో సుబ్బయ్య వైపు వేడికోలుగా చూసి బ్రెడ్ తేవడానికి వెళ్ళింది యమ్మాయమ్మ. ఏం తోచక పిల్లల దగ్గర కొచ్చింది రాగ.
"మీ కాళ్ళకి స్లిప్పర్స్ లేదా?' అడిగింది.
వాళ్ళల్లో పదకొండేళ్ళ కుర్రాడికి కోపం వచ్చింది. వాడు మాట్లాడేది ఒరియా అయినా రాగ మాట్లాడేది అర్ధం చేసుకున్నాడు. ఎందుకంటె ఆ గుడిసెల్లో ఒరియా, తెలుగు, అరవం, కన్నడం యిలా అన్నీ భాషలు మాట్లాడేవాళ్ళు వున్నారు.
"ఏయ్ నీకు బూట్స్ వున్నయనా! గొప్ప" అని ఒరియాలో తిడుతూ ముందు కొంగి ఆ పాప కాలి బూట్లు లాగేశాడు. దబ్బున వెనక్కిపడింది. ఇదే సందుగా మరొకమ్మాయి బాబ్ పిన్ను, రిబ్బను లాగేసింది. ఇంకో అబ్బాయి సిలుకు గౌను చింపేశాడు. ఇంకో అమ్మాయి నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించి ముఖం మీద వుమ్మేసింది. మరోకమ్మాయి తెల్లగా మెరిసే రాగ వొంటి మీద మురికి మట్టి ఇష్టం వొచ్చినట్లు పులిమింది. ఆ మట్టి కళ్ళల్లోకి, ముక్కుల్ల్లోకి నోట్లోకి వస్తుంటే బాధ భరించలేక "మమ్మీ!"  అని అరిచింది రాగ. సుబ్బయ్య బయటకొచ్చి జరుగుతున్నది చూసి పిల్లల్నించి విడిపించి రాగని దగ్గిరకి తీసుకున్నాడు.
"అంకుల్! మమ్మీ దగ్గర కెప్పుడు వెళ్దాం?": అడిగింది రాగ. గుర్రున చూశాడు జాన్.
"మీ మమ్మీ యిప్పుడు నిన్ను రానియదు నువు తన మాట యినకుండా మీ డాడీ యెంట బోయావని మమ్మికి నీ మీద కోపం వచ్చింది. నిన్నింట్లోకి రానియనని చెప్పేసింది" రూడ్ గా అన్నాడు. పాప పెద్ద కళ్ళు భయంతో మరికాస్త పెద్దవయ్యాయి. అతడు చెప్పిన మాటలు జిర్ణించిపోయినట్టు అయోమయంగా చూసింది. ఇంతలో యమ్మాయమ్మ బ్రెడ్ తో వచ్చింది. రాగ బ్రెడ్ తినలేదు. ఆకలి అనలేదు. యమ్మాయమ్మ నడుం చుట్టూ చేతులేసి "అంటి! అమ్మకి నామీద కోపం వచ్చిందా? నన్ను రానియదా?" అంది ఏడుస్తూ.
జాన్ యమ్మాయమ్మ వంక నిశితంగా చూస్తున్నాడు. రాగ తలమీద చెయ్యి వేసి నిమురుతూ, అవును మీ మమ్మీ నిన్ను రానియదు నిన్ను మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. డాడీ చెప్తే మమ్మీ రానిస్తుందిలే." అంది.
"లేదు లేదు. డాడీ చెప్తే అస్సలు రానీదు. డాడీ అంటే అమ్మకి చాలా కోపం! నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళు అంటి! నేను సారీ చెప్తాను." యమ్మాయమ్మ చీర కుచ్చేళ్ళల్లో మొహం దాచుకుని బావురుమంది రాగ.
జీవన్ ని ఆ దశలో చూసి మతిపోయినట్లైంది అణువేదకి. మనసులో ఏ మూలో దాక్కున్న మమత వెల్లువలా పొంగి రాగా అతని బెడ్ దగ్గిరగా వెళ్ళింది.

 Previous Page Next Page