Home » Dr c. ananda ramam » Eenati Sakunthala

    "మీ మామ వెళ్ళిపోయిందని తెలిసిననాడే మంచమెక్కింది. ఎక్కువ ఆవేశం తెప్పించవద్దన్నాడు డాక్టర్. నానమ్మ దగ్గరకు వెళ్ళకు."    
    "అమ్మలేక - నాయనమ్మ దగ్గిరకు వెళ్ళక - నే నెందుకు ఈ ఇంట్లో?"    
    "నా మాట మరిచిపోయావా?"    
    "డాడీ!"    
    "బిబ్రేవ్ మై చైల్డ్! లే-లేచి స్నానం చెయ్యి."    
    "నాకు ఆకలి లేదు."    
    "నాకాకలి మండిపోతోంది."    
    అప్పటికి శకుంతలనవ్వింది. పసిపిల్ల లా శర్మ భుజాలమీద చేతులు వేసి మంచం దిగి, బట్టలు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళింది.
    
                                                                  14
    
    హాల్లో కుర్చీలో కూచోని ఎవరితోనో మాట్లాడుతున్నాడు రాజు గుమ్మంలో నిలబడ్డ శకుంతలను చూడగానే మాట్లాడుతున్న విషయమే మిటో మరిచిపోయాడు. మాట్లాడటం మరిచిపోయాడు. తనను తను మరచిపోయాడు. ఇద్దరి కళ్ళలోనూ సంభ్రమం-ఆనందం-ఆశ్చర్యం-కన్నీళ్ళు-పులకింతలు.....    
    శకుంతల రాజు దగ్గరకు వచ్చిందో, లేక రాజే శకుంతల దగ్గరకు వచ్చాడో, ఏం జరిగిందో ఏమో! ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరున్నారు. ఇద్దరూ అస్పష్టంగా ఏదో మాట్లాడుతున్నారు. ఒకరి మాటలొకరికి అర్ధం కాకపోయినా, ఒకరి మనసులొకరికి అర్ధమయి, అర్ధంగాని ఆనందంతో నవ్వుకొంటున్నారు. తమ చుట్టూ మరికొందరు మనుష్యులున్నారనిగానీ, తాముకాక వేరే లోకముందనిగానీ, వారిద్దరిలో ఏ ఒక్కరికీ ఆ క్షణంలో స్ఫురించటం లేదు.    
    "రాజూ!" అనే రాజు తల్లి గర్జనకు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి కౌగిలిలో మరొకరున్నట్లు గుర్తించారు- సిగ్గుపడ్డారు-విడిపోయారు. కోపంతో రగులుకుపోతున్న తల్లి ముఖాన్ని గమనించారు రాజు అతడి ముఖం భయంతో పాలిపోయింది.    
    "రాజూ! సిగ్గులేదూ? నలుగురినోళ్ళలోనూ నానిన ఆ నీతీ జాతీలేని దాన్ని మన గడపలో ఎందుకడుగు పెట్టనిచ్చావ్? వెంటనే బయటకు పొమ్మను!" మాటలు కావని-పిడుగులు శకుంతల తనచెవులనూ, కళ్ళనూ నమ్మలేకపోతోంది. 'తను చూస్తున్నది తన మేనత్తనేనా? వింటున్నది ఆవిడ మాటలేనా? తనను అల్లారుముద్దుగా చూసే మేనత్త-తనను సంతృప్తి పరచటంకోసం కొడుకునే మందలించే మేనెత్త.....'    
    లోకమంతా గిరగిర తిరుగుతోంది ఏది మంచి? 'ఏది చెడు? ఎవరు తన వాళ్ళు? ఎవరు కానివాళ్ళు? ఈ బాంధవ్యాలు వెనుక ఉన్న అసలు బంధమేది?'    
    "అత్తయ్యా!" బలహీనంగా అంది. దీనంగా దీనాతి దీనంగా ప్రాధేయపడుతున్నట్లుగా అంది.    
    "అత్తయ్య! ఎవరే నీకు అత్తయ్య! నా అన్న కూతురివని ముద్దు చేశానుగాని, ఏ త్రాష్టుడో కనిపారేసిన దిక్కుమాలిన సంతా నానిపని తెలిస్తే నీ ముఖం చూసే దాన్నా? ఒకటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న రంకులాడి కూతురువని తెలిస్తే  నా గడప తొక్కనిచ్చే దాన్నా? హవ్వ! సిగ్గూ శరం ఉన్న మనుషులేనా? కోర్టులకెక్కి బజారునపడి ఏ ముఖం పెట్టుకొని వచ్చావే నా గుమ్మంలోకి?"    
    శకుంతలకి ఈసారి బాధ కలగటానికి బదులుగా కోపం వచ్చింది నిటారుగా నిలబడి, "నేను చేసిన తప్పేమిటి? నన్ను అనవసరంగా తిట్టకండి!" అంది.    
    "ఆఁ," అని నోరు తెరిచింది ఆవిడ. కొడుకువేపు తిరిగి "ఒరేయ్! దీన్ని ఇంట్లోంచి తరుముతావా, లేదా? లేకపోతే నన్నే ఇంట్లోంచి పొమ్మంటావా?" అంది.    
    "అమ్మా! నువ్వు లోపలికి వెళ్ళు" అన్నాడు రాజు.    
    ఆవిడ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.    
    "అయామ్ సారీ శకూ!"    
    వంచిన తల ఎత్తకుండా అన్నాడు రాజు.    
    "అంటే?"    
    "శకూ! నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు నా కిష్టంలేని పనులెన్నో అమ్మతో ఆజ్ఞాపించి చేయించావు. అప్పుడు ఒక్కొక్కసారి నా మనసు బాధపడినా, ఎదురు తిరగలేక పోయేవాడిని. ఇప్పుడు నా మనసు అంతకు వేయిరెట్లు ఎక్కువ బాధపడుతోంది....కానీ..."    
    అతని తరువాత మాటలు శకుంతల వినలేదు. గిర్రున తిరిగి బయతాకు వచ్చేసింది. ఎక్కడకు వెళుతుందో, ఏం చేస్తుందో తెలియకుండా పిచ్చిదానిలా నడవసాగింది. 'తనేం తప్పు చేసింది? తనను లోకం ఎందుకిలా వేటాడుతోంది? పెద్ద బొజ్జ ఉన్న పెద్దమనిషి తనను వాంచించడమే గాక, వార్డెన్ తో రాయభారం పంపటానికి ఎంతమాత్రమూ సంకోచించలేదు. అంత చులకన అయిపోయిందా తను లోకానికి?    
    'గారాబంగా పెంచిన నాయనమ్మకీ, అపురూపంగా చూసుకున్న అత్తయ్యకీ తను ఎందుకు కానిదై పోయింది? ఏం చేసింది? తను ఏంతప్పు చేసిందీ?'    
    రమేష్ స్కూటర్ తన ఎదురుగా ఆగేవరకూ శకుంతల ఈ లోకం లోకి రాలేకపోయింది. అతడ్ని చూసి తనూ ఆగిపోయింది.    
    "శకుంతలా! నాకు తెలుసు - నువ్విలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని...నీ తండ్రిని నేనున్నాను, నాతో వచ్చేసెయ్."    
    "గెటవుట్!"    
    "హౌ డేర్!"    
    రమేష్ శకుంతల భుజం పట్టుకుని బలవంతాన స్కూటర్ మీద కూచోబెట్టడానికి ప్రయత్నించాడు. ఆమె కెవ్వున కేకవేసింది. ఆ కేక విని వచ్చారో, లేక అంతకుముందు నుంచే ఆమెను కలుసుకోవాలను కుంటున్నారో - బ్లూస్కర్ట్స్, లైట్ బ్లవుజ్ లతో కాన్వెంట్ డ్రస్ లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు శకుంతలకు చెరో ప్రక్కనా నిలబడి రమేష్ చేతుల మీద కొట్టారు. ఒకమ్మాయి స్కర్ట్ జేబులోంచి రివాల్వర్ తీసింది. రమేష్ తలదించుకుని వెళ్ళిపోయాడు.    
    "థాంక్స్!" అంది శకుంతల వాళ్ళిద్దరూ చూడముచ్చటగావున్నారు ఆమెకి.    
    "మీరెక్కడికి వెళ్ళాలనుకున్నారో చెప్పండి. అక్కడ దింపేస్తాము."    
    శకుంతల కొంచెంసేపు ఆలోచించింది. ఆ క్షణంలో ఆమెకు తన వాళ్ళనుకొనే వాళ్ళెవరి దగ్గరకూ వెళ్లాలనిపించలేదు. 'డాడీ ఉన్నారుగానీ, నాయనమ్మ ద్వేషం భరించలేదు. రాజు వున్నాడు కానీ, అత్తయ్య కోపం సహించలేదు.'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra