Previous Page Next Page 
అసావేరి పేజి 2

    "అంటే..." ఎందుకో తెలిసిపోయింది కాని అది ఇష్టమో కాదో శంకూకి స్పష్టంగా తెలీడంలేదు.
   
    "అందుకే అంటే...."
   
    "ఆ మాత్రం తెలీని పిచ్చిపిల్లాడివా...."
   
    "మరేమో నాకు భయం."
   
    "అంతేగా" ఇష్టాన్ని చెప్పకుండా చెప్పిన శంకూని చూస్తూంటే మరీ ముద్దొస్తున్నాడు.
   
    "అదికాదు...." ఏది కావాలో మారేది కూడదో తెలీని ఆ వయసుకి అందమైన నిర్వచనంలా అలజడి పడిపోతున్నాడు. "నా కిష్టంలేదు...." ఇంటి ద్వారంకేసి ఓరగా చూస్తున్నాడు బామ్మ వస్తుందేమో అన్న భీతితో "అః భయ్యమేస్తూంది...."
   
    "పోతుంది ఈ ఒక్కసారితో....చాలా ధైర్యం వస్తుంది" మంగ చేతులు శంకూని స్పృశిస్తూన్నాయి. ఎక్కడో....ఎక్కడెక్కడో...బయటికి పలకనని భీష్మించుకున్న వీణలా వున్నాడు తప్ప అప్పటికే నాడుల్లో అతడి కన్తదాకా తెలీని నాదాల ఒరిపిడి...
   
    "నిజం శంకూ....ఒకసారి సరే అన్నావా మరోసారికి నువ్వే వెంట పడతావు...."
   
    "కానీ....నేను నీకంటే చిన్నాడ్ని."
   
    "అయితే...."
   
    "ఆయుష్షు తరిగిపోతుందట....."
   
    "మీ బామ్మందా...."
   
    "అహ.....! తాతయ్య ఎవరితోనో ఎప్పుడో అన్న విషయం గుర్తు కొచ్చింది. కాని ఎప్పుడన్నదీ స్పష్టంగా స్పురణకి రావడంలేదు. అదేంటీ అన్నీ మర్చిపోతున్నాడు" ఇప్పుడతడి కళ్ళు, పరిసరాల్ని గమనిస్తున్నాయి. "మా తాతయ్య చెప్పాడు"
   
    "నీకంటే నేను అయిదేళ్ళు పెద్దదాన్ని....అంతేగా....."
   
    "అస్సలు నాకేం తెలీదు మంగా...." గుటకలు వేస్తున్నాడు. తనకి ఒంట్లో అదోలా అయిపోతూంటే ...."నిజం..."
   
    "నేన్నేర్పుతాను."
   
    "ఏమిటీ?"
   
    "అదే"
   
    "అంటే?"
   
    "అదేమిటో తెలీదన్నారుగా."
   
    "అయ్యో...." వద్దని వారిస్తున్నట్లు ఆమె చేతుల్ని పట్టుకున్న శంకూకి యిప్పుడు ఆమె శరీరంలోని ఎత్తుపల్లాలు తాకుతున్నాయి. అదే....సరిగ్గా అది భరించడమే శంకూకి కష్టంగా వుంది. "వద్దంటే వినవేం."
   
    "నేన్నీకు నచ్చలేదా?" ఈ జాప్యం మంగ తాళలేకపోతూంది.
   
    లేదూ అనలేకపోతున్నాడు....అంటే మంగ బాధపడుతుందనికాదు_అనటానికి అతడికీ బాధగా వుంది.
   
    "నచ్చావా?" అర్ధమవుతూనే వుంది. అయినా చేతుల్ని గుండెల పైకి లాక్కుంటూ అడిగింది- "మరి భయపడతావేం?"
   
    "అదికాదు మంగా.....బలం పోతుందటగా?" అప్పటిదాకా విన్న చాలా మాటలు గుర్తుకొస్తున్నాయి.
   
    "పిరిగొడ్డు" నవ్వేసింది. అక్కడ శంకూని కంగారు పెట్టింది.....నవ్వు కాదు మంగ కళ్ళల్లో పేరుకుంటున్న కాంక్ష. రెచ్చగొడుతున్న ఆహ్వానం.
   
    "నువ్వు ఆటలాడుతుంటావా?"
   
    తలూపేడు.
   
    "ఆడితే బలం పోయిందా?"
   
    "కొంచెం నీరసంగా ఉంటుంది అంతే"
   
    "ఇదీ అంతే...."
   
    "కానీ...నేనిప్పుడూ...." శంకూ వాక్యం ఇంకా పూర్తికానే లేదు.
   
    "ఎప్పుడో ఒకప్పుడు ఏదోలా ప్రతిదీ మొదలు కావాలిగా శంకూ! ఇదీ అంతే...." ఆమెలో సహనం చచ్చిపోయింది. "శంకూ" ఆర్తిగా అతడిని హత్తుకుపోతూంది.
   
    "ఇది నీకే కాదు...నాకూ తొలిసారే....
   
    ఒకపక్క తమాయించుకోలేక పోతున్నాడు. మరోపక్క తప్పు చేయకూడదన్న సంకల్పం.
   
    "రా శంకూ....తెల్లారిపోనీకు...." ఒక నీలినీడ బాధాకరంగానైనా ఆమె మొహంపై మెరిసి మాయమయింది అదికాదు శంకూని ఆ క్షణంలో కలవరపరిచింది.
   
    మంగ కళ్ళల్లో క్రమంగా నీళ్ళు పేరుకుంటున్నాయి.
   
    "నేను తిరుగుబోతుని కాదు శంకూ....తెల్లారిపోతున్న బ్రతుకులో ఒక తోడు కోసం ఆరాటపడుతున్న ఆడదాన్ని....నిజం శంకూ....నేను పెళ్ళి చేసుకుంటే ముగ్గురు పిల్లల తల్లినయ్యేదాన్ని కాని నాకెవరున్నా రని...." అది తన స్థితిపై తిరుగుబాటో లేక ఎవరిమీదో కసో రొప్పుతూ చెప్పుకుపోతూంది. "అయ్యున్నాడు...కానీ మా అయ్యకి నా మీద కన్నా తాగుడు మీద ధ్యాసెక్కువ...అందుకే ఎదిగిన ఆడపిల్లనన్న విషయం మరిచిపోతుంటాడు. కూతుర్ని ఓ అయ్యచేతిలో పెట్టాలన్న విషయం పక్కకుపెట్టి నా సంపాదనాతో తాను తాగి బతికేస్తుంటాడు."
   
    కళ్ళొత్తుకుంటూ ఓ క్షణం ఆగింది.
   
    "నిన్న మొన్నటిదాకా నేనీ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు శంకూ....ఎప్పుడో చిన్నప్పుడు నీతో ఆడుకుంటూ వుండేదాన్ని కదూ! ఆ తర్వాత నువ్వు యీ ఊరొదిలి వెళ్ళావు. నిజానికి యిన్నేళ్ళూ నీ గురించి ఆలోచించనేలేదు శంకూ....యిన్నేళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు యీ మధ్యనే. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేనూ ఆడపిల్లనే అని...అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నిన్ను చూడగానే నువ్వు నాకు కావాలనిపించింది. మొండిదాన్ని శంకూ! అందుకే నువ్వు నా మనసు అర్ధం చేసుకునేట్టు లేవని యీ అర్ధరాత్రి ధైర్యం చేశాను. మగాడే కావాలీ అంటే అది నాకు కష్టం కాదు. కానీ నాకు తొలిసారి నువ్వు నీతో....నా వరకూ...." ఉద్వేగంగా చెప్పుకుపోతూంది.
   
    "గుర్తుందా శంకూ! చిన్నప్పుడు నిన్ను నేను ఎత్తుకునేదాన్ని.....బరువు కాయలేక కిందపడేసేదాన్ని కూడా....కానీ ఇప్పుడు నీకా భయం లేదు. చిన పిల్లాడివిగా మోయగలను...ఆడించగలను....ఇలా..." మంగ ఆవేశంగా వెల్లకిలా పడుకుంది. "నా శంకూ....ఈ రాత్రినుంచీ నువ్వు మగాడివైపో నన్ను నీకిష్టం వచ్చినట్టు నలిపేసి...."
   
    మంగ ఎంత బలంగా ఒడిసిపట్టుకుందీ అంటే అరక్షణంపాటు ఉక్కిరిబిక్కిరై పోయాడు.
   
    వద్దూ అనికేకపెట్టాలనుకుంటూనే కూరుకుపోతున్నాడు. అది కూడా కాదు....పెటేల్మంటున్న బ్లౌజ్ శంకూ సంకెళ్ళ కుత్తుకల్ని కత్తిరిస్తున్నట్లు క్రమంగా అతడూ ఓ మత్తులోకి జారిపోతున్నాడు.
   
    అయినా కంపిస్తున్నాడు.
   
    అది లేత వయసుకీ, యవ్వనపు సరిహద్దుకీ మధ్య సహజంగా జరిగే సంఘర్షణ అని గానీ, ఎదిగిన ప్రతి మగాడి జీవితంలోనూ యిలా ఆలోచించే ఓ సంధికాలం వుంటుందనిగానీ తెలీని శంకూ యిది తనకే పరిమిత మైన ఓ కోరని సంఘటనగా నలిగిపోతున్నాడు. అది కూడా కాదు. ప్రయత్నిస్తే దూరంగా జరిగే శక్తి తనకున్నా అది ఎందుకు సన్నగిల్లిపోతుందో వూహించలేకపోతున్నాడు.
   
    అక్కడ గాలి గొంతు మూగబోయింది....
   
    కాలం రెప్పలార్చుకు స్థంభించిపోయింది.
   
    మంగ రాక్షసంగా నలిపేస్తూంది.
   
    ఆ క్షణాన తన పదకొండు నెలల ప్రాయంలోనే కన్నుమూసిన అమ్మ గుర్తురావడంలేదు శంకూకి పాలి తాగే వయసులో మా అమ్మ పోతే 'కాయం' తిని నా పాలను నీకు పెట్టి పెంచాన్రా అనే బామ్మగానీ, తను నిన్న మొన్నటిదాకా చదువుకోసం అనాధగా పెరిగిఉన హాస్టల్ జీవితంగానీ ఏన్నార్ధం క్రితందాకా ఎన్నో కథలు చెబుతూ కన్నుమూసిన తాతయ్యగానీ, యిప్పుడిక పేదరికంతో కొనసాగించాల్సిన చదువుగానీ జ్ఞప్తికి రావడం లేదు.
   
    అక్కడ పేరుకున్న చీకటి ఇప్పుడు వెన్నెల పాలపుంతగా మారిపోయింది.
   
    అలా ఎంతసేపు గడిచిందో అతడికి గుర్తులేదు.

 Previous Page Next Page