Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

   

     రెండు సంవత్సరాల తరువాత నిర్దోషులుగా ఋజువు అయినట్టు తెలుస్తుంది. కానీ ఏం లాభం, మొదటిరోజు వార్తతోనే షేరుధర టప్ మని పడిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అని ఇంగ్లీషులో సామెత కూడా వుంది.
   
    చెంచురామయ్యా! సరి అయినచోట దెబ్బకొట్టావ్.
   
    రవితేజ ఈ విధమైన ఆలోచనలో వుండగా శర్మ ఇన్ స్పెక్టర్ తో బేరం మొదలు పెట్టాడు. పాతిక వేలిస్తాం వదిలెయ్యండి- టైప్ లో.
   
    రావు నవ్వేడు- "మీకు మా డిపార్ట్ మెంట్ మీదా, ప్రభుత్వం మీదా చాలా చిన్నచూపు వున్నట్టుంది! అందరూ లంచగొండులే వుండరు. మామూలుగా అయితే రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి ఈ వివరాలన్నీ కానీ ఇది మీ మీద కక్షగట్టి ఎవరో చేస్తున్నట్టు నాకే అనిపించింది. అందుకే ఇలా మామూలుగా మాట్లాడుతున్నాను. కానీ అరెస్ట్ మాత్రం తప్పదు. దేశరక్షణ అనేసరికి ఎవరూ స్వంత నిర్ణయాలు తీసుకోవటానికి ముందుకు రారు. బెయిల్ దొరకుతుందో- లేదో కూడా అనుమానమే! నేనిలా మామూలుగా మాట్లాడుతున్నాను కదా అని, దీన్నేదో డబ్బు దాహంలా మీరు భావించటం దురదృష్టకరం".
   
    "సారీ...సారీ" అంటున్నాడు శర్మ.
   
    ఈ లోపులో రవితేజ కల్పించుకుని అన్నాడు. "మేమేగానీ ఈ చీరెల్ని విదేశాలకు పంపాలనుకుంటే 'మా' బేళ్ళలో కట్టి ఎందుకు? మామూలుగా విమానంలో ఏ సూట్ కేసులోనో పెట్టి పంపవచ్చుగా?"
   
    "అవును, అదే నేనూ ఆలోచించాను. పాకిస్తాన్ కి ఎవరూ ఇలాటివి ఓడలో పంపరు. అందుకే ఇది మీమీద కక్షగట్టి ఎవరో చేస్తున్న పని అనిపించింది. అందులో వారు గెల్చారు".
   
    "ఒకసారి అరెస్ట్ అవగానే, తరువాత గంటలో విడుదలయినా, ఆ వార్త పేపర్లో తాటికాయలంత అక్షరాల్తో పడుతుంది" నిస్సహాయంగా అన్నాడు శర్మ. ఆయన ఆ మాటలు అంటుంటే రవితేజ మెదడులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. "ఒక రకంగా మనం దీన్ని - ఐ మీన్- ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు".
   
    "ఎలా?"
   
    "ఈ ఇన్ స్పెక్టర్ సాయం చేస్తే-"
   
    "ఎలా?" ఈసారి రావు అడిగాడు.
   
    "నిజంగా మీరు మమ్మల్ని నమ్మిన పక్షంలో, మమ్మల్ని అరెస్ట్ చేయటానికి రేపొస్తారు రేపు అరెస్టు చేస్తారు మమ్మల్ని".

    "నా కర్ధం కావటంలేదు".
   
    "ఇంకో గంటలో మేము నలుగురం మా డైరెక్టరు పదవికి రాజీనామా ఇచ్చేస్తాం.... డైరెక్టర్ రవితేజని అరెస్ట్ చేస్తే వున్నంత సెన్సేషను మాజీ డైరెక్టర్ ని చేస్తే వుండదు. మిగతాది పేపరువాళ్ళతో మనం ఏర్పాటు చేసుకోవచ్చు- వార్తయొక్క సాంద్రత తగ్గించటంద్వారా".
   
    ఇన్ స్పెక్టరు అయోమయంగా చూశాడు. ఇదంతా బయటికి పొక్కితే తన ఉద్యోగానికే ప్రమాదం. కానీ ఇలాటివి జరక్కూడదు అనలేదు. అసలు ఇలాంటి వ్యవహారాలు ఇలా జరుగుతాయని చాలామందికి తెలీదు. ఇక్కడ 'నేరం' కాదు ముఖ్యం. వీళ్ళ ప్రతిష్ట వాళ్ళు పోగొట్టాలి, అది పోగొట్టుకోకుండా వుండటానికి వీళ్ళు ఎదురు పథకం వేయాలి.
   
    రెండు మల్టీ క్రోర్ కంపెనీలమధ్య జరిగే ప్రచ్చన్న యుద్ధం అది. ఒక్కరోజు పేపరు వార్తకోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టినది ఒక కంపెనీ అయితే, ఒకరోజు దాన్ని వాయిదా వేయటం కోసం ఇంకో లక్ష ఖర్చు పెట్టటానికి మరో కంపెనీ సిద్దపడుతూ వుంది. రావుగానీ డబ్బు తీసుకోవటానికి సిద్దపడే మనిషయితే, ఆ క్షణం లక్షా ఇవ్వటానికి శర్మ సిద్దంగా వున్నాడు.
   
    "ఈ విషయం మూడోకంటికి తెలీకూడదు. మన మధ్యే వుండాలి" ఇన్ స్పెక్టర్ అన్నాడు. "....రేప్రొద్దున్న వచ్చి అరెస్టు చేస్తాను. ఈ లోపులోనే మీరు బెయిల్ ప్రయత్నాలు చేసుకోండి".
   
    "మేము జైల్లో వుండటంకాదు మా ప్రత్యర్దులకి కావల్సింది. మేము అరెస్టయ్యామన్న వార్త చాలు".
   
    రవితేజ అన్నాడు. ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు. చాలా సాధారణంగా, మామూలుగా జరిగిపోయింది.
   
    చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "ఇంత బ్రతుకూ బ్రతికి చివరికి అరెస్టుదాకా వచ్చాం" అన్నాడొక డైరెక్టరు. "ఇప్పుడు ఈ వార్త తెలిసిందంటే నా భార్య గుండె ఆగిపోతుంది".
   
    "ఈ వార్త చివరివరకూ మనకు తెలీదంటే వాళ్ళు జాగ్రత్తగా ప్లానువేసి చేసిందే ఇది" ఇంకో డైరెక్టరు అంటున్నాడు. శర్మ రవిని సలహా అడుగుతున్నట్టు "ఫైనాన్స్ మినిష్టర్ తో మాట్లాడితె...?" అన్నాడు.
   
    ఒక డైరెక్టర్ కల్పించుకుని, "లాభంలేదు. ఇది మామూలు కేసు కాదు. ఎవ్వరైనా భయపడతారు. అసలీ ఇన్ స్పెక్టర్ ధైర్యాన్నే మెచ్చుకోవాలి" అన్నాడు.
   
    అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న రవితేజ, "నాకో ఆలోచన వస్తోంది" అన్నాడు. అందరూ అతడివైపు చూశారు. రవితేజ ఫోన్ దగ్గిరకు లాక్కొన్నాడు.
   
    అతడు దాదాపు మూడుగంటలసేపు వరుసగా ఫోన్లు చేస్తూనే వున్నాడు. అరగంటసేపు ఢిల్లీ మాట్లాడాడు. తరువాత ముంబాయి షిప్పింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాడు. తనకి తెలిసిన మిత్రుడు హోం డిపార్టుమెంట్ లో ఉన్నత పదవిలో వుంటే, అతడిద్వారా ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ లో మరో ఉన్నతాధికారిని పట్టుకొని, అసలు ఫైలు ఏ స్థాయిలో వుందో కనుక్కున్నాడు.
   
    ఈ లోపలే శర్మ బి.పి. ఎక్కువైందని వెళ్ళిపోయాడు. రేప్రొద్దున పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే, అందర్నీ ఒకే లాకప్పులో పెట్టే ఏర్పాటు చేయమని మాత్రం కోరాడు.
   
    బెయిల్ కోసం ప్రయత్నించారు. అదీ లాభం లేకపోయింది. రేపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తేగానీ అసలు విషయం తేలదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రేపెవరో వచ్చి అరెస్టు చేస్తారని ఈ రోజునుంచీ ఏదో అవుతుందని ఎదురు చూడటం దానికన్నా 'అయిపోవటం' మంచిది. ఈ టెన్షన్ భరించలేక శర్మ వెళ్ళిపోయాడు.
   
    రవితేజ ఆఖరి నిముషం వరకూ దీన్ని ఆపుచేయతానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. అరెస్టు అవటం ప్రెస్టేజికి సంబంధించినది. ఏదో ఇన్ స్పెక్టర్ ముందు సాకు చెప్పారు కానీ, రాజీనామాలు ఈ రోజు సమర్పించినా, రేపు పోయేపరువులో దాని ప్రభావం ఏమీ వుండదు. షేరు ధరలోను మార్పు మామూలుగానే వుంటుంది. కానీ ఇటువంటి కేసుల్లో Purchasing Time చాలా ముఖ్యం.
   
    రవితేజకి అంత టెన్షన్ లోనూ నవ్వొస్తూంది. ఎవరో ఎక్కడో మనని ఇరికించటానికి ఏదో చేస్తారు. దాంతో ఈ రూల్సూ వ్యవహారాలు....చివరికి ఏమీ అవదు. షేరు ధరలో మార్పులతో కొంతమంది నష్టపోతారు. లేకపోతే ఎక్కడో ఒక ఓడలో తమ సరుకుతోపాటు మ్యాపు డిజైన్లు దొరకటం ఏమిటి? దానికి ఈ అరెస్టులూ, పబ్లిసిటీ ఏమిటి? నాలుగురోజుల పాటు హడావుడి ఏమిటి? రూల్స్.....రూల్స్...
   
    రాత్రి పదకొండున్నర వరకూ మొత్తం అంతా కలిసి, తమకున్న పరిధుల్లో రకరకాల పలుకుబదులు ఉపయోగించి ప్రయత్నించారు. ఈ రకమైన పరిస్థితుల్ని స్వయంగా పరిశీలిస్తే తప్ప, వర్ణిస్తే అర్ధంకావు. అప్పటివరకూ కోట్లమీద వ్యాపారం చేసేవాళ్ళు, ఈ క్షణం ఎవరు దొరికితే వాళ్ళ సహాయం తీసుకోవటానికి, దేన్నైనా వదులుకోవటానికి సిద్దంగా వున్నారు. రేపు పోలీసుస్టేషన్ లో ఒకగంట, ఆ తరువాత కోర్టులో మరో రెండుగంటలు....
   
    ఇంతదానికి, రేపు పేపర్లో ఈ చిన్న వార్త రాకుండా వుండటానికి లక్షలు ఖర్చు పెట్టటానికి సిద్దంగా వున్నారు.
   
    సమాజంలో (కృత్రిమమయిన) గౌరవానికి మనిషి ఎంత విలువ నిస్తాడో చెప్పటానికి ఇదో ఉదాహరణ. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో, నలుగురి దృష్టి తమమీద పడకూడదు అని భావిస్తాడు. రాత్రి పదకొండింటికి, ఒక స్నేహితుడిని పట్టుకుని, అతడికి తెలిసిన మరో మిత్రుడిద్వారా, మేజిస్ట్రేటుని కదిలించారు. రేపు కోర్టులో హాజరు పర్చగానే బెయిలు లభించేలా వాగ్దానం తీసుకున్నారు. అదొక రిలీఫ్ గుడ్డిలో మెల్ల.
   
    ఇంక ఆ రాత్రికి చేసేదేమీ లేదని నిర్ణయించుకుని డైరెక్టర్లు ఇళ్ళకి కదిలారు. రవి మాత్రం ఇంకేదైనా మార్గం వుందా అని ఆలోచిస్తూనే వున్నాడు. అతడింటికి వెళ్ళేసరికి రాత్రి పావుతక్కువ పన్నెండయింది. మాధవి మెలకువగానే వుంది.
   
    "అయినాయా అర్దరాత్రి వరకూ పార్టీలు, స్నేహితులు-" నాయి తగులుకుంది రాగానే రవితేజ నిశ్చేష్టుడయ్యాడు. అతనెంత టెన్షన్ తో వున్నాడంటే, ఈ తాకిడిని అసలు వూహించలేదు. అతడి మౌనాన్ని మరోలా అర్ధం చేసుకుని, "అసలు ఇంట్లో భార్య అనేది ఒకతుందని గుర్తుంటుందా మీకు బయటకు వెళ్తే?' లేకపోతే వంటమనిషిగా పడివుంటుంది అనుకుంటున్నారా? మీకేం? ప్రొద్దున్న ఎనిమిదింటి వరకూ పడుకుంటారు. తెల్లారేసరికి లేవాల్సింది నేనేగా మళ్ళీ! ప్రతిరోజూ ఇలా పదకొండు దాటాకరావటం, మాకు బయట ఎన్ని పనులుంటాయో నీకేం తెలుసు అని డబాయించటం".
   
    "నేను రాత్రి వచ్చేవరకూ నిన్ను మేలుకుని వుండమని అనలేదు. లేకపోతే ప్రొద్దున్నే లేచి ఇల్లు వూడవమనలేదు. ఈ రెంటిలో ఏది చేయకపోయినా నాకు పర్లేదు".
   
    "అంతేగానీ ఇంటికి మాత్రం తొందరగా రానంటారు".

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra