మోహన్ సాహసించి "పెద్దవారు, మీరే ఇలా పట్టించుకోకుండా ఊరుకుంటే ఇంక శ్యామ్ ఎలా బాగుపడతాడు?" అన్నాడు.
"పట్టించుకాలేదా? ట్యూషన్ మాస్టార్లని పెట్టాను. ఏం కావాలంటే అది ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చచెప్పాను. ఏం చెయ్యమంటావు?"
వృద్దాప్యం మీద పడుతున్నా జనార్ధన్ ఎంతో నిగ్రహంగల మనిషి గనుక బావురమని ఏడ్చేయ్యలేదు కానీ, అయన మాటలు ఇంచుమించు అలాగే ఉన్నాయి ......
శ్యామ్ ను తలుచుకున్నకొద్దీ ఎంత మండిపోతోందో జనార్ధన్ చూస్తోంటే అంత జాలిగాన్ ఉంది మోహన్ కి .....
"శ్యామ్ కు డబ్బు అందనీయకండి. కనీసం అలా అయినా కొంతవరకూ బాగుపడతాడు."
"ఇబ్బందిపడడూ?"
"మీరు అలా మొత్తబడకండి _ తిండికీ , బట్టకూ తప్ప ఒక్కపైసా అందనీయకండి _ ఏదో ఒక ఉద్యోగంలో చేరమనండి. ఈ తిరుగుళ్ళు తగ్గుతాయి. మనం మంచివాల్లనుఇ చెయ్యలేకపోయినా ఆశక్తి దర్జునలకు చెయ్యగలం ......."
జనార్ధన్ వెంటనే 'అలాగే' అనలేదు. అలోచిస్తూ కూర్చున్నాడు. పదకొండు కూడా దాటింది .....
"ఇంక నిద్రవస్తోంది . నువ్వూ వెళ్ళి పడుకోరాద!" అన్నాడు జనార్ధన్ .......
"ఫరవాలేదు" అన్నాడు మోహన్ లేవకుండా.
జనార్ధన్ వెళ్ళి పడుకున్నాడు.
ఇంచుమించు ఒంటిగంట అవుతుండగా వచ్చాడు శ్యామ్ ......
మేలికువగా కూర్చున్న మోహన్ ను చూసి గతుక్కుమన్నాడు __ ఒక్క క్షణమే! మరుక్షణం మామూలుగా "హాలో! మోహన్!" అన్నాడు.
శ్యామ్! నువ్వు చివరకు ఇంతనీచానికి దిగాజరావా!" ఉపోద్ఘతమేమీ లేకుండానే కరుగ్గా అడిగాడు మోహన్ ....
"ఏమిటి నీచం?"
అభం శుభం తెలియని అమాయకురాలైన ఆడపిల్ల జీవితాలు నాశనం చెయ్యటం కంటే నీచం ఉంటుందా?"
అభం శుభం తెలియని అమాయుకులు ..... ఎవరి గురించి?"
"ప్రాసూనను నువ్వు బలవంతంగా కారులో తీసుకుపోలేదు?"
విరగబడి నవ్వాడు శ్యామ్ ......
"అదా, అభం శుభం తెలియని అమాయుకురాలు? ఉద్రేకంలో నేను కాస్త తొందరపడ్డాను. అంటే కాని పద్హతి ప్రకారం కనుసైగ చేస్తే కళ్ళమీద వాలుతుంది ......"
"శ్యామ్!" పట్టరాని అసహ్యంతో కోపంతో అన్నాడు మోహన్ .........
"మోహన్! అది అమాయుకురాలు కాదు, కన్నె పిల్లా కాదు. చెల్లించవలసిన రుసుము చెల్లిస్తే తండ్రి స్వయంగా తెచ్చి మనకప్పగిస్తాడు ....."
"నోరు ముయ్యి ....."
"నేను నోరు మూసుకున్నా జరుగుతున్నా కధ అదే! తల్లి ఒక అప్పలమ్మ , తండ్రి తాగుబోతు , ఆ భోగభాగ్యాలన్నీ వాళ్ళ కేక్కడివి ? అసలు సాంబశివానికి ఈ కుటుంబానికీ ఉన్న ఆ ఆత్మబంధువు ఏమిటి?"
మోహన్ వెంటనే మాట్లాడలేకపోయాడు. ప్రసూన తల్లిదండ్రులనగుణించి ఇటీవలే తెలుసుకున్నాడు. శ్యామ్ చెప్పిన మాటలు నిజమే! కానీ, హరి తానే ప్రసూనాను తారుస్తాడా? ఇది నిజమేనా?
మోహన్ కస్తిష్కం పగిలిపోసాగింది. ......
"నా మాటల్లో నీకు నమ్మకం లేనట్లుంది. సరే! ఆ ప్రసూనాను మనింటికి రప్పించి నీకు చూపిస్తా!"
శ్యామ్ ఇలా సవాల్ చేస్తున్నట్లు మాట్లాడేసరికి మోహన్ కు కంపరం పుట్టింది .......
"సరే! ఏదెలా ఉన్నా ఇంకమీదట జాగ్రత్తగా ఉండు .... పడే పడే నేను నిన్ను విడిపించలేను ....." అన్నాడు మోహన్ .......
"అలాగే!" లోలోపల నవ్వుకుంటూ అన్నాడు శ్యామ్ ......
మోహన్ తన ఉద్యోగానికి రాజీనామా ఇయ్యవలసిందే కాని తనను విదిపిమ్చక మానడని శ్యామ్ కు తెలుసు .....
ఒకసారి శ్యామ్ పట్టిబడినపుడు "శిక్ష అనుభవించనియ్యండి తెలుస్తుంది." అన్నాడు మోహన్ .......
"అదీ నిజమే అనుకో! కానీ ఎంత అప్రతిష్ట! ఆ తరువాత శ్యామ్ కు భవిష్యత్తు ఏముంటుందీ? నా కోసం నువ్వు చిన్న సాయం చేయ్య్గాగలవని నాకు తెలుసు ...." అన్నాడు జనార్ధన్ .......
అప్పటికి ఏమీ అనలేక ఊరుకున్నా మరోసారి జనార్ధన్ తో "మీకు చిన్నప్పటినుండి నేనెంతో ఋణపడి ఉన్నాను ఎంతో కొంత నెల నెలా మీకు ముట్టజెప్పి ఋణవిముక్తుణ్నవుతాను." అన్నాడు మోహన్.
జనార్ధన్ గారు అర్ధంచేసుకుని గడుసుగా నవ్వారు. "అలా ముట్టజెప్పగలిగేస్తోమతు నేను కలిగించినదేకదయ్యా! ఇంక ఋణవిముక్తి ఏమిటి?"
తనకు ఈ విషవలయంలోంచి విముక్తిలేదనే చేదునిజం అర్ధమయిపోయింది మోహన్ కు ......
కఠినంగా ఉంది శ్యామ్ ను శిక్షించాలన్నా, అలా అతని బ్రతుకు అంధకార బంధురం చెయ్యబోయేముందు తనను అంధకారంలోంచి చేయ్యిచ్చి పైకి తీసిన శ్యామ్ సహాయం సంకెల అయిపోయింది.
జనార్ధన్ మోహన్ సలహా నచ్చింది, శ్యామ్ కు డబ్బు అందనీయటంలేదు. ఖండితంగా "ఇయ్యను" అని చెప్పేశాడు. చిన్న ఉద్యోగాలు చెయ్యటానికి శ్యామ్ కు నామోషీ. పెద్ద ఉద్యోగాలు రావు. శ్యామ్ చేతిలో డబ్బుఆడకపోవటం శ్యామ్ కంటే రేఖకు ఎక్కువ బాధ కలిగించింది "ఏమిటో డబ్బు రాధనుకుంటాం. కాని ఎక్కడపడితే అక్కడ బోలెడు డబ్బు .... అంది రేఖ ......
"ఎక్కడ?"
"కోటుజేబుల్లో ఉన్న పర్సుల్లో . ఇక్కడికొచ్చేవాళ్ళపర్సులన్నీ బరువుగానే ఉంటాయి."
"అయితే అవిమనకెలా వస్తాయి?"
"చంటిపాపలా మాట్లాడకు ! ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకువి! మరొక పోలీస్ ఆఫీసర్ తమ్ముడివి .... సూటుబూతు వేసుకుని పెద్దమనిషిలా తిరుగుతున్నావాడివి. తలుచుకుంటే నువ్వు చెయ్యలేనిదేముంది? చాకచక్యం వుండాలే కాని పెద్ద మనుష్యులు ఏంచేసినా ఎవరూ ఏమీ అనరు ......."
ఈ సలహా విని శ్యామ్ చాలా ఆనందించాడు. ఆ సాయంత్రానికి అతని జేబులో అయిదువందల రూపాయలున్నాయి.
ఆ మరుసటినుండే అతనికి తండ్రిని డబ్బడగవలసి అవసరం లేకపోయింది.
హొటల్లోకి వచ్చిన పెద్ద మనుష్యులు కొందరికి శ్యామ్ మీద అనుమానం రాకపోలేదు. సాహసించి ఏమీ అనలేక ఊరుకున్నారు.