"అదేమిటి ? మీరు చిరంజీవితో మాట్లాడితే నేను నొచ్చుకోవటం దేనికి!"
"మీ హోటల్ కి సంబంధించింది గనుక! ...."
"రహస్యం కాకపోతే చెప్పండి వినాలని నాకూ కుతూహలంగా ఉంది ...."
"చెప్పండిసార్! ప్రసూనగారు చాల మంచివారు ...." హుషారుగా అన్నాడు చిరంజీవి ......
"దొంగనోట్లు ముద్రిస్తున్నవారిలో సాంబశివం గారు కూడా ఉన్నారని సమాచారం, అందింది . తగిన ఆధారాలు దొరకడం లేదు. హోటల్ లోటస్ లో ఈ దొంగనోట్ల మారకం జరుగుతోందని రూఢీగా తెలిసింది! సాదరంగా ఆ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో వివరంగా రాసి పెట్టుకుంటారు. అలాంటిది ఆ హోటల్ లో ఎక్కడైనా దొరుకుతుందేమో చూడాలి. ఈ పని నువ్వు చెయ్యగలవా చిరంజీవి?"
ప్రసూన చిరంజీవి ఇద్దరూ ఆశ్చర్యంగా విన్నారు.
"అలాంటిపుస్తకం ఉంటే అది సంపాదించటానికి నేను కూడా ప్రయత్నిస్తాను." అంది ప్రసూన .......
"థేంక్స్! మీ ప్రయత్నం మీరు చెయ్యండి చిరంజీవి! నీ ప్రయత్నం నువ్వు మానకు_."
"అలాగే సార్ !"
'ఒక్కమాట ! నీకే సమాచారం అందినా నాకు వెంటనే తెలియజేయ్యాలి! నాకు మాత్రమె తెలియజేయ్యాలి."
"అర్ధమయ్యిందిసార్ !" నవ్వాడు చిరంజీవి .....
"సార్ ! మీకొక శుభవార్త చెప్పనా? నేను మా కాలేజిస్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా సెలెక్టయ్యాను"
"వెరీగుడ్! కంగ్రాచ్యులేషన్స్ !"
ఈ విజయం సామాన్యమైన విజయంకాదండీ! రవితో పోటీ చేసి నేగ్గాను. రవి అంటే ఎవరో తెలుసా? మంత్రిగారి అబ్బాయి. డబ్బు విరాజిమ్మాడు __ అందరూ అతనే గెలుస్తాడని అనుకున్నారు. నాలుగు ఓట్ల మెజారిటీతో నేను నెగ్గానండీ! నాలుగు ఓట్లు .....
చిరంజీవి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
"నాలుగు ఒత్లయినా రెండు ఒత్లయినా మినిష్టర్ గారి అబ్బాయితో పోటీచేసి గెలిచావంటే నిజంగా గర్వించదగిన విషయం .... విద్యార్ధుల్లో ఈరకమయిన అభ్యుదయం చూస్తోంటే కనీసం ముందు తరాల్లోనయినా మనసంఘం బాగుపడుతుందని ఆశ కలుగుతోంది ....."
"నిజంగా సార్! నాకు ఇంట నమడం ఎప్పుడూ కలగలేదు. మొన్న నా ప్రెండ్స్ అంతా నాకు పార్టీ ఇస్తోంటే నా మానసు రెక్కలు కట్టుకుని తేలిపోయింది. నా జీవితంలో ఇలాంటివే అపురూపమైన క్షణాలు. నేను అతి పదిలంగా మనసులో దాచుకునే అమృత ఘడియలు ......."
జీఫ్ చౌరాస్తా దగ్గరకు వచ్చింది .
"ఆపండిసార్ ! ఇక్కడ నాకు కొంచెం పని ఉంది." అన్నాడు చిరంజీవి .......
మావుఃన్ జీఫ్ ఆపి "నేను చెప్పిన పని మరచిపోకు!" అన్నాడు ......
"భలేవారుసార్! ఈసారి మిమ్మల్ని కలుసుకునేది ఆ ఎరిపోర్టు గురించిన సమాచారంతోనే!" చిరంజీవి దిగిపోయాడు.
మోహన్ జీఫ్ ను ప్రసూన ఇంటిముందు ఆపాడు. ప్రసూన క్రిందకు దిగి "థేంక్స్" చెప్పింది ....
ఆవిడను అంత త్వరలో వదలి వెళ్ళాలనిపించలేదు మోహన్ కి .......
"ఇమాట కష్టపడి ఇంటిదగ్గిర దింపితే నాకు కాఫీ అయినా ఇయ్యరా?" అల్లరిగా అన్నాడు.
గతుక్కుమంది ప్రసూన....
రాధమ్మను తన తల్లిగా మోహన్ కు పరిచయం చెయ్యాలంటే ఎలాగైఒ అనిపించింది. ఒకవేళ తండ్రికూడా ఉంటే? ఏ దశలో ఉంటాడో ? తాగి తూలుతూ ఉంటే?
వాలిపోయిన ప్రసూన ముఖం నిశితంగా పరిశీలిస్తూ "నేను వెళ్ళొస్తాను ......" అన్నాడు మోహన్.
ప్రసూన చేతులు జోడించింది.
జీఫ్ స్టార్టయింది. అది కనుమరుగయ్యేవరకూ నిల్చుని ఆ తరువాత అడుగులు ఎద్ద్చుకుమ్తూ లోపలికి నడిచింది ప్రసూన .....
9
శ్యామ్ మోహన్ ను తప్పుకు తిరుగుతున్నాడు. విధి లేక శ్యామ్ ను కస్టడీలోంచితప్పించినా ఆ తరుఅవాట మోహన్ శ్యామ్ ను ఛీవాట్లు పెట్టక మానడు. దానివల్ల ప్తయోజనం లేదనీ, కంఠశోష మాత్రమేనని తెలుసు. అయినా ఆ మాత్రమయినా అనకుండా ఉండలేడు.
ఆ రోజు ఏమైయినసరే శ్యామ్ ను కలుసుకుతీరాలని జనార్ధన్ ఇంట్లోనే కూర్చున్నాడు మోహన్.
రాత్రి పడయినా మోహన్ కదలకపోయేసరికి జనార్ధన్ ఆవులించి "శ్యామ్ కోసం చూస్తున్నావా? వాడేప్పుడు వస్తాడో ఎవరు చెప్పగలరు ?" అన్నాడు ......
జనార్ధన్ మాటల్లో ఆవేదన లేకపోలేదు. కానీ, అంతకు మించిన విసుగుదల ఉంది ......