Home » Yerramsetti sai » Bomma Borusu


    "డైలాగులు బాగానే వాడుతున్నావ్ లే! ఈ అతితెలివి మొదట్నుంచీ ఉందేగా!" "టీ" తాగి అతనువెళ్ళి పోయాడు తిరిగి వచ్చేసరికి రాత్రి రెండు గంటలయిపోయింది.
    అతను తాగి ఉన్నాడని ఇట్టే గ్రహించిందామె. కొంచెం తూలుతూనే బట్టలు మార్చుకుని మంచం మీదకు వరిగిపోయాడతను. మద్యంవాసన వెగటు కలిగిస్తోంది హేమకు. అతనికి దూరంగా జరిగి గోడవేపు తిరిగి పడుకుందామె. అప్పుడప్పుడూ ఇలా 'పార్టీ' అన్న పేరుతో అతను తాగి రావటంమామూలే వివాహమైన కొత్తలో తను అతనిని తాగవద్దనికోరింది.
    "నాకిదో అలవాటు కాదుగా! ఎప్పుడయినా ఓసారి స్నేహితులతో పార్టీలో తాగడమే! అదీ కంపెనీకోసం అంతే!" అంటూ సముదాయించాడు. అలాగే ఎప్పుడన్నా ఓసారి పార్టీలు జరుగుతూండేవి.
    "హేమా!" ఆమెకు దగ్గరగా జరిగి ఆమెను తనవేపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తూ పిలిచాడతను. అతనిని తోసివేసి వెనక్కు జరిగిందామె. వాంతయేట్లనిపిస్తోంది ఆ వాసన.
    "అలాపోతావేం?" తనే ఆమెకు దగ్గరగా జరుగుతూనవ్వాడతను.
    "నన్ను నిద్రపోనీండి!" అతని చేతిని తోసివేస్తూ అందామె.
    "ఎప్పుడూ నిద్రేనా?" ఆమె ముఖమంతా ముద్దులతో నింపేయసాగాడతను.
    ఆమె ఆ వాసన భరించలేకపోతోంది. "ప్లీజ్! ఆ వాసన తిప్పుతోన్నట్లుంది వదలండి!" బ్రతిమాలుతూఅందామె.
    "హేమా! నా మూడ్స్ పాడుచెయ్యకు...." కోపంగా అన్నాడతను.
    "మీరే నా నిద్రపాడు చేస్తున్నారు"
    అతను మాట్లాడకుండా ఆమె చీరపట్టుకుని లాగాడు. చీరకట్టు ఊడి అతనిచేతికి వచ్చింది. ఆమె ఇంక సహించలేకపోయింది. "అయితే నా ఇష్టా ఇష్టాలతో మీకేమీ ప్రమేయం లేదన్నమాట! అంతేగా?" మంచందిగి దూరంగా జరుగుతూ అంది ఆవేశంగా.
    తనచేతుల్లోకి వచ్చినచీరను విసిరి అవతలపడేశాడతను.
    "నా ఇష్టా ఇష్టాలకు నువ్వు గమనించనప్పుడు నిన్ను నేనెందుకు గౌరవించాలి?" ఆమె దగ్గరగా నడుస్తూ అన్నాడతను.
    ఆమె మరింత దూరం నడిచిగోడకు ఆనుకుండి పోయింది. "నాకువాసన పడదని చెప్పానుకదా! మీకాంత పట్టుదల ఏమిటి?" కళ్ళవెంబడినీళ్ళు తిరుగుతూండగా అందామె. "నీకే కోరిక కలిగివుంటే అప్పుడీ వాసను పట్టించుకునేదానివా నువ్వు!" హేళనగాఅడిగాడతను.
    "ఎప్పటికీనేనా వాసనను సహించలేను. ఎలాంటి కోరికను కూడాహరించి వేస్తుంది..." "హేమా! టైమ్ వేస్ట్ చేయకు! నాకు కావలసింది ఇప్పుడు వాగ్వివాదాలు కాదు! ఇలారా!" ఆమె చెయ్యిపట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడతను.
    "ప్లీజ్! బలవంతం చేయకండి! నాకు మనసు లేకుండా బలవంతం చేస్తే మీకు మాత్రం ఆనందం ఏముంటుంది?" సిగ్గువిడిచి అందామె బ్రతిమాలుతున్నధోరణిలో.
    "హేమా! అనవసరంగా వాగి టైమ్ వృధా చేయకు...." పొంగుకొస్తున్న ఆవేశంతో అన్నాడతను. ఆమెను రెండు చేతులతోనూ గట్టిగా తనకేసి అదుముకుని మంచంవేపులాగబోయాడు. హేమ అతనిని తోసివేయడానికి ప్రయత్నించేసరికి అసలే తూలుతున్న అతను బాలెన్సుతప్పి వెనుకకు పడిపోయాడు. అతని తల గోడకుకొట్టుకుంది. కళ్ళు బైర్లుకమ్మినట్లనిపించినయ్. కూడదీసుకుని తిరిగి లేచినిలబడ్డాడతను.
    "నీపొగరు ఎలా అణచాలో నాకు తెలుసు" ఆమె చెంపమీదబలంగా కొట్టాడతను. ఆమె బాధతో విలవిలలాడింది. కళ్ళవెంబడి జలజలాకన్నీళ్ళు రాలిపోయినయ్.
    "రాస్కెల్! నీ అంతు చూస్తాను! ఇంకోసారి అలాంటి మొండిపట్టుపట్టకుండా అసలు నీచేతులు విరిచేస్తాను...." ఆమె చేయి అందుకుని మెలి పెడుతూ అన్నాడు.
    హేమనొప్పి భరించలేక మెలికలు తిరిగిపోయింది. ఆ బాధ భరించడం సాధ్యంకాక అతనివేపు తిరిగి అతని చేతిని బలంగా కొరికిందామె. అతను చేయి వదలగానే తక్షణం గదిలోనుంచి హాల్లోకి పరుగెత్తిగది తలుపులు బయట గొళ్ళెం పెట్టేసింది.
    అతను కొద్దిసేపు గట్టిగా కేకలువేస్తూ తలుపు బాదాడు గానీ ఆ తరువాత కమ్ముతున్న మైకంలో మంచంమీదకు వరిగి నిద్రలోకి జారిపోయాడు. రాత్రంతా సోఫాలోనే నిద్ర లేకుండా గడిపివేసిందామె. తలచుకున్న కొద్దీ దుఃఖం పొంగుకొస్తోందామెకి. అతనలా అమానుషంగా ప్రవర్తించడం ఆమె మనసుని పూర్తిగా కల్లోల పరిచింది. రాన్రాను క్లిష్ట తరమయిపోతున్న తన సంసార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అతని పద్దతులను కొంతవరకయినా ఎలామార్చాలో అవగాహనకావడంలేదు.
    తను ప్రయత్నిస్తున్నకొద్దీ అతను మరింత మొండిగా తయారవుతున్నాడుగానీ తనను అర్ధంచేసుకోవడం లేదు. ఇలాంటిమనిషికి తన విలువ తెలియాలంటే అతని ఎదురుగా ఉండడంకంటే కొద్దిరోజులు దూరంగా గడపాలి! కొంత కాలంపుట్టింటి కెళ్ళిగడిపితే అప్పుడుగాని అతగాడికి తెలిసిరాదు. అతని తప్పు తెలుసుకునివచ్చి ప్రాధేయపడేవరకూ మళ్ళీ రాకూడదు.
    పూర్తిగా తెల్లారేవరకూ ఆలోచిస్తూనే ఉందామె. తను తీసుకున్న నిర్ణయం అమలుచేయడం తప్ప మరోమార్గం కనిపించడంలేదామెకు. లేచి అతని గదితలుపుగొళ్ళెం తీసి లోపలకు చూసిందామె. శ్రీనివాసరావ్ ఇంకా గాఢనిద్రలోనే ఉన్నాడు. గదిలోకి నడిచితన సూట్ కేసులో బట్టలు సర్దుకోసాగిందామె. ఆ పని పూర్తవగానే స్నానంచేసి అద్దం ముందు నిలబడి ముస్తాబవుతోంటే శ్రీనివాసరావ్ కి మెలకువవచ్చింది. లేస్తూనే టైమ్ చూసుకున్నాడతను.
    "అరె! తొమ్మిదిన్నర అయిపోయిందా?" అన్నాడు హడావుడిగా లేచి కూర్చుంటూ.
    హేమ ఏమీ మాట్లాడలేదు.
    ఆమె ఎక్కడికో వెళ్తున్నట్లు అలంకరించుకోవడంచూసి అతనికి ఆశ్చర్యం కలిగింది.
    "నేను ఆఫీస్ కెళ్ళాలని తెలీదా? నన్నెందుకు నిద్రలేపలేదు?" ఆమె నుద్దేశించి అడిగాడతను.
    ఆమె జవాబివ్వలేదు. అద్దం ముందు నుంచీ పక్కకు జరిగి తెరచిఉన్న సూట్ కేస్ మూసివేసితాళం వేసి, తాళంచేతులు తనపర్స్ లో పడేసుకుంది.
    ఆమెకుకోపం ఇంకా పోలేదని తెలిసిపోయిందతనికి. రాత్రి జరిగిందంతాగుర్తుకొచ్చేసరికి నవ్వూ, కోపం రెండు కలిగినాయతనికి. "ఎక్కడికి ప్రయాణం?" అడిగాడతను.
    "మా ఇంటికి!"
    "ఎందుకూ?"
    "వెళ్ళాలనిపించింది....."
    "కారణం?"
    "ఏమో!"
    "ఇంత హఠాత్తుగా ఎందుకు అనిపించింది?"
    "నాకు తెలీదు!"
    "వెళ్ళడానికి నా అనుమతి అవసరంలేదా?"
    "వెళ్ళేప్పుడు చెప్పేదాన్నే!"
    "ఒకవేళ నేను ఒప్పుకోకపోతే...."
    "ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వెళ్ళాలనే అనుకున్నాను".
    "నాకిష్టంలేకపోయినాసరే?"
    "మీరు అన్నీ నాకిష్టమైనవేచేస్తున్నారా?"
    "పెళ్ళాం ఇష్టా ఇష్టాల ప్రకారం నడుచుకోవాల్సినగతేం పట్టలేదునాకు! నా భార్య నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!"
    "అయితే మీ ఇష్టాఇష్టాల ప్రకారం నడుచుకోవలసిన అవసరం నాకు కూడా లేదు...." తెగింపుగా అందామె.
    "నా ఇంట్లో ఉన్నంతకాలం నోర్మూసుకుని నేను చెప్పినట్లు వినాల్సిందే...." కోపం అణచుకుంటూ అన్నాడతను.
    "అందుకే ఇక్కడినుంచి వెళ్ళిపోయికొంత కాలంపాటు ప్రశాంతంగా గడపదల్చుకున్నాను...." ఆమె నిర్లక్ష్యధోరణి అతనిని రెచ్చగొడుతోంది.
    "ఓహో! అలాగా! అయితే నువ్వీ ఇంట్లో నుంచి ఎలా వెళతావో నేనూ చూస్తాను!" కసిగా అన్నాడతను.
    హేమ ఇంకేమీ వాదించకుండా హాల్లోకినడిచి సోఫాలో కూర్చుండిపోయింది. అతనితో ఇంక వాదించడంవల్ల ఇద్దరి మధ్యా మరింత ఏవగింపు కలగడం తప్ప మరో ప్రయోజనంలేదని తెలిసిపోయింది.
    శ్రీనివాసరావ్ కి ఏం చేయడానికీ తోచలేదు.
    "నువ్వీ ఇంట్లో నుంచి ఎలా వెళతావో చూస్తాను. "అనయితే బెదిరించాడుగానీ నిజానికి ఆమెను ఆపడం ఎలా సాధ్యమో తెలీడంలేదు. తను ఆఫీస్ కెళ్ళినప్పుడు వెళ్ళిపోతే తనేంచేయగలడు? లేదా తను బాత్ రూమ్ లో ఉన్నప్పుడు ఆమె రిక్షా ఎక్కేస్తే? ఇక బస్ స్టాండ్ లోనూ రైలు స్టేషన్లోనూ రభస పడడం ఏం బావుంటుంది? టైము చూసుకున్నాడతను. పది దాటుతోంది.
    ఎలాగూ ఆ రోజు ఆఫీస్ పోయినట్లే ఇక! పది దాటాక వెళ్ళడంకంటే వెళ్ళకపోవడమే మంచిది. అదీగాక తను ఆఫీస్ కెళితే ఆమెవాళ్ళ ఊరికి బయల్దేరివెళ్ళిపోవడం ఖాయం. ఆమెను అంతతేలిగ్గా వదిలేయడం తనకిష్టం లేదు. అది తన బలహీనతగా తీసుకుని ఎప్పుడే గొడవజరిగినా పుట్టింటికి బయల్దేరితే ఇంక తనంటే గౌరవం ఏముంటుందీ? తనమాట అస్సలు లెక్కచేయదు.
    తను బాత్ రూం లోకి నడిచి త్వరత్వరగా ముఖంకడుక్కుని వచ్చి ఆమె కెదురుగ్గా కూర్చున్నాడతను. వీలయినంతవరకూ ఆమెతో సౌమ్యంగానేమాట్లాడి ఆమె నాప్రయత్నం నుంచి విరమింపజేయాలని నిశ్చయించుకున్నాడతను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra