Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    "అఫ్ కోర్స్..." త్రినాధ్ అప్పటికే ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.

    ఆయన నీకు నీ దగ్గరున్న కీ తో స్టార్ట్ చేయగల కారును బహుమతిగా ఇచ్చారు... యూ ఆర్ సో లక్కీ..."

    ముందు అతనేమన్నాడో త్రినాధ్, గుప్తాలకు అర్ధం కాలేదు.

    అర్ధమయ్యాక దిగ్భ్రమ చెందారు.

    "అతనెవరు? ఎందుకు మాకు కారు బహుమతిగా ఇచ్చారు...?" త్రినాధ్ తనలో రేగుతున్న ఉద్వేగాన్ని అణుచుకుంటూ అడిగాడు.

    "ఎందుకు వారికి నచ్చావో తెలియదు-"

    "కారు ఎందుకు బహుమతి ఇచ్చారో అర్ధం కావటం లేదు..." థ్రిల్లింగ్ గా ఫీలవుతూ అన్నాడు త్రినాధ్.

    "అది అనూహ్యం. ఒక్కటి మాత్రం నేను చెప్పగలిగేది. నువ్వు గొప్ప అదృష్టవంతుడివి" అన్నాడు కొరిసా.

    "కాని ఉచితంగా వచ్చే బహుమతిని నేను అంగీకరించను..." అంటూ జేబులో వున్న కారు కీ తీసి టేబుల్ మీద పెట్టేశాడు త్రినాధ్.

    ఈసారి మతి పోగొట్టుకోవటం కొరిసా వంతయింది.

    "ఆయనిచ్చిన బహుమతిని తిరస్కరించిన వారికి ఆయన తన కంపెనీ లాబరేషన్ కోపరేషన్ ఎలా ఇస్తారు...?" కొరిసా మాటలింకా పూర్తికాలేదు.

    త్రినాధ్ పెను ఉద్వేగంతో వేసిన కేక ఆ రూమ్ ఎ.సి. కాకుండా వుంటే కొన్ని ఫర్లాంగుల దూరం వినిపించి వుండేది.

    అంటే... అంటే... తాము అరగంట క్రితం ఏ వ్యక్తితో అయితే గంటన్నరసేపు మాట్లాడామో అతను హోండా-?!

    త్రినాధ్ ని చుట్టుముట్టిన ఎగ్జయిట్ మెంట్ అతన్ని స్థిమితంగా కూర్చోనివ్వలేదు.

    "మీలో వున్న ఒక మంచి లక్షణం వారి దృష్టికి వచ్చి వుంటుంది. అందుకే మీకు కారు ప్రజెంట్ చేశారు. కొలాబరేషన్ గురించి నావద్దకు వెళ్ళమని అన్యాపదేశంగా సజెక్ట్ చేసి వుంటారు" నకసోనే కొరిసా చెప్పుకుపోతున్నాడు.

    కాని అవేవీ త్రినాధ్ ని చేరటంలేదు.

    అతని ఆలోచన్లు ఎక్కడో వున్నాయి. ఒక సాధారణ వ్యక్తిలా హోండా తమ వద్దకు రావటం- తన జీవితాన్ని తనే రెండో వ్యక్తిలా చెప్పటం- హోండాకి మేజిక్ అంటే ఇష్టం అని కూడా చెప్పాడు. చెప్పి ఉత్తచేతులు చూపించి వాటిని గాల్లో త్రిప్పి హోండా ఎకార్డో కారు కీ ఇవ్వడం- కనీసం ఆ మేజిక్ డిమాన్ స్ట్రేన్ చూసైనా తను ఆయనే హోండా అని అనుమానించపోవడం-?

    "ఇంతకు హోండాను ఆకర్షించిన ఉత్తమ లక్షణం ఏమిటి తన దగ్గరుంది? లక్షల రూపాయల కారును తనకు ప్రెజెంట్ చేసినప్పుడైనా అనుమానించలేదు.

    ఇంతకీ ఆ ఉత్తమ లక్షణం...?

    "మీరు ఉప్పు, కారం తగ్గించమన్నారు గదా...? అదే నచ్చి వుంటుంది వారికి..." గుప్తా తెలుగులో అన్నాడు త్రినాధ్ ఆలోచనల్ని చదివేసినట్లు.

    "థాంక్యూ... మేడమ్... థాంక్యూ!" అని మనస్సులోనే మాలిని దేవికి కృతజ్ఞతలు అర్పించాడు త్రినాధ్.

    "ఇప్పుడు ఓసారి వార్ని కలవచ్చా...?" త్రినాధ్ ఆశగా అడిగాడు కొరిసాను.

    అతను తమాషాగా భుజాలు కదిలించి- "నేనీ కంపెనీలో చెరి ఇప్పటికి పాతిక సంవత్సరాలైంది. నేనే ఇంతవరకు ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేదు.

    త్రినాధ్ ఆశ్చర్యపోయాడు మరోసారి.

    "చిన్న రిక్వెస్ట్... ఏదైనా నా కష్టార్జితమే నాకు ఆస్థులూ, అంతస్థులూ తెచ్చిపెట్టాలి తప్ప మరొకటి కాదు. కనుక నేను కారును బహుమతిగా తీసుకోలేను. నేను మీకు తగిన వ్యాపారవేత్తనని మీరు భావిస్తేనే నాకు కొలాబరేషన్ ఇవ్వండి. నాకీ దేశంలో సాంకేతిక సహకారం లభించకపోయినా పెద్దగా బాధపడను. దాన్ని ఎప్పటికైనా, ఎలాగైనా నేను సాధించుకు తీరతాను. అంతటి మహోన్నత వ్యక్తిని చూసినప్పుడే నా జన్మ ధన్యమైంది..." అన్నాడు అరగంట క్రితం గంటన్నరనే తలుచుకుంటూ.

    ఈసారి మతిపోవటం గుప్తాకి వర్తించింది. సకసోనే ప్రశంసగా చూసాడు త్రినాధ్ వైపు. "అంటే కొలాబరేషన్ వద్దన్నమాట...?" నకసోనే ప్రశ్నించాడు.

    త్రినాధ్ లేచాడు.

    అది చూసి గుప్తా కూడా లేచాడు.

    అదే కండీషన్ అయితే ఇక మాట్లాడాల్సిందేమీ లేదన్నట్లు త్రినాధ్ నకసోనేకి నమస్కరించి బయటకు వెళ్ళేందుకు ఉద్యుక్తుడయ్యాడు.

    త్రినాధ్ మరో అంగలో డోర్ ని సమీపిస్తుండగా కొరిసా సీట్లోంచి లేచాడు.

    "శెభాష్... త్రినాధ్... శెభాష్...

    ఇంతకాలం వరకు ఇండియన్స్ పై మాకున్న దురభిప్రాయాన్ని నీ అత్యున్నత వ్యక్తిత్వంలో తొలగించేసావ్" అన్నాడు.

    త్రినాధ్ చటుక్కున వెనుదిరిగాడు. నకసోనే చిరునవ్వుతో తన వేపే చూస్తున్నాడు. ఆ కాంప్లిమెంట్ ఏ ఉద్దేశంతో చేసిందో ఓ క్షణం అర్ధం కాలేదు త్రినాధ్ కి, గుప్తాకి.

    "రండి... వచ్చి... ఇలా కూర్చోండి" అన్నాడు నకసోనే. ఎందుకో ఇంకా అర్ధం కాకపోయినా ఇద్దరూ వచ్చి నకసోనే ఎదురుగా కూర్చున్నారు మరల.

    "నీ వ్యక్తిత్వంతో విజయం సాధించావ్ మిస్టర్ త్రినాధ్. నాకు బాస్ నుంచి వచ్చిన సూచన ప్రకారం ప్రవర్తించాను. ఫ్రీగా ఇచ్చిన కారును నీవు స్వీకరించి వుంటే నీకు కొలాబరేషన్ లభించి వుండేదికాదు. పెద్ద వాళ్ళ మనస్తత్వాలు విచిత్రంగా వున్నట్టు అనిపించినా చాలా లాజికల్ గా వుంటాయి. మీరు బాస్ ని కలిసాక, మీరు నా దగ్గరకు వచ్చేలోపే బాస్ నాకు ఫోన్ చేసి మీరు వస్తారని గిఫ్ట్ తీసుకుంటేనే కొలాబరేషన్ ఇస్తామని లేదంటే ఇవ్వమని చెప్పి ప్రలోభ పెట్టమన్నారు. మీరు ప్రలోభపడి కారు బహుమతిని ఎగిరి గంతేసి స్వీకరించి వుంటే కొలాబరేషన్ ఇవ్వొద్దని కూడా చెప్పారు. ఉచితంగా వచ్చేది పూచిక పుల్లయినా మీరు స్వీకరించని ఆత్మాభిమానులని ప్రూవ్ అయితేనే కొలాబరేషన్ ఇచ్చేటందుకు అంగీకరించమన్నారు. ఇకపోతే మీమూలంగా నన్నో అదృష్టం వరించింది. అది బాస్ తో ఫోన్ లోనైనా కొద్దిసేపు మాట్లాడగలగటం..."

    గుప్తా అప్పటికే ఆనందోద్వేగంతో వూగిపోతున్నాడు. కొద్దిక్షణాల క్రితమే తను త్రినాధ్ పొగరుబోతని, అహంభావి అని, కారు వద్దంటూ ఫోజులు కొడుతున్న మూర్ఖుడని భావించాడు. కాని అది ఆత్మాభిమానమని- అదే ఒక్కోసారి అందలం ఎక్కిస్తుందని అంచనా వేయలేని తనే నిజానికి మూర్ఖుడు.

    త్రినాధ్ వైపు అప్పుడు గుప్తా చూసిన చూపులో ఓ అసమాన ప్రతిభావంతుడ్ని చూస్తున్న అడ్మిరేషన్- ఓ భగవంతుడ్ని చూస్తున్న భక్తి భావం- మామూలుగా ఆలోచనలకు అందని ఓ అనితరసాధ్యుడ్ని చూస్తున్న గౌరవభావం ప్రస్పుటమయ్యాయి.

    "అయితే నీవా కారును స్వీకరించక తప్పదు. అంటే ఫ్రీగా, బహుమతిగా కాదు. క్రమంగా తీర్చుకునే అప్పుగా. అదీగాక మా కంపెనీ కొలాబరేషన్ అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా అవతల వ్యక్తి వుండాలి. సో... నీవు నాలుగు రోజులు మా అతిధిగా వుండి నీకే వస్తువుకి కొలాబరేషన్ కావాలో డిసైడ్ చేసుకో. అప్పటివరకు మా కంపెనీ గెస్ట్ హౌస్ లో వుండవచ్చు" అని బాయ్ ని పిలిచి త్రినాధ్, గుప్తాలకు కావల్సిన సౌకర్యాలు కల్పించమని ఆర్డర్స్ పాస్ చేసాడు.

    త్రినాధ్, గుప్తా నకసోనేకి కృతజ్ఞతలు చెప్పి బయటకొచ్చేశారు. ఆ ఇద్దర్నీ కంపెనీలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా చూస్తున్నారు. అర్ధంకాక అదే విషయాన్ని ప్రక్కనున్న బాయ్ ని అడిగాడు త్రినాధ్.

    "బిగ్ బాస్ తో గంటన్నరపాటు ప్రత్యక్షంగా, అతిచేరువగా కూర్చుని మాట్లాడే అదృష్టం మీకు పట్టినందుకు ఆశ్చర్యపోతూ మీవైపు చూస్తున్నారు...." అన్నాడతను వారివైపు అసూయగా చూస్తూ.


                                       *    *    *    *


    కొన్ని సంఘటనలు మనిషి జీవిత గతినే అనూహ్యంగా మార్చివేస్తాయి. కొన్ని అధఃపాతాళానికి తోసివేస్తాయి.

    కొన్ని అలవాట్లు అవతలివారి దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. మరికొన్ని అలవాట్లు అవతలివారిని చిరాకుపరుస్తాయి.

    ఒక రైతు డబ్బు అవసరం బాగా వుండి ఓ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరకు వచ్చాడట. అప్పుడు ఆ వ్యాపారి ఇంటిముందు వాలు కుర్చీ వేసుకుని కూర్చుని వున్నాడు. తనకు అర్జంట్ గా నాలుగు వందలు వడ్డీకి కావాలని ఆ రైతు వ్యాపారిని అడిగాడట. అప్పుడా వ్యాపారి బురదతో వున్న రైతు కాళ్ళను చూసి ముందా కాళ్ళను కడుక్కునిరా అని తనకు ఎదురుగా, కొంచెం దూరంలో పెట్టివున్న నీళ్ళబక్కెట్టును చూపించాడట.

    అప్పుడా రైతు కాళ్ళు కడుక్కునేందుకు బకెట్ వద్దకు వెళుతూ ఏంటండీ సేఠ్ గారు! మీ ఇంటి ముందు బురద గుంటలుంటే బాగు చేయించుకోలేదని అంటూ కాళ్ళు కడిగేసుకొని పై పంచతో తుడుచుకొని వచ్చి అప్పిస్తారా అని అడిగాడట. అప్పుడా వ్యాపారి నిర్మొహమాటంగా నేనివ్వను అన్నాడు. అంతలో మరో వ్యక్తి అప్పుకోసం వచ్చాడు. అతన్ని అదేవిధంగా ముందు కాళ్ళు కడుక్కుని రమ్మన్నాడట. అతను కడుక్కుని రాగానే వ్యాపారి వెంటనే ఎంత కావాలి? అని అడిగాడట.

    దాంతో కోపించిన మొదటి వ్యక్తి అతని కున్నంత పొలం నాకూ వుంది. నాకివ్వనని అతనికే ఇస్తాననటం అన్యాయం అంటూ అభియోగం చేశాడు.

    అప్పుడా వ్యాపారి శాంత స్వరాన అన్నాడు- నా ఇంటిముందు బురద గుంట వుండేలా చేసింది నేనే. నా దగ్గరికి అప్పుకి వచ్చే ప్రతి వ్యక్తి కాళ్ళకు బురద అంటుతుంది. అసలలా అంటాలనే ఆ బురదగుంట ఏర్పాటు చేస్తాను. ఇకపోతే నీకు అప్పు ఎందుకివ్వనన్నానంటే, బక్కెట్ నీళ్ళు పెడితే అడుగున ఏ కాసినో వుంచి అన్నీ వృధా చేసావు కాళ్ళు కడుగుకునేందుకు. అంటే నీ చేతికి ఖర్చు ఎక్కువ అలవాటు అని అర్ధమయిపోయింది. అదే ఇతను చూడు- ఆ బక్కెట్ లో నీవు మిగిల్చిన కొద్ది నీళ్ళతోనే కాళ్ళు శుభ్రంగా కడిగేసుకున్నాడు. అంటే ఇతనికి పొదుపు తెలుసు. అన్నం ఉడికిందీ లేంది తెల్సుకోటానికి ఒక్క మెతుకును చూసినా చాలు... అదీ సంగతి.

    రెండో వ్యక్తిలో వున్న సుగుణమే అతనికి వెంటనే అప్పుపుట్టేలా చేసింది.

    అలాగే ఇక్కడ హోండాకి త్రినాధ్లో నచ్చిన పాయింట్... ఎక్కువ శ్రమించేందుకు, బ్యాలెన్స్ గా వుండేందుకు ఉప్పు, కారం తక్కువ వాడాలనేదే.


                                        *    *    *    *


    మిట్ట మధ్యాహ్నం. ఎండ నిప్పులు చెరుగుతున్నట్లుగా వుంది. వడగాడ్పు అటునుంచి ఇటు విసురుగా దూసుకుపోతోంది. ప్రియాంక కారు నగర ప్రధాన కూడలిలోకి వచ్చింది. అంతకు ముందే కారులోని ఎ.సి. మెషిన్ చెడి పోవడంతో ఆ చిరాకును భరించలేని ఆమె రోడ్డు వారగా కనిపించిన అతి ఖరీదైన రెడీ ఈటబుల్ ఫుడ్స్ కేంటిన్ దగ్గర ఆపింది.

    కారులోంచి దిగి లోపలకు వెళ్ళి ఓ మూలగా వెళ్ళి కూర్చుని ఐస్ క్రీమ్ కి ఆర్డరిచ్చి ఎదురుచూస్తూ కూర్చుంది. సెంటెడ్ ఎ.సి. గాలి చల్లగా సేద తీరుస్తోంది. అద్దాల్లోంచి బయటకుచూస్తూ ఏదో ఆలోచిస్తున్నంతలో పన్నెండు అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఆమె దృష్టిలో పడింది.

    ఆమె ఓ క్షణం ఆశ్చర్యపోయింది.

    గత ఐదారునెలల్లో ఆవేపుకి రాని ఆమెకు ఆ బిల్డింగ్ ఆశ్చర్యార్ధకం అయింది.

    ఇంతలో వచ్చిన బేరర్ ని ప్రశ్నించింది ఆ బిల్డింగ్ ఎవరిదని.

    అప్పుడతను చెప్పిన పేరు విని ఆమె షాక్ అయింది.

    "అది... అది... ఆ బిల్డింగ్.... వసుంధరా ఇండస్ట్రీస్ కి చెందినదా?" ఆమె పైకే అనేసింది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. "ఎందుకండీ అంత ఆశ్చర్యం....? అలా అనుకుంటే ఇప్పుడు మీరు కూర్చున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఆ కంపెనీకి చెందినదే...!"

    ఎవరో వీపుమీద కొరడాతో కొట్టినట్టు లేచి నుంచుంది ప్రియాంక.

    తన తండ్రిని నిలువునా ముంచివేసి తన తాత ఆస్థిని దక్కకుండా చేసిన రాక్షసి కొడుకుదీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్! ఎలా...? అతను... ఇంత ఎలా సంపాదించగలిగాడు ఈ మూడు సంవత్సరాల కాలంలో? ఆ బిల్డింగ్ ని చూస్తుంటేనే తెలిసిపోతుంది అతని ఆస్థులు కోట్లకు చేరుతున్నట్లు.

    ఆమెకు అంతా అయోమయంగా వుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra