Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 14


    నీలిమ నిప్పలాంటి ఆడది కాబట్టి వెంటనే చెప్పతిసి రెండు చేంపలూ  వాయించింది. అప్పటినుంచి సుధాకర్ తన అక్కసుకొద్ది ఆమె గురించి తెలియని కొత్తవాళ్ళు ఎవరు ఎదురుపడినా ఆమె శీలంలేని ఆడదానిగా  ఆడదానిగా  చిత్రించి చెప్పడం మొదలు పెట్టాడు. అలానే మీకు కూడా అలాంటిదేదో  వినిపించివుంటాడు. అతని మాటలను అస్సలు నమ్మనవసరంలేదు" ఏకధాటిగా చెప్పిన వ్తేస్ చాన్సలర్  ఒకక్షణం ఆగాడు.

    ఇన్స్ పెక్టర్ ధీరజకు విషయం అర్ధమ్తెంది.

    కొందరు వ్యక్తులు అంతే.....

    తాము ఆశించింది దక్కనప్పుడు ఎదుటివాళ్ళకు ఎందుకు దక్కనివ్వాలనే స్వార్ధం పాతుకుపోయి వుంటుంది. అందుకోసం వున్నవి లేనివీ కల్పించి చెప్పి వాళ్ళు తమ మ్,ఆటలు  నమ్మితే మాత్రం వాళ్ళకు ఎంతో  ఆనందం కలుగుతుంది. ఆదోరకమ్తెన శాడిస్టిక్  మెంటాలిటి!

    ఎదుటివాళ్ళ  చేతిలో భంగాపడి....ఆ పరాభవాన్ని అంతటితోమరచిపోకుండా వాళ్ళప్తె పగను పెంచుకుని వాళ్ళ గురించి ఎన్నెన్నో వదంతులను కల్పించి, తనలోని  దుర్గుణాలన్నీటిని వాళ్ళకు  ఆపాదించి, ఎదుటివాళ్ళు....వాళ్ళను దుర్మార్గులను  భావిస్తూ వుంటే తను మాత్రం ఆనందపడిపోతుంటారు.

    ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే సుధాకర్.

    అలాంటి వ్యక్తులు వుంటారని  ధీరజ వినడమేతప్ప ఎప్పడూ చూడలేదు.

    ఇప్పుడు  ప్రత్యేక్షంగా  తొలిసారి సుధాకర్  లో అలాంటి శాడిస్ట్  చూడగలగడంతో ఒక్కసారిగా అంతులేని సానుభూతి పేరుకుపోయిందామేలో.

    సుధాకర్ ని ఇంకొకసారి  కలుసుకోవాలని అప్పడే నిర్ణయించుకున్నదామె.

    షాక్ లో  హాస్పిటల్ పాల్తెన సుధాకర్ చెప్పిన మాటలలో అప్పడు  ఏమీ అనుమానం కలగలేదు కాని, ఇప్పుడు  అతను  ఎలాంటివాడో తీయడంతో  అతను చెప్పింది  నిజం కాదెమోననిపిస్తున్నది ఆమెకు.

    కేవలం షాక్ వలన స్పృహతప్పులేదతనికి....

    నీలిమ దెయ్యంలా కనిపించిందన్నాడు.

    నీలిమ దెయ్యం కవడమేంటి అంటే...ఏదో  ఆకారం కనిపించింది. ఆమె నిలిమాలా ,దెయ్యంలా అనిపించడంతో కెవ్వున  అరిచాను తప్పు.... తనకు  కనిపించింది ఎవరో....తనకెందుకు అలా అయిందో  తెలియదన్నడతను

    ఏమో.... ఆ మాటలను మాత్రం నిజం అనుకోవడానికి వీల్లేదు.

    తన దర్యాప్తును ప్రక్కకు  మళ్ళించడానికి అతను బుద్దిపూర్వకంగానే  అబద్దం చెప్పివుండాలి.

    నీలిమ అశ్రుశ్యం వెనుకనున్న కారణం ఏదో అతనికి తెలిసి వుండాలి.

    ఆమె ఆలోచనలలో వుండగానే వ్తేస్ చాన్సలర్ టేబుల్ ప్తెనున్న ఫోన్ మ్రోగింది రిసీవర్ తిసి అవతలివ్తెపు నుంచి  మాటలను విన్న తరువాత.....

    "మేడమ్! మీ స్టేషన్  నుంచి ఫోన్."

    ధీరజ రిసీవర్  తీసుకుని అవతలి వ్తెపునించి  మాట్లాడే మాటలను విన్నది.

    "ఓ.కే.....వెంటనే  బయలు దేరుతున్నాను. అతని అడ్రస్ చెప్పండి. నేరుగా అక్కడికే వెళతాను" అన్నది ధీరజ.

    వ్తేట్ పేపర్ ప్తె చిరునామా నాట్ చేసుకున్న తరువాత రిసీవర్ పెట్టేసింది.

    "ఓ.కే.సర్! సెలవుతీసుకుంటూన్నాను. ఈ కేసు రానురాను వింత వింత  మలుపులు తిరుగుతున్నట్టుంది. నీలిమ పేరే కలవరిస్తూ  షాక్ తిని పడిపోయిన మీ స్టూడెంట్  తండ్రి  ఇంతకుముందే ఫోన్ చేశాడంట..... ఇప్పుడు అక్కడికే  వెళుతున్నాను" లేచి నిలుచుంటూ అన్నదామె.

    "బ్తెదిబ్తె ఆ స్టూడెంట్  ఎవరు?" కుతూహలాన్ని ఆపుకోలేక ప్రశ్నించాడు వ్తేస్ చాన్సలర్. 

    "అతని పేరు అనిల్! ఇండస్టియలిస్ట్  ముకుందరావుగారబ్బాయి అంట" వెళుతూ వెళుతూ చెప్పి వెళ్ళిపోయింది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    ఆ పేరు విన్న వ్తేస్ చాన్సలర్  ముఖం నల్లగా మాడిపోవడం. ఆ సమయంలో హడావుడిగా  బయటకు అడుగు పెడుతున్న ధీరజ గమనించలేదు.

   

                                                          *    *    *    *

   
    పోలిస్ జిఫ్  ముకుందరావుగారి బంగళాలోకి ప్రవేశించింది.

    ఇన్స్ పెక్టర్  ధీరజ క్రిందకు దిగి దిగడంతోనే పోర్టికోలో పచార్లు చేస్తున్న ముకుందరావు ఆమెకు ఎదురయ్యాడు.

    "రండి ఇన్స్ పెక్టర్ ! ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ."

    ధీరజ  మౌనంగా  అతనివెంట నడిచింది.

    "మాకున్న  ఒక్కగానొక్క కొడుకు అనిల్ అపస్మారకస్ధితిలో వున్నాడు. కానీ స్పృహలో కొచ్చిన ప్రతిసారి  లెక్చరర్  నీలిమ....లెక్చరర్  నీలిమ....అని ఒకటే కలవరింతలు. అందుకే  వెంటనే  మీకోసం  ఫోన్ చేస్తే మీరు యూనివర్సిటిలో వున్నారని, మీ స్టావ్ అక్కడకు ఫోన్ చేసి మెసేజ్  పాస్ చేస్తానన్నారు."

    మాట్లాడుతూనే  అనిల్ వున్న గదిలోకి వచ్చారిద్దరూ.

    అనిల్ వున్న స్ధితిలో ఎవరయినా  ఖరీదయిన హాస్పిటల్ కు పంపి  ఖరీదయిన  వ్తేద్యం  చేయిస్త్య్హారు. కానీ ముకుందరావు కోటిశ్వరుడు కావడం  వలెనేమో సూపర్ స్పెషాలిటిస్ అట్మాసిఫియర్ అంత ఆ గదిలోనే వచ్చి చేరినట్టుంది.

    స్పెషలిస్టులను రప్పించి తన సొంత బంగళలోనే కొడుక్కు ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాడాయన.

    "అసలేం జరిగింది?"

    ధీరజ అతన్ని ప్రశ్నించింది.

    "మా ప్యామిలీ మొత్తం వూరికి వెళ్ళాం. అనిల్ ఒక్కడే ఇంట్లో  వున్నాడు. ఏంజరిగిందో ఏ పనివాడూ  చెప్పలేకపోతున్నాడు. ఏదో  పనిమీద ప్తెగదిలోకి వెళ్ళిన పని వాళ్ళకు స్పృహతప్పిఅ పడివున్న  అనిల్  కనిపించాడట. వెంటనే మా ప్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ట్రీట్ చేస్తున్నారు. అనిల్ పరిస్ధితి వివరించి చెప్పి  మాకు  ఫోన్ చేసింది ఆయనే."
   
    "అంతా బాగానే వుంది కానీ, ఈ విషయాన్నీ  పోలీసులకు  తెలియ పరచకుండా ప్రత్యేకించి మహిళా పోలిస్ స్టేషన్  కే  ఫోన్ చేసి చెప్పడంలో మీ అంతరార్ధం?" సూటిగా ప్రశ్నించింది దిరజ.

    వచ్చినప్పటినుంచి ఆమెలో మెదులుతున్న అనుమానం అది.

    "గుడ్ క్వశ్చన్ ....మీరు కాబట్టి ఈ ప్రశ్న వేశారు. రియల్లీ ఐ ఆప్రిసియేట్ యూ!అదే  ఇంకోకారయినట్టయితే అసలు ఈ ఆలోచనే వచ్చి  వుండేదికాదు పోలీసులకు ఇన్ ఫామ్ చేయవలసిన అవసరంలేని  మాట నిజమే. కానీ మీరు లెక్చరర్ నీలిమ గురించి ఎంక్వయిరీ చేస్తున్నట్లు పేపర్లలో చదివాను."

    "సో....వాట్? చదివినంతమాత్రాన మీ అబ్బాయి స్పృహతప్పి పోవడానికి నీలిమ అదృశ్యానికి  కారణం ఏం వుంది?"

    "ఉన్నది మేడమ్! కాబట్టి మీకు ఫోన్ చేశాను."

    ఇప్పుడు  స్ధిరంగా వుంది ముకుందరావు కంఠం.

    అప్పుడు కలిగింది దిరజకు అనుమానం.....

    ఏమిటో అది?

    "నేను వచ్చేటప్పుటికే అనిల్ కు రెండుసార్లు స్పృహ  రావడం_ మళ్ళి తప్పిపోవడం జరిగాయి. స్పృహవచ్చిన ప్రతిసారి లెక్చరర్ నిలిమను  కలవరించిన విషయం  నేను వచ్చిన  వెంటనే  డాక్టర్ గారు  చెప్పారు. లెక్చరర్  నీలిమ గురించి వీడేమ్తెన వినకూడని సంభాషణ విన్నాడేమో- లేక ఆమెకు సంబంధించిన దృశ్యం ఏదయినా చూసి యిలాంటి స్ధితికి చేరుకున్నా డేమోననే అనుమానంతో  మీకు ఇన్ ఫామ్  చేశాను. ఈ విషయం మీ దర్యాప్తుకు  సహకరిస్తుందేమోనని మికుఇ ఫోన్ చేశాను."

    "సారి ముకుందరావుగారూ."

    "ఇట్స్ ఆల్ ర్తెట్ ! ప్రతి చిన్న విషయాన్నీ అంత లోతుగా ఆలోచించగలిగితేనె  నరయిన ఫలితాన్ని పొందగలరని విశ్వసించేవాడిని నేను.

    మీ ప్రశ్నకు నేనేం వర్రి కావడంలేదు. ముందు నా కొడుకు అనిల్ ఇప్పటి పరిస్ధితికి నీలిమ ఎంత వరకు కారణమో ఆలోచించడి"

    ఆయన మాటలకు  తెప్పరిల్లి ణ ఇన్స్ పెక్టర్ ధీరజ డాక్టర్ ని సమీపించింది.

    "డాక్టర్....అనిల్ పరిస్ధితి ఎలా వుంది? అతను ఇలా అయిపోవడానికి కారణం ఏమ్తే వుంటుందో తెలిసిందా?"

    "ఊహించని  దృశ్యాన్ని చూడటం వలనా అ టెన్షన్ కు తట్టుకోలేని  మెదడులోని నరాలు తీవ్రమయిన ఒత్తిడికి గురయ్యాయి. నౌ హి ఈజ్ ఆల్ ర్తెట్! ఈసారి కళ్ళు తెరిచిన తరువాత ఎప్పటిలానే మాట్లాడతాడు" అన్నాడు డాక్టర్ రొటి గా.

    నిమిషాలు దొర్లుతున్నాయి.....

    అనిల్ తల్లి జయంతి అయితే అతని బెడ్  దగ్గరే దాదాపు  అతనికి  అంటుకుపోయినట్టు వుండి పోయింది.

    ఆ తల్లి  చూపులన్నీ అతని ముఖం మీదనే వున్నాయి.

    లెక్చరర్ నీలిమ అదృశ్యనికి, ఆమె స్టూడెంట్ అయిన అనిల్ కు ఉన్న సంబంధం ఏమ్తే వుంటుందో వూహించే ప్రయత్నం చేస్తున్నది ఇన్స్ పెక్టర్ ధీరజ పోలిస్ బుర్ర!

    ఏ సంబంధమూ లేనట్టయితే, అనిల్ నోటి వెంట  ఈ అపస్మారక స్ధితిలో నీలిమ  పేరు రావలసిన అవసరమే వుండదు.

    అంటే....నిలిమకు చెందిన  ఏదో రసహ్యం  అనిల్ కు తప్పనిసరిగా  తెలిసి వుండాలి.

    అదేమిటో.....ఏమ్తే వుంటుందో?

    ఆలోచిస్తున్నదామే!

    అప్పడే అనిల్ కనులు భారంగా విచ్చుకున్నాయి.

    అతని తల్లితండ్రులు ఆరాటంగా అతన్ని సమీపించారు.

    అనిల్ కళ్ళు తెరిచిన వెంటనే బిత్తరపోయాడు.

    "మమ్మి ఏమిటి? నాకేమయిందని ఇలా గుమికూడారు?" వెంట వెంటనే ప్రశ్నల వరంపర చేస్తూ ఇన్స్ పెక్టర్ దిరజను చూసి గతుక్కుమన్నాడతను.

    ఆమె అప్పుడు సమిపించిందతడిని.

    "మిస్టల్ అనిల్! ఆర్ యూ ఆల్ ర్తెట్?"

    "ఎస్ ! ఐయమ్ ఆల్ ర్తెట్ బట్- మీరెందుకోచ్చారో నాకు అర్ధం కావడంలేదు" మనసులో ఏదో భీతి తొలుస్తున్న ప్తెకి మాత్రం గంభీరంగా వుండాలని ప్రయత్నస్తూ అన్నాడు.

    "అసలు ఏం జరిగిందో చెప్పగలరా?"

    అనిల్ కళ్ళలో బెదురు  స్పష్టంగా కనిపించింది అప్పుడు.

     తనకు ఏమ్తెందో ఒక్కసారిగా  గుర్తు వచ్చిందతనికి.

    ఆ దృశ్యం  తలుచుకోవడంతో అతని గొంతు తడారిపోయింది.

    "నీలిమ....నీలిమ దెయ్యం కనిపించింది...." అస్పష్టంగా గొణిగాడతను.

    "వ్యాట్....నీలిమ దెయ్యమా?"

    దిరజలో విస్మయం.....

    "కాదు కాదు....ఊర్వశి ....ఊర్వశి దెయ్యం."

    అనిల్  తడబడుతున్నాడు.

   
    "మిస్టర్! నువ్వు మాట్లాడుతున్నదేమిటో నీకు తెలుస్తోందా? ఊర్వశి అంటున్నావు.....కాసేపు నీలిమ అంటున్నావు.....మళ్ళి దెయ్యం అంటున్నావు......అసలు ఏం చూశావు నువ్వు?" విసుగ్గా ప్రశ్నించింది ధీరజ.

    "ఊర్వశిని చూసి నీలిమ అనుకున్నాను."

    "ఎవరా ఊర్వశి?" ముకుందరావు వ్తెపు తిరిగి ప్రశ్నించింది ధీరజ.

    "అదే  మాకూ అర్ధంకావడం లేదు" అన్నాడతను అయోమయంగా.

    "ఎవర్రా కన్నా....ఆ మాయలాడి  ఎవరు? నిన్ను ఏం మయచేసిందో?"

    "అదేంటమ్మా అలా అంటావు? మనింట్లో కొత్తగా చేరిన పనిపిల్ల ఊర్వశి గురించే నేను  చెప్పేది."

    ముకుందరావు భార్య ముఖంవ్తెపు తెల్లబోతూ చూశాడు.

    "ఇన్స్ పెక్టర్ అనిల్ చెప్పే పనిపిల్ల ఎవరూ మా ఇంట్లో లేదు. ప్తె పెచ్చు కొత్తగా చేరిందంటున్నాడు. ఎవరిని మేము పనిలో పెట్టుకోక పోతే ఇంకా కొత్తగా ఎక్కడనుంచి  వచ్చిందో నాకు అర్ధంకావడంలేదు" అనిల్ కు ఇంకా  స్వస్ద్హత చేకూరలేదేమోననే బాధతో అతని గొంతులో  వేదనా విచికలో తొంగి చూశాయి.

    "అదేమో నాకు తెలియదు  కానీ ఇన్స్ పెక్టర్ ! ఎవరో  అమ్మాయి  కొత్తగా పనిలో చేరానని చెప్పి నా గదిలోకి వచ్చింది. తీరా దగ్గరకు వచ్చాక ఆమె ముఖం పరిశీలనగా చూస్తే నీలిమ....తరువాత ఏమయిందో నాకు తెలిదు. భయంతో నా కళ్ళు తిరిగిపోవడం వరకే చెప్పదలుచుకున్నది ఇంకేమి లేదన్నట్టు  గడగడా చెప్పాడు అనిల్.

    "నీలిమ అంటే మీ లెక్చరర్ నిలిమే కదూ?"

    "అవును."

    "అయితే ఆమెని చూసి  దడుసుకోవడం ఎందుకు?"

    ఏం చెప్పాలో అర్ధంగాక  అనిల్ బిక్కముఖం వేశాడు.

    "దెయ్యం లా  అనిపించింది. అందుకే భయం వేసింది" ఏదో  ఒకటి చెప్పక తప్పదనిపించి ఖంగారుగా అన్నాడతను.

    "ఎస్! ఐ  గాటిట్ ....ఇప్పుడు  చెప్పావు  సరయిన  సమాధానం మాకు మీ లెక్చరర్ నీలిమ కనిపించడం లేదని  రిపోర్ట్  వచ్చింది. నువ్వేమో  ఆమెని చూసి దెయ్యం అనుకుంటున్నావు. చనిపోయిన వాళ్ళు  మాత్రమే దెయ్యం అవుతారంటరు కదా..... అంటే నీలిమ చనిపోయిందని  నీకు ఖచ్చితంగా  తెలిస్తేనే కడ ఆమె దెయ్యం  అయివుంటుందని  నువ్వు భయపడవలసింది?"

    ధీరజ లేవానెత్తిన పాయింట్ కు అనిల్ గొంతులో పచ్చివెలక్కాయ  అడ్డుపడినట్టయింది.

    "ఏమో ఇన్స్ పెక్టర్! అప్పుడు ఆమె నాకు  దెయ్యంలా అనిపించిందంతే!"

    "అదే....ఎందుకలా అనిపించేందనే అడుగుతున్నాను" రెట్టించిందామే.

    "అంతకుముందు మా ప్రెండ్స్ కు కూడా  నీలిమ దెయ్యమ్తె కనిపించింది. అందుకే  నేనూ అలా అనుకున్నాను."

    మరో అనుమానం వచ్చింది దిరజకు.

    "మీ ప్రెండ్స్ కు కనిపించిన విషయం నీకెలా తెలుసు?"

    "వాళ్ళే చెప్పారు."

    "అంటే -వాళ్ళకు నీలిమ దెయ్యంలా కనిపించిందన్న మాట" ధీరజ సందిగ్ధంగా ప్రశ్నించింది.

    "ఎస్....వాళ్ళు కూడా నీలిమ దెయ్యాన్ని చూసి దడుసుకున్నారు."

    "ని స్నేహితుల పేర్లు ఏమిటి?"

    అనిల్ చెప్పాడు అనుమానంగానే.


    "ముకుందరావుగారు.....మీరిచ్చిన వాల్యుబుల్ ఇన్పర్మేషన్  మా దర్యాప్తుకు ఎంతగానో సహకరిస్తుందని భావిస్తున్నాను. ఎనిహౌ.....ఐయం వెరి ధాంక్ పుల్ ఫర్ యువర్ కో ఆపరేషన్ ."


    ఇన్స్ పెక్టర్ ధీరజ ఎక్కినా పోలిస్ జిఫ్ ముందుకు కదిలింది.


                                         *    *    *    *   


    రాత్రి  తొమ్మిది గంటలు....

    ఔట్  హౌస్ లో వుంటున్న వాచ్ మాన్ అబ్బులు కూనిరాగాలు తీస్తూ వంట చేస్తున్నాడు.


    వాస్తవానికి ఆ గెస్ట్ హౌస్  మాజీ మంత్రి గారిదే అయినప్పటికీ ఎక్కవగా  వుపయోగించేది  ఆయన ఎక్తెక పుత్రరత్నం రమేష్ మాత్రమే!

 Previous Page Next Page