"వ్యక్తిత్వం" అనేది ఒక పెద్ద విషయంగా అనుకోంటాంగాని అదేప్పడూ అహంతో మిళితమయ్యే వుంటుంది. అసలు- "నాకేది ప్రత్యేకమ్తెన వ్యక్తిత్వం లేదు. నేను చాల సామన్యమ్తెన మనిషిని అనుకునేవాడే నిజమ్తెన బుషి" ప్రకాశానికి తెలిదు.
_సుజాత లేచి మళ్ళి లోపలికి వెళ్ళింది.
చుట్టూ చూసేడు. ఎవరి గొడవలో వారున్నారు. ప్రపంచం అంతా హాయిగా వుంది. తను తప్ప అందరూ కేరింతలు కొడుతున్నారు. తన మనసులో మాత్రమే సంఘర్స్షణ. దేనికి దేనికి మధ్యనో తెలిదు. ఎగోని....
లేచేడు___
వెళ్ళిపోవాలి....మనుషుల మధ్య వుండాలేడు...
ఇంటి వెనుకవ్తెపు చిన్న గేటు కనిపిస్తూంది. అటు నడిచేడు. కాళ్ళ క్రింద దుబ్బుగా పెరిగిన గడ్డి నలుగుతోంది. పిచ్చి మొక్కలు నలిగిపోతున్నాయి. ఎందుకూ పనికిరానీ మొక్కలు ప్రకాశంలా!
వడివడిగా అడుగులువేసి గేటు చేరుకున్నాడు. వెక్కిరిస్తున్నట్టు చిన్న తాళంకప్పు వ్రేలాడుతోంది.
నిస్పృహగా వెనక్కి తిగిగేడు.
కారు గ్యారేజీ....
ఇంకో అడుగు వేసేడు-
అలికిడి అయింది- నీడలు ....కదిలే నీడలు....
ఇంకో అడుగు వేసేడు.... కళ్ళక్రింద పిచ్చిమొక్క పటపటమంటూ విరిగింది. ఆ నీరవంలో ఆ చప్పుడు వేయింతల్తెంది.
గోడమీద నీడలు విడిపోతున్నాయి. కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు. సగం తెరిచివున్న గ్యారేజీ తలుపు వెక్కిరిస్తున్నట్టు ఉంది ల్తెటు వెలుతురులో నీడలు రూపాన్ని ఆపాదించుకొన్నాయి. ముసుగు తీసిన నీడలు-స్దాణువ్తే పోయేడు.
క్షణం పఠాలున పగిలి విశ్వవాస్తవమ్తెపోయింది. ఆకాశం భూమి మీదకు దిగిపోతోంది. నక్షత్రాలు మండిపోతున్నాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యేయి... కడలి ఇంకిపోయింది. బిగ్గరగా నవ్వాలనిపించింది ఏడుపోచ్చింది. యుగ యుగాలుగా పేరుకొన్న ఆవేదన అంతా ఒక్క కన్నీటిచుక్క రూపంలో బయటకొచ్చింది. కుమార్ కౌగిలిలోంచి విడివడిన సుజాత ప్రకాశాన్ని చూసి కెవ్వున వేసిన కేక గుండెల్లో ప్రతిధ్వనించింది. నిశ్శబ్దంలో కలిసిపోయింది.
అమ్మా- ఎందుకు పడేశావమ్మ నన్ని పాడులోకంలోకి? మూడు నిమిషాల ఆవేశానికి నువ్వు లోంగాకుండా ఉంటే ఏ దేవుడికుందమ్మ నన్నుసృష్టించే శక్తి?
ట్రాన్స్... నిక్షిప్తం.... ప్రహర్షోన్మాద తన్మయమూర్ఖవస్ద... అంతా దుఃఖమే-భూతకాలిక దుఃఖం నశించింది....వర్తమానం రానే వచ్చింది. అనాగత దుఃఖం హేయం. ఎలా? ఎలా?
అప్పుడు నేను వేయి నేనుగులుగా ఈ విశాల విశ్వం అంతా వ్యాపించి ...అహం బ్రహ్మస్మి....కుర్చీలో కూలబడ్డాడు.
కళ్ళు మూతలు పడుతున్నాయి....ఎదురుగా విస్కీ సీసా మసగ్గా కనబడుతూంది....ఎవరు కనిపెట్టేడు దిన్ని? ధాంక్స్ ఫర్ యువర్ ఇన్ వెన్షన్....నేనంత గొప్పవాన్నో ఎవరికీ తెలిదు. నేను తాగటం లేదని నవ్వింది యెవరు? తాగుతున్నాను. ఐ డోంట్ వాంట్ సోడా-
సీసా ఎత్తి గడగడా తాగేసెడు. గొంతు మంట- మనసు మంటతో పోలిస్తే ఇది ఏపాటిది?
అంతా శూన్యం__ ఆ శూన్యంలో ఒక నవ్వు_ ఎవరిదీ? పరందామయ్యదా? కుమార్ దా?సుజాతదా?
ఎదుటి వ్యక్తుల మనసులో ఆలోచన్లనీ భావాల్ని చదవగలిగే ఒక భూతద్దం దేముడు నాకిస్తే ఇంత కల్మషాన్ని, నిచాన్ని చూడలేకఆత్మహత్య చేసుకోవడం ఖాయం. ఎందుకు బ్రతకటం? ఈ వేదనలూ రోదనలూ...నిరవ నిశిధిలో__శ్మశాసంలో ఒక మూల , ఉవ్వెత్తున లేచే మంటలు మధ్య పఠాలున పగిలే కపాలం__దట్టమ్తెన అడవిలో ఒక రేమ్మనుంచి రాలే గడ్డిపువ్వు, సముద్రగర్భంలో చచ్చిపోయిన చేప పిల్లలా- ఏది మిగిలేది చివరికి?- ప్రశ్నే-సమాధానం లేదు. దొరకదు. ఎందుకి వ్యధ?
సుజాత కౌగిలిలో చలిరాత్రి వెచ్చగా అనుభవిస్తున్నాడు.
సితా చౌకబారు పుస్తకాలు చదవడం మానేసింది.
తను రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
పరంధామయ్య ఆధ్యాత్మిక చింతన లో మునిగిపోయేడు.
తనే ఒక రేసుగుర్రాన్ని కొని ప్రజల దగ్గర డబ్బు పిండుకొంటున్నాడు.
రేషన్ లేకుండా కాల్ గ్యాస్ దొరుకుతోంది.
సర్వ్జనా సుఖినో భవంతు!
"ప్రకాశం...ప్రకాశం...." తట్టిలేపుతున్నాడు. నిద్రావస్దలోనే లేచివెళ్ళి కారులో కూర్చున్నాడు.
అయిదు నిమిషాలు మౌనంగా గడిచినయ్.
"నన్ను చూస్తూంటే నీకు అసహ్యంగా వుంది కదూ" కుమార్ అడిగేడు.
"లేదు, ఇప్పుడు లేదు...." తన కంఠంలో కనపడిన ప్రశాంతత తననే విచలితుడ్ని చేసింది. అహం బుష్యత్వాన్ని పొందుతుంది.
"నువ్వు అర్ధం చేసుకుంటానంటే ఒక విషయం."
"చెప్పు"
"నేనూ-సుజాత"క్షణం ఆగి, "ద్రిల్ కోసం....అంతే....కాని,కాని, ఒక్కవిషయం మాత్రం నిజం ప్రకాశం సుజాత నిన్ను ప్రేమిస్తూంది! అది ప్రేమ- నిజాయితి వున్న ప్రేమ. పోతే మా విసహాయనికంత ఇంపార్టేన్స్ లేదు-"ఆగేడు.
"నీకు ముందే తెలుసా?" నాలుక తడబడింది.
"అంతా తెలుసు. కాలేజిలో వున్నప్పడే. అంతేకాదు, మొన్న మీ ఇద్దరూ కలుసుకున్న విషయం కూడా తెలుసు. తనే చెప్పింది. షి లవ్స్ యూ ప్రకాశం."
కారు ఆగింది.