Previous Page
ఋషి పేజి 40


    ప్రకాశం దిగేడు. కారు డోర్  పట్టుకొని  అన్నాడు- "మైడియర్ ఆనరబుల్ మెంబర్  ఆఫ్ ది బార్చేరియాన్  సోస్తేటి__మీరంతా  రాక్షసులు! మనసులో రాక్షసుల్ని దాచుకొని బయటకి దేవతల్లా కనబడే  మనుష్యులు. మీ మీ  వెధవ పన్లని, వెధవ ఆలోచన్లనీ  మంచి మంచి  వాదనలతో  సమర్ధంచుకోంటూ ఆత్మవంచన చేసుకొని బ్రతికేస్తారు. నేను సగటు మనిషిని. నన్ను చూసి భయపడకండోరే. నేను మిలో కలిసిబోతున్నాను! ఐ యామ్ ఆల్సో బికమింగ్  ఎస్కేపిస్టూ ల్తేక్ యు! ఈ రోజునుంచే, ఈ రోజునుంచే" కారు డోరు బలంగా వేసి తూలుకుంటూ  నడిచి కొద్దికొద్దిగా  చీకట్లో కలిసిపోయేడు.

    క్షణంపాటు అటువై]పే నిశ్చేష్టుడై చూసి కారు ముందుకు పోనీ చ్చాడు  కుమార్.

    మెట్లు తగిలి తూలి పడబోయి  నిలదొక్కుకొని తలుపు తట్టాడు. లోపల గడియా వేసిలేదు. మత్తులో ఆ విషయం  గమనింలేదు అతను.

    తలుపు చప్పడవటంతో లేచి వచ్చింది సిత.

    అంత మత్హ్టులోనూ  ఆశ్చర్యంవేసింది. అంత రాత్రి వరకూ తన కోసం ఒకరు ఎదురుచూడటం అదే మొదటిసారి. తెల్లచీరే కట్టుకొని వాలు జడ వేసుకొని, వికసించిన పద్మంలా తనక్కాబోయే భార్య.

    గదిలోకి వెళ్ళేడు. వెనుకనే  నడిచివచ్చి "భోజనం చెయ్యవా బావా-" అని అడిగింది.

    తల అడ్డంగా వూపేడు. కళ్ళు పెద్దవిచేసి చూసేడు.

    ఎంత నిర్మలంగా  వుంది!

    భరించలేనంత నిర్మలత్వం___పాడుచెయ్యాలి. సర్వ నాశనం చెయ్యాలి! పెళ్ళయ్యాక  ఏముంటుంది డ్రిల్లు? ఇప్పడే ....ఈ క్షణవె....

    కళ్ళల్లో ఎరుపు చోటుచేసుకుంటూంది__ రాక్షసుడు మేల్కొంటు న్నడు__ సుజాతతో గెస్టుహౌస్  కి వెళ్ళటానికి  ఉవ్విళ్ళూరే రాక్షసుడు__ వంద యిస్తామంటే పైలు తగలబెట్టటనికి సిద్దపడ్డ రాక్షసుడు__సుబ్బులుతో రహస్యం  పంచుకావటంతో ఆనందాన్ని పొందే  రాక్షసుడు.

    "హ్తేడ్-"

    వచ్చేశాడు. బయటకి వచ్చేసేడు-"సితా" పిల్చేడు.

    వెళ్ళబోతున్నది వెనక్కి తిరిగి "ఏం  బావా" అంది.

    చేయిచాచి చప్పన దగ్గరకు  లాక్కున్నాడు. ఊహించని యీ పరిణామానికి బిత్తరపోయింది సిత.

    "అబ్బే__ఏవిలేదు సితా-ద్రిల్ కోసం__ చెడిపోవటంలో యెంత ఆనందం  వుందో చూపిస్తాను ఇక మనకి బాధలు లేవు. అంతా సుఖమే దానికి ప్రారంభోత్సావం చేద్దాం, పెళ్లయ్యాక ఏముంది-అంతా రోటిను ఈ రాత్రి ఇద్దరం ఒకేసారి చెడిపోదాం ...."

    బలమ్తెన అతని చేతిలో  నాజూకు హస్తం నలిగిపోతూంది- అతని కౌగింలింతలో ఆమె గింజుకొంటున్నది. ఆమె చుట్టూ చెయ్యివేసి మరింత  దగ్గిరగా  లాక్కొన్నాడు ఆమెలో  ప్రతిఘటన  తగ్గిపోయింది.

    "వదులు బావా?" అంది. ఇంకొంచెం దగ్గరగా అతనికి హత్తుకొంటూ.

    వదిలేసెడు.

    "వెళ్ళు" అన్నాడు. బెదిరిపోయి  అతనివైపు భయంగా చూసింది. అతని కళ్ళు ఎర్రగా రక్తం పెరుకోన్నట్టు వున్నాయి.

    "ఐ సే గెటవుట్ " అరిచేడు జకిల్.

    అతనివైపు చిత్రంగా నెమ్మదిగా  ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. నిశ్శబ్దం జాలిగా మిగిలింది.

    అయిదు  నిముషాల తరువాత- గదిలో పక్కమీద  బోర్లాపడుకుని, తలగడలో మొహం  దాచుకొని  ఏడుస్తున్నాడు ప్రకాశం.

    మనిషి నైతికంగా కట్టిపడవేసే ధర్మసూత్రపు పరిధిని  అగౌరపర్చలేని సగటు మనిషి!

    చెడిపోవడం కూడా అందరికి చేతకాదు. అది ఒక ఆర్టు!

   
                                                                            20

    నా జీవితపు  అతి విషాదకరమైన దినాల్లో ఈ కథ  వ్రాయాలనే కోర్కె చాలా బలంగా వుండేది నాలో. ప్రకాశం బ్రతికున్న రోజులవి కలం నా చేతిలో వుంది కాబట్టి  ప్రకాశాన్ని మంచివాడుగానే వుంచేసేను. కాని నాలో ప్రకాశాన్ని ఏం చేసెను?- నిర్దాక్షిణ్యంగా చంపేసెను. ఎపుడన్నా ఒక అర్దరాత్రి- ప్రపంచం అంతా నిద్రలోకి  జారుకొన్నాక ఒంటరిగా  కిటికీ  దగ్గర నిలబడి ఆ నిరవంలోకి- ఆ నల్లటి చీకటిలోకి చూస్తూ వుంటే  ఆకస్మాత్తుగా ప్రకాశం  బ్రతుకుతాడు నాలో నొక్కే స్తాను. పైకి రానివ్వను? కారణం- అనుక్షణం నాలో సంఘర్షణ భరించలేను- కనిసం నాలో "హ్తేడ్ " అన్నా నిశ్చింతగా  బ్రతికితే  చాలు!


                                                            -:శుభం:-  
 

 Previous Page