Previous Page Next Page 
ఋషి పేజి 37


    "ఏం?"

    "నేన్నిన్ను అర్ధం చేసుకోగలను."

    "ఏమిటి?" ఏమిటి నీకు అర్ధం అయింది?"

    "నీ సమస్య...."

    "ఏమిటి ణా ససుస్య?"

    "అది నేనే చెప్పాలా? స్టగుల్ ఫర్ ఎగ్జిస్తేన్స్...."

    "ణా జీతం నాకు సరిపోతుంది.

    "తిండి ఒకటే కాదుగా సమస్య....నిజాయితిగా బ్రతకటం. రేషన్ షాపులూ- ఆస్పత్రులు...ప్లేటోనిక్ లవ్ అప్తేర్లూ....ఇంకొంచెం ముందుకు వెళ్ళితే ఎస్ ఎస్ డిలూ___ఆధ్యాత్మిక చింతన.... అంతా స్టగులే__"

    "నిజం నువ్వు చెప్పింది. నాగుంరిచి నవల ప్రాయగూడదూ?"

    "కుమార్ ఉలిక్కిపడి జోకులేస్తున్నావా?" అన్నాడు.

    "లేదు, సీరియస్ గానే  అడుగుతున్నాను. ణా గురించీ నవలవ్రాయి....ప్లీజ్."

    అతను నవ్వాడు. "ఏం వ్రాయను నీ గురించీ ఏముంది వ్రాయటానికి?"

    "అంటే-"

    "నవల  అంటే  మెలోడ్రామా వుండాలి. ట్విస్టు లుండాలి."

    "మన జీవితాల్లో మెలోడ్రామా లేదంటావా?"

    "నవల కది సరిపోదు."

    "నవలంటే ఏమిటి?"

    కుమార్ నవ్వి "తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞానం సర్వస్వం ప్రకారం నవలంటే వాస్తవ జీవితానికి సంబంధంచిన సన్నీవేశాల్తో, కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమ్తెన ఊహనిర్మిత కథ" అన్నాడు.

    "మరి ణా జీవితం వాస్తవమే కదా."

    కుమార్ మాట్లాడలేదు. క్షణం ఆలోచించి "మన జీవితం రొటిన్. నవలంటే సాధారణంగా ఒక ప్రేమ ___దానిచుట్టూ అల్లిన కథా వుండాలి."

    ఈసారి మౌనం ప్రకాశాన్ని ఆవరించింది. సాలోచనగా అన్నాడు___"నిన్న ప్రొద్దున రేషన్ షాపుకి వెళ్ళేను. క్యూలో  నిలబడితే ముందతను ఎవరో ట్రాన్సిస్టర్ తెచ్చాడు. ఆ అడ్వర్టయిజ్ మెంట్లు  వింటే నిజంగా మనదేశం యెంత ప్రొడక్టివ్ ఎలా అయిందా అనిపించింది. ఉన్నదేమో రేషన్ షాపుల్లో__ఈ క్లానిక్ట్  చాలాడా ఒక సంఘటన సృష్టించటానికి-"

    కుమార్ మాట్లాడలేదు. ప్రకాశమే అన్నాడు-"నువ్వు రచయి తావి! రచనేప్పడు వాస్తవికతను ప్రతిబింబించాలి. అవునా__ మరి నాలాటి సగటుమనిషి గురించీ  ఎందుకు వ్రాయలేవు? మేటర్ చలదనా?"

    "అబ్బే, ఆదేవిలేదు. ఒక మనిషి మనసులో క్షణకాలం  జరిగే సంఘర్షణనీ వర్ణించటానికి ఎన్ని పేజీలు వ్రాసిన సరిపోదు."

    "మరింకేం?" అడిగేడు  ప్రకాశం.

    "ప్రయత్నిస్తాము" అన్నాడు కుమార్.

    కారు నెమ్మదిగా మాణిక్యాలరావు ఇంటిముందు ఆగింది.

    టేబుల్స్ దూరం దూరంగా  వుండటంవల్ల అంతగా  హడావుడి కనబడటం లేదు. మొత్తం అంతా కలిసి  ఒ పాతిక మందిదాక వుంటారు. పార్టి బ్తేట గార్డెన్  అరేంజ్ చేయబడింది. చెట్లకే బల్బులు అమర్చటంవల్ల ల్తేటింగ్ కొంచెం  డిమ్ గా వుంది. స్పీకర్  లోంచి  సన్నగా పాట వినిపిస్తూంది. జనం ముగ్గురు  నలుగురు కలిసి ఒక గుంపుగా కూర్చొన్నారు.

    "పార్టికి ఆలస్యం అయినట్టుంది మనం" అన్నాడు కుమార్__ కారు లాక్ చేస్తూ. అతడు మాట్లాడలేదు. అతనికి ఎందుకో నెర్వస్ గా వుంది. ఇటువంటి  పార్టిలో ఇంతకుముందు ఎప్పడూ పాల్గొనకపోవటం వల్లనో లేక... మళ్లి కనిపిస్తుందనే ఆలోచనల్లో.....

    ఇద్దరూ లోపలికి  ప్రవేశించారు.

    ఎవరి గొడవల్లో వాళ్ళు  వుండటంవల్ల ఇద్దర్ని  ఎవరూ గమనించలేదు.

    "అలా దూరంగా కూర్చోందాం-" నెమ్మదిగా అన్నాడు కుమార్. ప్రకాశం తాలూపాడు.

    ఇద్దరూ కూర్చోబోతూ వుంటే "హల్లో ఆడిటర్" అంటూ మాణిక్యాలరావు వచ్చ్కాడు.

    "గుడ్ ఈవినింగ్" అన్నాడు కుమార్.

    "ఫార్మాలిటిస్ కేం గాని ఇలా  ఒంటరిగా కూర్చోంతున్న రేవిటి" అడిగేరు ప్రకాశాన్ని చూస్తూ.

    "ఇలాగే బావుంటుంది....." అన్నాడు కుమార్ కూర్చోంటూ.

    తనూ ఒ కుర్చీలో  కూర్చోంటూ ప్రకాశం  వ్తెపు తిరిగి "మీ ఆఫీసర్ గారు కూడా వచ్చేరు" అన్నాడు  మాణిక్యాల్రావ్. ప్రకాశం  ఎందుకో గిల్టీ కాన్సస్  ఫిలయ్యేడు.

    నౌకరు వచ్చి మూడు గ్లాసులు పెట్టి వెళ్ళిపోయేడు.

    "నేను కోకోకోలా తీసుకొంటాను__" అన్నాడు  ప్రకాశం  అతని కంఠం నూతిలోంచి వచ్చినట్టూ హీనంగావుంది. ఆ పరిసరాల్లో ఇమడలేకపోతున్నాడు!

    మాణిక్యాలరావు బలవంతపెట్టలేదు. "దానిదేముంది. మీ ఇష్టం కాని భోజనం విషయంలో మాత్రం తక్కువ తింటే ఒప్పుకోను" అన్నాడు. ప్రకాశం అతనికి మనసు లోనే కృతగ్నతలు తెలుపుకొన్నాడు.

    "ఇప్పడే వస్తాను" అంటూ మాణిక్యాలరావు లేచి  వెళ్ళేడు. కుర్రాడు వచ్చి సోడా, కోకోకోలా పోసి  వెళ్ళేడు.

    కుమార్ గ్లాసు ఎత్తి పట్టుకొని  "చీర్స్" అన్నాడు. ప్రకాశం కూడా గ్లాసు ఎత్తి ఒక గుటక వేసేడు.

    పార్టిలో కొంచెం హుషారు ఎక్కువ్తెంది. ఎవరో బిగ్గరగా  నవ్వు తున్నారు.

    "వాళ్ళల్లో ఎవరూ నీకు తెలిదా?" అడిగేడు ప్రకాశం. 

 Previous Page Next Page