Home » Yandamuri veerendranath » అభిలాష

    అంతలో ఒకగంట కొట్టింది.
   
    శర్మ ఉలిక్కిపడ్డాడు. అప్పుడే గంట అయిపోయిందా అవునన్నట్టూ  జైలు ఒకసారి గంటకొట్టింది.    
   
    ఒంటిగంట.
   
    __ఏదైనా చేసి ఈ చిరంజీవిని రక్షించాలీ అంటే ఇంకో మూడున్నర గంటల కాలం మాత్రమె వుంది.
   
    అలా రక్షించగలిగేది ఒక్క అర్చన మాత్రమే.
   
     ఏం చేసినా ఆమె చెయ్యాలి.
   
    మరిక ఆలస్యం చెయ్యదల్చుకోలేదు అతడు.
   
                                                                                3
   
    ధర్మారావుకి ఆ రాత్రి నిద్ర పట్టటంలేదు.పక్కమీదే ఊరికే పొర్లుటున్నాడంతే.
   
    అతడిని చూసినవారెవరూ అతడు జైలు అధికారి అనుకోరు. అతడు తన సర్వీసులో పద్నాలుగు ఉరితీతల్ని చూశాడు. సాధారణంగా ఒక జైలు సూపరెంటే౦డే౦టు  తన జీవితకాలంలో ఐదారు శిక్షలకన్నా ఎక్కువ అమలు జరపడు. కానీ అదేం ఖర్మమో అతడెంత  వద్దనుకున్నా అతడున్నజైలుకే వస్తూవుంటారు, ఆ నేరస్థులు.
   
    తెల్లవరుఝామున నాలుగింటికి ఎంతో సహజంగా జరిగిపోయే ఆ క్ర్యక్రమాన్ని అతడు చాలా నిశ్శబ్దంగా గమనిస్తాడు. తనపని తను నిర్వర్తించుకు పోతాడు.ఆరింటికల్లాఅంతా అయిపోతుంది. ఉరికంబం చుట్టూ స్మశాన వాతావరణం తిరిగి నేలకొంటుంది. అతడు తన ఇంటికివెళ్ళి తలుపు వేసుకుంటాడు. అతడి పాత డైరీలో ఒకకగితం వుంది.  ఎర్రటి రక్తపుమారక దానికి ఇంకా అంతుకొనే వుంది. బాగా మేడిపోయిన మారక. దాన్ని చూడగానే_
   
    అప్పుడు వస్తుంది దుఃఖం__
   
    తెరలు తెరలుగా__ గుండెల్లోంచి ఉబికి ఉబికి.
   
    తనివితీరా ఏడుస్తాడు. ఉరికంబం ఎక్కబోయే ముందు ఖైదీ బోనులో జంతువులా గింజుకోవటాన్నీ__ ఆఖరి క్షణపు అతడి నిస్సహాయ తనీ__ టఫ్ మన్న చప్పుడుతో మెడ విరిగిపోవటాన్నీ __ అంతా జ్ఞాపకం వచ్చి పచ్చి నెత్తురు తాగేవాడే కావొచ్చు. నిర్దోషి కూడా కావొచ్చు అయినా అంతకన్నా పెద్దనేరాలు  చేసినవాళ్ళు ఎంతమంది తప్పించుకుతిరగటంలేదు?
   
    అతడికి కొడుకు జ్ఞాపకం వస్తాడు. పదమూడేళ్ళఆ వయసులో చనిపోయిన కొడుకు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. ఆ వయసులోనే భరవిలా చిన్న చిన్న గేయాలు, కవిత్వం వ్రాసేవాడు. స్కూల్ నుంచి వస్తూండగావెనకనుంచి కారు రాష్ గా వచ్చి పుట్ పాత్ ఎక్కి డాష్ యిచ్చింది. పక్క టేముకలువిరిగి, ఊపిరితిత్తుల్లోగుచ్చుకున్నాయి. స్కూల్ బాగ గాలిలో ఎగిరి దూరంగా పడింది. పుస్తకాలు చెల్లాచెదురు అయ్యాయి. అయిదు నిముషాలపాటు గిలగిలా కొట్టుకున్న చిన్నారి శరీరాన్ని ఎవరూ ఆస్పత్రికి తెసుకెల్లాతానికి సాహసించలేదు.  నిక్కరు రక్తంతోతడిసి పోయింది. విజ్ఞానంతోనవ్వే ఆ పెద్ద కళ్ళు బాధతో విలవిలాడెయి.... పొట్లం కట్టి విసిరేసినట్టూ కొంతసేపు పుట్ మీద పడివున్నాడు.          తరువాత ఆస్పత్రికి తీసుకొచ్చిఆపరేషన్ చేశారు.
   
    అయినా బ్రతకలేదు. మధ్యలో ఒక గంట స్పృహా వచ్చిందంతే, ఆ ఆరగంటలోనూ ఆఖరి గేయాన్ని వ్రాసుకున్నాడు.
   
    "పగలు , రాత్రితోపోరాడి ఓడినవేళ
   
    ఎర్రటి సంధ్య __ నల్లటి చీకట్లోకి
   
    వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ
   
    నన్ను తీసుకెళ్ళిపోతూ
   
    అని __ అంతే.
   
     ఆ కాగితానికి రక్తపు మారక యింకా అలానే అంటి వున్నది. ఒక నిర్భాగ్యుడు ఉరి తీయపడ్డాప్పుడల్లా ధర్మారావు ఆకాగితాన్ని తీసి చూసుకొంటూ వుంటాడు.
   
    తన కొడుకుని చంపినావాడు__
   
    అంబాసిడర్ కారు గంటకు నూట యిరవై కిలోమీటర్ల కన్నా వేకువ వేగంతో నడుస్తుందా, లేదా అని గర్ల్ ప్రెండ్ తో పందెం కట్టి, విస్కీ మత్తులో రాష గా నడిపి, పుట్ పాత్ ఎక్కించిన వాడు__
   
    శిక్షనుంచి చాలా సులభంగా తప్పించుకున్నాడు.    
   
    కారు స్లోగానే వేళ్తో౦దన్నారు సాక్షులు. బ్రేకులు ఫేలయ్యా యన్నాడు ఇన్ స్పెక్టరు, విస్కీ ఛాయే కనబడలేదన్నారు పోలీసులు, చట్టం ఏం చేయలేకపోయింది. తన కొడుకుని చంపినవాడు ఇప్పటికీ అదే కార్లో తిరుగుతున్నాడు. నిజానికి అతడి మెడకు ఎన్ని అరులు వెయ్యాలి? బ్రతగ్గలిగే వాళ్ళు ఎలానూ బ్రతుకుతున్నప్పుడు మరి ఈ ఉరిశిక్ష ఎందుకు?
   
    కాగితం పట్టుకుని అతడు పక్క దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రికి మరిక నిద్రపట్టదు...... కిటికీలోంచి నల్లటి ఆకాశం కనబడ్తూంది. ఎప్పుడు నాలుగు అవుతుందా, రైటువల్ ఎప్పుడు పూర్తీ చేద్దామా అనుకుంటూ కూర్చొని వున్నాడు. కొడుకు ఫోటోవైపే చూస్తూ.
   
    అతడి కంటినుంచి అ ప్రయత్నంగా జారిన నీటిచుక్క __ అతడు చేతిలో పట్టుకున్న కాగితంమీద పడింది.
   
                                                     *    *    *    *   
   
    జైలునుండి అర్చన వాళ్ళిల్లు నాలుగైదు మైళ్ళు౦టు౦ది. అతడివద్ద సైకిలు లేదు. డబ్బు కూదాఎక్కువలేదు. డబ్బు కూడా ఎక్కువలేదు. రూపాయో, రేండో వున్నాయంతే.
   
    అతడు రొప్పుతూ పరుగేడ్తూన్నాడు. మధ్యలో ఆయాసం తీర్చుకోవటానికి కొద్దిసేపు అడుగుతున్నాడు. అంతలో సమయం వులువ గుర్తొస్తుంది. మళ్ళీ పరుగు సాగిస్తున్నాడు.
   
    తనెందుకు అంత తొందరపడ్తున్నాడో అతడికే తెలీదు. కానీ ఈ విషయం ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా అర్చానకి చెప్పాలని అతడి తాపత్రయం. కారణం చాలా చిన్నది. మనవాళ్లైవరికైనా ఆక్సిడెంట్ అయితే ఆస్పత్రిలో __ మనతోపాటు నాలుగైదుగురుఅప్తూలుమనతోపాటూ వుండాలని కోరుకుంటాం. వాళ్ళేదో మనకి సాయం చేస్తారు కాదు. మన అడుర్ధానీ, టెన్షన్ నీ పంచుకొంటారని!           

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra